రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
college student health insurance options explained
ఆగస్టు 5, 2022

మెడికల్ ఇన్సూరెన్స్‌లో ఆయుష్ చికిత్స - ప్రయోజనాలు, కవరేజ్ మరియు అర్హత

గత కొన్ని దశాబ్దాలుగా వైద్య శాస్త్రం అద్భుతమైన పురోగతిని సాధించింది. ఒకప్పుడు ప్రాణాపాయ స్థితికి కారణమైన ప్రాణాంతక వ్యాధులు, ఇప్పుడు విజయవంతంగా నయం అవ్వడమే కాకుండా, ప్రారంభ దశలోనే రోగనిర్ధారణ చేయబడుతున్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో వైద్య శాస్త్రంలో అభివృద్ధి మాత్రమే కాకుండా, ప్రత్యామ్నాయ చికిత్స మార్గాల గురించి అవగాహన కూడా పెరిగింది. ప్రతి ఒక్కరూ అల్లోపతి చికిత్సను ఇష్టపడనప్పటికీ, ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, సిద్ధ లాంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాలను చాలా మంది కోరుకుంటారు. సాంప్రదాయ వైద్య చికిత్సల నుండి వైదొలగడానికి వివిధ కారణాలు ఉండవచ్చు, అందులో ముఖ్యంగా ఈ రకమైన ఔషధాలలో వినియోగించిన సహజ మూలాలు ఒకటి కావచ్చు. Insurance Regulatory and Development Authority of India (IRDAI) 2013 లో అలంటి ప్రత్యామ్నాయ చికిత్సల కోసం కవరేజ్‌ను ప్రవేశపెట్టింది. కాబట్టి, ఈ రోజుల్లో, మెడికల్ ఇన్సూరెన్స్ మరింత సమగ్రమైనదిగా మారింది మరియు ఈ ప్రత్యామ్నాయ ఔషధాలను కవర్ చేస్తుంది. మరిన్ని వివరాల కోసం మీరు IRDAI యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఆయుష్ చికిత్స సంక్షిప్త వివరణ

ఆయుష్ అనగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల కింద కవర్ చేయబడే వివిధ ప్రత్యామ్నాయ చికిత్సలు ఆయుర్వేదం, యోగ, యునాని, సిద్ధ మరియు హోమియోపతి లాంటి వాటికి ఒక సంక్షిప్త రూపం. పైన వివరించిన విధంగా, ఈ చికిత్సలు వివిధ వ్యాధులకు నయం చేసే ప్రకృతి సిద్ధ వన మూలికలపై ఆధారపడి ఉంటాయి. ఈ రకమైన చికిత్సల కోసం అవసరమైన ఔషదాలు సహజసిద్ధంగా లభ్యమవుతాయి కాబట్టి, మానవ శరీరం వాటిని తక్కువ లేదా ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా సులభంగా తట్టుకోగలుగుతుంది. అయితే, నిర్దిష్ట వ్యాధుల కోసం ఈ చికిత్సలు డ్రగ్ థెరపీలను పూర్తిగా మినహాయించవు.

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలో ఆయుష్ చికిత్స కవరేజ్ పొందడం వలన కలిగే ప్రయోజనాలు ఏవి?

మీరు ఆయుష్ కవరేజ్‌తో పాలసీని కొనుగోలు చేయడాన్ని ఎందుకు పరిగణించాలి అనేదానికి కొన్ని కారణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
  • ప్రామాణిక వైద్య చికిత్సల్లో తలెత్తే అంతరాయాలను పరిష్కరించి, అనారోగ్యాన్ని తగ్గించడానికి ఆయుష్ చికిత్సకు ఒక సమగ్ర విధానం ఉంటుంది. కేవలం అనారోగ్యం పై మాత్రమే కాదు రోగి శ్రేయస్సు పై సమగ్ర దృష్టిని ఉంచుతుంది.
  • అల్లోపతి చికిత్సలతో పోలిస్తే ఆయుష్ చికిత్సలు సాధారణంగా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటాయి. కాబట్టి, ఇలాంటి ప్రత్యామ్నాయ చికిత్సలు ఆ వ్యాధులను నయం చేయడానికి ఒక సమర్థవంతమైన మార్గం కావచ్చు మరియు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఈ చికిత్సలకు కవరేజీని అందిస్తుంది.
  • గ్రామీణ ప్రాంతాల్లో, అనగా ప్రామాణిక వైద్య సదుపాయాలు అందుబాటులో లేని చోట, ఆయుష్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ వైద్య చికిత్స ఖర్చులను కవర్ చేస్తుంది.
  • చివరిగా, ఆయుష్ చికిత్సలు తక్కువ ఖర్చుతో కూడా వస్తాయి. నిఫ్టీ టూల్ సహాయంతో మీరు ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను లెక్కించవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్.
* ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

ఆయుష్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏమి కవర్ చేయబడుతుంది?

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఆయుష్ చికిత్స అనేది ఆయుర్వేదం, యోగ, యునాని, సిద్ధ మరియు హోమియోపతి లాంటి వేర్వేరు ఔషధాల విభాగాల కింద వివిధ ఇన్-పేషెంట్ వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ చికిత్సలు ప్రభుత్వ గుర్తింపు పొందిన Quality Council of India లేదా The National Accreditation Board on Health సంస్థల ద్వారా గుర్తించబడిన వైద్య కేంద్రాల్లో పొందవచ్చు. అప్పుడు మాత్రమే మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ కింద పరిహారం చెల్లించబడుతుంది. * ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

ఆయుష్ కవరేజ్‌తో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను పొందడానికి అర్హులు ఎవరు?

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఆయుష్ కవరేజీని అందించే ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఏకైక షరతు ఏమిటంటే, ఇన్సూరెన్స్ కంపెనీ దాని పాలసీ పరిధిలో ఆయుష్ కవరేజీని కలిగి ఉండాలి. * ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, ఎంచుకునే విషయానికి వస్తే ప్రామాణిక నిబంధనలు, షరతులు వర్తిస్తాయి. వివిధ కోణాలలో ఆలోచించాలి మరియు అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇన్సూరెన్స్ అనేది అభ్యర్థనకు సంబంధించిన విషయం. ఒక కొనుగోలుని పూర్తి చేయడానికి ముందు దాని ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించిన మరిన్ని వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/పాలసీ షరతులు మరియు నిబంధలను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి