రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
What Are The Two Major Types Of Health Insurance?
17 మార్చి, 2021

రెండు ప్రధాన రకాల హెల్త్ ఇన్సూరెన్స్‌లు ఏమిటి?

ఇటీవలి కాలంలో, మన జీవితాల్లో మనం దృష్టి పెట్టే ప్రధాన విషయాలు మన మరియు మన కుటుంబం యొక్క శ్రేయస్సు మరియు ఆరోగ్యం. అందువల్ల ఇది హెల్త్ ఇన్సూరెన్స్ పరిశ్రమ యొక్క అభివృద్ధికి దారితీస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పాలసీదారునికి వారి భవిష్యత్తులో ఊహించని వైద్య ఖర్చులను తీర్చుకోవడానికి కవరేజ్ అందించే ఇన్సూరెన్స్ కంపెనీ. నమన్ తన కుటుంబం, స్నేహితులు లేదా సహోద్యోగులను అడిగిన ప్రతిసారీ అతనికి అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండే సంక్లిష్టమైన సమాచారం అందుతున్నందున ఎన్నడూ హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయలేదు, ఇది అతనికి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి అని అర్థం చేసుకోవటం మరియు దాని ఇతర వివరాలను తెలుసుకోవడం కష్టతరం చేసింది. అలాగే, ఏ పాలసీని అతను కొనుగోలు చేయాలి మరియు అతనికి ఏది ఉత్తమమైనదో అనే దాని గురించి ఆన్‌లైన్‌లో ఉన్న సమాచారం అతనిని గందరగోళానికి గురి చేసింది. ఈ రోజు, వివిధ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ కస్టమర్లకు అనేక ప్లాన్లను అందిస్తున్నాయి, ఇందులో దాదాపుగా యాభై అనారోగ్యాల కోసం అధిక వైద్య కవరేజ్, వారి నెట్‌వర్క్ ఆసుపత్రులలో నగదురహిత చికిత్స, ఉచిత వైద్య చెక్-అప్ మరియు మరెన్నో ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టం, 1961 యొక్క సెక్షన్ 80D క్రింద పన్ను ఆదా ప్రయోజనాల కోసం చాలామంది పెట్టుబడి పెడుతున్నారు, మరియు వివిధ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉన్నాయి అన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. అనేక హెల్త్ ఇన్సూరెన్స్ రకాలు ఉన్నాయి, కానీ పాలసీదారు యొక్క అత్యంత సాధారణ ప్రశ్నలు - రెండు ప్రధాన రకాల హెల్త్ ఇన్సూరెన్స్‌లు ఏమిటి? లేదా రెండు ప్రధాన రకాల హెల్త్ ఇన్సూరెన్స్‌లు ఏమిటి? ఈ, క్రింది ఆర్టికల్‌లో దాని గురించి మనం అర్థం చేసుకుందాం.

రెండు ప్రధాన రకాల హెల్త్ ఇన్సూరెన్స్‌లు ఏమిటి?

రెండు ప్రధాన రకాల హెల్త్ ఇన్సూరెన్స్‌లు ఉన్నాయి — ఇన్‌డెమ్నిటీ పాలసీ ప్లాన్ మరియు డిఫైన్డ్ బెనిఫిట్ పాలసీ ప్లాన్.

1. ఇన్‌డెమ్నిటీ పాలసీ ప్లాన్

ఇన్‌డెమ్నిటీ ప్లాన్ అనేది ఒక ప్రాథమిక మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్లాన్, ఇది పాలసీదారున్ని ఊహించని వైద్య ఖర్చు నుండి బీమా చేయబడిన మొత్తం యొక్క పరిమితి మేరకు రక్షణను అందిస్తుంది; ఇన్సూరెన్స్ కంపెనీ హాస్పిటలైజేషన్ ఛార్జీలను తిరిగి చెల్లిస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఇన్సూరెన్స్ మొత్తం ముందుగానే నిర్ణయించబడుతుంది.

ఇన్‌డెమ్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఉన్న ప్లాన్‌లు ఇలా ఉన్నాయి:

- మెడికల్ ఇన్సూరెన్స్

దీనిని మెడిక్లెయిమ్ పాలసీ అని కూడా పిలుస్తారు, ప్రమాదం లేదా అనారోగ్యం కారణంగా అయ్యే హాస్పిటలైజేషన్ ఖర్చు కోసం ఇన్సూరర్ పాలసీదారునికి పరిహారం చెల్లిస్తారు. ఖర్చులో ఔషధాల ఛార్జీలు, ఆక్సిజన్, సర్జరీ ఖర్చులు మొదలైనవి ఉంటాయి.

- వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ

ఈ ఇన్సూరెన్స్ పాలసీ ఒక వ్యక్తి కోసం ఉద్దేశించబడింది, మరియు పాలసీదారు అవసరమైన ఇన్సూరెన్స్ మొత్తం వరకు మాత్రమే క్లెయిమ్ చేయవచ్చు. ఉదాహరణకు, ఒక పాలసీదారునికి రూ.2 లక్షల వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే మరియు జీవిత భాగస్వామి కవర్ చేయబడితే, ఇద్దరూ విడిగా రూ.2 లక్షలను క్లెయిమ్ చేయవచ్చు.

- ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్

ఈ పాలసీ మొత్తం కుటుంబాన్ని కవర్ చేయడానికి ఉద్దేశించబడింది. ఇన్సూర్ చేయబడిన మొత్తం కుటుంబ సభ్యులకి సమానంగా పంపిణీ చేయబడుతుంది, మరియు అత్యవసర వైద్య పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక కుటుంబ సభ్యుడు పూర్తి మొత్తాన్ని ఉపయోగించవచ్చు. ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ యొక్క ప్రీమియం ఒక వ్యక్తిగత ప్లాన్ కంటే తక్కువగా ఉంటుంది.

- సీనియర్ సిటిజన్ ప్లాన్

ఈ పాలసీ 60 సంవత్సరాలకు పైబడిన వారి కోసం రూపొందించబడింది. ఇది సాధారణంగా ముందు నుండి ఉన్న వ్యాధి కవర్, ఇతర తీవ్రమైన వ్యాధుల కవర్లు, నగదురహిత హాస్పిటలైజేషన్, అంబులెన్స్ ఛార్జీలు, హాస్పిటలైజేషన్ ఛార్జీలు, డేకేర్ ఖర్చులు మొదలైన వాటి ప్రయోజనాలతో అధిక హామీ ఇవ్వబడిన మొత్తాన్ని కవర్ చేస్తుంది.

ఇన్‌డెమ్నిటీ ప్లాన్ ఉపనిబంధనలలో ఇవి ఉంటాయి:‌ మినహాయింపులు

— ఒక అత్యవసర వైద్య పరిస్థితి ఏర్పడినప్పుడు క్లెయిమ్ల రూపంలో డబ్బును రీయింబర్స్ చేసే ముందు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కంపెనీకి ముందే నిర్ణయించబడిన మొత్తాన్ని పాలసీదారు చెల్లించవలసి ఉంటుంది. మరియు కో-పేమెంట్ ఉపనిబంధన - క్లెయిమ్ మొత్తంలో కొంత శాతం ఇన్సూరర్ ద్వారా చెల్లించబడుతుంది మరియు మిగిలిన మొత్తాన్ని పాలసీదారు సంఘటన జరిగిన సమయంలో చెల్లించవలసి ఉంటుంది. సాధారణంగా, సీనియర్ సిటిజన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలలో ఈ ఉపనిబంధన ఉంటుంది.  

2. డిఫైన్డ్ బెనిఫిట్ పాలసీ ప్లాన్

ఒక డిఫైన్డ్ బెనిఫిట్ హెల్త్ పాలసీ కవర్ చేయబడిన సంఘటన కోసం ఒక నిర్దిష్ట మొత్తాన్ని చెల్లిస్తుంది. హాస్పిటల్ క్యాష్ పాలసీ, క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ, ప్రధాన సర్జరీలు మొదలైనవి డిఫైన్డ్ బెనిఫిట్ హెల్త్ ప్లాన్లు. ఒక ముఖ్యమైన హెల్త్ పాలసీ అనేది సాధారణంగా ఒక డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్. హాస్పిటల్ ఖర్చుతో సంబంధం లేకుండా, ఇన్సూర్ చేయబడిన వ్యక్తికీ ప్రాణాంతక వ్యాధి నిర్ధారణపై కవరేజ్ లేదా హామీ ఇవ్వబడిన మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది.

రెండు ప్రధాన రకాల హెల్త్ ఇన్సూరెన్స్‌లు ఏమిటి?

మెడికల్ ఇన్సూరెన్స్ మరియు తీవ్రమైన అనారోగ్యం అనేవి భారతదేశంలో అందించబడే రెండు ప్రధాన హెల్త్ ఇన్సూరెన్స్ రకాలు మరియు ప్రాథమిక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు. భారతదేశంలో, హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే, హాస్పిటల్ బిల్లులలో డబ్బును ఆదా చేయడానికి మరియు పన్నును ఆదా చేయడానికి ప్రతి కస్టమర్ కోసం కస్టమైజ్ చేయబడిన గరిష్ట కవరేజ్‌తో విస్తృత శ్రేణిలో ఖర్చుకు తగ్గ ప్రతిఫలాన్ని అందించే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను బజాజ్ అలియంజ్ అందిస్తుంది.

హెల్త్ ఇన్సూరెన్స్ గురించి పాలసీదారు అడిగే కొన్ని తరచుగా అడగబడే ప్రశ్నలు క్రింద ఇవ్వబడ్డాయి:

1. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అదే కంపెనీలో కలిసి పనిచేసే ఉద్యోగుల సమూహం కోసం ఉద్దేశించబడింది, మరియు కంపెనీ యొక్క యజమాని దానిని తన ఉద్యోగులకు అందిస్తారు.

2. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి ముందు తనిఖీ చేయవలసిన మూడు ప్రధాన అంశాలు ఏమిటి?

  • కనీస వెయిటింగ్ పీరియడ్‌తో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్లాన్‌ను ఎంచుకోండి.
  • నగదురహిత క్లెయిముల కోసం గరిష్ట సంఖ్యలో నెట్‌వర్క్ ఆసుపత్రులు.
  • గరిష్ట వయస్సు రెన్యూవల్ కలిగి ఉన్న ప్లాన్.

ముగింపు

మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి వ్యక్తికీ భిన్నంగా ఉంటుంది మరియు ప్రధానంగా వారి వయస్సు, వైద్య పరిస్థితి మరియు జీవనశైలి పై ఆధారపడి ఉంటుంది. ఇన్‌డెమ్నిటీ ప్లాన్ మరియు డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్ రెండూ విభిన్న ప్రయోజనాలను కలిగి ఉంటాయి; రెండు పాలసీలను కలపడం ద్వారా ఏదైనా ఊహించని వైద్య అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు సమగ్ర కవర్ అందుతుంది. రెండు పాలసీల మధ్య సమతౌల్యం పాటించడం వలన ప్రీ మరియు పోస్ట్-హాస్పిటలైజేషన్ ఖర్చులను కవర్ చేయవచ్చు.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి