రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
What is Skidding and Hydroplaning?
జూలై 21, 2016

ఈ వర్షాకాలంలో స్కిడ్డింగ్ మరియు హైడ్రోప్లేనింగ్‌ను ఎలా నివారించాలి?

డ్రైవర్లు వారి వాహనంపై నియంత్రణ కోల్పోవడం కంటే భయంకరమైన విషయం మరొకటి లేదు. ఇది స్టీరింగ్ చేసే సామర్థ్యాన్ని తగ్గించడమే కాకుండా, అనుభవజ్ఞులైన డ్రైవర్లకు కూడా నిస్సహాయ భావనను కలిగిస్తుంది. నియంత్రణ కోల్పోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అతి ముఖ్యమైన కారణాల్లో ఒకటి హైడ్రోప్లేనింగ్ లేదా ఆక్వాప్లేనింగ్. వర్షాకాలం ప్రారంభంతో ప్రమాదాల సంభావ్యత విపరీతంగా పెరుగుతుంది, హైడ్రోప్లానింగ్ మరియు దానిని నివారించే చిట్కాల యొక్క సమాచారాన్ని అందించే ఒక ఆర్టికల్ ఇక్కడ ఇవ్వబడింది. హైడ్రోప్లేనింగ్‌ అంటే ఏమిటి? హైడ్రోప్లేనింగ్‌ అనగా తడి నేలపై కారు టైర్లు స్కిడ్ అవడం లేదా జారిపోవడం. టైర్ దాని సామర్థ్యానికి మించి ఎక్కువ నీటిలో ప్రయాణించినప్పుడు ఇది సంభవిస్తుంది. నీటి పీడనం వల్ల ఇది జరుగుతుంది, ఇది నీటిని చక్రం ముందు వైపు నుండి కిందకు నెట్టేస్తుంది. అప్పుడు టైర్ అనేది రోడ్డు ఉపరితలం నుండి ఒక సన్నని నీటి పొర ద్వారా వేరు చేయబడుతుంది, తద్వారా పట్టు కోల్పోతుంది. దీని కారణంగా స్టీరింగ్ పై నియంత్రణ, బ్రేకింగ్ పై నియంత్రణ మరియు పవర్ కంట్రోల్ పై నియంత్రణ కోల్పోవడం జరుగుతుంది. హైడ్రోప్లేనింగ్‌ ఎప్పుడు సంభవిస్తుంది? తేలికపాటి వర్షం కురిసిన మొదటి 10 నిమిషాలు అత్యంత ప్రమాదకరం అయినప్పటికీ, ఏదైనా తడి ఉపరితలంపై అయినా హైడ్రోప్లానింగ్ సంభవించవచ్చు. వర్షపు నీరు రోడ్డుపై ఉన్న చమురు వ్యర్థాలతో కలిసినప్పుడు రోడ్డు పై, ముఖ్యంగా అధిక వేగంతో ప్రయాణించే వాహనాలు, జారిపోయే పరిస్థితులు ఏర్పడతాయి దీని కారణంగా హైడ్రోప్లేన్ పరిస్థితి ఏర్పడుతుంది. పొగమంచు, మంచు తుంపర్లు, హిమపాతం మరియు వర్షం లాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ప్రమాదం సంభావ్యత పెరుగుతుంది. అయితే, అలాంటి పరిస్థితుల్లో మాత్రమే హైడ్రోప్లేనింగ్ జరగాల్సిన అవసరం లేదు. సాధారణంగా, డ్రైవర్లు ఇలాంటి ఊహించని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. హైడ్రోప్లేనింగ్ నివారించడానికి చిట్కాలు 1.నీటి కుంటలు మరియు నిలువ ఉండే నీటి ని నివారించండి నీరు నిల్వ ఉన్నప్పుడు హైడ్రోప్లేనింగ్ జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే హైడ్రోప్లేనింగ్ జరగడానికి ఒక చిన్న నీటి పొర సరిపోతుంది. అందువల్ల, వాటిని నివారించడం మంచిది. 2.హైడ్రోప్లేనింగ్ నివారించడానికి అధిక నాణ్యత గల టైర్లను ఎంచుకోండి మీ టైర్లను క్రమం తప్పకుండా మార్చండి. అరిగిపోయిన టైర్లతో తడి రోడ్లపై డ్రైవింగ్ చేయడం హానికరం. ముఖ్యంగా తరచూ వర్షం కురిసే ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇది చాలా అవసరం. మీ వాహనం దాదాపు 11,000 కిమీ దూరం ప్రయాణించిన ప్రతిసారి ఆయిల్‌ను మార్చాలి, అలాగే, దాని టైర్ల రొటేషన్ మరియు బ్యాలెన్స్‌ను సక్రమంగా నిర్వహించాలి. 3.మీ వేగాన్ని నియంత్రించండి వర్షం యొక్క తొలి చినుకులు మీ విండ్‌షీల్డ్‌ను తాకగానే, మీ కారు వేగాన్ని తగ్గించాలి. సాధారణంగా, వేగం గంటకు 57 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే హైడ్రోప్లేనింగ్ జరుగుతుందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో నిర్దేశిత వేగ పరిమితి కంటే 10 నుండి 15 కిలోమీటర్ల తక్కువ వేగంతో నడపడం మంచిది. అలాగే, ఆకస్మికంగా వేగాన్ని పెంచడం నివారించాలి. 4.వర్షంలో క్రూయిజ్ ఉపయోగించవద్దు తడిగా ఉన్న రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు మీ కారు క్రూయిజ్ ఫంక్షన్‌ను ఎన్నడూ ఉపయోగించకండి. మీరు క్రూయిజ్ ఫంక్షన్‌తో హైడ్రోప్లేన్‌ను ప్రారంభించినట్లయితే, మీ కారుపై మీరు నియంత్రణను తిరిగి పొందడానికి ముందు ఫంక్షన్‌ను డిసేబుల్ చేయడానికి సమయం పడుతుంది. హైడ్రోప్లేనింగ్ నుండి కోలుకోవడం ఎలా?
  • హైడ్రోప్లేనింగ్ జరిగిన వెంటనే యాక్సిలరేటర్ నుండి మీ పాదాన్ని తీసివేయండి
  • హైడ్రోప్లేనింగ్ దిశలో మీ కారు స్టీరింగ్ వీల్‌ను మెల్లగా తిప్పండి.
  • రోడ్డు ఉపరితలంపై మీ టైర్లు తిరిగి కనెక్ట్ అవుతున్నట్లు మీరు భావించే వరకు వేచి ఉండండి.
  • భయంకరమైన హైడ్రోప్లేనింగ్ నుండి బయటపడ్డ తర్వాత, దీర్ఘ శ్వాస ఒకటి తీసుకొని ప్రయాణాన్ని తిరిగి కొనసాగించండి.
వర్షాకాలంలో ఊహించని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి, మిమ్మల్ని మీరు సురక్షితం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ కారును ఇన్సూర్ చేసుకోండి మరియు ఆర్థిక సంక్షోభం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. నేడే మిమ్మల్ని సురక్షితం చేసుకోవడానికి బైక్ ఇన్సూరెన్స్ మరియు కారు ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ లని చూడండి!

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి