రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Linking your Aadhaar and PAN card to your insurance policy
జూలై 11, 2020

మీ ఇన్సూరెన్స్ పాలసీకి మీ ఆధార్ మరియు పాన్ కార్డును లింక్ చేయడం

ఇప్పుడు అన్ని ఇన్సూరెన్స్ పాలసీలను ఆధార్ మరియు పాన్/ఫారం 60కు లింక్ చేయడం తప్పనిసరి అని Insurance Regulatory and Development Authority of India (IRDAI) ఒక ప్రకటనను జారీ చేసింది. ఈ డాక్యుమెంట్లు సమర్పించని ఏ కస్టమర్‌‌కు కూడా కొత్త పాలసీలు జారీ చేయబడవని, అలాగే ప్రస్తుత కస్టమర్లు వారి ఆధార్, పాన్‌ కార్డును వారి అన్ని పాలసీలకు లింక్ చేయాలని ఈ ఆదేశం పేర్కొంది.

ఈ కొత్త నిబంధనకు సంబంధించి మీకు ఉన్న కొన్ని సాధారణ ప్రశ్నలకు సమాధానాలు క్రింద ఇవ్వబడ్డాయి:

  • ప్ర. ఇది ఎప్పటి నుండి వర్తిస్తుంది అనే నిర్దిష్ట అమలు తేదీ ఉందా లేదా తక్షణమే అమలులోకి వస్తుందా?A. IRDAI సర్క్యులర్ అనేది తక్షణమే అమలులోకి వస్తుంది.
  • ప్ర. మనం అర్థం చేసుకున్నట్లు, IRDAI నోటిఫికేషన్ ప్రకారం ఆధార్ కార్డు లేకపోతే ఎలాంటి కొత్త పాలసీలు జారీ చేయబడవు. మరి పాలసీ జారీ చేసే సమయంలో మన వద్ద ఆధార్ కార్డు లేకపోతే ఏం చేయాలి?జ. పాలసీ జారీ చేసే సమయంలో క్లయింట్ ఆధార్ నంబర్ మరియు పర్మనెంట్ అకౌంట్ నంబర్‌ను అందించకపోతే కొత్త పాలసీలు జారీ చేయబడతాయి. అయితే, పాలసీ జారీ చేసిన తేదీ నుండి ఆరు నెలల వ్యవధిలో కస్టమర్ వాటిని సబ్మిట్ చేయాలి.
  • ప్ర. ప్రస్తుత పాలసీల విషయంలో, పాలసీ జారీ చేసినప్పుడు ఆధార్ నంబర్ సమర్పించనట్లయితే (బదులుగా మరొక రకమైన ఐడి, అడ్రస్ ప్రూఫ్‌ను ఉపయోగించి ఉంటే), ఇలాంటి పాలసీలను ఆధార్‌తో లింక్ చేయడానికి ఏదైనా తుది గడువు ఉంటుందా? గడువు ముగియకపోతే, పాలసీహోల్డర్ల పరిస్థితి ఏమిటి?జ. ప్రస్తుత పాలసీల విషయంలో కస్టమర్ తన ఆధార్ మరియు పాన్ నంబర్/ఫారం 60 ను 31 మార్చి 2018 నాటికి సమర్పించాలి. ఒకవేళ కస్టమర్ సరైన సమయంలో వాటిని సబ్మిట్ చేయకపోతే, అది సమర్పించే వరకు వారి అకౌంట్ నిలిచిపోతుంది.
  • ప్ర. ఒకవేళ నిర్దిష్ట పాలసీహోల్డర్లు వారి ఆధార్‌ను ఇంకా లింక్ చేయకుండానే ఒక క్లెయిమ్ చేసినట్లయితే, వారి క్లెయిమ్ తిరస్కరించబడుతుందా?జ. ఒకవేళ పాలసీహోల్డర్ తన ఆధార్ మరియు పాన్ వివరాలను లింక్ చేయకపోతే, ఆ వివరాలు అందించే వరకు వారి క్లెయిమ్‌లు యథాతతంగా ఉంచబడతాయి.
  • ప్ర. ఒకవేళ పాలసీహోల్డర్‌కు ఆధార్ కార్డు లేకపోతే అతని/ఆమె పాలసీ రద్దు అవుతుందా లేదా క్లెయిములు తిరస్కరించబడతాయా?జ. లేదు, పాలసీలు రద్దు కావు, లేదా క్లెయిములు తిరస్కరించబడవు. అయితే, పాలసీహోల్డర్ ఆధార్ మరియు పాన్/ ఫారం 60 వివరాలు సబ్మిట్ చేసేంత వరకు క్లెయిముల తాత్కాలికంగా నిలిపివేయబడతాయి.
  • ప్ర. ప్రస్తుత పాలసీహోల్డర్ల విషయంలో, పాలసీని లేదా క్లెయిమ్‌లను నిలిపివేసిన సందర్భంలో ఇన్సూరెన్స్ ఒప్పందం అమలులోకి రాదా?ఎందుకనగా, గతంలో పాలసీని జారీ చేసే సమయంలో ఆధార్ గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదు.జ. ఇన్సూరెన్స్ ఒప్పందాలు భారత ఒప్పంద చట్టం ద్వారా నిర్వహించబడతాయి. అయితే, మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 కింద రూపొందించబడిన పిఎంఎల్ నిబంధనల ప్రకారం, ఆధార్ మరియు పాన్/ఫారం 60 సమర్పించాల్సిన అవసరం ఉంది. పిఎంఎల్ నియమాలు చట్టపరమైన విధానాలతో కూడినవి మరియు వాటిని తప్పక అనుసరించాలి.

 

 

మీ ఏవైనా సందేహాలకు సమాధానం లభిస్తుందని మేము ఆశిస్తున్నాము!

మీకు మా వద్ద ఒక పాలసీ ఉంటే, మరియు మీ ఆధార్ మరియు పాన్/ఫారం 60 వివరాలను అప్‌డేట్ చేయాలనుకుంటే, ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి