• search-icon
  • hamburger-icon

హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు ఆన్‌లైన్ వర్సెస్ ఏజెంట్, ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి

  • Health Blog

  • 25 ఫిబ్రవరి 2019

  • 256 Viewed

ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, మీలో చాలా మంది ఎదుర్కొనే అత్యంత కఠినమైన ప్రశ్నల్లో ఇది ఒకటి. మీరు సమీపంలోని ఇన్సూరెన్స్ కంపెనీ బ్రాంచ్ ఆఫీసును సందర్శించి ఒక ఏజెంట్ సహాయంతో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయవచ్చు లేదా ఇన్సూరెన్స్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కూడా పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేయడానికి తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు ఆన్‌లైన్‌లో వివిధ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల రకాలు గురించి బ్రౌజ్ చేయడం వృత్తి నిపుణులకు చాలా సులభం. మరోవైపు, ఆఫ్‌లైన్‌‌లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు అంటే, ఒక ఏజెంట్ సహాయంతో పాలసీని కొనుగోలు చేయడం అనేది ఇన్సూరెన్స్ కంపెనీ మరియు పాలసీహోల్డర్ మధ్య ప్రత్యేక బంధాన్ని ఏర్పరుస్తుంది. అయితే, పాలసీని కొనుగోలు చేసే అన్ని విధానాలు కూడా సారూప్య ప్రీమియం రేట్లతో సమానమైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు అందిస్తుండగా, మీకు ఏ విధానం బాగా సరిపోతుందో ఎంచుకోవడం అనేది మీ సౌలభ్యం మేరకు ఉంటుంది. ఆన్‌లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

  • ఈ రోజుల్లో క్షణం తీరికలేని, మన ఉరుకుల పరుగుల జీవితాలను పరిగణనలోకి తీసుకుంటే, ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
  • ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం వలన, విభిన్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు అందించే ఫీచర్లు, ప్రయోజనాలు, కవరేజీలు మరియు ప్రీమియం రేట్లను బట్టి వేర్వేరు ప్లాన్లను సరిపోల్చవచ్చు.
  • ఆన్‌లైన్ చెల్లింపు విధానాలు, ప్రీమియం అమౌంటును త్వరగా మరియు పారదర్శకంగా చెల్లించేలా చేస్తాయి.
  • The process of buying ఆన్‌లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు విధానం చాలా సులభం.
  • మీరు చేసిన చెల్లింపును ఇన్సూరర్ అందుకున్న వెంటనే, పాలసీ డాక్యుమెంట్ సాఫ్ట్ కాపీ మీకు జారీ చేయబడుతుంది.

ఏజెంట్ సహాయంతో హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

  • ఏజెంట్ రూపంలో మీ పాలసీ చెల్లుబాటు వరకు మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు సంబంధించిన ఏవైనా సమస్యల కోసం మీరు గైడ్ పొందుతారు.
  • An agent is a trustworthy person, who can help you not only while purchasing the policy but also while making హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిములు.
  • ఏజెంట్ మీకు మరియు మీ ఇన్సూరర్‌కు మధ్య ఒక సమాచార కర్తగా పనిచేస్తారు, ఆవిధంగా మీరు ఇన్సూరెన్స్ పాలసీ కోసం ఎలాంటి సాంకేతికతలతో వ్యవహరించాల్సిన అవసరం లేదు.

ముగింపు చివరగా, హెల్త్ కేర్ సర్వీసులకు సంబంధించిన ఖర్చులు క్రమంగా పెరుగున్న నేటి అనిశ్చిత ప్రపంచంలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం తప్పనిసరి. కాబట్టి, మీరు మీకు తగిన విధంగా సరిపోయే పాలసీని ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడం లేదా ఆఫ్‌లైన్ విధానంలో వారి ఏజెంట్ సహాయంతో కొనుగోలు చేయడం అనేది మీకు సౌలభ్యం మేరకు ఉంటుంది. మీరు మా వెబ్‌సైట్‌లోని ఉత్తమ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను చెక్ చేయవచ్చు మరియు సరసమైన ప్రీమియం రేట్లతో మీ అవసరాలకు సరిపోయే ఒక దానిని కొనుగోలు చేయవచ్చు.

Go Digital

Download Caringly Yours App!

  • appstore
  • playstore
godigi-bg-img