వాయు కాలుష్యం అనేది నేడు ఈ దేశంలో ఒక ప్రధాన సమస్యగా మారింది. మరియు దానిని నియంత్రణ కోసం ప్రభుత్వం అవసరమైన ప్రతి చర్యను తీసుకుంటుంది. అందులో ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల్లో ఒకటి వాహన కాలుష్యాన్ని పరిమితులలో ఉంచడం. భారతీయ రోడ్లపై వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో, కాలుష్య నివారణకై చర్యలు తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. అందుకు రవాణా మంత్రిత్వ శాఖ, సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ 1989 ప్రకారం, డ్రైవర్లకు పియుసి సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేయడం ఒక నిదర్శనం. కాబట్టి, బైక్ లేదా కారు లేదా ఏదైనా ఇతర వాహనంలో పియుసి అంటే ఏమిటి?? దాని ప్రాముఖ్యత ఏమిటి?? ఇక్కడ అనేక ప్రశ్నలు సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు వాటన్నింటిని లోతుగా తెలుసుకుందాం!
పియుసి అంటే ఏమిటి?
పియుసి అనే పదం పొల్యూషన్ అండర్ కంట్రోల్ కి సంక్షిప్త రూపం, ఇది వాహన ఉద్గార స్థాయిలను పరీక్షించిన తర్వాత ప్రతి వాహన యజమానికి జారీ చేయబడే ఒక సర్టిఫికేట్. ఈ సర్టిఫికెట్, వాహనాల ద్వారా వెలువడే ఉద్గారాలు మరియు అవి నిర్ణీత పరిమితుల్లో ఉన్నాయో లేదో అనే పూర్తి వివరాలను తెలియజేస్తుంది. ఈ ఉద్గార స్థాయిల పరీక్ష అనేది ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంపుల వద్ద అధీకృత కేంద్రాల్లో జరుగుతుంది. పియుసి అనేది బైక్ ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మాదిరిగా పనిచేస్తుంది, దీనిని ఎల్లవేళలా మీ వెంటే తీసుకెళ్లాలి. పియుసి సర్టిఫికెట్ ఈ కింది సమాచారాన్ని కలిగి ఉంటుంది:
- కారు, బైక్ లేదా ఏదైనా ఇతర వాహనం యొక్క రిజిస్ట్రేషన్ నంబర్.
- టెస్ట్ చెల్లుబాటు వ్యవధి
- పియుసి యొక్క సీరియల్ నంబర్
- ఎమిషన్ టెస్ట్ జరిగిన తేదీ
- వాహనం యొక్క ఉద్గార రీడింగ్‌లు
నాకు పియుసి అవసరమా?
అవును,
పియుసి సర్టిఫికెట్ అనేది ఒక డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ మరియు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల మాదిరిగా తప్పనిసరిగా వెంట తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్. అది ఎందుకు అవసరం అనేది ఇక్కడ ఇవ్వబడింది:
- చట్టం ప్రకారం ఇది తప్పనిసరి: మీరు తరచూ ప్రయాణించే వ్యక్తి అయితే, తప్పనిసరిగా పియుసి సర్టిఫికెట్‌ని వెంట తీసుకెళ్లాలి. డాక్యుమెంటేషన్ ప్రయోజనం కోసం మాత్రమే కాదు, ఇది భారతీయ చట్టం ప్రకారం తప్పనిసరి.
నా ఫ్రెండ్ గౌరవ్‌కు ట్రాఫిక్ చలాన్ ఇవ్వబడింది, అయితే అతను ఏ నియమాన్ని ఉల్లంఘించలేదు. ఎందుకు? ఆరా తీయగా, అతని వద్ద చెల్లుబాటు అయ్యే పియుసి సర్టిఫికెట్ లేదని తెలిసింది. దీని కారణంగా ₹1000 జరిమానా విధించబడుతుంది. ఈ భారీ జరిమానాలను నివారించడానికి, మీరు పియుసి సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి.
- ఇది కాలుష్య నియంత్రణను ప్రోత్సహిస్తుంది: పియుసి సర్టిఫికేట్‌ను తీసుకోవడానికి గల రెండవ ప్రధాన కారణం, ఇది పర్యావరణాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. మీ వాహన ఉద్గార స్థాయిలను అనుమతించదగిన పరిమితుల్లో ఉంచడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు మరియు పర్యావరణాన్ని పరిరక్షించడంలో మీ వంతు సహాయం చేయవచ్చు.
- ఇది మీ వాహన ఆరోగ్య స్థితిని గురించి మీకు తెలియజేస్తుంది: పియుసి సర్టిఫికెట్‌ను కలిగి ఉండటంలోని మరొక ఆవశ్యకత ఏమిటంటే ఇది మీ వాహనం యొక్క ఆరోగ్య స్థితిని గురించి మీకు తెలియజేస్తుంది. అందువల్ల, భవిష్యత్తులో భారీ జరిమానాల వల్ల తలెత్తే నష్టాలను నివారించవచ్చు.
- ఇది జరిమానాలను నిరోధిస్తుంది: కొత్త నిబంధనల ప్రకారం, మీరు పియుసి సర్టిఫికేట్‌ను కలిగి ఉండకపోతే మీకు రూ. 1000 జరిమానా విధించబడుతుంది. ఇది అలాగే పునరావృతమైతే జరిమానా రూ. 2000 కూడా కావచ్చు. ఈ జరిమానాలను నివారించడానికి, పియుసి సర్టిఫికేట్‌ను కలిగి ఉండటం అవసరం.
భారతదేశంలోని వాహనాల కోసం నిర్దేశించిన కాలుష్య ప్రమాణాలు ఏమిటి?
వాహనాలు కారు, బైక్, ఆటో మరియు మరెన్నో రకాలుగా ఉంటాయి. అంతేకాకుండా, ఇంధన రకాన్ని బట్టి నిర్దేశించిన కాలుష్య నిబంధనలు కూడా మారుతూ ఉంటాయి. ఆమోదయోగ్యమైన కాలుష్య స్థాయిలను ఒక సారి చూడండి.
బైక్ మరియు 3-వీలర్‌లలో పియుసి అంటే ఏమిటి?
బైక్ మరియు 3-వీలర్ కోసం నిర్దేశించిన కాలుష్య స్థాయిలు కూడా ఇక్కడ ఇవ్వబడ్డాయి:
వాహనం |
హైడ్రోకార్బన్ (ప్రతి మిలియన్‌కు భాగాలు) |
కార్బన్ మోనో-ఆక్సైడ్ (సిఒ) |
31 మార్చి 2000 (2 లేదా 4 స్ట్రోక్) కు ముందు లేదా ఆ తేదీన తయారు చేయబడిన బైక్ లేదా 3-వీలర్ |
4.5% |
9000 |
31 మార్చి 2000 (2 స్ట్రోక్) కు ముందు లేదా ఆ తర్వాత తయారు చేయబడిన బైక్ లేదా 3-వీలర్ |
3.5% |
6000 |
31 మార్చి 2000 (4 స్ట్రోక్) తర్వాత తయారు చేయబడిన బైక్ లేదా 3-వీలర్ |
3.5% |
4500 |
పెట్రోల్ కార్ల కోసం కాలుష్య స్థాయిలు
వాహనం |
హైడ్రోకార్బన్ (ప్రతి మిలియన్‌కు భాగాలు) |
కార్బన్ మోనో-ఆక్సైడ్ (సిఒ) |
భారత్ స్టేజ్ 2 ప్రమాణాల ప్రకారం తయారు చేయబడిన 4-వీలర్లు |
3% |
1500 |
భారత్ స్టేజ్ 3 ప్రమాణాల ప్రకారం తయారు చేయబడిన 4-వీలర్లు |
0.5% |
750 |
సిఎన్‌జి/ఎల్‌పిజి/పెట్రోల్ వాహనాల (భారత్ స్టేజ్ 4) కోసం అనుమతించదగిన కాలుష్య స్థాయిలు
వాహనం |
హైడ్రోకార్బన్ (ప్రతి మిలియన్‌కు భాగాలు) |
కార్బన్ మోనో-ఆక్సైడ్ (సిఒ) |
భారత్ స్టేజ్4 నిబంధనల ప్రకారం తయారు చేయబడిన సిఎన్‌జి/ఎల్‌పిజి 4-వీలర్లు |
0.3% |
200 |
భారత్ స్టేజ్ 4 నిబంధనల ప్రకారం తయారు చేయబడిన పెట్రోల్ 4-వీలర్లు |
0.3% |
200 |
పియుసి సర్టిఫికెట్ చెల్లుబాటు వ్యవధి ఎంత?
మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడల్లా, డీలర్ మీకు ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అయ్యే పియుసి సర్టిఫికేట్‌ను అందజేస్తారు. ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత మీరు, మీ వాహనాన్ని చెక్ చేయడానికి మరియు కొత్త పియుసి సర్టిఫికేట్ పొందడానికి అధికారిక ఎమిషన్ టెస్ట్ సెంటర్‌కు వెళ్లాలి, ఈ సర్టిఫికేట్ చెల్లుబాటు వ్యవధి ఆరు నెలలు. కాబట్టి, దీనిని ప్రతి ఆరు నెలలకు ఒకసారి రెన్యూవల్ చేసుకోవాలి.
పియుసి సర్టిఫికెట్‌ను ఎలా పొందాలి?
దీనిని పొందడానికి కొన్ని సులభమైన దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
- ముందుగా, మీరు ఒక అధికారిక కేంద్రాన్ని కనుగొనాలి. మీరు ఒక పెట్రోల్ పంపుకు వెళ్లవచ్చు మరియు అక్కడ కాలుష్య నియంత్రణ కేంద్రం ఉందో లేదో చెక్ చేయవచ్చు. ఇంతే కాకుండా, మీరు ఆన్‌లైన్‌లో Parivahan ప్లాట్‌ఫారమ్‌లో లైసెన్స్ పొందిన ఆర్‌టిఒ ఆమోదిత పియుసి సెంటర్ కోసం చూడవచ్చు.
- సమీప పియుసి సెంటర్‌ను గుర్తించిన తర్వాత అక్కడ మీ వాహనాన్ని డ్రైవ్ చేయండి మరియు సిబ్బంది మీ వెహికల్ యొక్క ఎగ్జాస్ట్ పైపులోకి ఎమిషన్ టెస్ట్ ట్యూబ్‌ను పంపిస్తారు. ఇది మీ వెహికల్ యొక్క ఉద్గార స్థాయిలను తెలియజేస్తుంది.
- ఆ తర్వాత; అతను మీ కోసం ఒక సర్టిఫికేట్‌ను కూడా అందజేస్తారు అది ఎలక్ట్రానిక్ రూపంలో జనరేట్ అవుతుంది. ఇది మీ వాహనం యొక్క ఉద్గార స్థాయిలను కలిగి ఉంటుంది.
దీని కోసం నాకు ఎంత ఖర్చవుతుంది?
ఒక
బైక్ ఇన్సూరెన్స్ మరియు ఇతర డాక్యుమెంట్లతో పోలిస్తే, పియుసి సర్టిఫికెట్ ధర తక్కువగా ఉంటుంది. ఒక పియుసి సర్టిఫికెట్ కోసం మీకు దాదాపుగా రూ.50-100 ఖర్చవుతుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు
- నేను ఆన్‌లైన్‌లో పియుసి పొందవచ్చా?
అవును, అది జారీ చేయబడిన తర్వాత మాత్రమే మీరు ఆన్‌లైన్‌లో పియుసి పొందవచ్చు. మీరు ముందుగా మీ వాహనాన్ని అధీకృత కేంద్రంలో చెక్ చేయించుకోవాలి, ఆ తరువాత మాత్రమే మీరు Parivahan వెబ్‌సైట్ నుండి పియుసిని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- కొత్త బైక్ కోసం పియుసి సర్టిఫికెట్ అవసరమా?
అవును, బైక్ ఇన్సూరెన్స్ మాదిరిగానే, ఒక కొత్త బైక్ కోసం ఒక పియుసి సర్టిఫికెట్ కూడా అవసరం. అయితే, మీరు దాని కోసం ఏ అధీకృత పియుసి సెంటర్‌ను సందర్శించాల్సిన అవసరం లేదు. ఇది డీలర్ ద్వారా అందించబడుతుంది, 1 సంవత్సరం పాటు చెల్లుతుంది.
- పియుసి సర్టిఫికెట్ ఎవరికి కావాలి?
సెంట్రల్ మోటర్ వెహికల్స్ చట్టం, 1989 ప్రకారం ప్రతి వాహనానికి పియుసి సర్టిఫికెట్ తప్పనిసరి. వీటిలో భారత్ స్టేజ్ 1
/భారత్ స్టేజ్ 2/భారత్ స్టేజ్ 3/భారత్ స్టేజ్ 4 కు అనుగుణంగా ఉండే మరియు ఎల్‌పిజి/సిఎన్‌జి పై నడిచే వాహనాలు ఉన్నాయి.
- నేను Digilockerలో పియుసి సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చా?
అవును, అన్ని ఇతర వెహికల్ డాక్యుమెంట్లతో పాటు మీరు డిజిలాకర్ యాప్‌లో పియుసి ని కూడా చేర్చవచ్చు.
రిప్లై ఇవ్వండి