రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
medical insurance coverage for ambulance charges
30 మార్చి, 2023

అంబులెన్స్ ఛార్జీల కోసం మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్

జీవితంలోకి వచ్చే అనేకమంది అప్రియమైన అతిథులు లాగానే, వైద్య అత్యవసర పరిస్థితులనేవి కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రముఖంగా రావచ్చు. వైద్య అత్యవసర పరిస్థితి సంభవించినప్పుడు, విభిన్న విషయాలతో మీరు తప్పనిసరిగా వ్యవహరించాల్సి ఉంటుంది. మంచి హాస్పిటల్‌లో బెడ్ పొందడం, మీకు ఇష్టమైన వైద్యుడి సేవలు అందుకోవడం మరియు తక్కువ అడ్మిషన్ ఛార్జీల లాంటివి వీటిలో కొన్ని మాత్రమే. అయితే, రోగిని ఆసుపత్రికి తీసుకువెళ్లడం కోసం ఒక అంబులెన్స్‌ను రప్పించడమనేది ఎల్లప్పుడూ ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది. చాలావరకు అంబులెన్స్‌లు ప్రైవేట్‌ సంస్థలకు చెందినవిగా ఉంటాయి కాబట్టి, వాటి ఛార్జీలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి, ‘‌ఇన్సూరెన్స్ అనేది అంబులెన్స్ ఫీజును కవర్ చేస్తుందా?', అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ముందు అంబులెన్స్ ఛార్జీల కోసం వ్యక్తిగత లేదా ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తుందో లేదో తెలుసుకోవడం ముఖ్యం. దాని గురించిన సమాచారం ఇక్కడ ఇవ్వబడింది.

భారతదేశంలో అంబులెన్సుల రకాలు

భారతదేశంలో మీకు విభిన్న రకాల అంబులెన్స్‌లు అందుబాటులో ఉంటాయి. అవి:
  1. నేల మీద- ప్రయాణించే అంబులెన్స్

అత్యంత సాధారణ రకం అంబులెన్స్‌గా నేల మీద ప్రయాణించే అంబులెన్సును పేర్కొంటారు. భారతదేశంలో, రోడ్డు మీద ప్రయాణించే అంబులెన్సులను వివిధ సైజుల్లో చూడవచ్చు. ఈ అంబులెన్సుల్లో చాలావరకు ప్రైవేట్‌గా యాజమాన్యంలో ఉంటాయి లేదా కొన్ని హాస్పిటల్స్ ద్వారా నిర్వహించబడుతుంటాయి. నిజానికి, చాలా అంబులెన్సులనేవి ప్రయాణీకుల వాహనాలను అంబులెన్స్‌గా మార్చిన రకానికి చెందినవిగానే ఉంటాయి.
  1. నీటి మీద ప్రయాణించే అంబులెన్స్

ఈ రకమైన అంబులెన్స్‌ను నిర్వహించడానికి మరియు తరలించడానికి సులభంగా ఉండేలా, సాధారణంగా చిన్న టగ్‌బోట్‌ల మీద రూపొందిస్తుంటారు. నీటి మీద ప్రయాణించే అంబులెన్సులనేవి ప్రతిచోటా అందుబాటులో ఉండవు మరియు ఎక్కువగా మారుమూల ప్రదేశాల్లో (రోడ్డు మార్గం తక్కువగా అందుబాటులో మరియు వరద ముప్పుకు గురయ్యే అవకాశం ఉంండే ప్రదేశాల్లో) నిర్వహించబడుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో, బోటు అంబులెన్సులు ఉపయుక్తంగా ఉండొచ్చు. ఈ అంబులెన్సులనేవి ప్రభుత్వాలు లేదా ఎన్‌జిఓల ద్వారా అందించబడుతాయి.
  1. వాయు మార్గంలో ప్రయాణంచే అంబులెన్స్

వాయు మార్గంలో ప్రయాణించే అంబులెన్సులను సాధారణంగా విమానాలకు మార్పులు చేయడం ద్వారా అంబులెన్సుగా మార్చినవై ఉంటాయి. ఇవి ప్రభుత్వ సంస్థల ద్వారా నిర్వహించబడుతాయి. అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్ అంబులెన్సులు ఉపయోగించబడుతాయి. భూకంపం లేదా వరద లేదా ఏదైనా ఇతర వైపరీత్యం కారణంగా ప్రభావితమైన ప్రాంతంలోని ప్రజలకు తక్షణ వైద్య సహాయం అందించడం కోసం వీటిని ఉపయోగిస్తుంటారు. తక్షణ చికిత్స మరియు సమీప ప్రదేశానికి తరలింపు కోసం హెలికాప్టర్లు కూడా ఉపయోగిస్తుంటారు. పరిస్థితి తీవ్రతను బట్టి, ఎయిర్ అంబులెన్సులను తరచుగా విదేశీ ప్రదేశాలకు కూడా పంపుతుంటారు.

అంబులెన్సుల్లో అందించబడే సేవలు

అంబులెన్స్‌లో సేవల లభ్యత అనేది మీరు ఎంచుకున్న అంబులెన్స్ రకం మీద ఆధారపడి ఉంటుంది:
  1. ప్రాథమిక అంబులెన్స్

ప్రాథమిక అంబులెన్స్‌లో, హార్ట్‌బీట్, పల్స్ మరియు బ్లడ్ ప్రెజర్‌ను తనిఖీ చేయడానికి మానిటర్ లాంటి ప్రాథమిక సేవలు మీకు అందించబడుతాయి. రోగికి శ్వాస సమస్యలు ఉన్నట్లయితే, సెలైన్ స్టాండ్ మరియు ఆక్సిజన్ సిలిండర్ మరియు మాస్క్ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి.
  1. అధునాతన అంబులెన్స్

ప్రాథమిక అంబులెన్సులతో పోలిస్తే, అధునాతన అంబులెన్సులు సైజులో పెద్దవిగా ఉంటాయి. ప్రాథమిక అంబులెన్సులతో పోలిస్తే, వీటిలో మరిన్ని సేవలు అందించే సౌకర్యం ఉంటుంది. రోగి క్లిష్టమైన పరిస్థితిలో ఉంటే, తక్షణ సహాయం అందించడానికి ఇందులో వైద్యుడు కూడా ఉంటారు. సెలైన్ మరియు ఐవి సరఫరాలు మరియు మానిటర్లతో పాటు, అధునాతన అంబులెన్సుల్లో డిఫిబ్రిలేటర్లు మరియు నెబులైజర్లు కూడా ఉంటాయి.
  1. నియో-నేటల్ అంబులెన్స్

పేరుకు తగ్గట్టుగానే, ఇంటెన్సివ్ నియో-నేటల్ కేర్ అవసరమైన శిశువుల కోసం ఈ రకం అంబులెన్స్ ఉపయోగించబడుతుంది. నెలలు నిండకుండానే పుట్టిన లేదా పుట్టిన తర్వాత సమస్యలు ఎదుర్కొంటున్న శిశువులకు నియో-నేటల్ కేర్ అవసరం. ఈ అంబులెన్సుల్లో శిశువులను రికవరీ కోసం ఉంచే ఇంకుబేటర్లు ఉంటాయి.

ఇన్సూరెన్స్ అనేది అంబులెన్స్ ఫీజును కవర్ చేస్తుందా?

హాస్పిటల్‌లో చేర్చాల్సిన వయో వృద్ధులు ఎవరైనా మీ కుటుంబంలో ఉంటే మరియు వారు సీనియర్ సిటిజన్ల కోసం హెల్త్ ఇన్సూరెన్స్‌ ‌ద్వారా కవర్ చేయబడి ఉంటే, అంబులెన్స్ ఖర్చు డిఫాల్ట్‌గా కవర్ చేయబడుతుందని మీరు భావించవచ్చు. కానీ, ఇది ఒక తప్పు భావన అని చాలామందికి తెలియకపోవచ్చు. చాలా ఇన్సూరెన్స్ సంస్థలు అదనపు కవర్ రూపంలో మాత్రమే అంబులెన్స్ ఫీజుల కవర్ చేసే వీలు కల్పిస్తాయి. వీటిని సాధారణంగా అంబులెన్స్ కవర్‌గా విక్రయిస్తారు. ఇందులో ఒక నిర్దిష్ట పరిమితి వరకు అంబులెన్స్ ఫీజును కవర్ చేయడానికి ఇన్సూరర్ అంగీకరిస్తారు. * ఉదాహరణకు, మీ కుటుంబంలోని ఒకరిని తక్షణం హాస్పిటల్‌కు తీసుకెళ్లాల్సిన పరిస్థితిని ఊహించండి. మీరు ఒక అంబులెన్స్ కోసం కాల్ చేశారు. అంబులెన్స్ ఖర్చు రూ.3000. పాలసీలోని అంబులెన్స్ కవర్ అనేది రూ. 5000 వరకు అంబులెన్స్ కవరేజీ అందిస్తే, ఆ ఫీజులు మొత్తంగా కవర్ చేయబడుతాయి. అయితే, అంబులెన్స్ ఫీజు అనేది ఆమోదిత పరిమితిని మించితే, మీరు మీ జేబు నుండి చెల్లించాల్సి ఉంటుంది. * కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు అంబులెన్స్ ఫీజుల కవరేజీ కోసం ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తంలోనే కొంత శాతం కేటాయిస్తారు. ఈ నిబంధన కలిగి ఉండడమనేది ఇన్సూరర్ నుండి ఇన్సూరర్‌కు మారవచ్చు. అంబులెన్స్ ఫీజు అనేది ఆమోదిత పరిమితిలోనే ఉంటే, మీరు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే, ఫీజు అనేది ఆ పరిమితిని మించిపోతే, మీరు మీ జేబు నుండి చెల్లించాల్సి రావచ్చు. *

మీరు కవర్ కొనుగోలు చేయాలా?

ఒక వైద్య అత్యవసర పరిస్థితిలో, మీరు ఒక క్లెయిమ్ ఫైల్ చేయడానికి మరియు పరిహారం పొందడానికి ముందు మీరు కవర్ చేయాల్సిన వివిధ ఖర్చులు ఉన్నాయి. ఈ ఖర్చులకు అంబులెన్స్ ఫీజులు కూడా తోడైతే, మీ పొదుపులు మరింతగా ఖర్చు చేయాల్సి వస్తుంది. బదులుగా, మీరు కనీస ఖర్చుతో మీ పాలసీకి కవర్‌ను జోడించవచ్చు మరియు అంబులెన్స్ ఖర్చు అనేది ఆ పాలసీ ద్వారా కవర్ చేయబడుతుంది కాబట్టి మీరు మనశ్శాంతిగా ఉండొచ్చు. *

ముగింపు

అంబులెన్స్ ఫీజుల కోసం ప్రతి ఇన్సూరెన్స్ సంస్థ డిఫాల్ట్ కవరేజీ అందించకపోయినప్పటికీ, భారతదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్, ‌లో అంబులెన్స్ కవర్‌ను ఎంచుకోవడం ద్వారా మీరు పొదుపు చేసిన డబ్బు మొత్తం ఇతర అత్యవసర పరిస్థితుల కోసం ఖర్చు చేయగలుగుతారు. దీని గురించి మరింత తెలుసుకోవడానికి మరియు మెరుగైన కవరేజీ పొందడానికి మీ పాలసీలో మీరు చేర్చగల వివిధ యాడ్-ఆన్‌లు గురించి మరింత తెలుసుకోవడానికి ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్‌ను సంప్రదించండి. * ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి