• search-icon
  • hamburger-icon

మీ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలో మినహాయింపుల గురించి అన్ని విషయాలను తెలుసుకోండి

  • Motor Blog

  • 17 జూన్ 2019

  • 18 Viewed

మీరు మీ వాహన దొంగతనం/ ప్రమాదం లాంటి తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటే, మీ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ మిమ్మల్ని ఆర్థికంగా రక్షిస్తుంది. ఒక సమగ్ర మోటార్ బీమా పాలసీ మిమ్మల్ని వీటికోసం కవర్ చేస్తుంది:

  • పిడుగుపాటు, భూకంపం, వరద, టైఫూన్, హరికేన్, తుఫాను మొదలైనటువంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా మీ వాహనానికి నష్టం/డ్యామేజీ.
  • దోపిడీ, దొంగతనం, యాక్సిడెంట్, అల్లర్లు, సమ్మె మొదలైనటువంటి దురదృష్టకర సంఘటనల కారణంగా మీ వాహనానికి జరిగిన నష్టం లేదా డ్యామేజీ.
  • యజమాని-డ్రైవర్ కోసం రూ. 2 లక్షల (ఫోర్-వీలర్ విషయంలో) మరియు రూ. 1 లక్షల (టూ-వీలర్ విషయంలో) కవరేజ్‌తో పర్సనల్ యాక్సిడెంట్ (పిఎ) కవర్.
  • మీ వాహనం ద్వారా థర్డ్ పార్టీ (వ్యక్తులు/ఆస్తి)కి జరిగిన నష్టం కారణంగా తలెత్తిన థర్డ్ పార్టీ (టిపి) చట్టపరమైన బాధ్యత.

  మీరు మీ మోటార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు సరైన యాడ్-ఆన్ కవర్లను జోడించడం ద్వారా మీ సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ అందించే కవరేజీని మరింత మెరుగుపరచుకోవచ్చు. అలాగే, ఒక సాధారణ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం ఎంత ఖర్చవుతుంది? మరియు మీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను నిర్వచించే అంశాలు ఏవి? అనేవి మీ తదుపరి ప్రశ్నలు కావచ్చు, అలాగే, మీరు మా ఉచిత మోటార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఉపయోగించవచ్చు మరియు మీ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం మీరు చెల్లించవలసిన ప్రీమియం మొత్తం అంచనా విలువను లెక్కించవచ్చు. మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం ఈ కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది:

  • మీ వాహనం యొక్క ఐడివి (ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ)
  • మినహాయింపులు
  • ఎన్‌సిబి (నో క్లెయిమ్ బోనస్), వర్తిస్తే
  • మీ వాహనం యొక్క లయబిలిటీ ప్రీమియం, ఇది ప్రతి సంవత్సరం మారవచ్చు
  • వాహనం క్యూబిక్ సామర్థ్యం (సిసి)
  • భౌగోళిక సరిహద్దు
  • యాడ్-ఆన్ కవర్లు (ఆప్షనల్)
  • మీరు మీ వాహనంలో ఉపయోగించిన యాక్సెసరీస్ (ఆప్షనల్)

  మనం ఈ అంశాన్ని గురించి చర్చిద్దాం మోటార్ ఇన్సూరెన్స్‌లో మినహాయింపులు. అయితే, మినహాయింపు అనేది క్లెయిమ్ సమయంలో మీరు స్వంతంగా చెల్లించే మొత్తం. భారతదేశంలో రెండు రకాల మినహాయింపులు ఉన్నాయి:

  • తప్పనిసరి మినహాయింపు – IRDAI (Insurance Regulatory and Development Authority of India) క్లెయిమ్ సమయంలో మీరు చెల్లించవలసిన తప్పనిసరి మినహాయింపు మొత్తాన్ని నిర్ణయించింది:
    • ప్రైవేట్ కారు కోసం (1500 సిసి వరకు) - రూ. 1000
    • ప్రైవేట్ కారు కోసం (1500 సిసి కంటే ఎక్కువ) - రూ. 2000
    • టూ వీలర్ కోసం (సిసితో సంబంధం లేకుండా) - రూ. 100

మీ వాహనం క్లెయిమ్‌ల ప్రమాదాన్ని ఎక్కువగా సూచిస్తే, మీ ఇన్సూరెన్స్ కంపెనీ అధిక తప్పనిసరి మినహాయింపును వసూలు చేయవచ్చు.

  • Voluntary deductible - This is the amount that you choose to pay at the time of every claim, in order to gain additional discount, while buying/renewing your motor insurance policy. This amount is over and above the compulsory deductible. For e.g., if you choose a voluntary deductible of INR 7500 for your private car, then you are eligible to earn a discount of 30% on your premium amount, with the maximum limit of the discount being INR 2000. Similarly, for your two wheeler, if you choose a voluntary deductible of INR 1000, then you are eligible to get a discount of 20% on your premium amount, with the maximum limit of discount being INR 125.

  ఇప్పుడు అధిక మినహాయించదగిన ఇన్సూరెన్స్ ప్లాన్ లేదా తక్కువ మినహాయించదగిన ఇన్సూరెన్స్ ప్లాన్, ఈ రెండింటిలో దేనిని ఎంచుకోవాలి అని మీరు ఆశ్చర్యపోవచ్చు. చింతించకండి! మీకు సహాయం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. తప్పనిసరి మినహాయింపు విషయంలో మీరు ఏమీ చేయలేనప్పటికీ, స్వచ్ఛంద మినహాయింపును తెలివిగా ఎంచుకోవచ్చు. మీరు తగిన మొత్తంలో స్వచ్ఛంద మినహాయింపును ఎంచుకోవాలి, తద్వారా మీరు మీ ప్రీమియం మొత్తంపై గొప్ప డిస్కౌంట్‌ను సంపాదించవచ్చు మరియు మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ ఫైల్ చేసేటప్పుడు మీ స్వంత ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చు. మీరు దీనిని ప్రీమియం మొత్తంపై తగ్గింపును పొందడం కోసం మాత్రమే కాకుండా, మీ డ్యామేజ్ అయిన వాహనాన్ని రిపేర్ చేయించుకోవడానికి తీసుకువెళ్లినప్పుడు మరియు మీ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీపై దానిని క్లెయిమ్ చేసినప్పుడు మీరు ఆలోచించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది కావున, మీకు మినహాయించదగిన మొత్తాన్ని ఎంచుకోవాల్సిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము. మీ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలోని మినహాయింపుల గురించి మీకు ఇప్పుడు అన్ని విషయాలు వివరంగా తెలుసని మేము ఆశిస్తున్నాము. ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి కింద ఒక కామెంట్‌ను వ్రాయండి. మీ అన్ని ప్రశ్నలకు సాధ్యమైనంత త్వరగా సమాధానం ఇస్తాము. మోటారు ఇన్సూరెన్స్ మరియు సంబంధిత అంశాల గురించి మరింత తెలుసుకోవడానికి మా వెబ్‌సైట్, బజాజ్ అలియంజ్ సాధారణ బీమా ని సందర్శించండి.

Go Digital

Download Caringly Yours App!

  • appstore
  • playstore
godigi-bg-img