రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Car Insurance Transfer
31 మార్చి, 2021

కార్ ఇన్సూరెన్స్ ట్రాన్స్‌ఫర్

మీరు తయారీదారు లేదా కంపెనీ అధీకృత షోరూమ్ నుండి నేరుగా కారును విక్రయించనప్పుడు లేదా కొనుగోలు చేయనప్పుడు ట్రాన్స్‌ఫర్ అనే ప్రశ్న తలెత్తుతుంది. ట్రాన్స్‌ఫర్ జరిగినప్పుడు, కారుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు కొత్త యజమానికి ట్రాన్స్‌ఫర్ చేయబడాలని అనేది స్పష్టమైన విషయం. కానీ తరచుగా, కారు ఇన్సూరెన్స్ ట్రాన్స్‌ఫర్ అనేది నిర్లక్ష్యం చేయబడుతుంది. ఎందుకనగా ఇది అవసరమైన మరియు తప్పనిసరి డాక్యుమెంట్ అయినప్పటికీ, ఇది నేరుగా కారుకు సంబంధించినది కాదు. గతంతో పోలిస్తే కార్ల సెకండరీ సెల్లింగ్ మార్కెట్ ఇప్పుడు ఎక్కువగా పెరగడంతో, వాహనాల ట్రాన్స్‌ఫర్ అనేది తెలిసిన పార్టీల మధ్య పరిమితం అవ్వడం లేదు. విభిన్న భౌగోళిక ప్రదేశాల్లో నివసించే అన్ని వర్గాల ప్రజలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నారు మరియు అందువల్ల ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించిన అన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కార్ ఇన్సూరెన్స్ ట్రాన్స్‌ఫర్ అంటే ఏమిటి? ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కారు ఇన్సూరెన్స్ ట్రాన్స్‌ఫర్ లోని సాంకేతిక అంశాల గురించి తెలుసుకోవడానికి ముందు, కారు ఇన్సూరెన్స్ ట్రాన్స్‌ఫర్ అంటే ఏమిటో చూద్దాం. విక్రేత పేరు నుండి కొనుగోలుదారు పేరు మీదకు ఇన్సూరెన్స్ పాలసీని ట్రాన్స్‌ఫర్ చేసే ప్రక్రియను కార్ ఇన్సూరెన్స్ ట్రాన్స్‌ఫర్ అంటారు. వాహనం ఉపయోగిస్తున్నప్పుడు కార్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం చాలా ముఖ్యం, కనీసం ఒక 3వ పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. ఇది చాలా కీలకమైన అంశం, ఎందుకనగా దీనిని పాటించకపోవడం అనేది చట్టపరమైన ఉల్లంఘనకు దారి తీస్తుంది మరియు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. సులభంగా చెప్పాలంటే, ఇది ఒక పార్టీ పేరును ఉపసంహరించుకోవడం మరియు దానిని ఇప్పుడు వాహన యజమానిగా ఉన్న మరొక పార్టీ పేరుకి మార్చే ప్రక్రియ. అటువంటి ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఏదైనా సమయ పరిమితి ఉందా? ఇచ్చిన షరతుల ప్రకారం, వాహనాన్ని ట్రాన్స్‌ఫర్ చేసిన తేదీ నుండి 14 రోజుల్లోపు కారు ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయడం తప్పనిసరి. ఒకవేళ మునుపటి యజమాని థర్డ్-పార్టీ పాలసీని కలిగి ఉంటే, అది కారు ట్రాన్స్‌ఫర్ అయిన తేదీ నుండి 14 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుంది. అయితే, మునుపటి యజమాని సమగ్ర పాలసీని కలిగి ఉన్నట్లయితే, ఆ పాలసీ ట్రాన్స్‌ఫర్ ఇంకా పూర్తి కానట్లయితే, కారు ట్రాన్స్‌ఫర్ పూర్తయిన తేదీ నుండి 14 రోజుల పాటు థర్డ్ పార్టీ లయబిలిటీ మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది. ఒకవేళ, విక్రేత 14 రోజుల్లోపు కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలుదారుకు ట్రాన్స్‌ఫర్ చేయడంలో విఫలమైతే, థర్డ్-పార్టీ బాధ్యత 14 రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా కాలం చెల్లుతుంది. ఆ తరువాత, ఈ పాలసీ కింద ఎలాంటి క్లెయిమ్‌లు స్వీకరించబడవు. ఇన్సూరెన్స్ పాలసీ ట్రాన్స్‌ఫర్ చేయబడకపోతే ఏం జరుగుతుంది? ఒకవేళ కారు ఇన్సూరెన్స్ పాలసీ ట్రాన్స్‌ఫర్ చేయబడకపోతే, ఇన్సూరెన్స్ కంపెనీ కొత్త కొనుగోలుదారు చేసిన ఎలాంటి క్లెయిములను అంగీకరించదు; ఎందుకనగా వాహనం కొత్త కొనుగోలుదారు పేరుతో రిజిస్టర్ చేయబడి ఉంటుంది; అదేవిధంగా, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అతని పేరుతో ఉంటుంది మరియు పాలసీ పాత యజమాని పేరు మీద ఉంటుంది. రెండు డాక్యుమెంట్లు ఒకే పేరును కలిగి ఉండవు. కావున, క్లెయిమ్ తిరస్కరించబడుతుంది. ఒక ప్రమాదం సంభవించినట్లయితే నష్టపరిహారాన్ని చెల్లించడానికి విక్రేత బాధ్యత వహించాలి. కాబట్టి, విక్రేత దృష్టిరీత్యా పాలసీని ట్రాన్స్‌ఫర్ చేయడం చాలా అవసరం. ట్రాన్స్‌ఫర్ జరిగినప్పుడు, పాలసీలో జమ చేయబడిన 'నో క్లెయిమ్ బోనస్' ట్రాన్స్‌ఫర్ చేయబడదు అని గమనించడం కూడా చాలా ముఖ్యం. ఇది పాత పాలసీదారుతో మాత్రమే ఉంటుంది. అలాగే, 'నో క్లెయిమ్ బోనస్' అనేది ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పై మాత్రమే చెల్లించబడుతుంది. ఒక పాలసీహోల్డర్‌గా, అవసరమైన సమయంలో కార్ ఇన్సూరెన్స్‌ను ఎలా క్లెయిమ్ చేయాలి తప్పనిసరి, అవసరమైనప్పుడు ఇది క్లెయిమ్‌ల త్వరిత పరిష్కారాన్ని ప్రారంభించడానికి ఉపయోగపడుతుంది. మీరు ఇన్సూరెన్స్ పాలసీని ఏవిధంగా ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు? ప్రస్తుత ఇన్సూరెన్స్ పాలసీని ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఈ కింది డాక్యుమెంట్లు ఇన్సూరెన్స్ కంపెనీకి సమర్పించబడతాయి.
  • అప్లికేషన్ ఫారం
  • ఫారం 29
  • ఫారం 30
  • ప్రస్తుత యజమాని నుండి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్
  • ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్
  • కొత్త యజమాని పేరు మీద ఉన్న రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
కొత్త యజమానికి ఏయే డాక్యుమెంట్లు అందించాలి?
  • కొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
  • కారు ఇన్సూరెన్స్
  • కారు యొక్క ఒరిజినల్ ఇన్వాయిస్
  • ఫైనాన్సర్ నుండి ఎన్ఒసి
  • రోడ్డు టాక్స్ రసీదులు
తరచుగా అడిగే ప్రశ్నలు పాలసీ వ్యవధిలో నేను నా ఇన్సూరెన్స్‌ను కొత్త కారుకు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చా? అందించిన పాలసీ వ్యవధిలో మీరు ఇన్సూరెన్స్ పాలసీని కొత్త కారుకు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. మీ పాలసీ ప్రొవైడర్, పాలసీ మరియు ప్రీమియంలో నిర్దిష్ట మార్పుల కోసం అవసరమైన సదుపాయాన్ని కల్పిస్తారు. నేను నా ప్రస్తుత ‘నో క్లెయిమ్ బోనస్’ ప్రయోజనంతో పాటు నా ఇన్సూరెన్స్‌ను కొత్త కారుకు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చా? పాలసీని ట్రాన్స్‌ఫర్ చేస్తే 'నో క్లెయిమ్ బోనస్' పాస్ చేయబడదు మరియు అది ట్రాన్స్‌ఫర్ చేసిన వారి వద్దనే ఉండిపోతుంది. అందువల్ల మీరు మీ 'నో క్లెయిమ్ బోనస్' ప్రయోజనాన్ని పొందడాన్ని కొనసాగించవచ్చు.‌  “నేను కారును విక్రేతను. నేను కారు ఇన్సూరెన్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఎందుకు ఆసక్తి చూపాలి?” అని మనీష్ అడుగుతున్నారు ఒక విక్రేతగా మీరు, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌ విధానంలో కారు ఇన్సూరెన్స్ ట్రాన్స్‌ఫర్ నుండి ప్రయోజనం పొందవచ్చు, ట్రాన్స్‌ఫర్ తర్వాత ఏదైనా థర్డ్ పార్టీ బాధ్యత తలెత్తితే వాటిని చెల్లించాల్సిన బాధ్యత మీకు ఉండదు. అలాగే, మీరు మీ కొత్త కార్ ఇన్సూరెన్స్ పాలసీలో మీ నో క్లెయిమ్ బోనస్‌ను ఉపయోగించవచ్చు మరియు తక్కువ ప్రీమియం చెల్లింపు ప్రయోజనాన్ని పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి