రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Simple Guide To Marine Hull Insurance
మే 23, 2022

భారతదేశంలో మెరైన్ హల్ ఇన్సూరెన్స్‌ సంబంధిత పూర్తి మార్గదర్శకాలు

గ్లోబలైజేషన్‌తో ప్రపంచం అంతా కూడా ఒక భారీ మార్కెట్‌గా అవతరించింది మరియు అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడంలో జలమార్గాలు అవసరం అయ్యాయి. ఏళ్ల తరబడి సముద్రం రవాణాకు ఒక ప్రధాన మార్గంగా ఉంది మరియు నేటికీ అది అలాగే కొనసాగుతోంది. అయితే, ఏళ్లు గడిచినప్పటికీ జల రవాణాలో ఎదురయ్యే ప్రమాదాలు నేటికీ అలాగే ఉన్నాయి. ఈ ప్రమాదాలలో కేవలం ప్రకృతి వైపరీత్యాల కారణంగా మాత్రమే కాకుండా ఓడరేవుల వద్ద సంభవించే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి, మెరైన్ ఇన్సూరెన్స్ కవర్‌ను కలిగి ఉండటం ఉత్తమం.

మెరైన్ ఇన్సూరెన్స్ వివరాలు

ఇది ఓడ యజమానులు, షిప్పింగ్ కంపెనీలు మరియు వీటి ద్వారా తమ వస్తువులను రవాణా చేసే వ్యాపారస్తులకు అందించబడే ఒక కమర్షియల్ ఇన్సూరెన్స్ ప్లాన్. వాతావరణ పరిస్థితులలో ఊహించని మార్పులు, సముద్రపు దొంగలు, నావిగేషన్ సమస్యలు మరియు కార్గో నిర్వహణ సమస్యలు అనేవి సరకు రవాణా మరియు ఓడను దెబ్బతీస్తాయి. అలాంటి సమయంలోనే ఒక మెరైన్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ నష్టాల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. మెరైన్ హల్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? మెరైన్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో వివిధ రకాలు ఉన్నాయి, అందులో మెరైన్ హల్ ఇన్సూరెన్స్ ప్రధానంగా కార్గోను తీసుకువచ్చే ఓడను రక్షించే లక్ష్యంతో రూపొందించబడినది. ఇది ఓడ యజమానులు మరియు నౌకల సముదాయాన్ని కలిగి ఉన్న షిప్పింగ్ కంపెనీల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక రక్షణ కవచం. ఈ హల్ అనేది షిప్ యొక్క ప్రధాన మద్దతు భాగం. హల్‌కు ఏదైనా నష్టం జరిగితే అది ఓడ భద్రతను దెబ్బతీస్తుంది కనుక ఒక ఇన్సూరెన్స్ కవర్ అనేది చాలా ముఖ్యం. కేవలం హల్ మాత్రమే కాదు, కార్గోను లోడ్ చేయడానికి మరియు అన్‌లోడ్ చేయడానికి షిప్‌లో అమర్చిన యంత్రాలు కూడా దెబ్బతింటాయి. మెరైన్ హల్ ఇన్సూరెన్స్ కవర్‌తో ఓడ యజమానులు అటువంటి యంత్రాలకు నష్టం కలిగించే ఆర్థిక నష్టాలను నివారించవచ్చు.

మెరైన్ హల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలో ఏమి కవర్ చేయబడుతుంది?

మెరైన్ హల్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో భాగంగా ఈ కింది ప్రమాదాలు చేర్చబడ్డాయి:
 • ఓడ లేదా నౌకకు జరిగిన నష్టం, దాంతో పాటు వాటిలో అమర్చిన ఏవైనా యంత్రాలు లేదా పరికరాలు.
 • దొంగతనం మరియు అగ్నిప్రమాదాల కారణంగా ఓడకు జరిగిన నష్టం లేదా డ్యామేజీ.
 • పిడుగుపాటు, టైఫూన్లు మొదలైనటువంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఓడకు జరిగే నష్టాలు.
 • ఇతర ఓడలు మరియు నౌకలకు జరిగిన నష్టం కారణంగా తలెత్తిన థర్డ్ పార్టీ బాధ్యతలు.
 • నిర్వహణ కార్యకలాపాల సమయంలో నౌకకు జరిగిన ఏదైనా ఊహించని నష్టం
 • మహాసముద్రాల మీదుగా ప్రయాణించే నౌకల కోసం ప్రపంచవ్యాప్తంగా కవరేజ్.
*ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

మెరైన్ హల్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ఎవరు కొనుగోలు చేయాలి?

మెరైన్ హల్ ఇన్సూరెన్స్ ప్లాన్లు అనేవి జనరల్ ఇన్సూరెన్స్ పోర్ట్ అధికారులు, ఓడ యజమానులు మరియు ప్రైవేట్, పబ్లిక్ పోర్ట్ ఆపరేటర్లను కూడా దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పాలసీలు. ఇవి ఊహించని ఆర్థిక నష్టాలను నివారించడానికి సహాయపడతాయి.

మెరైన్ హల్ కవర్ కొనుగోలు చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి?

మొదటి మరియు అత్యంత ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, ఇది ఊహించని ఆర్థిక నష్టాల కోసం భద్రతా పరిపుష్టిని అందిస్తుంది. మెరైన్ హల్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం వలన, ఊహించని సంఘటనల సందర్భాల్లో మీ ఫైనాన్స్‌లకు ఎలాంటి భంగం వాటిల్లదు. తరువాత, మీ అవసరాలకు అనుగుణంగా సరిపోయే యాడ్-ఆన్ సదుపాయాన్ని ఉపయోగించి మెరైన్ ఇన్సూరెన్స్ ప్లాన్లను కస్టమైజ్ చేయవచ్చు. ఈ యాడ్-ఆన్‌లలో సాధారణంగా ఉగ్రవాదం, యుద్ధాలు మరియు ఇలాంటి పరిస్థితుల నుండి రక్షణ ఉంటుంది. ఇలాంటి మెరైన్ కవర్‌ని కలిగి ఉండటంతో, మీరు మీ వ్యాపారానికి ఎలాంటి ఆర్థికపరమైన ఎదురుదెబ్బ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

మెరైన్ హల్ ఇన్సూరెన్స్ కవరేజీలో ఏవైనా మినహాయింపులు ఉంటాయా?

ఇతర ఇన్సూరెన్స్ పాలసీల మాదిరిగానే, మెరైన్ ఇన్సూరెన్స్ ప్లాన్లు వాటి పరిధిలో పరిమితం చేయబడ్డాయి. పాలసీ ఏమి కవర్ చేస్తుంది, అలాగే పాలసీలో చేర్చబడని అంశాలను పాలసీ డాక్యుమెంట్ వివరిస్తుంది. దాని మినహాయింపులకు ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి:
 • హల్ మరియు దాని యంత్రాల సాధారణ అరుగుదల, తరుగుదల.
 • అణు కార్యకలాపాల కారణంగా జరిగిన నష్టాలు.
 • రేడియోధార్మిక మూలకాల వల్ల ఏర్పడిన కాలుష్యం.
 • నౌకకు జరిగిన ఏదైనా ఉద్దేశపూర్వక నష్టం.
 • సరుకులను ఓవర్‌లోడ్ చేయడం వల్ల కలిగే నష్టాలు.
మరింత చదవండి-‌ మెరైన్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి   ఇన్సూరెన్స్ అనేది అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వివరాలను జాగ్రత్తగా చదవండి.  

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 1 / 5 ఓట్ల లెక్కింపు: 1

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి