రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
‘Pro-Fit’: A Wellness Platform by Bajaj Allianz
ఆగస్టు 30, 2018

బజాజ్ అలియంజ్ వెల్‌నెస్ ప్లాట్‌ఫామ్ 'ప్రో-ఫిట్' గురించిన పూర్తి వివరాలు

ప్రఖ్యాత చరిత్రకారుడు అయిన థామస్ ఫుల్లర్ ఇలా చెప్పారు, “అనారోగ్యం కలిగే వరకు ఆరోగ్యం విలువ తెలియదు.నేడు కూడా, అనేక అనిశ్చితి పరిస్థితులు ఉన్న ప్రపంచంలో, ప్రజలు తమ ఆరోగ్యాన్ని లేదా వాటికి సంబంధించిన ఖర్చులకు తగిన ప్రాధ్యాన్యతను ఇవ్వరు. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వద్ద మేము 'ప్రో-ఫిట్' అనే ఒక ప్రత్యేకమైన వెల్‌నెస్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాము, ఇది మీ ఆరోగ్యం మరియు వెల్‌నెస్ అవసరాలు అన్నింటికీ ఒక వన్ స్టాప్ పరిష్కారం. ప్రో-ఫిట్ అంటే ఏమిటి? ప్రో-ఫిట్ అనేది మా కస్టమర్లను ఆరోగ్యంగా మరియు ఫిట్‌గా ఉండడానికి ప్రోత్సహించే లక్ష్యంతో బజాజ్ అలియంజ్ అందిస్తున్న ఒక ఆన్‌లైన్ పోర్టల్. ఇది ఒక క్లౌడ్-ఆధారిత ప్లాట్‌ఫామ్, ఇది మా కస్టమర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు వారి ఆరోగ్య రికార్డులను ట్రాక్ చేయడానికి మరియు దానిని మెరుగుపరిచేందుకు కృషి చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ పోర్టల్ ప్రారంభం గురించి బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండి మరియు సిఇఒ అయిన తపన్ సింఘేల్ మాట్లాడుతూ ఇలా అన్నారు, “మా కంపెనీలో మేము కస్టమర్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తాము మరియు వారిని నిరంతరం సంప్రదిస్తాము. ఇన్సూరెన్స్‌కి మించి మరింత విలువను అందించడమే ఇటువంటి వినూత్న ప్రోడక్టులను మరియు సేవలను అందించడం వెనుక ఉన్న ఉద్దేశం. నేడు ప్రజలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు మరియు ప్రాసెస్ ఆటోమేషన్ మరియు ఒక క్లిక్‌లో సేవలను కోరుకుంటున్నారు. సమగ్రమైన వెల్‌నెస్ విధానము మరియు ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించే వివిధ ఫీచర్లతో ప్రో-ఫిట్ ఈ అవసరాన్ని తీరుస్తుంది.” ప్రో-ఫిట్ యొక్క ఫీచర్లు ఏమిటి? ప్రో-ఫిట్ ఈ క్రింది ముఖ్యమైన ఫీచర్లను అందిస్తుంది:
  1. హెల్త్ రిస్క్ అసెస్‌మెంట్ – ఈ ఫీచర్ మీరు కొన్ని ఆరోగ్య సంబంధిత ప్రశ్నలకు అందించే సమాధానాల ఆధారంగా మీకు స్కోర్ అందిస్తుంది. ఈ ప్రశ్నలు సాధారణంగా వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం మరియు వృత్తిపరమైన ఆరోగ్యం వంటి అంశాలను కవర్ చేస్తాయి.
  2. ఆరోగ్య ఆర్టికల్స్ – ఆన్‌లైన్ పోర్టల్ యొక్క ఈ ఫీచర్ మీకు అనేక ఫిట్‌నెస్ మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి సంబంధిత ఆర్టికల్స్‌కు యాక్సెస్ ఇస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా తాజా ఆరోగ్య ట్రెండ్ల గురించి కూడా మీకు తెలియజేస్తుంది.
  3. స్టోర్ రికార్డులు – ఈ ఫీచర్ మీ హెల్త్ రికార్డుల డిజిటల్ కాపీని నిర్వహించడానికి మీకు వీలు కల్పిస్తుంది. మీరు కేవలం డాక్యుమెంట్లను పిడిఎఫ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఈ రికార్డులను ఎక్కడినుండైనా, ఎప్పుడైనా యాక్సెస్ చేయవచ్చు, ఆ విధంగా డాక్యుమెంట్ల హార్డ్-కాపీని నిర్వహించవలసిన ఇబ్బంది తప్పుతుంది.
  4. పారామితులను ట్రాక్ చేయండి – మీ కిడ్నీ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్, లివర్ ప్రొఫైల్ మరియు ఇటువంటి మరెన్నో ఆరోగ్య పారామితులను ట్రాక్ చేయడంలో మీకు సహాయపడటానికి మీరు ప్రో-ఫిట్‌ను ఉపయోగించవచ్చు. ఈ పారామితులను ట్రాక్ చేస్తున్నప్పుడు, ఏదైనా అసాధారణంగా కనిపిస్తే, ప్రో-ఫిట్ పర్సనలైజ్డ్ రిపోర్టులను జనరేట్ చేస్తుంది.
  5. ఫిట్‌నెస్ ట్రాకర్ – ఈ ఫీచర్ మీరు వేసిన అడుగుల సంఖ్యను ట్రాక్ చేస్తుంది మరియు మీ ఫిట్‌నెస్ గురించి ప్రతివారం స్టేటస్ అప్‌డేట్ చేస్తుంది. ఈ ట్రాకర్ Android ఫోన్లలో Google Fit కి మరియు iOS లో Health Kit కి కనెక్ట్ అయి ఉంటుంది.
  6. డాక్టర్‌తో చాట్ చేయండి – సర్టిఫై చేయబడిన మరియు రిజిస్టర్ చేయబడిన డాక్టర్ల నుండి అన్ని సాధారణ వైద్య ప్రశ్నలకు మీరు ఆన్‌లైన్ సహాయం పొందవచ్చు.
  7. వ్యాక్సినేషన్ రిమైండర్ – ఈ ఫీచర్ మీకు నోటిఫికేషన్లను పంపుతుంది, వ్యాక్సినేషన్ పొందడానికి చివరి తేదీ మరియు మీ డాక్టర్‌తో మీకు ఉన్న అపాయింట్‌మెంట్ల గురించి రిమైండర్లను సెట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
  8. కుటుంబ ఆరోగ్యం – సమాచారాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచుతూ ఈ ఫీచర్ మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని మరియు మీ కుటుంబ డాక్టర్ వివరాలను నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
  9. పాలసీ నిర్వహణ – ఈ ఫీచర్ మీ పాలసీ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను ఒకే చోట స్టోర్ చేయడానికి మీకు సహాయపడుతుంది, ఆ విధంగా వాటిని మీ సౌలభ్యం కోసం అందుబాటులో ఉంచుతుంది.
ప్రో-ఫిట్‌ను ఎవరు ఉపయోగించవచ్చు? మా వద్ద పాలసీ ఉన్నా లేకపోయినా, ఈ పోర్టల్‌ని ఎవరైనా ఉపయోగించవచ్చు. మీరు ప్రో-ఫిట్‌ను ఎలా యాక్సెస్ చేయగలరు? ఆరోగ్య సంరక్షణ సేవలను పొందేటప్పుడు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అవసరం అయిన సమయాల్లో మీకు సహాయం అందించే అనేక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ గురించి తెలుసుకోవడానికి మరియు వాటిని కొనుగోలు చేయడానికి మా వెబ్‌సైట్‌ని సందర్శించండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి