రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Difference Between Life Insurance and Health Insurance
ఏప్రిల్ 2, 2021

లైఫ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ మధ్య వ్యత్యాసం

మీరు ఎల్లప్పుడూ మీ భవిష్యత్తు కోసం ప్లాన్ చేయడానికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి. సంపాదించడం మొదలుపెట్టినప్పటి నుండి, కొంత మొత్తాన్ని ఆదా చేయడానికి ప్రయత్నిస్తాము. మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి సంబంధించి, రెండు సాధారణ మరియు విస్తృతంగా ఉపయోగించే ఆర్థిక సాధనాలు లైఫ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు. రెండింటికీ వేర్వేరు లక్ష్యాలు ఉన్నప్పటికీ, అవి మీ ఆర్థిక ప్రణాళికలో ప్రధాన భాగంగా ఉంటాయి. లైఫ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్‌ మధ్య వ్యత్యాసాన్ని పరిశీలిద్దాం. అయితే దానికి ముందు, అవి వేటిని సూచిస్తాయో అర్థం చేసుకుందాం.   లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క ఉద్దేశ్యం ఏమిటి? మీరు లేనప్పుడు మీపై ఆధారపడిన వారికి ఆర్థిక భద్రతను కల్పించడమే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల లక్ష్యం. లైఫ్ ఇన్సూరెన్స్ కవర్‌ను కలిగి ఉండటం ద్వారా ఒక పాలసీహోల్డర్, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తనపై ఆధారపడిన వారి జీవనశైలి ఎక్కువగా ప్రభావితం అవకుండా చూసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ నుండి వచ్చే ఆదాయం మరణించిన వ్యక్తి ఆదాయాన్ని భర్తీ చేస్తుంది, ఇది వారి జీవితాల్లో ఆర్థిక సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో సహాయం చేస్తుంది. అలాగే, చాలా రకాల ప్లాన్‌ల కోసం మరణ పరిహారాలు పన్ను రహితంగా ఉంటాయి; అందువల్ల, హామీ ఇవ్వబడిన పూర్తి మొత్తం లబ్ధిదారులను చేరుతుంది.   హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనం ఏమిటి? లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ల మాదిరిగా కాకుండా, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వైద్య చికిత్సను పొందడంలో చెల్లింపును అందిస్తుంది. ఇది వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో ఇన్సూర్ చేసిన వ్యక్తికి ఆర్థికపరమైన భద్రతా కవచాన్ని అందిస్తుంది. ఒకవేళ మీ వద్ద మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ లేనట్లయితే, అలాంటి పరిస్థితిలో మీరు వైద్య ఖర్చులను భరించవలసి ఉంటుంది. అయితే, మీ వద్ద ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే, ఈ ఖర్చులు మీ ఇన్సూరెన్స్ పాలసీ మరియు చికిత్సకు అవసరమైన వైద్య సౌకర్యాన్ని బట్టి నగదురహిత విధానం లేదా రీయంబర్స్‌మెంట్ రూపంలో చెల్లించబడతాయి. అంతేకాకుండా, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసినప్పుడు, కొన్ని ప్లాన్లకు ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్ సదుపాయం కూడా ఉంటుంది. ఈ పాలసీలు ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి మెడికల్ చెకప్‌ సదుపాయాన్ని కల్పిస్తాయి, అయితే, కొన్ని ఇతర పాలసీలు ప్రిస్క్రిప్షన్ మందుల ఖర్చును కూడా కవర్ చేస్తాయి.   లైఫ్ ఇన్సూరెన్స్ వర్సెస్ హెల్త్ ఇన్సూరెన్స్:
లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్
లైఫ్ ఇన్సూరెన్స్ మీ మరణం సందర్భంలో మీ కుటుంబానికి ఆర్థికపరమైన రక్షణను అందించే ఒక పాలసీ. హామీ ఇవ్వబడిన మొత్తం లేదా మీ నామినీలకు చెల్లించే డబ్బు అనేది పాలసీ ఒప్పందం ప్రకారం ముందుగానే నిర్వచించబడుతుంది. మరోవైపు, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీ వైద్య ఖర్చులను కవర్ చేసే ఒక ఆర్థికపరమైన కవర్. ఏదైనా అనారోగ్యం లేదా ప్రమాదం సందర్భంలో చికిత్స, హాస్పిటలైజేషన్ మరియు ఇతర అనుబంధ ఖర్చులను ఈ పాలసీ కవర్ చేస్తుంది.
లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రీమియంలు పాలసీహోల్డర్ కొనుగోలు చేసే పాలసీ రకం మరియు అతని వయస్సుపై ఆధారపడి ఉంటాయి. కొన్ని లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇన్సూరెన్స్ ఫీచర్లతో పాటు ఒక పెట్టుబడి భాగాన్ని కూడా అందిస్తాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం పాలసీహోల్డర్ వయస్సు, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రధాన లక్ష్యం కేవలం రక్షణ అందించడం, పెట్టుబడి చేయడానికి కాదు. అందువల్ల అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇన్సూరెన్స్ ఫీచర్లను మాత్రమే కలిగి ఉంటాయి.
ఇది ఒక దీర్ఘకాలిక ఇన్సూరెన్స్ ప్రోడక్ట్, దీనికి సకాలంలో రెన్యూవల్స్ అవసరం కావచ్చు లేదా ఉండకపోవచ్చు. ఇది ఒక స్వల్పకాలిక ఇన్సూరెన్స్ ప్రోడక్ట్, సాధారణంగా దీనిని సంవత్సరానికి ఒకసారి రెన్యూ చేయాల్సి ఉంటుంది.
ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరణించిన తర్వాత లేదా ఇన్సూరెన్స్ వ్యవధి పూర్తయిన తర్వాత పాలసీ ముగుస్తుంది. పాలసీ అవధి పూర్తయిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల గడువు ముగుస్తుంది.
ప్రాథమికంగా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ మరణ ప్రయోజనాలను అందించినప్పటికీ, మనుగడ ప్రయోజనాలు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కింద అందుబాటులో ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రత్యేకంగా భవిష్యత్తులో వైద్య అవసరాలను తీరుస్తుంది. ఇది ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి మనుగడ లేదా మరణ ప్రయోజనాలను అందించదు.
  ఇవి లైఫ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ మధ్య గల కొన్ని ముఖ్యమైన వ్యత్యాసాలు. ఒకవేళ మీరు ఏది ఎంచుకోవాలో అని ఆలోచిస్తున్నట్లయితే, రెండు పాలసీలు కూడా సమానంగా ముఖ్యమైనవి మరియు మీ ఆర్థిక ప్రణాళికలో భాగంగా ఉండాలి; ఒకటి మీరు జీవించి ఉన్నప్పుడు ఖర్చులను కవర్ చేస్తుంది, రెండవది మీరు పోయిన తర్వాత మీ కుటుంబసభ్యులకు ఆర్థికపరమైన భరోసా కల్పిస్తుంది. బజాజ్ అలియంజ్ బ్లాగ్స్ ద్వారా భారతదేశంలోని హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల రకాలు అన్వేషించండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి