సూచించబడినవి
Health Blog
21 నవంబర్ 2021
2860 Viewed
Contents
సంవత్సరంలో మళ్ళీ ఆ సమయం ఆసన్నమైంది! ఏ సమయం అని మీరు అడగవచ్చు? చల్లని సీజన్‌లో బహుమతులు, ఉత్సాహం మరియు వెచ్చదనాన్ని అందించే సమయం. మేము దేని గురించి మాట్లాడుతున్నామో ఇంకా ఊహించలేకపోతున్నారా. మేము మరొక సూచన అందిస్తాము. ఏమైనా గుర్తుకు వస్తుందా? గుర్తుకు వచ్చిందని మేము అనుకుంటున్నాము. మేము క్రిస్మస్ సమయం గురించి మాట్లాడుతున్నాము! ఈ పండుగను సూచించే పురాతనమైన క్రిస్మస్ ట్రీ అందరూ ఇష్టపడే మరియు ప్రముఖ చిహ్నం. ఈ అందమైన సంప్రదాయం యొక్క ప్రాముఖ్యతని మేము ఇప్పుడు మీకు తెలియజేస్తాము.
క్రిస్మస్ ట్రీ ఆధ్యాత్మిక జీవితం యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. క్రిస్మస్ ట్రీ ని ఏర్పాటు చేసే సంప్రదాయం మొదట జర్మనీలో ప్రారంభం అయింది అని విశ్వసిస్తారు, ఆ తరువాత 1830లలో ఇది యుకె కి వచ్చింది. శీతాకాలంలో జీసస్ క్రైస్ట్ పుట్టిన తర్వాత, ఆ గొప్ప సంఘటనకి గుర్తుగా కొన్ని చెట్ల మీద ఉన్న మంచు కింద పడిపోయి పచ్చగా మారిపోయాయి. అందువల్ల, క్రిస్మస్ ట్రీ శాశ్వతత్వము మరియు అమరత్వాన్ని సూచిస్తుంది.
అనాది కాలంగా, నిరుత్సాహంగా, నిరాసక్తిగా మరియు ఉదాసీనంగా ఉండే వాతావరణంలో క్రిస్మస్ ట్రీ ఉల్లాసం, సానుకూలత మరియు ఆశావాద స్ఫూర్తిని తీసుకువస్తుందని నమ్ముతారు. కఠినమైన వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పటికీ పట్టుదల వదలకుండా పచ్చగా ఉండే స్ఫూర్తి క్రిస్మస్ ట్రీ అందించే సానుకూలతను సూచిస్తుంది. అలాగే, ఈ నిత్యనూతన చెట్ల నుండి ఉత్పన్నమయ్యే మంచి సువాసన మిమ్మల్ని రోజువారీ ఒత్తిడి నుండి విశ్రాంతి తీసుకోవడంలో మరియు మనశ్శాంతిని అందించడంలో మీకు సహాయపడుతుంది.
పూర్వం, ప్రజలు క్రిస్మస్ చెట్టును జింజర్‌బ్రెడ్ మరియు యాపిల్ వంటి ఆహార పదార్థాలతో అలంకరించేవారు. కానీ సమయం గడిచే కొద్దీ సంప్రదాయాలు మారాయి మరియు ఇప్పుడు అలంకరణలలో క్రిస్మస్ లైట్లు, క్యాండీలు, టిన్సెల్, బాబుల్స్, మెరిసే నక్షత్రాలు, రంగు రంగుల కాగితాల ముక్కలు, గోల్డ్ ఫాయిల్స్, సిల్వర్ వైర్స్, శాంటా క్లాజ్ పప్పెట్స్ వంటి చిన్న బొమ్మలు, కృత్రిమ స్నోఫ్లేక్స్ మరియు క్రిస్మస్ బెల్ వంటివి ఉన్నాయి.
క్రిస్మస్ పండుగ నాడు శాంటా క్లాజ్ పిల్లల కోసం బహుమతులు తీసుకువస్తారు అని మరియు వాటిని క్రిస్మస్ చెట్టు కింద పెడతారు అని అంటారు. ఈ సంప్రదాయాన్ని మరింత సరదాగా చేయడానికి, ప్రజలు పెద్ద చెట్లను తీసుకువస్తారు మరియు శాంటాని ఆశ్చర్యపరచడానికి వాటిని విశేషంగా అలంకరిస్తారు. క్రిస్మస్ ట్రీ బహుమతులను సేకరించడానికి మరియు వాటిని తెరవడానికి ఒక మంచి ప్రదేశం. అన్ని పండుగలు మిమ్మల్ని కొంత వరకు ఆనందపరుస్తాయి, అయితే, మీరు ఇచ్చిపుచ్చుకునే బహుమతులు ఆశ్చర్యాన్ని మరియు ఆనందాన్ని అందిస్తాయి. ఈ పండుగ సీజన్లో, మీ ప్రియమైన వారికి జీవితకాలంపాటు వారి జ్ఞాపకాలలో మిమ్మల్ని ఉంచే బహుమతిని ఇవ్వండి.
ఈ క్రిస్మస్ రోజున, క్రిస్మస్ చెట్టు కింద ప్రత్యేకమైన భావావేశం కలిగిన మీ బహుమతిని ఉంచండి. ఈ పండుగ సీజన్ మీ ప్రియమైన వారికి ఏదైనా ప్రత్యేకమైన బహుమతిని ఇవ్వండి - #GiftABetterEmotion. మీ ప్రియమైన వారి పట్ల మీ ప్రేమ మరియు బాధ్యతను వ్యక్తపరచడానికి ఒక భద్రత భావన కంటే మంచి బహుమతి ఏమి ఉంటుంది? మా వెబ్‌సైట్‌ను సందర్శించండి - https://apps.bajajallianz.com/gift-an-insurance/index.html మరియు మీ ప్రియమైన వారికి అత్యవసర సమయాలలో ఆర్థిక సంరక్షణను అందించే ఒక సాధారణ బీమా పాలసీని బహుమతిగా ఇవ్వండి. మీ అందరికీ ఆనందకరమైన మరియు సంతోషకరమైన క్రిస్మస్ శుభాకాంక్షలు!
What makes our insurance unique
With Motor On-The-Spot, Health Direct Click, etc we provide fast claim process , Our sales toll free number:1800-209-0144