రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Porting from Group to Individual Health Insurance
మే 31, 2021

గ్రూప్ నుండి ఇండివిడ్యువల్ కవర్‌లోకి హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ

ఒక గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉద్యోగుల కోసం ప్రత్యేకించినది. ఇది యజమాని తన ఉద్యోగులకు అందించే ఒక రకమైన మెడికల్ ఇన్సూరెన్స్. ఈ ఇన్సూరెన్స్ ఉద్యోగులకు అనేక ఆరోగ్య సంబంధిత ప్రయోజనాల కోసం కవరేజీని అందిస్తుంది. ప్రీమియం సాధారణంగా యజమాని ద్వారా చెల్లించబడుతుంది కాబట్టి, పాలసీతో లభించే ప్రయోజనాలను తెలుసుకోవడానికి ఉద్యోగులు ఎల్లప్పుడూ ఆసక్తి చూపుతారు. అయితే, ప్రయోజనాలు ఉన్నప్పటికీ, పాలసీ కవరేజ్ మొత్తం, వైద్య సౌకర్యాలు మరియు వ్యవధి పరంగా అనేక పరిమితులు ఉంటాయి. ఉద్యోగులకు ఉన్న ఏకైక సందేహం ఏమిటంటే, వారు ఉద్యోగాన్ని మానేసినప్పుడు పాలసీకి ఏం జరుగుతుంది? అయితే, ఉద్యోగం మానేసిన తర్వాత, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ ఎంపికను ఎంచుకోవచ్చు. తద్వారా మీ పాలసీ ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు బదిలీ అవుతుంది మరియు మీరు దానిని వ్యక్తిగతంగా కొనసాగించవచ్చు.

గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ల దీర్ఘకాలిక ప్రతికూలతలు

పైన పేర్కొన్న విధంగా, గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్లు అన్ని గొప్పవి కావు మరియు అనేక పరిమితులను కలిగి ఉంటాయి. కాబట్టి, గ్రూప్ ఇన్సూరెన్స్ కవర్ల యొక్క కొన్ని ప్రధాన పరిమితులను పరిశీలిద్దాం.
  1. సంస్థ పాలసీని నియంత్రిస్తుంది కాబట్టి, ఉద్యోగికి వారి ఇండివిడ్యువల్ కవరేజీపై ఎలాంటి నియంత్రణ ఉండదు.
  1. మీరు ఉద్యోగాన్ని మానేసినప్పుడు పాలసీ నిలిపివేయబడుతుంది. అయితే, ప్రయోజనాలను పెంచుకోవడానికి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఇండివిడ్యువల్ పాలసీకి పోర్ట్ చేయవచ్చు.
  1. ఆరోగ్యకరమైన మరియు అధిక-రిస్క్ పొంచి ఉన్న వ్యక్తులకు ప్రీమియం అమౌంటు ఒకే విధంగా ఉంటుంది. అయితే, ఇండివిడ్యువల్ పాలసీలో వ్యాధి-లేని వ్యక్తుల కోసం ప్రీమియం తక్కువగా ఉంటుంది.
  1. మీరు పాలసీలో నిర్దిష్ట కవరేజ్ కోసం చూస్తున్నట్లయితే అప్పుడు అదనపు కవర్‌ను కొనుగోలు చేయాలి.

గ్రూప్ నుండి ఇండివిడ్యువల్ ప్లాన్లకు మారేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను మార్చుకునేటప్పుడు మీరు ఈ కింది విషయాలను గుర్తుంచుకోవాలి:

● మీ ప్రస్తుత ఇన్సూరర్‌తో సంప్రదింపులు జరపాలి

IRDA మార్గదర్శకాల ప్రకారం, గ్రూప్ ప్లాన్లు ఉన్న వ్యక్తులు అవసరమైన ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాత అదే ఇన్సూరెన్స్ కంపెనీతో ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు మారవచ్చు.

● సమయ వ్యవధిని దృష్టిలో ఉంచుకోండి

మీ పాలసీని పోర్ట్ చేయడానికి, మీరు పాలసీ రెన్యూవల్ లేదా గడువు ముగియడానికి కనీసం 45 రోజుల ముందు విషయాన్ని ప్రస్తుత ఇన్సూరర్‌కు తెలియజేయడం తప్పనిసరి.

● ప్రీ-మెడికల్ చెకప్ అవసరం కావచ్చు

కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు గ్రూప్ కవర్ నుండి ఇండివిడ్యువల్ కవర్‌కు పాలసీని మార్చడానికి ముందు ప్రీ-మెడికల్ చెకప్ చేసుకోవాలని కోరవచ్చు.

● వెయిటింగ్ పీరియడ్‌ను పరిగణించండి

సాధారణంగా, గ్రూప్ ఇన్సూరెన్స్ కవర్‌లో ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ ఉండదు, అలాగే, పోర్టబిలిటీపై కూడా మీకు ఎలాంటి వెయిటింగ్ పీరియడ్‌ ఉండదు. అయితే, పాలసీలో ఏదైనా వెయిటింగ్ పీరియడ్ పేర్కొనబడి ఉంటే, పాలసీని పోర్ట్ చేయడానికి ముందు మీరు ఆ వ్యవధిని పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది.

గ్రూప్ నుండి ఇండివిడ్యువల్ కవర్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ ప్రాసెస్

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ నుండి ఇండివిడ్యువల్ పాలసీకి మారడానికి అనుసరించాల్సిన దశలు ఇలా ఉన్నాయి:

1. పాలసీని ఎంచుకోవడం

అత్యంత ముఖ్యమైన దశ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ సరిపోల్చడం మరియు మీ అవసరాలకు తగిన విధంగా సరిపోయే పాలసీని ఎంచుకోవడం. కొత్త పాలసీ కవరేజ్ మొత్తం, మినహాయింపులు, ప్రయోజనాలు, నిబంధనలు మరియు షరతులు మొదలైనవి పరిగణలోకి తీసుకోవాలి.

2. పేపర్‌వర్క్‌ను పూర్తి చేయడం

మీరు పాలసీని ఎంచుకున్న తర్వాత, గ్రూప్ నుండి ఇండివిడ్యువల్ కవర్‌కు మారడానికి ఫారం నింపండి. ప్రస్తుత పాలసీ వివరాలు, వయస్సు రుజువు, క్లెయిమ్ చరిత్ర, వైద్య చరిత్ర మరియు ఏవైనా ఇతర డిక్లరేషన్ సంబంధిత వివరాలను ఫారంతో పాటు జతచేయవలసి ఉంటుంది.

3. డాక్యుమెంట్ల సమర్పణ

పాలసీ గడువు ముగియడానికి లేదా రెన్యూవల్‌కు కనీసం 45 రోజుల ముందు డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి.

4. ప్రీమియం చెల్లింపు

ఇన్సూరర్ మీ డాక్యుమెంట్లను అంగీకరించిన తర్వాత పాలసీ కోసం కొత్త పూచీకత్తు చట్టాలు మరియు నిబంధనలు మరియు షరతులను సిద్ధం చేస్తారు. దీనికి సాధారణంగా 15 రోజుల సమయం పడుతుంది, ఆ తర్వాత మీరు పాలసీ యొక్క కొత్త ప్రీమియం మొత్తాన్ని చెల్లించవచ్చు.

ప్రయోజనాలు

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అనేది మీ కొత్త పాలసీకి అనేక ప్రయోజనాలను జోడిస్తుంది, అవి:
  • సమగ్రమైన కవరేజ్
వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ‌ను మీ ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్ చేసుకోవచ్చు మరియు ఇది గ్రూప్ కవర్‌తో పోలిస్తే మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది.
  • హామీ ఇవ్వబడిన మొత్తం విలువలో పెరుగుదల
గ్రూప్ కవర్ నుండి ఇండివిడ్యువల్ కవర్‌కు మారుతున్నప్పుడు, పాలసీ కవర్లోని హామీ మొత్తాన్ని పెంచుకునే అవకాశం మీకు లభిస్తుంది. అయితే, మీరు కొత్త ఇన్సూరర్ వద్ద తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని నియమాలు ఉండవచ్చు.
  • వెయిటింగ్ పీరియడ్ కోసం అందుకున్న క్రెడిట్
ముందుగా ఉన్న వ్యాధుల విషయంలో వెయిటింగ్ పీరియడ్ కోసం పొందిన ప్రయోజనం కొత్త ప్లాన్‌కు జత చేయబడుతుంది, మీరు దాని పూర్తి ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు

  1. నేను గ్రూప్ మరియు ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ రెండింటినీ పొందవచ్చా?
అవును, ఒకేసారి రెండు పాలసీలను కలిగి ఉండవచ్చు.
  1. నేను ఉద్యోగం మానేసినప్పుడు నా గ్రూప్ ఇన్సూరెన్స్ కవర్ ఏమవుతుంది?
ఇన్సూరెన్స్ కవర్ నిలిపివేయబడుతుంది. అయితే, మీరు దానిని ఇండివిడ్యువల్ కవర్‌కు మార్చుకోవచ్చు. ముగింపు గ్రూప్ నుండి ఇండివిడ్యువల్ పాలసీకి మారడం అనేది, ఉద్యోగం మానేసి మరియు తమ ప్రస్తుత పాలసీ ప్రయోజనాలను పొందాలనుకునే వ్యక్తులకు ఒక సరైన ఎంపిక. మరింత వివరణాత్మక సమాచారం కోసం మీరు మా ఇన్సూరెన్స్ నిపుణులను సంప్రదించవచ్చు.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి