రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Indian Independence Day
నవంబర్ 23, 2021

స్వాతంత్య్ర దినోత్సవం - మీరు కోరుకున్నట్లుగా ఉండగలిగే స్వేచ్ఛ

1947 లో స్వాతంత్య్రం పొందిన తరువాత భారతదేశం చాలా అభివృద్ధి సాధించింది. భారతదేశం దాదాపుగా 200 సంవత్సరాలపాటు బ్రిటిష్ పాలనలో ఉంది మరియు ఆగస్ట్ 15, 1947 నాడు భారతదేశం స్వతంత్ర దేశంగా ప్రకటించబడింది. స్వంతంత్రంగా ఉండాలి అనే స్వాతంత్య్ర సమర యోధుల కాంక్ష వారిని అనేక పోరాటాల తరువాత తమ లక్ష్యాన్ని సాధించే విధంగా ప్రోత్సహించింది. నేటి కాలంలో కూడా, అణచివేతకు గురి అవుతున్నాము అని ఈ దేశపు యువత భావించినప్పుడు 'కోరుకున్నట్లుగా ఉండడం' అనే స్ఫూర్తి వారికి మార్గనిర్దేశం చేస్తుంది. ఈ జాతీయ సెలవు దినాన్ని భారతదేశ జాతీయ పతాకాన్ని ఎగరవేయడం, ఆ తరువాత అనేక సాంస్కృతిక కార్యక్రమాలు మరియు రంగురంగుల ప్రదర్శనలతో భారతదేశ ప్రజలు జరుపుకుంటారు. భారతదేశంలోని ప్రతి ప్రైవేట్ మరియు పబ్లిక్ భవనం త్రివర్ణ పతాకం యొక్క రంగులతో అలంకరించబడుతుంది. పాఠశాలలలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయబడతాయి ఇందులో అందరు విద్యార్థులు పాల్గొని చిత్రకళ, పాటలు పాడటం, వ్యాస రచన, ఫ్యాన్సీ డ్రెస్, రంగోలి, నాటకాలు మరియు మరెన్నో పోటీలలో పాలుపంచుకుంటారు. ఈ రోజున అనేక కార్యాలయాలు స్వాతంత్య్ర దినోత్సవం ఇతివృత్తంగా అనేక ఈవెంట్లు మరియు కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఈ సాధారణ వేడుకలు జరుపుకుంటూనే, నేటి రోజులలో ప్రజలు సోషల్ మీడియా ద్వారా కూడా తమ ఉత్సాహాన్ని ప్రకటిస్తున్నారు. అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ ఫ్రేమ్‌లు మరియు థీమ్‌లను ఉపయోగించి వారి ప్రొఫైల్ చిత్రాలను మార్చడానికి వీలు కల్పిస్తున్నాయి. అలాగే ప్రజలు ఈ వేడుకకు తగిన విధంగా దుస్తులు ధరించడం లేదా దేశం పట్ల తమ ప్రేమను వ్యక్తపరుస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్లలో చిత్రాలను పోస్ట్ చేస్తారు. ఈ రోజు నిర్వహించబడే కార్యకలాపాలు మరియు పండుగలను ట్యాగ్ చేస్తూ నెట్‌లో అనేక హ్యాష్‌ట్యాగ్‌లు ఉపయోగించబడుతున్నాయి. సోషల్ మీడియాలో అనేక స్వాతంత్య్ర దినోత్సవ పోస్టులు చేయడంతో పాటు, ఈ ప్రత్యేకమైన రోజున ఆనందకరమైన శుభాకాంక్షలతో అనేక చిత్రాలు మరియు సందేశాలు ఫార్వార్డ్ చేయబడతాయి. కానీ మీరు ఈ సందేశాలను ఫార్వార్డ్ చేస్తున్నప్పుడు, మీ చిత్రాలను అప్‌లోడ్ చేస్తున్నపుడు మరియు మీ ప్రొఫైల్ చిత్రాలను అప్‌డేట్ చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు? ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేటి ప్రపంచంలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. హ్యాకర్లు స్వాతంత్య్ర దినోత్సవం వంటి ప్రత్యేక రోజులను ఒక అవకాశంగా తీసుకొని సైబర్-దాడిని ప్రారంభించడానికి అతి తక్కువ భద్రత ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటారు. అటువంటి తీవ్రమైన పరిస్థితిలో మిమ్మల్ని మీరు కవర్ చేసుకోవడానికి ఉత్తమ మార్గం సైబర్ ఇన్సూరెన్స్ పాలసీని పొందడం. సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ అనేది ఎవరైనా ఒక సైబర్ దాడికి గురి అయినప్పుడు తమని రక్షించుకోవడానికి రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన ఇన్సూరెన్స్ ప్లాన్. ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజున మీకు మరియు మీ కుటుంబానికి ఉత్తమ సైబర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఆన్‌లైన్ ప్రపంచంలో మీ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఇన్సూర్ చేసుకోండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి