రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Harvest Festival Celebrations
జూన్ 10, 2021

పంటకోత పండుగను జరుపుకోవడం - జనవరి 14

భారతదేశం గొప్ప సంస్కృతి మరియు వైవిధ్యం కలిగిన దేశం, ఇక్కడ ప్రజలు ప్రతి పండుగను ఒకే ఉత్సాహంతో జరుపుకుంటారు. జనవరి 14 అనేది అలాంటి ఒక ప్రత్యేకమైన రోజు, ఇది పంటకోత పండుగ ఉత్సవాల ప్రారంభాన్ని సూచిస్తుంది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రజలు ఈ రోజును అంగరంగవైభవంగా మరియు ఉత్సాహభరితంగా జరుపుకుంటారు. భారతదేశ వ్యాప్తంగా ఒకే లక్ష్యంతో, ఒకే రోజును వేర్వేరు పేర్లతో గొప్ప వేడుకతో జరుపుకోవడం అనేది, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే అందమైన భారతీయ సంస్కృతిని సూచిస్తుంది.

పొంగల్

ఈ పంటకోత పండుగను దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఘనంగా జరుపుకుంటారు. ఈ విశిష్టమైన రోజున పంటకోత కాలం ప్రారంభాన్ని మరియు వర్షాకాలం ముగింపును సూచిస్తుంది. ఈ వేడుకల్లో భాగంగా కొత్త వరి ధాన్యంతో పొంగల్ అనే తీపి పదార్థాన్ని వండుతారు, దీని పేరు మీదుగా ఈ పండుగకు పొంగల్ అని నామకరణం చేయడం జరిగింది. పొంగల్ రోజున ప్రజలు వారి పశువులను పూల మాలలతో అలంకరిస్తారు మరియు వాటి నుదిటిపై పసుపు, కుంకుమ మరియు గంధాన్ని దిద్దుతారు మరియు వాటిని పూజించి ఆశీర్వాదాలు కూడా తీసుకుంటారు.

మకర సంక్రాంతి లేదా ఉత్తరాయణం

భారతదేశంలోని పశ్చిమ రాష్ట్రం అయిన గుజరాత్‌లో మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజు పంటకోత సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ రోజున ప్రజలు సూర్య భగవానుడికి వారి గౌరవవందనాలు తెలుపుతారు. ఈ వేడుకలో భాగంగా సూర్యోదయం (ఉత్తరాయణం) మొదలుకొని గాలి పటాలు ఎగురవేస్తారు, ఉంధియు మరియు జిలేబీ లాంటి విభిన్న వంటకాలు తయారు చేస్తారు, సూర్య భగవానుడిని ఆరాధిస్తారు.

లోహ్రి

భారతదేశంలోని ఉత్తర రాష్ట్రమైన పంజాబ్‌లో లోహ్రీని జరుపుకుంటారు. పంజాబీలకు జనవరి 14 కు ముందు రోజు నుండే పంటకోత కాలం ప్రారంభమవుతుంది. జనవరి 14న, పంజాబ్‌ రాష్ట్ర ప్రజలు మాఘిని ఘనంగా జరుపుకుంటారు, రైతులు దీనిని ఒక కొత్త ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తారు. ఈ పండుగలో భాగంగా ప్రజలు భోగి మంటలు వేయడం, పూజా ప్రార్థనలు చేయడం, పవిత్ర నదుల్లో స్నానం ఆచరించడం, భాంగ్రా మరియు గిడ్డా పాటలకు నాట్యం చేయడం, గాలి పటాలు ఎగురవేయడం, అలాగే, ఖీర్ లాంటి తీపి వంటకాలను వండటం లాంటివి చేస్తుంటారు.

బిహు

ఇది భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. జనవరి నెలలో బిహూ వేడుకను మాఘ్ బిహూ అని పిలుస్తారు. ఇది కాలంలో జరిగే మార్పుల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ పండుగలో భాగంగా ప్రజలు వివిధ రకాల పిండి వంటలు వండుతారు మరియు జానపద పాటలకు నృత్యాలు చేస్తారు. భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా, ఉదాహరణకు పశ్చిమ బెంగాల్‌లో ఈ పండుగను పౌష్ పర్బన్‌గా మరియు బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సక్రాత్‌గా జరుపుకుంటారు. పంటలు రైతులు చేసే అత్యంత విలువైన పెట్టుబడి మరియు వారి ప్రధాన ఆదాయ వనరు కూడా. కానీ అనేకసార్లు, ప్రకృతి వైపరీత్యాలు లేదా మరేదైనా కారణాల వల్ల వారి పంట చాలాసార్లు దెబ్బతింటుంది. అందువల్ల, భారత ప్రభుత్వం ఇప్పుడు ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన‌ ను ప్రారంభించింది, ఇది భారతదేశంలో వ్యవసాయ ఇన్సూరెన్స్‌ను అందిస్తుంది. రైతుల శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా రూపొందించిన ఈ పాలసీ గురించి మరింత తెలుసుకోవడానికి మీరు మా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి