టూ-వీలర్ ఇన్సూరెన్స్ అనేది ప్రకృతి వైపరీత్యాలు లేదా దొంగతనం, దోపిడీ మరియు ప్రమాదాల వంటి ఊహించని సంఘటనల కారణంగా మీ టూ వీలర్‌కు సంభవించే నష్టం/డ్యామేజీ నుండి ఉత్పన్నమయ్యే ఆర్థిక నష్టం నుండి మిమ్మల్ని రక్షించే ఒక ఇన్సూరెన్స్ ప్రోడక్ట్.
ఇక్కడ రెండు రకాల టూ-వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉన్నాయి:
- 1. A టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ కవర్
- 2. దీర్ఘకాలిక టూ వీలర్ ఇన్సూరెన్స్
భారతదేశంలో మీరు మీ టూ వీలర్ వాహనాన్ని రోడ్డు పైకి తీసుకెళ్లడానికి ముందు థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. మీ వాహనాన్ని మీరు బైక్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ప్రక్రియ ద్వారా ఇన్సూర్ చేయవచ్చు. దీర్ఘ కాలిక టూ-వీలర్ పాలసీని పొందడం తప్పనిసరి కాదు, కానీ, మీరు దానిని పొందవలసిందిగా సలహా ఇవ్వడమైనది, ఎందుకనగా ఏవైనా ఊహించని సంఘటనలు జరిగినప్పుడు మీ ఆర్థిక స్థితిని మెరుగ్గా నిర్వహించుకోవచ్చు.
మీ టూ వీలర్ యొక్క ఆర్‌సి బుక్, యాజమాన్యం మరియు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లాంటి రుజువులను చూపించాల్సిన అవసరం లేదు. అయితే, గడువు ముగిసిన తర్వాత టూ వీలర్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ కోసం మీకు అవి ఖచ్చితంగా అవసరమవుతాయి
ఈ ముఖ్యమైన డాక్యుమెంట్లను గురించి కొంత ఉపయోగకరమైన సమాచారాన్ని చూద్దాం.
బైక్ ఆర్‌సి బుక్ అంటే ఏమిటి?
ఆర్‌సి బుక్ లేదా రిజిస్ట్రేషన్ కార్డ్ అనేది భారత ప్రభుత్వంచే జారీ చేయబడిన ఒక అధికారిక డాక్యుమెంట్, ఇది, ఆర్‌టిఒ (ప్రాంతీయ రవాణా కార్యాలయం) వద్ద మీ బైక్ చట్టబద్ధంగా నమోదు చేయబడిందని ధృవీకరిస్తుంది. ఇది ఒక స్మార్ట్ కార్డు మాదిరిగా కనిపిస్తుంది మరియు మీ బైక్/టూ వీలర్‌కు సంబంధించి ఈ కింది వివరాలను కలిగి ఉంటుంది:
- రిజిస్ట్రేషన్ తేదీ మరియు నంబర్
- ఇంజిన్ నంబర్
- ఛాసిస్ నంబర్
- టూ వీలర్ వాహనం యొక్క రంగు
- టూ వీలర్ రకం
- సీటింగ్ సామర్థ్యం
- మోడల్ నెంబర్
- ఇంధన రకం
- టూ వీలర్ తయారీ తేదీ
ఇది మీ పేరు మరియు చిరునామా వంటి మీ వివరాలను కలిగి ఉంటుంది.
మీరు టూ వీలర్ ఆర్‌సి బుక్‌ను ఎలా పొందవచ్చు?
టూ వీలర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా మీకు సమీపంలో ఉన్న ఒక ఆర్‌టిఒ కార్యాలయాన్ని సంప్రదించడం, ఇక్కడ అధికారులు మీ వాహనాన్ని చెక్ చేసి మీ బైక్ కోసం టూ వీలర్ ఆర్‌సిని జారీ చేస్తారు. ప్రత్యామ్నాయంగా మీరు, మీ బైక్‌ను కొనుగోలు చేసిన షోరూమ్ డీలర్‌ను కూడా మీ తరపున రిజిస్ట్రేషన్ చేయమని అడగవచ్చు. అలాగే, ఆర్‌సి బుక్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే మీ టూ వీలర్ వాహనం మీకు డెలివర్ చేయబడుతుంది.
ఆర్‌సి బుక్ 15 సంవత్సరాల వ్యవధి కోసం జారీ చేయబడుతుంది మరియు ప్రతి 5 సంవత్సరాల తర్వాత దానిని రెన్యూ చేసుకోవచ్చు.
మీరు మీ ఆర్‌సి బుక్‌ను పోగొట్టుకున్నట్లయితే ఏమి జరుగుతుంది?
భారతదేశంలో, మీరు చెల్లుబాటు అయ్యే ఆర్‌సి బుక్ లేకుండా టూ వీలర్ వాహనాన్ని లేదా ఏదైనా వాహనాన్ని డ్రైవ్ చేసినట్లయితే అది చట్టవిరుద్ధం అవుతుంది. కావున, మీరు టూ వీలర్ యొక్క ఆర్‌సి బుక్‌ను పోగొట్టుకున్నా లేదా అది దొంగిలించబడినా లేదా ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా, దయచేసి పోలీసులకు ఫిర్యాదు (దొంగతనం జరిగితే) చేయండి మరియు నకిలీ ఆర్‌సి బుక్ కోసం అప్లై చేయడానికి సమీపంలో ఉన్న ఆర్‌టిఒ కార్యాలయాన్ని సందర్శించండి. ఈ కింది డాక్యుమెంట్లతో ఫారం 26 ని ఆర్‌టిఒలో సబ్మిట్ చేయండి:
- ఒరిజినల్ ఆర్‌సి బుక్ కాపీ
- పన్ను చెల్లింపు రసీదులు మరియు టాక్స్ టోకెన్
- మీ పాత లేదా కొత్త టూ వీలర్ ఇన్సూరెన్స్ కాపీ
- ఫైనాన్సర్ నుండి ఎన్ఒసి (మీ టూ వీలర్ వాహనాన్ని మీరు రుణం పై కొనుగోలు చేసినట్లయితే)
- పియుసి (పొల్యూషన్ అండర్ కంట్రోల్) సర్టిఫికెట్
- మీ చిరునామా రుజువు
- మీ గుర్తింపు రుజువు
- పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
మీరు దాదాపు రూ. 300 చెల్లించండి మరియు చెల్లింపు రసీదును స్వీకరించండి, దానిపై మీ ఇంటి వద్ద మీరు డూప్లికేట్ ఆర్‌సి బుక్ హార్డ్‌కాపీని అందుకునే తేదీ ఉంటుంది.
మీరు ఆన్‌లైన్‌లో బైక్ ఆర్‌సిని ఎలా ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు?
మీరు చాలా కాలం పాటు (సంవత్సరం కంటే ఎక్కువ కాలం) లేదా శాశ్వతంగా వేరే రాష్ట్రానికి మారినట్లయితే, మీరు మీ బైక్ యొక్క ఆర్‌సిని బదిలీ చేయాలి. మీ బైక్ ఆర్‌సిని బదిలీ చేసే ప్రాసెస్ చాల సులభం మరియు సరళంగా ఉంటుంది:
- మీ ప్రస్తుత ఆర్‌టిఒ నుండి ఎన్‌ఒసి లెటర్ పొందండి.
- మీ బైక్/టూ వీలర్‌ను కొత్త రాష్ట్రానికి రవాణా చేయడానికి ఏర్పాట్లు చేసుకోండి.
- కొత్త రాష్ట్రంలో మీ బైక్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోండి.
- మీ కొత్త రాష్ట్రం యొక్క నిబంధనల ప్రకారం చెల్లింపు చేయండి మరియు రోడ్ టాక్స్ చెల్లించండి.
మీరు ఆన్‌లైన్‌లో బైక్ యాజమాన్యాన్ని ఎలా బదిలీ చేయగలరు?
మీరు ఒక సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొనుగోలు చేస్తున్నప్పుడు లేదా మీ బైక్‌ను విక్రయిస్తున్నప్పుడు, బైక్ యాజమాన్యం బదిలీ ప్రక్రియను పరిగణనలోకి తీసుకోవాలి. మీ పాత లేదా కొత్త టూ వీలర్ వాహన ఇన్సూరెన్స్ పాలసీని కూడా అప్‌డేట్ చేయాలి. టూ వీలర్ వాహన యాజమాన్య బదిలీ ప్రక్రియను ప్రాథమికంగా కొనుగోలుదారు ప్రారంభించవలసి ఉంటుంది.
బైక్ యాజమాన్యాన్ని బదిలీ చేయడానికి దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
- డైరెక్టరేట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో దిగువ పేర్కొన్న డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి:
- ఆర్‌సి బుక్
- ఇన్సూరెన్స్ కాపీ
- ఎమిషన్ టెస్ట్ సర్టిఫికెట్
- విక్రేత యొక్క చిరునామా రుజువు
- పన్ను చెల్లింపు రసీదులు
- ఫారం 29 మరియు 30
- కొనుగోలుదారు మరియు విక్రేత యొక్క పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
- సబ్మిట్ చేసిన డాక్యుమెంట్లు ధృవీకరించబడతాయి మరియు ఆ తరువాత అధికారులు/రిజిస్ట్రేషన్ అధికారులు సంతకం చేస్తారు.
- దాదాపు రూ. 250 చెల్లించండి.
- చెల్లింపు రసీదును స్వీకరించండి.
- 'రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వశాఖ ' అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ఈ పేరు ఉన్న లింక్ పై క్లిక్ చేయండి - 'వాహన రిజిస్ట్రేషన్ సంబంధిత సేవలు'.
- తదుపరి కనపడే స్క్రీన్‌లో బదిలీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- 'కొనసాగండి' నంబర్ పై క్లిక్ చేయండి.
- తదుపరి స్క్రీన్ పై, ఇతర విభాగం పై క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్, మొబైల్ నంబర్ మరియు మీ మొబైల్ నంబర్‌కు పంపిన ఓటిపిని ఎంటర్ చేయండి.
- షో వివరాలపై క్లిక్ చేయండి. ఈ బటన్ పై క్లిక్ చేసిన తర్వాత, మీ వెహికల్ పూర్తి వివరాలు ప్రదర్శించబడతాయి.
- అదే పేజీలో మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది - 'యాజమాన్యం బదిలీ'. ఈ ఎంపికను ఎంచుకోండి.
- వాహనం యొక్క కొత్త యజమాని వివరాలను ఎంటర్ చేయండి.
- ట్రాన్స్‌ఫర్ ఫీజు మొత్తాన్ని చెక్ చేయండి మరియు ప్రక్రియను పూర్తి చేయడానికి, చెల్లింపు చేయడానికి కొనసాగండి.
ఈ డాక్యుమెంట్ మీకు, టూ వీలర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, బైక్ ఆర్‌సి బుక్ వివరాలు, టూ వీలర్ ఆర్‌సి బుక్‌ను కోల్పోయిన సందర్భంలో తీసుకోవాల్సిన చర్యలు, ఆర్‌సి బుక్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ మరియు ఆన్‌లైన్‌లో బైక్ యాజమాన్యాన్ని బదిలీ చేయడానికి అనుసరించవలసిన దశలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుందని ఆశిస్తున్నాము. మీ టూ వీలర్‌ను విక్రయించేటప్పుడు మీరు పాత లేదా కొత్త టూ వీలర్ ఇన్సూరెన్స్ కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. అంతేకాకుండా, ఎల్లప్పుడూ చట్టపరమైన ఆవశ్యకతలను అవాంతరాలు లేకుండా నెరవేర్చడానికి మీరు ఆన్‌లైన్‌లో థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయండి.
రిప్లై ఇవ్వండి