సూచించబడినవి
Health Blog
04 మార్చి 2021
488 Viewed
Contents
ఏ వయస్సులో ఉన్న వ్యక్తికైనా హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం మరియు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలో ప్రీమియం రేట్లు పెరగడంతో అన్ని ఆదాయ వర్గాల ప్రజలకు ఇది అందుబాటులో ఉండకపోవచ్చు. అంతేకాకుండా, భారతదేశం లాంటి దేశాల్లో పిల్లలు వారి చదువు ముగిసిన తర్వాత కూడా తల్లిదండ్రులపై ఆధారపడతారు మరియు తల్లిదండ్రులు వారి జీవితంలోని తరువాతి దశల్లో వారి ఆర్థిక అవసరాల కోసం వారి పిల్లలపై ఆధారపడతారు. ఇటువంటి పరిస్థితులలో ఫ్యామిలీ ఫ్లోటర్లు మరియు ఫ్యామిలీ ఆరోగ్య బీమా పథకాలు వంటి రక్షణను అందిస్తాయి.
ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా పాలసీహోల్డర్ కుటుంబాన్ని కూడా కవర్ చేస్తుంది. ఈ ప్రయోజనం ఒకే ప్రీమియం చెల్లింపు పై అందుబాటులో ఉంటుంది మరియు ఇన్సూరెన్స్ మొత్తం అనేది పాలసీహోల్డర్ కుటుంబానికి పంచబడుతుంది. ఇది వివిధ కుటుంబ సభ్యుల బహుళ హాస్పిటలైజేషన్ ఖర్చులను కూడా కవర్ చేస్తుంది. ఉదాహరణ: మిస్టర్ అగ్ని స్వీయ, జీవిత భాగస్వామి మరియు ఇద్దరు పిల్లలను కవర్ చేసే రూ. 10 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని తీసుకున్నారు. ఇప్పుడు, పాలసీ సంవత్సరంలో మిస్టర్ అగ్నికి డెంగ్యూ ఉన్నట్లు నిర్ధారణ అయింది మరియు అతనికి రూ. 3.5 లక్షల వరకు హాస్పిటల్ ఖర్చులు అయ్యాయి. అతను క్లెయిమ్ ఫైల్ చేసాడు మరియు అది అంగీకరించబడింది. ఇప్పుడు మిగిలిన సంవత్సరానికి రూ. 6.5 లక్షలను 4 కుటుంబ సభ్యులలో ఎవరైనా వినియోగించుకోవచ్చు. అయితే, సంవత్సరం చివరిలో మిస్టర్ అగ్ని కుమార్తె మలేరియాతో బాధపడినప్పుడు, ఆమెకు రూ. 1.5 లక్షలు ఖర్చు కాగా, అదే పాలసీ కింద క్లెయిమ్ చేయడం జరిగింది. కొన్ని ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు బిన్నంగా రూపొందించబడ్డాయి, అవి కుటుంబంలోని ప్రతి వ్యక్తికి ప్రత్యేక కవర్‌ను కలిగి ఉంటాయి మరియు మొత్తానికి అందరికి వర్తించే హామీ ఇవ్వబడిన ఇన్సూరెన్స్ మొత్తాన్ని కలిగి ఉంటాయి.
సరసమైనది: అనేక పాలసీలను తీసుకోవడం వల్ల ఒక వ్యక్తికి స్వంత డబ్బు ఖర్చు అవుతుంది. కుటుంబము కోసం హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్స్ లో మీ ప్రియమైన వారందరు సభ్యులుగా ఉంటారు మరియు మిగతా వాటితో పోలిస్తే ఇది తక్కువ ఖర్చుతో లభిస్తుంది. అవాంతరాలు-లేని: ఇది మీ కుటుంబానికి సంబంధించి అనేక పాలసీలను నిర్వహించాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. పన్ను ప్రయోజనాలు: మీరు చెల్లించిన ప్రీమియం, మీ పూర్తి ఆదాయంపై చేసే ఆదాయపు పన్ను లెక్కింపు నుండి మినహాయింపు కోసం అనుమతించబడుతుంది.
ఫ్లోటర్ పాలసీలు కుటుంబాలకు అందుబాటులో ఉన్నందున, వారు కుటుంబాన్ని ఎలా నిర్వచిస్తారు మరియు ఎవరికి కవర్ చేయబడదు అనేది తెలుసుకోవడం ముఖ్యం ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ. సాధారణంగా, ప్రతి పాలసీ కుటుంబం కోసం దాని స్వంత నిర్వచనాన్ని కలిగి ఉంటుంది, చేరికలు మరియు మినహాయింపులకు సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి. ఒక కుటుంబంలో జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు మరియు అత్తమామలు ఉండవచ్చు. అయితే, కొన్ని పాలసీలు కుటుంబసభ్యుల సంఖ్యను 2 వయోజనులకు మాత్రమే పరిమితం చేస్తాయి, మరికొన్ని పాలసీలు ఒకే పాలసీ కింద 4 వయోజనుల వరకు పరిమితిని పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తాయి.
మీ పాలసీ ప్రొవైడర్‌ను బట్టి ఫ్లోటర్ పాలసీలు 60 లేదా 65 ఏళ్ల వయస్సు పరిమితిని కలిగి ఉంటాయి. మీ తల్లిదండ్రులు ఆ వయో పరిమితిని మించితే, వారు ఫ్లోటర్ కింద కవర్ చేయబడరు మరియు మీరు వారి కోసం ప్రత్యేక పాలసీని కొనుగోలు చేయాలి. అయితే, వారు పాలసీ ప్రమాణాలను నెరవేర్చినా, ఈ కింది కారణాల వల్ల వారి కోసం ప్రత్యేక పాలసీ కొనుగోలు చేయవలసిందిగా సిఫార్సు చేయడమైనది:
కుటుంబం అనగానే అందులో పిల్లలు కూడా ఉంటారు. అయితే, వారు మీ ఫ్లోటర్ పాలసీలో భాగస్వాములు కావాలా అనేది ఒక ప్రశ్న. అయితే ఇక్కడ, పిల్లలు వయస్సులో చిన్న వారై మీపై ఆధారపడినప్పుడు వారు ఫ్లోటర్ కింద కవర్ చేయబడతారు, కానీ పిల్లలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటే, వారి కోసం ప్రత్యేక పాలసీని కలిగి ఉండటం మంచిది అని సూచించబడుతుంది. ఎందుకనగా, వారికి కవరేజ్ అవసరం ఎక్కువగా ఉండవచ్చు మరియు అధిక కవరేజీతో కూడిన ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు సాధారణంగా చాలా ఖరీదైనవి. అలాగే, వారు వారి ఆదాయం నుండి పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. కేవలం దంపతులు మరియు పిల్లలు చిన్నవారైతే ఫ్లోటర్ పాలసీలు మంచివి. కానీ, ఇండివిడ్యువల్ పాలసీని ఎంచుకోవాలా లేదా ఫ్లోటర్ పాలసీని ఎంచుకోవాలా అనేది వ్యక్తి యొక్క స్వంత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
అవును, మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో మీ అత్తమామలను కవర్ చేయవచ్చు. మీ అత్తమామలు మీ జీవిత భాగస్వామిపై ఆధారపడి ఉన్నారా లేదా అనేది ముఖ్యం కాదు.
లేదు, మీ మేనమామ లేదా మేనత్త మీపై ఆధారపడి ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా, మీరు వారిని మీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ కింద కవర్ చేయలేరు.
GST waiver makes retail individual health, PA and travel insurance including family floater policies 18% cheaper from 22nd September 2025. Secure your health at an affordable price