రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Car Insurance Exclusions
అక్టోబర్ 22, 2019

కార్ ఇన్సూరెన్స్ మినహాయింపులు - కార్ ఇన్సూరెన్స్ కవర్ చేయనివి ఏమిటి?

మీరు షోరూమ్‌కు వెళ్లి కొత్త కారును కొనుగోలు చేశారు. ఇది గొప్ప అనుభూతి కాదా? కానీ మీ వద్ద చెల్లుబాటు అయ్యే కార్ ఇన్సూరెన్స్ లేకపోతే మీరు కారును ఇంటికి తీసుకువెళ్ళలేరు. మీరు కారు ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ ‌లో కొనుగోలు చేయవచ్చు లేదా కార్ డీలర్ ఒప్పందం కలిగి ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద మీరు కారును ఇన్సూర్ చేయించుకోవచ్చు. మీరు కలలు కన్న కారును డ్రైవ్ చేయడం ప్రారంభించడానికి, మీ కారును మీరు ఇన్సూర్ చేయించుకోవాలి మరియు షరతులు మరియు నిబంధనలను చదవాలి. కానీ కొన్ని నిబంధనలు చాలా ముఖ్యమైనవి. మీరు వాటిని మరింత జాగ్రత్తగా చదవాలి. అవి మీ ఇన్సూరెన్స్ పాలసీలో ఉన్న మినహాయింపులు. దిగువన ఒక ఉదాహరణను చూద్దాం: ముంబైకి చెందిన ఆనంద్ శ్రీవాస్తవ తన కొత్త కారును కొనుగోలు చేశాడు మరియు తన స్నేహితులకు పార్టీ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. పార్టీ ముగిసిన తర్వాత, ఆనంద్ యొక్క స్నేహితుడు రాహుల్ తన కొత్త కారును నడపాలనుకున్నాడు. ఆనంద్ అందుకు వెంటనే అంగీకరించాడు. అన్ని సజావుగా సాగుతున్న వేళ, తప్పు దారిలో మరొక కారు అధిక వేగంతో వచ్చి ఆనంద్ కారును ముందు నుండి ఢీకొట్టింది. ఇద్దరూ సురక్షితంగా ఉన్నప్పటికీ, బంపర్ దెబ్బతిన్నది. ఆనంద్ కారు ఇన్సూర్ చేయబడినందున అతను నష్టాల కోసం క్లెయిమ్ చేశాడు. అయితే, అతని క్లెయిమ్ తిరస్కరించబడింది! కారణం? రాహుల్ వద్ద చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేదు మరియు ఆ విషయం ఆనంద్‌కి తెలియదు. ఆనంద్ తన స్వంత డబ్బుతో అన్ని ఖర్చులను భరించవలసిన పరిస్థితి ఏర్పడింది. పైన పేర్కొన్న ఉదాహరణలో లాగానే, మీ కారు కవర్ చేయబడని అనేక మినహాయింపులు పాలసీలో ఉంటాయి. ఓన్ డ్యామేజ్ అనేది సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీలలో మాత్రమే కవర్ చేయబడుతుంది మరియు థర్డ్ పార్టీ లయబిలిటీ ప్లాన్లలో కవర్ చేయబడదు అని తెలుసుకోవడం ముఖ్యం. మీకు అవసరమైనప్పుడు ఏదైనా నష్టం నుండి మిమ్మల్ని మరియు మీ వాహనాన్ని కవర్ చేయడానికి మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ రూపొందించబడింది. కానీ ఇన్సూరెన్స్ మీ క్లెయిమ్‌లకు కవరేజ్ అందించని పరిస్థితులు కొన్ని ఉంటాయి మరియు వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం, తద్వారా మీరు ఆనంద్ లాగా మీ స్వంత డబ్బుతో మీకు జరిగిన నష్టాల కోసం చెల్లించవలసిన అవసరం ఏర్పడదు. ఈ క్రింది పరిస్థితుల గురించి మీరు తెలుసుకోవాలి: 1) వాహనం యొక్క అరుగుదల మరియు తరుగుదల సాధారణ అరుగుదల మరియు తరుగుదల కారణంగా సంభవించే ఏదైనా నష్టం కోసం క్లెయిమ్ చేయలేరు. అదేవిధంగా, ఏదైనా రూపంలో ఉన్న మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ బ్రేక్‌డౌన్, ఛాసిస్ వైఫల్యం, లేదా బాడీ పార్ట్స్ వైఫల్యం లేదా తుప్పు లేదా ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా బ్రేకేజ్ వంటివి క్లెయిమ్ కోసం పరిగణించబడవు. 2) టైర్లు, ఎలక్ట్రికల్ పరికరాలు లేదా ఎలక్ట్రానిక్స్‌కు జరిగిన నష్టం సమయం గడిచే కొద్దీ టైర్లు అరిగిపోతాయి. ఫలితంగా, వాటి కోసం మీరు క్లెయిమ్ చేయలేరు. అదేవిధంగా, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, షార్ట్-సర్క్యూట్ లేదా ఎలుకలు వంటి జంతువుల కారణంగా కారులో ఎలక్ట్రికల్ పరికరాలు దెబ్బతినవచ్చు. అటువంటి నష్టానికి పరిహారం ఇవ్వబడదు. 3) ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి మద్యం మత్తులో డ్రైవ్ చేస్తున్నప్పుడు నష్టం జరిగినట్లయితే మద్యం మత్తులో లేదా మత్తును కలిగించే ఏదైనా పదార్థం ప్రభావంలో ఒక వ్యక్తి వాహనం నడుపుతూ ఉన్నప్పుడు ప్రమాదం జరిగినట్లయితే, ఏ ఇన్సూరర్ నష్టాల కోసం కవరేజ్ అందించదు. 4) ఉద్దేశపూర్వకంగా ఏదైనా గాయం చేసుకున్నా లేదా ఆస్తికి నష్టం కలిగించినా ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తికి లేదా ఆస్తికి హాని కలిగించినట్లయితే, అప్పుడు అతనికి కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద ఏ రూపంలోనూ రీయింబర్స్‌మెంట్ లభించదు. అదేవిధంగా, ఇది ఇన్సూర్ చేయబడిన వ్యక్తి యొక్క ఆస్తికి జరిగిన నష్టాన్ని కవర్ చేయదు. 5) యుద్ధం మరియు ఇతర ఆపదల వలన కలిగిన నష్టం యుద్ధం, జీవ-రసాయన దాడి, లేదా అణు విస్ఫోటనం ఏర్పడిన అగ్ని ప్రమాదం మరియు సంబంధిత సంఘటనల వలన వాహనానికి ఏదైనా నష్టం జరిగినట్లయితే వాటి కోసం క్లెయిమ్ చేయలేరు. 6) రేసింగ్ వలన కలిగిన నష్టాలు ఆర్గనైజ్ చేయబడిన రేసింగ్‌లో ఢీకొనడం ఫలితంగా జరిగిన ఏదైనా కొలిజన్ నష్టం లేదా ఆస్తి నష్టం కార్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడదు. అదేవిధంగా, వాహనాన్ని షేరింగ్ కార్యక్రమాలలో ఉపయోగించినట్లయితే అది పరిమిత కవరేజ్ అందిస్తుంది లేదా అన్ని నష్టాలకు కవరేజ్ అందించదు. 7) చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం పై ఉదాహరణలో పేర్కొన్న విధంగా, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరైనా డ్రైవింగ్ చేస్తే మరియు కారు యాక్సిడెంట్‌కు గురి అయితే, అప్పుడు క్లెయిమ్లు రీయింబర్స్ చేయబడవు. ఇప్పుడు మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ మినహాయింపుల గురించి మీకు తెలుసు కాబట్టి, మీ అవసరాలను తీర్చే ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయండి. మీరు కార్ ఇన్సూరెన్స్ కోసం శోధిస్తున్నట్లయితే, మీరు బజాజ్ అలియంజ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీని చూడవచ్చు. ఇది భారతదేశంలో అత్యంత సమగ్రమైన కార్ ఇన్సూరెన్స్ పాలసీలలో ఒకటి.  

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి