రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
General Insurance Penetration in India
నవంబర్ 23, 2021

భారతదేశంలో ఇన్సూరెన్స్ రంగం - టైర్ 3 మరియు 4 నగరాల్లో జనరల్ ఇన్సూరెన్స్ విస్తరణ అవసరం

ప్రపంచంలో కెల్ల భారతదేశంలోని ఈ ప్రత్యేక ప్రాంతాల్లో ఇన్సూరెన్స్ బిజినెస్ లేదా జనరల్ ఇన్సూరెన్స్ చాలా ప్రభావవంతంగా అభివృద్ధి చెందుతోంది. 2016-17 సంవత్సరంలో 8000 కోట్ల మార్కెట్ పరిమాణం నుండి మొదలుకొని ఇప్పుడు 120000 కోట్లకు పైగా విస్తరించింది. జనరల్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఎల్లప్పుడూ పూర్తి ఆర్థిక వృద్ధితో అభివృద్ధి చెందుతోంది. లైఫ్ ఇన్సూరెన్స్‌లో మాదిరిగా ఇది విక్రేతలు ఒక అవసరాన్ని సృష్టించేందుకు ప్రయత్నించే, స్వచ్ఛమైన విక్రయ ఆధారిత పంపిణీ కాదు, పి&సిలో ఇన్సూరెన్స్ కోసం అవసరం లేదా అవకాశం ఇప్పటికే ఉంది. ఉదాహరణకు, మీరు ఒక కారును కొనుగోలు చేసినట్లయితే, కనీసం ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్ లేదా మీరు ఒక బ్యాంకు వద్ద రుణం కోసం అప్లై చేసినట్లయితే, మీ ఆస్తులను ఇన్సూర్ చేయించుకోవడం అనేది ఆవశ్యకం. కానీ భారతదేశంలో దాదాపుగా 30 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు (హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలతో సహా) ఉన్నాయి. అనేక సంస్థలు అభివృద్ధి చెందడానికి మరియు నిలదొక్కుకోవడానికి సాంప్రదాయక 'అవకాశాలు' ఎక్కువగా లేవు. జనరల్ ఇన్సూరెన్స్‌లో మోటార్ ఇన్సూరెన్స్ ఎప్పుడూ ఒక ప్రధాన వ్యాపారంగా ఉంది మరియు 1 బిలియన్ కంటే ఎక్కువ మంది నివసిస్తున్న దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్‌కి రెండవ ప్రాధాన్యత ఉంటుంది. ప్రధాన జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు అన్నీ భారతదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్, కనీసం 5 ప్రత్యేకమైన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలతో (మరియు కొన్ని సిద్ధం అవుతున్నాయి). లాజిస్టిక్స్, ఉత్పాదకత, టిక్కెట్ పరిమాణం మరియు సులభమైన పంపిణీ మెట్రోలు మరియు టైర్ I నగరాల్లో మాత్రమే కంపెనీలకు దోహదపడింది. కానీ భారతదేశంలో, నేడు, టైర్ III మరియు IV నగరాలు/గ్రామాల్లో 60% కంటే ఎక్కువ మంది నివసిస్తున్నారు. ఇది ఇన్సూరెన్స్ లేని భారీ కస్టమర్ల సంఖ్యను సూచిస్తుంది. టైర్ III మరియు IV నగరాల్లో అనేక ఇన్సూరెన్స్ సంస్థలు ఈ కింది సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి:
  1. అంతటా ఏకరీతి సేవలను అందించడానికి, కనీస సిబ్బందితో పనిచేసే కార్యాలయాలను తెరవడానికి అధిక మొత్తంలో ఖర్చవుతుంది
  2. మెట్రో ప్రాంతాల నుండి ఈ నగరాలకు చేరుకోవడానికి రవాణా/ ప్రయాణ సమస్యలు
  3. ఈ ఇన్సూరెన్స్ గురించి తక్కువ అవగాహన ఉండటం, దీనిపై పూర్తి అవగాహన కల్పించడానికి మరిన్ని ప్రయత్నాలు మరియు వనరులు అవసరం.
  4. కస్టమర్ ప్రశ్నలు మరియు సమస్యలకు సమాధానం ఇవ్వడానికి అనుభవజ్ఞులైన మరియు శిక్షణ పొందిన మానవశక్తి (ఇన్-హౌస్ మరియు డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్‌లు), ఎందుకంటే పాలసీ నిబంధనలు మరియు షరతులు, ఉపనిబంధనలు, క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ మొదలైన వాటి పరంగా ఇన్సూరెన్స్‌ను అర్థం చేసుకోవడం చాలా క్లిష్టంగా ఉండవచ్చు.
  5. క్లెయిమ్ సైజు మరియు ఫ్రీక్వెన్సీ (ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్‌లో) పై అందుబాటులో ఉన్న డేటా తక్కువగా ఉన్నందున ధరల విషయంలో సవాళ్ళు.
అందువల్ల, భారతదేశంలో ఇన్సూరెన్స్ చాలా తక్కువ ప్రాచుర్యం పొందింది. అయితే, టైర్ III మరియు IV నగరాల పై దృష్టి పెట్టకపోతే ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని పెంచుకోవడం సాధ్యం కాదు. ఎఫ్ఎంసిజి, ఫార్మా మరియు టెలికామ్ రంగాల వంటి కొన్ని పరిశ్రమలు అటువంటి ప్రదేశాలలో అభివృద్ధి చెందాయి. అయితే ఆ పరిశ్రమలు సఫలం అవ్వడానికి కారణంగా వారి ఉత్పత్తులు మరియు పంపిణీ పద్ధతులను ఆయా ప్రాంతాలలోని స్థానిక జనాభా అవసరానికి అనుకూలంగా మార్చడం. తక్కువ ధర వద్ద (నాణ్యత పై రాజీ పడకుండా) అందించడంలో వినూత్నత, నెలవారీ ప్యాక్స్ బదులు డైలీ బడ్జెట్, విస్తృత పంపణీ నెట్‌వర్క్ ద్వారా సులభమైన లభ్యత మొదలైనవి ఈ సర్దుబాట్లలో కొన్ని. ఇవి ఈ ప్రాంతాల్లో వారి విజయానికి దోహదపడ్డాయి. ఈ పరిశ్రమలతో పోలిస్తే ఇన్సూరెన్స్ పరిశ్రమ భిన్నంగా ఉన్నప్పటికీ, ఆ ప్రదేశాలలో ఇన్సూరెన్స్ పరిశ్రమని విస్తరించడానికి కొన్ని పాఠాలు వీరి వద్ద నుండి నేర్చుకోవచ్చు. ఇన్సూరెన్స్‌లో అతిపెద్ద సవాలు ఏంటంటే కస్టమర్‌కు వెంటనే ప్రతిఫలం దక్కదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే మొత్తాన్ని రీఇన్‌స్టేట్ చేయడం లేదా నష్టాలను చెల్లించడం అనే వాగ్దానం మాత్రమే ఉంటుంది. ప్రతిరోజూ అనేక దుర్ఘటనలను చూసినప్పటికీ అవి మనకు జరగవు అనే మనలో చాలా మంది భావిస్తుంటారు. ఈ మనస్తత్వాన్ని మార్చడానికి మరియు ఈ ప్రాంతాల్లో ఎఫ్ఎంసిజి మరియు టెలికాం కంపెనీలు అందుకున్న విజయాన్ని సాధించడానికి ఇన్సూరెన్స్ సంస్థలు మరి కొంత కష్టపడాలి మరియు మరి కొంత కృషి చేయాలి. టైర్ III మరియు IV నగరాల్లో విస్తరణ కోసం ఒక వ్యూహాన్ని రూపొందించేటప్పుడు, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు పరిగణలోకి తీసుకోవాల్సిన కొన్ని విషయాలు మరియు సూచనలు ఇక్కడ ఉన్నాయి:
  1.   భౌతిక ఉనికిని కలిగి ఉండటానికి బదులుగా స్వయం-సమృద్ధి గల ఒక ఇకోసిస్టమ్ సృష్టించడానికి టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించడం (అంటే టెక్నాలజీ సహాయంతో పాలసీలు జారీ చేయడం, తక్షణమే క్లెయిముల సెటిల్‌మెంట్ చేయడం)
  2. పంపిణీ వ్యూహం మెట్రోలు మరియు టైర్ I నగరాల లాగా ఉండకూడదు. పెద్ద సంఖ్యలో ఏజెంట్లు (పూర్తి సమయం పని చేసే వారు కాకపోవచ్చు) ప్రతి నెలా క్రమం తప్పని కానీ తక్కువ విక్రయాలను చేయడం ఒక మార్గం.
  3. కవరేజ్, ఫీచర్లు, అఫోర్డబిలిటీ మరియు పాలసీ టర్మ్ మొదలైన వాటి పరంగా ఇన్నోవేషన్ మరియు కస్టమైజేషన్ అవసరం (చాలా పాలసీలు ఒక సంవత్సరం కోసం మాత్రమే ఉంటాయి).
  4. అవగాహన అనేది మొత్తం పరిశ్రమలో పెద్ద బాధ్యత, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు స్మార్ట్ ప్రకటన (మీడియా టివిసి, వార్తాపత్రిక, సోషల్ మీడియా మొదలైన వాటి వినూత్న ఉపయోగం) దిశగా మరిన్ని వనరులలో సేకరించాలి.
  5. సిఎస్‌సి, ఐఎంఎఫ్, పిఒఎస్ మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల వంటి కొత్త పంపిణీ అవకాశాలు ఇన్సూరెన్స్ విస్తరణకు ఎంతో సహాయపడగలవు.

ముగింపు

బజాజ్ అలియంజ్ వద్ద, మేము టైర్ 3 మరియు 4 నగరాలను మాత్రమే జనరల్ ఇన్సూరెన్స్ విస్తరణ అవసరమైన మార్కెట్‌లుగా చూడటం లేదు, మేము ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజల సంపాదన సామర్థ్యాన్ని పెంచడాన్ని లక్ష్యంగా కలిగి ఉన్నాము. ప్రస్తుతం 800 కి పైగా విఎస్ఒలు పనిచేస్తున్నాయి, మేము ప్రత్యక్షంగా 1000 మందికి పైగా వ్యక్తులకు మరియు పరోక్షంగా మధ్యవర్తుల విస్తృత నెట్‌వర్క్‌కు ఉపాధిని కల్పించాము. వర్చువల్ ఆఫీస్ చొరవ అనేది ఈ ప్రాంతాల్లోని కస్టమర్లకు తమను తాము సురక్షితం చేసుకునే అవకాశాన్ని మాత్రమే కాకుండా, వారి స్వస్థలం నుండే ఒక ప్రసిద్ధ బ్రాండ్‌తో పని చేసే అవకాశాన్ని కూడా సృష్టించింది. సహకారం అందించినవారు: ఆదిత్య శర్మ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు నేషనల్ హెడ్ - స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి