Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ఉత్పత్తిని ఎంచుకోండి

హెల్త్ ఇన్సూరెన్స్‌ కింద సెక్షన్ 80D మినహాయింపులు

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల నుండి మిమ్మల్ని రక్షించడమే కాకుండా కొన్ని పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం - 1961లోని సెక్షన్ 80D అనేది మీరు మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ కోసం చెల్లించిన ప్రీమియంకు బదులుగా, మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుండి కొన్ని మినహాయింపులను పొందడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

సెక్షన్ 80D కింద నిబంధనలు

సెక్షన్ 80D అనేది హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుకు బదులుగా, పూర్తిగా పన్ను విధించదగిన ఆదాయం నుండి వ్యక్తులతో పాటు హిందూ అవిభాజ్య కుటుంబాలకు (హెచ్‌యుఎఫ్) పన్ను మినహాయింపులను అందిస్తుంది. ఒక వ్యక్తి తమ కోసం, జీవిత భాగస్వామి, ఆధారపడిన తల్లిదండ్రులు లేదా పిల్లల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను చెల్లిస్తున్నట్లయితే, అతను/ఆమె ఈ పన్ను ప్రయోజనాలను పొందవచ్చు

వయస్సు ఆధారిత పన్ను ప్రయోజనాలు

ఒకవేళ సెక్షన్ 80D క్రింద ఒక వ్యక్తి తమ కోసం, అతని/ఆమె కుటుంబం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు చెల్లిస్తున్నట్లయితే, అతను/ ఆమె పన్ను విధించదగిన ఆదాయం నుండి రూ. 25,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అదనంగా, 60 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు గల తల్లిదండ్రులకు ప్రీమియం చెల్లించబడితే పాలసీదారుడు రూ. 25,000 వరకు అదనపు పన్ను మినహాయింపును పొందవచ్చు. ఒకవేళ పన్ను చెల్లింపుదారు తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ అయితే, అనగా 60 సంవత్సరాల కన్నా ఎక్కువ వయస్సుతో ఉన్నట్లయితే, అదనపు పన్ను మినహాయింపు రూ. 50,000 వరకు ఉండవచ్చు.

60 ఏళ్లు పైబడిన పన్ను చెల్లింపుదారులకు సంచిత పన్ను ప్రయోజనాలు రూ. 1,00,000. వరకు లభిస్తాయి. పన్ను విశ్లేషణ అనేది ఒక సీనియర్ సిటిజన్ పాలసీదారు తమ కోసం, జీవిత భాగస్వామి మరియు ఆధారపడిన పిల్లల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు చెల్లించినందుకు గాను రూ. 50,000 వరకు పన్ను మినహాయింపులకు అర్హులు, అయితే, అతని/ ఆమె తల్లిదండ్రుల కోసం చెల్లించిన ప్రీమియంలకు గాను రూ. 50,000 వరకు అదనపు మినహాయింపును కూడా పొందవచ్చు.

ప్రివెంటివ్ హెల్త్‌కేర్ బెనిఫిట్

ప్రివెంటివ్ హెల్త్ కేర్ చెక్-అప్‌లపై చేసే ఖర్చులు కూడా రూ. 5,000. పరిమితి వరకు పన్ను మినహాయింపులకు అర్హత పొందుతాయి. ఈ పన్ను ప్రయోజనం అనేది పన్ను మినహాయింపు పరిమితి రూ. 25000 లేదా రూ. 50,000 వరకు, వర్తించే విధంగా ఉంటుంది.

కావున, ప్రతి ఒక్కరి ఫైనాన్సియల్ ప్లాన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ అత్యంత ముఖ్యమైన భాగంగా నిలుస్తుంది. వైద్యపరమైన ఆకస్మిక పరిస్థితులపై ఆర్థిక భద్రతను అందించడమే కాకుండా, పన్ను ప్రయోజనాల పరంగా ఇది అందించే అదనపు అంచు ఫైనాన్సియల్ ప్లాన్‌కు అత్యంత లాభాన్ని సమకూర్చే మార్గాలలో ఒకటిగా నిలుస్తుంది.

మరిన్ని అన్వేషించండి:‌ హెల్త్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం