రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Important Checks for Secondhand Two Wheeler
సెప్టెంబర్ 28, 2020

సెకండ్‌హ్యాండ్ టూ వీలర్‌ను కొనుగోలు చేసేటప్పుడు నిర్వహించవలసిన 5 ముఖ్యమైన తనిఖీలు

గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం వ్యాప్తంగా వేగవంతమైన జీవన విధానాన్ని అవలంబించడం అనేది వేగంగా విస్తరిస్తోంది. నిత్యం రద్దీ కారణంగా టూ వీలర్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. చాలామంది ప్రజలు సెకండ్-హ్యాండ్ మోటార్‌బైకులను ఇష్టపడుతుండగా, మిగతా వారు మార్కెట్లోని సరికొత్త బైక్‌ను ఎంచుకుంటున్నారు. మంచి స్థితిలో ఉన్న సెకండ్-హ్యాండ్ వాహనాల లభ్యత అనేక కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. అంతేకాకుండా, సరసమైన రేటుతో కూడిన సెకండ్-హ్యాండ్ టూ-వీలర్ భారతీయ మార్కెట్లలో కొత్త బైక్‌గా పరిగణించబడుతుంది. మరోవైపు, టూ-వీలర్ వాహనాల కోసం అందుబాటులో ఉన్న అనేక ఆప్షన్లు వినియోగదారులను గందరగోళానికి గురిచేస్తాయి. యూజ్డ్ బైక్ మోడల్‌ను కొనుగోలు చేసేటప్పుడు, కస్టమర్లు అందుబాటులో ఉన్న విస్తృతమైన ఆప్షన్ల నుండి ఎంచుకోవచ్చు. కావున, సెకండ్-హ్యాండ్ టూ-వీలర్‌ను ఎంచుకునేటప్పుడు దిగువ పేర్కొన్న అంశాల జాబితాను చూడండి:
 1. బైక్ మోడల్‌ను పరిగణలోకి తీసుకోండి
జీవితంలో ఒక్కసారైనా ఫ్యాన్సీ మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేయాలనుకునే ప్రతి వ్యక్తి కలలు కనే విషయాన్ని మనం కాదనలేము. అయితే, మీకు కావలసిన బైక్‌ను కొనుగోలు చేయడం అంత సులభమేమి కాదు. అలాగే, వాహనం మార్కెట్ విలువ మీ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేస్తుంది. అందువల్ల, బైక్ మోడల్‌ను పరిగణలోకి తీసుకోండి మరియు టూ-వీలర్‌లో తెలివిగా పెట్టుబడి పెట్టండి. మీకు కావలసిన మరియు మీ బడ్జెట్‌కు అనుగుణంగా సరిపోయే టూ-వీలర్‌ను ఎంచుకోండి.
 1. వాహనం కండిషన్
ఒక యూజ్డ్ టూ-వీలర్ వెహికల్ అనేది నిర్దిష్ట యాంత్రిక లోపాలను కలిగి ఉండవచ్చు. అందువల్ల, సెకండ్-హ్యాండ్ బైక్‌ను కొనుగోలు చేయడానికి ముందు, అవసరమైన తనిఖీలను నిర్వహించండి. ఒకసారి దిగువన చూడండి:
 • ఆయిల్ లీక్స్ కోసం చూడండి.
 • వాహనంలోని ఏదైనా భాగంలో తుప్పు, దూళి పట్టిందో లేదోనని తనిఖీలు నిర్వహించడం.
 • డెంట్లు లేదా గీతలు లాంటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించండి.
 • ఆయిల్ మరియు ఇంజిన్ చెక్‌ నిర్వహించడం.
 • వాహనానికి జరిగిన ఏదైనా భౌతిక నష్టాన్ని అంచనా వేయండి.
 • హ్యాండిల్స్, బ్రేక్‌లు, బ్యాటరీ, గేర్లు మొదలైనవాటిని చెక్ చేయండి.
 1. టూ-వీలర్ రిజిస్ట్రేషన్
మీరు ఆర్‌సి బుక్ అనే పదాన్ని విని ఉంటారు. ఒక వేళ మీరు వినకపోతే మరియు ఆశ్చర్యానికి గురైతే ఆర్‌సి బుక్ అంటే ఏమిటి , ఇక్కడ వివరణ ఇవ్వబడింది: బైక్‌ను రిజిస్టర్ చేసుకోవడానికి ముందు, ఒక వ్యక్తి మునుపటి యజమాని నుండి యాజమాన్యం ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్‌ను పొందాలి. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్‌ను అందుకున్న తర్వాత, ఒకరు బైక్‌ను రిజిస్టర్ చేసుకోవచ్చు అలాగే టూ-వీలర్ ఇన్సూరెన్స్‌తో వాహనాన్ని సురక్షితం చేసుకోవచ్చు. యజమాని అతను/ఆమె టూ-వీలర్‌ను రిజిస్టర్ చేసుకున్న తర్వాత, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సి)ని అందుకుంటారు. ఇది చట్టపరమైన అవసరం కాబట్టి, వాహనంతో పాటు ఆర్‌సి సర్టిఫికెట్‌ను తీసుకెళ్లడం ముఖ్యం.
 1. టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ
పెరుగుతున్న ప్రమాదాల రేటు టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను తప్పనిసరి అవసరంగా మార్చింది. ప్రమాదాల సమయంలో బైక్‌కు భౌతికంగా నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా నష్టాల విషయంలో పాలసీహోల్డర్ ఇన్సూరర్ నుండి రీయంబర్స్‌మెంట్ కోసం క్లెయిమ్ చేయవచ్చు. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ తన కస్టమర్లకు ఆన్‌లైన్‌లో టూ వీలర్ ఇన్సూరెన్స్ యొక్క వేగవంతమైన మరియు సులభమైన ఇన్సూరెన్స్ కొనుగోలుతో పాటు సరళమైన మరియు సమర్థవంతమైన క్లెయిమ్ ప్రక్రియను అందిస్తుంది. త్వరిత క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ మీ మనశ్శాంతికి భంగం కలిగించకుండా, అవాంతరాలు లేని అనుభవాన్ని అందిస్తుంది.
 1. డాక్యుమెంటేషన్
పేపర్‌వర్క్ చాలా ముఖ్యం, అలాగే అనివార్యమైనది. యజమాని ఒక కొత్త బైక్‌ను కొనుగోలు చేసినా లేదా యూజ్డ్ బైక్‌ను కొనుగోలు చేసినా, వారు తప్పనిసరిగా వాహనంలో అన్ని సంబంధిత డాక్యుమెంట్లను కలిగి ఉండాలి. ఒరిజినల్ డాక్యుమెంట్లను లాకర్‌లో సురక్షితంగా భద్రపరచగలిగినప్పటికీ, వాహనం వెంట ఫోటోకాపీలను తీసుకెళ్లాలి. ప్రతి డ్రైవర్ దిగువ పేర్కొన్న ఈ కింది డాక్యుమెంట్లను కలిగి ఉండాలి:
 • ఆర్‌సి సర్టిఫికెట్
 • పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పియుసి) సర్టిఫికెట్
 • టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్
 • నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఒసి)
మొత్తానికి, సెకండ్-హ్యాండ్ టూ-వీలర్‌పై పెట్టుబడి పెట్టడం అనేది చాలామంది డ్రైవర్లకు ఒక మంచి ఎంపిక. యాక్సిడెంట్లు, రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు లాంటి దురదృష్టకరమైన సంఘటనల సమయంలో బైక్‌ను రక్షించడానికి టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోండి. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా ఆన్‌లైన్‌లో థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ మరియు సమగ్ర ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోండి. ఈ ప్లాన్లు పాలసీహోల్డర్ అవసరాలకు తగినవిధంగా సరిపోయే అనేక ప్రయోజనాలు మరియు ఫీచర్లతో ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.  

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 0 / 5. ఓట్ల లెక్కింపు: 0

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి