సూచించబడినవి
Motor Blog
07 ఆగస్టు 2025
56 Viewed
Contents
ఆన్-రోడ్ ప్రమాదాలనేవి ఊహించలేనివి. మీరు నిబంధనలు పాటించడంతో పాటు సరైన రోడ్డు భద్రతను నిర్వహించినప్పటికీ, మీ చుట్టూ ఉన్నవారు ఆవిధంగా చేస్తారనేందుకు హామీ ఏదీ లేదు. గమ్యస్థానం చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ తొందరపడినప్పుడు, ఏదైనా దుర్ఘటన జరిగే అవకాశం ఉంది. ప్రమాదంలో మీ కారు దెబ్బతింటే, ఆ నష్టాలను మరమ్మత్తు చేయడం కోసం మీ జేబు నుండి చెల్లించడమనేది ఖరీదైన వ్యవహారంగా ఉండవచ్చు. అయితే, మీకు కారు ఇన్సూరెన్స్ ఉంటే, పరిహారం కోసం మీరు ఒక క్లెయిమ్ ఫైల్ చేయవచ్చు*. ఒక క్లెయిమ్ ఫైల్ చేయడానికి దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
ప్రమాదంలో మీ కారు దెబ్బతిన్న సందర్భంలో, మీరు పరిహారం కోసం క్లెయిమ్ ఫైల్ చేయవచ్చు. మీ వద్ద ఆన్‌లైన్ ఫోర్-వీలర్ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే, క్లెయిమ్ ఫైల్ చేయడానికి మీరు ఈ దశలను అనుసరించవచ్చు:
ప్రమాదం జరిగిన తర్వాత, దాని గురించి మీ ఇన్సూరర్‌కు తెలియజేయడం మీ బాధ్యత. రెండు మాధ్యమాల ద్వారా మీరు మీ ఇన్సూరర్‌ను సంప్రదించవచ్చు:
ప్రమాదం జరిగిన తర్వాత, ఆ యాక్సిడెంట్ గురించి మీరు పోలీసులకు తెలియజేయాలి. జరిగిన నష్టాలు మైనర్‌వి అయినప్పుడు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. అయితే, థర్డ్-పార్టీ కారణంగా ఏదైనా మేజర్ నష్టం జరిగితే, మీరు దానిని ఫైల్ చేయాలి. చాలావరకు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎఫ్ఐఆర్ కాపీ అవసరం కాబట్టి, ఈ విషయం గురించి మీ ఇన్సూరర్ నుండి స్పష్టంగా నిర్ధారించుకోండి.
మీ వాహనానికి జరిగిన నష్టం సంబంధిత ఫోటోలు మరియు వీడియోలు తీసుకోండి. క్లెయిమ్ ధృవీకరణ ప్రక్రియ సమయంలో ఇది మీ ఇన్సూరర్‌కు అవసరం మాత్రమే కాకుండా, ఇది మీ ఇన్సూరర్ ముందు మీ కేసును బలోపేతం కూడా చేస్తుంది.
మీరు పూర్తి సమాచారం సేకరించిన తర్వాత, మీ పాలసీ డాక్యుమెంట్ కాపీ, ఎఫ్ఐఆర్ మరియు మీరు తీసుకున్న ఫోటోలు మరియు వీడియోలు లాంటి డాక్యుమెంట్లను మీ ఇన్సూరర్‌కు సమర్పించండి. ఈ డాక్యుమెంట్ల ఆధారంగా, మీ ఇన్సూరర్ మీ క్లెయిమ్‌ను ధృవీకరిస్తారు.
మీ కారుకు జరిగిన నష్టాలు పరిశీలించడం కోసం మీ ఇన్సూరర్ ఒక సర్వేయర్‌ను పంపుతారు. మీ క్లెయిమ్‌లో పేర్కొన్న నష్టాలనేవి వాస్తవ నష్టాలతో సరిపోలుతున్నాయా అని వారు తనిఖీ చేస్తారు. అదేసమయంలో, మీ ఇన్సూరర్‌కు అందించగల అదనపు సమాచారం కూడా వారు సేకరించవచ్చు.
సర్వేయర్ అందించిన అన్ని వివరాలతో ఇన్సూరర్ సంతృప్తి చెంది, మీ క్లెయిమ్‌ను నిజమైనదే అని వారు గుర్తిస్తే, వారు మీకు పరిహారం అందిస్తారు*. ఈ పరిహారం క్లెయిమ్ చేయడానికి మీకు రెండు ఎంపికలు ఉన్నాయి:
ఇవి కూడా చదవండి: భారతదేశంలో ప్రమాదం జరిగిన తర్వాత కార్ ఇన్సూరెన్స్‌ను ఎలా క్లెయిమ్ చేయాలి?
మీ ఇన్సూరెన్స్ రకాన్ని బట్టి మీ క్లెయిమ్‌లు క్రింది విధంగా ఉండవచ్చు:
మీరు కారు ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేయడం కోరుకుంటే, ఈ విషయాలు మీరు గుర్తుంచుకోవాలి:
మీ కారు దెబ్బతిన్న సందర్భంలో, క్లెయిమ్ ఫైల్ చేయడానికి మరియు స్వంత నష్టాల కోసం సరైన పరిహారం పొందడానికి మీరు పైన పేర్కొన్న దశలు అనుసరించవచ్చు*. మీరు పాలసీని సొంతం చేసుకోకపోతే, దీనిని ఉపయోగించండి . మీరు ఆన్‌లైన్ కార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ నుండి పొందే కోట్ మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న పాలసీ రకం, పాలసీ వ్యవధి మరియు ఇతర అంశాలతో పాటు వాహనం రకం మీద ఆధారపడి ఉంటుంది*. మీరు సమగ్ర ఇన్సూరెన్స్‌ను ఎంచుకుంటే, ఆ పాలసీకి యాడ్-ఆన్‌లు చేర్చడం ద్వారా మీరు ధర వ్యత్యాసం కూడా చూడవచ్చు. క్యాలిక్యులేటర్ ద్వారా అందించబడిన కోట్ అనేది ఇన్సూరర్ మీకు అందించే వాస్తవ కోట్ కంటే భిన్నంగా ఉండవచ్చునని తెలుసుకోవడం ముఖ్యం.
*ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.
What makes our insurance unique
With Motor On-The-Spot, Health Direct Click, etc we provide fast claim process , Our sales toll free number:1800-209-0144