సూచించబడినవి
Motor Blog
23 మార్చి 2023
67 Viewed
Contents
ఒక కార్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ కొనుగోలు అనేది నేడు చాలా సులభమైన ప్రక్రియ మరియు చాలామంది కారు యజమానులకు ఈ విషయాల్లో మంచి పరిజ్ఞానం ఉంది. వీటిలో చాలామందికి తెలిసిన ప్రకారం, థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అయినప్పటికీ, ఒక సమగ్ర పాలసీ అనేది మరిన్ని ప్రతికూల అంశాల నుండి మిమ్మల్ని రక్షించగలదు. అయితే, మీరు మీ సమగ్ర పాలసీ నుండి మరింత ఎక్కువ ఆశిస్తే, మీరు యాడ్-ఆన్‌లు ఎంచుకోవచ్చు. అలాంటి ఒక యాడ్-ఆన్‌గా టైర్ ప్రొటెక్ట్ కవర్‌ను చెప్పవచ్చు. మీ టైర్లకు రక్షణ అందించే ఒక రకమైన కవర్ ఇది. ఏదైనా ప్రమాదంలో లేదా ఏదైనా ఇతర సందర్భాల్లో టైర్లు దెబ్బతిన్నప్పుడు ఈ పాలసీ ద్వారా కవర్ లభిస్తుంది. టైర్ ప్రొటెక్ట్ లాంటి యాడ్-ఆన్‌లను మీ ప్రీమియం అమౌంట్‌కి జోడించవచ్చు. కాబట్టి, మీరు కొనుగోలు చేసే ముందు, మీరు ఒక ఆన్‌లైన్ కార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ ను ఉపయోగించి ఖర్చు గురించి ముందుగానే ఒక అవగాహనను పొందవచ్చు. అలాగే, మీరు దానిని కొనుగోలు చేయడానికి ముందు ఈ కవర్ అందించే ఆఫర్లను గురించి మీరు సరిగ్గా అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం. దానిని ఎప్పుడు క్లెయిమ్ చేయాలి మరియు దేని కోసం చేయాలనేది మీరు తెలుసుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది.
మీ కారులోని ఏదైనా ఇతర ప్రధాన భాగాలు లాగే, నష్టానికి గురయ్యే అవకాశం ఉన్న వాటిలో టైర్లు అత్యంత ముఖ్యమైనవిగా ఉంటాయి. మీ కారుకి ప్రమాదం జరిగినప్పుడు, మీ టైర్లకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. మీకు ఎదురైన ఏదైనా సంఘటనలో, మీ కారు ప్రమాదానికి గురైన తర్వాత, దాని మరమ్మత్తుల ఖర్చు భరించడంలో మీకు సహాయపడడానికి మీకు సమగ్ర కవరేజీ ఉంటుంది. అయితే, సాధారణ సమగ్ర కవరేజీ అనేది మీ కారు టైర్లను కవర్ చేయదు. కాబట్టి, ప్రమాదంలో మీ టైర్లు దెబ్బతింటే, మరమ్మత్తు లేదా మార్చాల్సిన అవసరం వస్తే, మీరు మీ జేబు నుండి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు టైర్ ప్రొటెక్ట్ కవర్ అక్కరకు వస్తుంది. దీన్ని ఒక యాడ్-ఆన్ కవర్‌గా మీ సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్ పాలసీతో కొనుగోలు చేయవచ్చు. మీ టైర్ల కోసం కవరేజీ అందించడమే ఈ యాడ్-ఆన్ ఏకైక ఉద్దేశం. పాలసీ ద్వారా కవర్ చేయబడిన సంఘటనలో నష్టం జరిగినప్పుడు, టైర్ మరమ్మత్తు లేదా మార్చడం కోసం అయ్యే ఖర్చును కవర్ చేయడంలో ఇది మీకు సహాయపడుతుంది. కొన్ని సందర్భాల్లో, ఈ పాలసీ అనేది మీ టైర్ మరమ్మత్తు లేదా మార్చడం కోసం అయ్యే లేబర్ ఛార్జీలను కూడా కవర్ చేస్తుంది.
మీరు ఏ రకమైన పాలసీనైనా కొనుగోలు చేయడానికి ముందు, యాడ్-ఆన్‌లతో సహా, పాలసీ అనేది వేటిని కవర్ చేస్తుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు ఏం అందించాలనే దాని ఆధారంగా, పాలసీల్లోని సూక్ష్మ అంశాలు మారవచ్చు. టైర్ ప్రొటెక్ట్ కవర్‌లోని కొన్ని సాధారణ చేర్పుల గురించి ఇక్కడ చూడండి.
అలాంటి పాలసీలు అందించే గరిష్ట కవరేజీ వ్యవధి నాలుగు సంవత్సరాలుగా ఉంటుంది. ఆ తర్వాత వాటిని రెన్యూవల్ చేసుకోవాలి. సాధారణంగా, ఒక సంవత్సరం కనీస వ్యవధి కోసం ఈ రకమైన కార్ ఇన్సూరెన్స్‌ను మీరు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.
మీ పాలసీలోని చేర్పులను తెలుసుకున్న విధంగానే, దాని మినహాయింపులు తెలుసుకోవడం కూడా ముఖ్యం. ఈ రకమైన పాలసీలోని కొన్ని మినహాయింపులను చూద్దాం.
ఇవి కొన్ని సాధారణ మినహాయింపులు. ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ఏమి అందించాలి అనేదాని ఆధారంగా, పాలసీలో మరిన్ని మినహాయింపులు ఉండవచ్చు, లేదా తక్కువ కూడా ఉండవచ్చు. మీరు కొనుగోలు చేయడానికి ముందు పాలసీ వివరాలు చూడడం మంచిది.
సాధారణంగా, నామమాత్రపు ఖర్చుతో ఇది మీ టైర్లకు రక్షణ అందిస్తుంది కాబట్టి, ఎవరైనా సరే, టైర్ ప్రొటెక్ట్ కవర్ కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, మీరు ఖచ్చితంగా ఈ రకమైన యాడ్-ఆన్ కవర్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సిన కొన్ని సందర్భాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
ఒక టైర్ ప్రొటెక్ట్ కవర్‌ను థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్‌తో కొనుగోలు చేయలేరు అని గుర్తుంచుకోండి, కానీ దీనిని ఒక సమగ్ర పాలసీతో మాత్రమే కొనుగోలు చేయగలరు. మీరు పాలసీని బాగా అర్థం చేసుకున్న తర్వాత, దాని కోసం మీరు ఎంత చెల్లించాలో తెలుసుకోవడం కోసం ఆన్‌లైన్ కార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించండి. ఆతర్వాత, ఆన్‌లైన్‌లో మీ సమగ్ర ప్లాన్‌ను కొనుగోలు చేసే సమయంలో, మీరు ఈ యాడ్-ఆన్‌ను జోడించవచ్చు. ఆన్‌లైన్‌లో దానిని కొనుగోలు చేసినప్పటికీ, మీరు దాని గురించి మీ ఇన్సూరెన్స్ ఏజెంట్‌ను అడగవచ్చు. టైర్ ప్రొటెక్ట్ కవర్ అనేది అవసరం కాకపోయినప్పటికీ, ఏదైనా దుర్ఘటన తర్వాత మీ టైర్లు మరమ్మత్తు చేయడం లేదా మార్చాల్సి వచ్చినప్పుడు అయ్యే భారీ ఖర్చుల నుండి ఇది మిమ్మల్ని కాపాడుతుంది. పాలసీ వివరాలను చదవండి మరియు ఈ కవర్ క్రింద క్లెయిములను ఎప్పుడు చేయాలో తెలుసుకోండి. ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.
What makes our insurance unique
With Motor On-The-Spot, Health Direct Click, etc we provide fast claim process , Our sales toll free number:1800-209-0144