రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Third Party Car Insurance Premium Estimation
సెప్టెంబర్ 28, 2020

థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్ ప్రీమియం ఎలా అంచనా వేయబడుతుంది?

ఉదాహరణకు చూద్దాం: మీరు మీ తదుపరి లాంగ్ రోడ్ ట్రిప్ అడ్వెంచర్ కోసం బయలుదేరారని అనుకుందాం. అలాగే, మార్గం మధ్యలో మీ కారు మరో కారును ఢీ కొట్టింది. ఆ పరిస్థితిలో మీకు ఎవరికి కాల్ చేయాలో మరియు ప్రమాదం నుండి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? అయితే, ఇలాంటి సందర్భంలోనే మిమ్మల్ని రక్షించడానికి Insurance Regulatory and Development Authority (IRDA) థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్‌ను తప్పనిసరి చేసింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుందో మీకు తెలియకపోతే, అప్పుడు దాని గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి. థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? మోటారు ఇన్సూరెన్స్ చట్టం 1988 ప్రకారం, ఒక థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్ ని కలిగి ఉండటం చట్టపరమైన అవసరం. థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్ ప్రధాన లక్ష్యం ఏమిటంటే, కారు యజమాని ద్వారా తలెత్తిన ఆర్థిక బాధ్యతల కోసం కవరేజీని అందించడం. అది మరణం అయినా లేదా థర్డ్ పార్టీకి జరిగిన శారీరక వైకల్యం అయినా సరే, థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్ పాలసీ ప్రతిదీ కవర్ చేస్తుంది. లబ్దిదారు పరంగా చూసుకుంటే ఒక థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా పాలసీహోల్డర్ లేదా ఇన్సూరెన్స్ కంపెనీ కాకుండా థర్డ్ పార్టీ మాత్రమే పాలసీ పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు. మీరు థర్డ్ పార్టీ పాలసీని ఎంచుకున్నప్పుడు తప్పనిసరిగా పాలసీలో చేరికలు, మినహాయింపులను పూర్తిగా అర్థం చేసుకోవాలి. పాలసీ కవరేజీని అంచనా వేయడం వల్ల ఒక దురదృష్టకర సంఘటన లేదా ఆకస్మిక సంఘటన సందర్భంలో మీ క్లెయిమ్ తిరస్కరించబడదు అని నిర్థారించుకోవచ్చు. ఒక థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడానికి ముందు నిబంధనలు, షరతులను వివరంగా చదవండి. అలాగే కారు ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి ముందు పరిగణనలోకి తీసుకోవలసిన మరొక ముఖ్యమైన అంశం ప్రీమియం రేటు. థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్ కోసం వర్తించే ప్రీమియం రేట్లు ఏవి?
క్యూబిక్ సామర్థ్యం రెన్యూవల్ కోసం ప్రీమియం రేటు కొత్త వాహనం కోసం ప్రీమియం రేటు
1,000 సిసి కంటే తక్కువ రూ. 2,072 రూ. 5,286
1,000 సిసి కంటే ఎక్కువ కానీ 1,500 సిసి కంటే తక్కువ రూ. 3,221 రూ. 9,534
1,500 సిసి కంటే ఎక్కువ రూ. 7,890 రూ. 24,305
(మూలం: IRDAI) ఇన్సూరెన్స్ కంపెనీల నుండి అనేక కోట్‌లను పొందడానికి ఒక పాలసీహోల్డర్ ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌లో వాటిని కనుగొనవచ్చు. ఆఫ్‌లైన్ పరిశోధన కోసం అతను నేరుగా ఏజెంట్‌తో మాట్లాడాలి మరియు అతని ప్రశ్నలను పరిష్కరించుకోవాలి. అదే సమయంలో అనేక కోట్‌లను చూడటానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, దీనిని ఉపయోగించడం-‌ కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ . ఒక ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్ సహాయంతో మీరు అదే ప్లాన్ కింద వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే ప్రీమియంలు, ఫీచర్లు మరియు ప్రయోజనాలను సరిపోల్చవచ్చు. ఇప్పుడు మీకు థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు గురించి అన్ని విషయాలు తెలుసు కాబట్టి, ఇంకా ఆలస్యం చేయకుండా నేడే కారు ఇన్సూరెన్స్‌లో పెట్టుబడి పెట్టండి. ఒకవేళ మీరు థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్ పాలసీ లేకుండా రోడ్లపై రెడ్-హ్యాండెడ్‌గా పట్టుబడితే, అప్పుడు మీరు భారీ జరిమానాలను చెల్లించవలసి ఉంటుంది.  

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి