రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
prevent e-bike fires
30 మార్చి, 2023

ఈ-బైక్ అగ్నిప్రమాదాలను నివారించండి: ప్రమాదాలకు గల కారణాలు మరియు సురక్షితమైన రైడ్‌ కోసం చిట్కాలు

కాలుష్యానికి వ్యతిరేకంగా అత్యంత సమర్థవంతమైన పరిష్కారాల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఉపయోగం కూడా ఒకటి. పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలకు మెరుగైన ప్రత్యామ్నాయంగా ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలనేవి కాలుష్య ప్రభావాన్ని పరిష్కరించడంలో మరియు ఆ పరిస్థితిని తీవ్రంగా తగ్గించడంలో చాలా అవకాశాలు అందిస్తాయి. అయితే, ఈ బైక్‌లో అస్సలు సమస్యలే రావని చెప్పే పరిస్థితి లేదు. ఇ-బైక్‌ల్లో మంటలంటుకోవడమనే సంఘటనలతో, ఈ బైకుల్లో భద్రత అనే అంశం ప్రముఖంగా వెలుగులోకి వచ్చింది. మీ ఈ-బైక్‌కు నష్టం జరిగిన సందర్భంలో ఈ ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు పరిహారం చెల్లిస్తుంది.* అయితే, ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయి మరియు వాటిని ఎలా నివారించవచ్చో అర్థం చేసుకోవడం ముఖ్యం.

ఈ-బైకుల్లో మంటలు అంటుకోవడానికి కారణమేమిటి?

ఈ-బైక్‌లకు అగ్నిప్రమాదాలు మంచివి కావని చెప్పడానికి ఇక్కడ కొన్ని కారణాలు ఇవ్వబడ్డాయి:
  1. లిథియం-అయాన్ బ్యాటరీ

లిథియం-అయాన్ బ్యాటరీ, లేదా లి-అయాన్ బ్యాటరీ అనేది నేటి రోజుల్లో ఉపయోగిస్తున్న అత్యంత సాధారణ బ్యాటరీ రకాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ బ్యాటరీలను మొబైల్ ఫోన్లు మరియు ల్యాప్‌టాప్‌లు లాంటి దాదాపుగా అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల్లోనూ ఉపయోగిస్తున్నారు. లి-అయాన్ బ్యాటరీలనేవి వాటి మన్నిక మరియు సుదీర్ఘ జీవితకాలం కారణంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే, అధిక ఉష్ణోగ్రతల్లో సమస్యలకు గురికావడం ద్వారా అవి అపఖ్యాతి పొందాయి. లి-అయాన్ బ్యాటరీల్లో ఉపయోగించే లిక్విడ్ అనేది ఒక విధమైన ఎలక్ట్రోలైట్ ఫ్లూయిడ్‌గా ఉంటుంది. ఈ ఫ్లూయిడ్‌కి ఉండే అత్యంత జ్వలనశీలత స్వభావం కారణంగా, అధిక ఉష్ణోగ్రతల ఈ ఫ్లూయిడ్ వ్యాకోచిస్తుంది. తద్వారా, బ్యాటరీ జీవితకాలం ప్రభావితమవుతుంది. తద్వారా, బ్యాటరీలో మంటలు రేగడానికి కూడా ఇది అవకాశాలు పెంచుతుంది. బ్యాటరీలో ఉండే ఈ సమస్య అనేది ఇ-బైక్‌లు అగ్నిప్రమాదానికి గురయ్యే ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉంటోంది.
  1. వేడికి గురికావడం

బ్యాటరీలో ఫ్లూయిడ్ వేడెక్కడం అనే సమస్య మాత్రమే కాకుండా, ఇ-బైక్‌లనేవి బాహ్య వాతావరణంలో వేడికి గురయ్యే అవకాశం కూడా ఎక్కువే. వేడి వాతావరణ పరిస్థితుల్లో డ్రైవింగ్ చేసినప్పుడు, బైక్ బాడీ మరింతగా వేడెక్కడం వల్ల అది బ్యాటరీ ఉష్ణోగ్రతను కూడా ప్రభావితం చేస్తుంది. తద్వారా, బైక్‌ మంటలు అంటుకునే సంభావ్యత మరింత పెరుగుతుంది.
  1. లోపంతో ఉన్న విడిభాగాల వినియోగం

To avoid paying more for genuine parts, people tend to settle for low-cost parts during servicing. This carries a huge risk as low-cost parts tend to be faulty at times. If a faulty part is used to replace an old part, this increases the chance of the bike lighting up in flames. Faulty parts can cause short circuit or friction internally, which can lead to your బైక్‌‌కు అగ్ని ప్రమాదం. తరచుగా, గ్యారేజీ యజమానులు సైతం సహజంగానే లోపాలతో ఉన్న విడిభాగాలను బిగిస్తుంటారు, ఇది మీ బైక్‌కు నష్టం కలిగించడమే కాకుండా మీరు కూడా గాయపడడానికి దారితీసే ప్రమాద అవకాశాన్ని ఇవి పెంచుతాయి.

అలాంటి సంఘటనలు నివారించడానికి చిట్కాలు

ఈ క్రింది చిట్కాలతో, అగ్నిప్రమాదం కారణంగా మీ బైక్ దెబ్బతినే అవకాశాలు తగ్గించవచ్చు:
  1. అధీకృత గ్యారేజీలో బైక్ సర్వీస్ చేయించండి

సర్వీస్ మరియు విడిభాగాల కోసం ఖర్చు ఎక్కువగా ఉన్నట్లు మీరు గుర్తించినప్పటికీ, బైక్ భద్రత మరియు సమగ్రతలో రాజీపడే పరిస్థితి ఉండదు. మీరు మీ బైక్‌ను నాన్-ఆథరైజ్డ్ సర్వీస్ గ్యారేజీలో రిపేర్ చేయించాలనుకుంటే, నిజమైన రిప్లేస్‌మెంట్ భాగాలు మీకు లభించకపోవచ్చు. అధీకృత గ్యారేజీల్లో, ఎల్లప్పుడూ మీకు నిజమైన విడిభాగాలు లభిస్తాయి. అలాగే, మీ బ్రాండ్ బైక్‌ను మరమ్మత్తు చేయడం కోసం సిబ్బందికి శిక్షణ ఇవ్వబడుతుంది. అది సేవ నాణ్యతను నిర్ధారిస్తుంది.
  1. మాన్యువల్‌లో సూచించిన ప్రకారం ఛార్జ్ చేయండి

ఇ-బైక్ యూజర్లు చాలామంది వారి బైక్‌లను రాత్రిపూట ఛార్జ్ చేస్తుంటారు. మీరు మీ బ్యాటరీని దాని పరిమితికి మించి ఓవర్‌ఛార్జ్ చేసినప్పుడు అది ఒక రిస్క్ కారకంగా మారుతుంది. ఇది బ్యాటరీ యంత్రాంగానికి నష్టం కలిగించడమే కాకుండా, చార్జింగ్ సమయంలో లేదా బైక్ ఉపయోగంలో ఉన్నప్పుడు బ్యాటరీలో మంటలు రేగే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాంటి సంఘటనల అవకాశం తగ్గించడం కోసం, మాన్యువల్‌లో ఇచ్చిన ఛార్జింగ్ సూచనలు అనుసరించండి. అవసరమైతే, మీ ఇ-బైక్ తయారీదారు కస్టమర్ కేర్‌ను కూడా మీరు సంప్రదించవచ్చు.
  1. తీవ్రమైన వేడి వాతావరణంలో బైక్‌ ఉపయోగించడం నివారించండి

ఇంతకుముందు పేర్కొన్నట్లు, బాహ్య వాతావరణంలోని వేడి కారణంగా బైక్ బాడీ తీవ్రంగా వేడెక్కుతుంది. అది అగ్నిప్రమాదం తలెత్తే అవకాశం పెంచుతుంది. ఉష్ణోగ్రత గరిష్టంగా ఉన్నప్పుడు కాకుండా, ముందుగానే మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం ద్వారా, ఈ పరిస్థితిని నివారించవచ్చు. మధ్యాహ్నం వేళ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రత్యేకించి వేసవి కాలంలో ఇది సిఫార్సు చేయబడుతోంది.
  1. మంటలు అంటుకోగల వస్తులు నిల్వ చేయకండి

మంటలు అంటుకోగల వస్తువులకు గురికావడమనేది కూడా ఇ-బైకుల్లోని బ్యాటరీల్లో మంటలు చెలరేగడానికి కారణాల్లో ఒకటిగా ఉంటోంది. మీరు మీ బైక్‌లోని బూట్ ప్రదేశంలో కిరోసిన్, లైటర్ ఫ్లూయిడ్ లేదా ఏరోసోల్ లాంటి మంటలు అంటుకోగల ద్రవాల క్లాన్లు నిల్వచేస్తే, అధిక ఉష్ణోగ్రతల వద్ద అవి మంటలంటుకుంటాయి. ఇది బ్యాటరీని కూడా దెబ్బతీస్తుంది. మీ బైక్ బూట్ స్పేస్‌లో అలాంటి ఏవైనా వస్తువులు నివారించడం ద్వారా ప్రయోజనం లభిస్తుంది.

ముగింపు

These tips can help you ensure a longer life for your e-bike without the risk of it getting damaged due to fire. It would be prudent for you to remain prepared for any such incidents with the help of an electric bike insurance policy, which offers financial protection and gives compensation in the event of damages to your . * * ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి