రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Percentage of Monthly Salary Investment in Health Insurance
సెప్టెంబర్ 9, 2021

మీ జీతంలో ఎంత శాతం హెల్త్ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడి పెట్టాలి?

పెట్టుబడి ప్రణాళిక మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడుతుంది. కానీ అన్ని ఆర్థిక లక్ష్యాలను సరైన పెట్టుబడి మార్గాలతో సాధించలేము కానీ బదులుగా, మీరు ఆపదలు మరియు ఎదురుదెబ్బలకు సిద్ధం కావాలి. ఉదాహరణకు, ఒక అత్యవసర వైద్య పరిస్థితి లాంటి నివారించలేని ఆకస్మిక ఖర్చు రూపంలో ఉండవచ్చు. ఈ ఖర్చులను నివారించడం సాధ్యం కాదు మరియు ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు మీరు చేసిన పెట్టుబడుల వలన ఇటువంటి ఖర్చులను భరించలేరు. అందుకే, హెల్త్ ఇన్సూరెన్స్ మీ పెట్టుబడి ప్రణాళికలో ముఖ్యమైన భాగంగా ఉంటుంది. సరైన పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవడం కష్టతరమైనప్పటికీ, ఆరోగ్య ఆకస్మిక పరిస్థితుల కోసం ప్లాన్ చేయడం కూడా కీలకం. సరైన హెల్త్ ఇన్సూరెన్స్ కవర్‌తో చికిత్స ఖర్చులను మాత్రమే కాకుండా, దానితో ముడిపడి ఉన్న మీ మానసిక ఒత్తిడిని కూడా తగ్గించవచ్చు. వైద్య శాస్త్రం మనిషి జీవిత కాలపు అంచనాను పెంచినప్పటికీ, మారుతున్న జీవనశైలి ఫలితంగా చాలా మంది ప్రజలు వివిధ వ్యాధుల కోసం వైద్య సహాయం పై ఆధారపడుతున్నారు. దాంతో పాటు పెరుగుతున్న వైద్య ద్రవ్యోల్బణం మీరు కష్టపడి సంపాదించిన పొదుపుల నుండి అలాంటి ఖర్చులను భరించడం కష్టతరం చేస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే అత్యవసర పరిస్థితుల్లో మీకు బ్యాకప్‌ను అందించడం మరియు మీ పెట్టుబడులను ఖర్చు చేయకుండా నివారించడం. కాబట్టి, మీరు ఒక హెల్త్ పాలసీలో ఎంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాలి అనే ప్రశ్నకు సమాధానం సూటిగా లభించదు. అయితే, ప్రముఖ ఆర్థిక నిపుణులు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ కోసం మీ నెలవారీ ఆదాయంలో రెండు శాతం నుండి ఐదు శాతం వరకు పెట్టుబడి పెట్టాలని సిఫార్సు చేస్తున్నారు. ఉదాహరణకు, మీ నెలవారీ ఆదాయం నెలకు రూ. 80,000 అయితే, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు రూ. 1,600 నుండి రూ. 5,000 వరకు ఉండాలి. కానీ, ఈ సంఖ్య స్థిరంగా ఉండనవసరం లేదు. మీ భవిష్యత్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అంచనా ఆధారంగా ఇది మారవచ్చు. మీరు ఇప్పుడే కొత్తగా ఒక పాలసీని తీసుకోవాలని అనుకుంటే, ఆరోగ్య సంజీవని పాలసీ లాంటి బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పాలసీ సరసమైన ప్రీమియంతో వివిధ అనారోగ్యాలకు సమగ్ర కవరేజీని అందిస్తుంది కాబట్టి, ఇది ముఖ్యంగా నూతన కొనుగోలుదారులకు ఉపయోగకరంగా ఉంటుంది. కవరేజ్ పరిధి అనేది వయస్సు, ముందుగా ఉన్న పరిస్థితులు, వైద్య చరిత్ర మొదలైన వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటికి అదనంగా మీ జీవిత దశ, నివాస నగరం, ఉద్యోగ స్వభావం మరియు మరెన్నో అంశాలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే, మీ నిర్ణయం అనేది కేవలం ప్రీమియంపై మాత్రమే ఆధారపడి ఉండకూడదు. పైన అనేక అంశాలు పేర్కొనబడ్డాయి, అవి మీకు ఎంత మేరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవసరమో అనే దానిని నిర్ణయిస్తాయి. అలాంటి పాలసీ కోసం ప్లాన్ చేసేటప్పుడు, ప్రస్తుత సమయాల్లో కాకుండా భవిష్యత్తులో చికిత్స ఖర్చులను గురించి అంచనా వేయాలి. ఇది మీ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని భవిష్యత్తులో చాలా ప్రయోజనకరంగా చేస్తుంది. పాలసీల మధ్య సరిపోల్చడానికి, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ మీ కవరేజ్ అవసరాల ఆధారంగా మీకు ఏది ఉత్తమంగా సరిపోతుందో నిర్ణయించడానికి సహాయపడుతుంది. ప్రీమియంపై ఆదా చేయడంలో మీకు సహాయపడే కొన్ని ఇతర మార్గాలలో ఒకటి ప్రారంభంలోనే మీ అవసరాలను అంచనా వేయడం. ఇది మీ హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా దేనిని కవర్ చేయాలనే దాని గురించి ఒక స్పష్టమైన అవగాహన అందిస్తుంది మరియు తదనుగుణంగా అలాంటి రక్షణను అందించే పాలసీని వెతకడంలో సహాయపడుతుంది. తరువాత, మీరు పైన పేర్కొన్న పారామితుల ఆధారంగా బడ్జెట్‌ను రూపొందించుకోవాలి, తద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ మీకు భారంగా అనిపించదు, కానీ నిజానికి మీ పెట్టుబడి ప్రయాణంలో సహాయక పాత్రను పోషిస్తుంది. ఆన్‌లైన్‌లో అలాగే ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వివిధ పాలసీలను సరిపోల్చడం ద్వారా దీనిని సులభతరం చేసుకోవచ్చు. మంచి బడ్జెట్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పొందడానికి ఇవి కొన్ని ఉత్తమ మార్గాలు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రాథమిక ఉద్దేశ్యం ఏమిటంటే వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో, ఆర్థిక అవసరాల సమయాల్లో మీకు మద్దతు ఇవ్వడం మరియు మీ ఆర్థిక లక్ష్యాలకు ఆటంకాలు కలగకుండా చూసుకోవడం. ఇన్సూరెన్స్ అనేది అభ్యర్థనకు సంబంధించిన విషయం. ఒక కొనుగోలుని పూర్తి చేయడానికి ముందు దాని ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించిన మరిన్ని వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/పాలసీ షరతులు మరియు నిబంధలను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి