ఒక సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ మీ ఆర్థిక స్థిరత్వానికి హాని కలిగించే ప్రాథమిక ప్రమాదాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అయితే, మీరు యాడ్-ఆన్ కవర్లను చేర్చడం ద్వారా మీ ప్రాథమిక మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కవరేజీని మెరుగుపరుచుకోవచ్చు. ఈ అదనపు కవర్లు మీ అదనపు ఖర్చులను తగ్గించడంలో మీకు సహాయపడతాయి మరియు సాధారణ సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కన్నా ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. ఉదాహరణకు, మీరు ఒక ముఖ్యమైన మీటింగ్‌కు హాజరు కావడానికి, మీ సహోద్యోగితో కలిసి డ్రైవింగ్ చేస్తూ క్లయింట్ ఆఫీసుకు బయలుదేరారని అనుకుందాం. కానీ దురదృష్టవశాత్తు, మీరు ఆఫీసు నుండి కొంత దూరం వెళ్లగానే, మీ టైరు పంక్చర్ అయిందని గమనిస్తారు. అలాంటి ఒక సందర్భంలో మీరు 24x7 స్పాట్ అసిస్టెన్స్ కవర్ కలిగి ఉండటం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కవర్‌తో మీరు టైర్ రిపేర్, కారు బ్యాటరీ కోసం జంప్ స్టార్ట్, ప్రమాదం జరిగినప్పుడు న్యాయ సలహా మొదలైన అత్యవసర పరిస్థితుల కోసం మీ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి సేవలను పొందవచ్చు. ఇది ఒక ఉపయోగకరమైన కవర్ అయినప్పటికీ, మీ కారు మరియు టూ-వీలర్ కోసం ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు మీరు తెలుసుకోవలసిన మరికొన్ని యాడ్-ఆన్‌లు కూడా ఉన్నాయి. మీ
కారు ఇన్సూరెన్స్ పాలసీ అందుబాటులో ఉన్న యాడ్-ఆన్ కవర్లు ఇలా ఉన్నాయి:
- 24 x 7 స్పాట్ అసిస్టెన్స్ – మీరు మీ ఇన్సూర్ చేయబడిన కారులో ప్రయాణిస్తున్నప్పుడు టైరు పంక్చర్ అయితే లేదా కారు బ్యాటరీని జంప్ చేయడం, ఎలక్ట్రికల్ పార్ట్స్ రిపేర్ చేయడం లాంటి ఏదైనా మెకానికల్ సహాయం అవసరమైతే ఈ కవర్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేళ మీరు ప్రమాదానికి గురైతే, మీ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మీకు అవసరమయ్యే ఏదైనా చట్టపరమైన సహాయం కూడా అందించబడుతుంది.
- లాక్ మరియు కీ రీప్లేస్‌మెంట్ కవర్ – మీ కారు తాళం చెవులను పోగొట్టుకోవడం అనేది మీరు ఉద్దేశపూర్వకమైన చర్య కానప్పటికీ, మీ కారు తాళం చెవులను పోగొట్టుకున్నప్పుడు/ కోల్పోయినప్పుడు మీరు ఏం చేయాలి? నేటి ఆటోమేటిక్ లాక్‌లు మరియు కార్ల తాళం చెవులు చాలా ఖరీదైనవి మరియు మీరు వాటిని పోగొట్టుకుంటే/ డ్యామేజ్ అయితే ఖచ్చితంగా ఆ ఖర్చులను భరించాలి. అందువల్ల, లాక్ మరియు కీ రీప్లేస్‌మెంట్ కవర్‌ను కలిగి ఉండటం అనేది ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకనగా ఇది కొత్త తాళాలను ఏర్పాటు చేయడానికి లేదా కొనుగోలు చేయడానికి లేదా మీ కారు తాళం చెవులను రీప్లేస్ చేయడానికి నష్టపరిహారం అందించగలదు.
- యాక్సిడెంట్ షీల్డ్ – ఈ యాడ్-ఆన్ మీ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులను, వారి మరణం మరియు/ లేదా ప్రమాదం కారణంగా సంభవించే శాశ్వత పూర్తి వైకల్యాన్ని కవర్ చేస్తుంది. మీ సమగ్ర కారు ఇన్సూరెన్స్ పాలసీలో పిఎ (పర్సనల్ యాక్సిడెంట్) కవర్ ఉన్నప్పటికీ, యాక్సిడెంట్ షీల్డ్ కవరేజీ దీని కంటే అదనపు ప్రయోజనాన్ని అందిస్తుంది- యజమాని డ్రైవర్ కోసం PA కవర్ .
- కన్జ్యూమబుల్ ఖర్చులు – ఇంజిన్ ఆయిల్, గేర్ బాక్స్ ఆయిల్, పవర్ స్టీరింగ్ ఆయిల్, కూలెంట్, ఎసి గ్యాస్ ఆయిల్, బ్రేక్ ఆయిల్ మొదలైనటువంటి మీ కారులోని కొన్ని భాగాలను కన్జ్యూమబుల్ పార్ట్స్ అని పిలుస్తారు. యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో ఈ పార్ట్స్ యొక్క రిపేర్/ రీప్లేస్‌మెంట్ ఖర్చు అనేది సాధారణంగా సమగ్ర కారు ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడదు. కానీ, కన్జ్యూమబుల్ ఖర్చుల కవర్‌తో మీరు ఏ చింత లేకుండా ఉండవచ్చు, ఎందుకంటే ఈ విడిభాగాల రిపేర్/ రీప్లేస్‌మెంట్ ఖర్చులను మీ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది.
- కన్వేయన్స్ ప్రయోజనం – ఒకవేళ మీ కారు యాక్సిడెంట్ కారణంగా పూర్తిగా దెబ్బతిన్నట్లయితే, వర్క్‌షాప్‌లో రిపేర్ చేయించాల్సి వస్తే, రోజువారి నగదు ప్రయోజనం కోసం క్లెయిమ్ చేయడానికి కన్వేయన్స్ ప్రయోజనం మిమ్మల్ని అనుమతిస్తుంది.
- వ్యక్తిగత సామాను – మీరు అనేక సార్లు ల్యాప్‌టాప్ బ్యాగ్, సూట్‌కేస్, డాక్యుమెంట్లు మొదలైనటువంటి మీ బ్యాగేజిని కారులో మర్చిపోవచ్చు. మీరు ఏ మాత్రం నిర్లక్ష్యంగా చేసినా ఈ విలువైన వస్తువులను కోల్పోయే/ డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కవర్‌తో మీ కారులో ఉన్న విలువైన వ్యక్తిగత వస్తువులకు ఏదైనా నష్టం/ డ్యామేజ్ జరిగినప్పుడు మీరు నష్టపరిహారం పొందవచ్చు.
మీ లాంగ్ టర్మ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ అందుబాటులో ఉన్న యాడ్-ఆన్ కవర్లు ఇలా ఉన్నాయి:
- 24 x 7 స్పాట్ అసిస్టెన్స్ – ఈ టూ వీలర్ ఇన్సూరెన్స్ మీ టూ-వీలర్ దారి మధ్యలో బ్రేక్‌డౌన్ అయి మరియు మీకు సహాయం అవసరమైతే, ఈ యాడ్-ఆన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 24 x 7 స్పాట్ అసిస్టెన్స్ కవర్ ద్వారా అందించబడే ప్రయోజనాలు దిగువ ఇవ్వబడ్డాయి:
- టోయింగ్ సౌకర్యం
- రోడ్‍సైడ్ అసిస్టెన్స్
- అత్యవసర సందేశాలను పంపించడం
- ఇంధన సహాయం
- టాక్సీ ప్రయోజనం
- వసతి ప్రయోజనం
- వైద్య సమన్వయం
- యాక్సిడెంట్ కవర్
- చట్టపరమైన సలహా
- జీరో డిప్రిసియేషన్ బైక్ ఇన్సూరెన్స్ కవర్ – ఈ కవర్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది క్లెయిమ్ ఫైల్ చేసేటప్పుడు మీ వాహనం డిప్రిసియేషన్ ఖర్చును మినహాయించడం ద్వారా మీ ఖర్చులను తగ్గిస్తుంది. డిప్రిసియేషన్ ఖర్చు అనేది నిర్ధిష్ట వ్యవధిలో మీ బైక్‌కు జరిగిన సాధారణ అరుగుదల మరియు తరుగుదల కారణంగా మీ క్లెయిమ్ నుండి మినహాయించబడే మొత్తం.
- పిలియన్ రైడర్ల కోసం పర్సనల్ యాక్సిడెంట్ కవర్ – ఈ యాడ్-ఆన్, మీ టూ-వీలర్ పాలసీ కవరేజీని మరింత మెరుగుపరుస్తుంది. ఇది మీ బైక్‌ను రైడ్ చేసేటప్పుడు మీ సహ-ప్రయాణీకులు గాయపడినట్లయితే వారిని కవర్ చేస్తుంది.
- యాక్సెసరీల నష్టం – ఈ యాడ్-ఆన్, మీరు మీ టూ-వీలర్‌ను అందంగా తీర్చిదిద్దడానికి ఉపయోగించిన వివిధ యాక్సెసరీలను కవర్ చేస్తుంది. మీ బైక్ యొక్క ఎలక్ట్రికల్ మరియు నాన్-ఎలక్ట్రికల్ యాక్సెసరీల కోసం మీరు రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ చేయవచ్చు.
మీకు సహాయం అవసరమైన సందర్భంలో ఇది మరింత మెరుగ్గా పనిచేస్తుంది. మీ సమగ్ర మోటారు ఇన్సూరెన్స్ పాలసీతో ప్రయోజనకరమైన యాడ్-ఆన్‌లను కలిగి ఉండటం అనేది నేడు మనం జీవిస్తున్న అనిశ్చిత సమయాల్లో అవసరమైన రక్షణను అందిస్తాయి. ఇన్సూరెన్స్ విషయంలో ఎప్పుడూ ఆలస్యం చేయడం అంత మంచిది కాదు. మా సమగ్ర మోటారు ఇన్సూరెన్స్ పాలసీతో అత్యంత అనుకూలమైన యాడ్-ఆన్ కవర్(ల)ను ఎంచుకోవడంలో మీరు చురుగ్గా వ్యవహరించాలని మేము సలహా ఇస్తున్నాము.
మీరు మీ మోటార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు సరైన యాడ్-ఆన్ కవర్లను జోడించడం ద్వారా మీ సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ అందించే కవరేజీని మరింత మెరుగుపరచుకోవచ్చు.
సరైన యాడ్-ఆన్ కవర్లను ఎంచుకొని ఈ యాక్సెసరీలను జోడించిన తర్వాత కూడా మీరు మీ బేస్ ప్లాన్ కవరేజీని మరింత మెరుగుపరచాలనుకోవచ్చు.
ప్యాకేజ్ పాలసీ క్రింద, కస్టమర్ దానికి బదులుగా అదనంగా యాడ్-ఆన్ కవర్లను (అదనపు కవరేజ్ అదనపు ఆర్థిక రక్షణను అందిస్తుంది) ఎంచుకోవచ్చు
ఈ ఆధునిక యుగంలో యాడ్-ఆన్ కవరేజీలు లేకుండా సాధారణ మోటార్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది తెలివైన నిర్ణయం కాదు.
మోటార్ ఇన్సూరెన్స్ యాడ్ ఆన్ కవర్ అనేది చాలా ముఖ్యం. మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడల్లా ఇది టోయింగ్ సౌకర్యాలు, పేర్కొన్న వ్యక్తులకు అత్యవసర సందేశాలను పంపించడం, వైద్య సమన్వయం, ఇంధన సహాయం, వసతి ప్రయోజనాలు, టాక్సీ ప్రయోజనాలు మరియు న్యాయ సలహాలను అందిస్తూ మనకు అండగా నిలుస్తుంది.