రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Day Care Procedures List, Benefits In Health Insurance
జూలై 21, 2020

డే కేర్ విధానాల జాబితా, ప్రయోజనాలు మరియు మినహాయింపులు

టెక్నాలజీ అభివృద్ధితో నేడు అనేక సర్జరీలు (సాధారణమైనవి మరియు సంక్లిష్టమైనవి) ఒకే రోజులో విజయవంతంగా పూర్తి చేయబడుతున్నాయి మరియు రోగులు 24 గంటల్లోపు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయబడుతున్నారు. అయితే, మీరు 24 గంటల కంటే ఎక్కువ సమయం ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేని ఇలాంటి వైద్య విధానాలను డే కేర్ విధానాలు అంటారు.

సాధారణంగా ఈ కింది విధానాలు డే కేర్ విధానాల వర్గంలోకి వస్తాయి:

 • కంటిశుక్లం
 • రేడియోథెరపీ
 • కీమోథెరపీ
 • సెప్టోప్లాస్టీ
 • డయాలిసిస్
 • యాంజియోగ్రఫీ
 • టాన్సిలెక్టమీ
 • లిథోట్రిప్సీ
 • హైడ్రోసెల్
 • పైల్స్ / ఫిస్టులా
 • ప్రోస్టేట్
 • సైనసైటిస్
 • లివర్ ఆస్పిరేషన్
 • కొలొనోస్కోపీ
 • అపెండెక్టమీ

మా కస్టమర్లకు అత్యుత్తమ స్థాయి సేవలను అందించడానికి, మేము బజాజ్ అలియంజ్ ద్వారా మా విభిన్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లతో అనేక డే కేర్ విధానాల కోసం కవరేజీని అందిస్తాము.

డే కేర్ విధానాల గురించిన ఒక పెద్ద అపోహ ఏమిటంటే, అవి మీ వీటి పరిధిలోకి రావు:‌ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ . మీలో చాలా మంది మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ దీర్ఘకాలిక హాస్పిటలైజేషన్‌ను మాత్రమే కవర్ చేస్తుందని నమ్ముతారు. కానీ, ఇది ప్రతి సందర్భానికి వర్తించదు. వైద్య విధానాల్లో అభివృద్ధితో చికిత్స సమయం గణనీయంగా తగ్గింది. అందువల్ల, హెల్త్ ఇన్సూరెన్ పాలసీలు కూడా ఈ స్వల్పకాలిక హాస్పిటలైజెషన్ విధానాలను కూడా పాలసీలో చేర్చడాన్ని అలవరచుకున్నాయి.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలలో డే కేర్ విధానాలను చేర్చడం వలన కలిగే ప్రయోజనాలు

హెల్త్ ఇన్సూరెన్స్‌లో చేర్చబడిన డే కేర్ విధానాల ప్రయోజనాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

 • మనశ్శాంతి: ఒక్కరోజు కూడా హాస్పిటల్‌లో అడ్మిట్ కావడం అనేది ఒత్తిడికి గురిచేస్తుంది. దీనికి అదనంగా భారీ చికిత్స ఖర్చులు కూడా తోడవుతాయి. అయితే, ఇన్సూరెన్స్ కంపెనీ మీ డే కేర్ ఖర్చులను కవర్ చేస్తుందని తెలుసుకోవడం వల్ల ఈ ఒత్తిడి నుండి మీకు ఉపశమనం కలుగుతుంది మరియు మీకు అవసరమైన మనశ్శాంతి కూడా లభిస్తుంది.
 • నగదురహిత సేవ: మీరు లేదా మీ కుటుంబ సభ్యులు చేయించుకోబోయే సర్జరీ (డే కేర్ విధానం) గురించి మీకు ముందుగా తెలిస్తే, మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించండి మరియు మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో జాబితా చేయబడిన డే కేర్ విధానాల కోసం నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్  క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రయోజనాన్ని పొందవచ్చు.
 • పన్ను ఆదా ప్రయోజనం: భారతదేశంలో పాలసీ ప్రీమియం చెల్లించినందుకు గాను ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80D కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. కావున, డే కేర్ విధానాల కోసం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కవర్ చేసే పాలసీ మీకు అదనపు పన్ను ఆదా ప్రయోజనాన్ని అందిస్తుంది.
 • ఉత్తమ వైద్య సంరక్షణ: మీరు నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో డే కేర్ విధానాల కోసం చికిత్స పొందవచ్చు, ఇక్కడ నగదురహిత సేవ యొక్క అదనపు ప్రయోజనంతో పాటు మీరు ఉత్తమ వైద్య సంరక్షణను పొందుతారు. హాస్పిటలైజెషన్ సమయం తక్కువ అయినా సరే, నెట్‌వర్క్ హాస్పిటల్‌లో చికిత్స అనేది మీకు, మీ కుటుంబ సభ్యులకు నాణ్యమైన చికిత్సను నిర్ధారిస్తుంది.
 • హెల్త్ సిడిసి ప్రయోజనం: హెల్త్ సిడిసి (క్లిక్ చేయండి నేరుగా క్లెయిమ్ చేసుకోండి) అనేది మా ఇన్సూరెన్స్ వాలెట్ యాప్‌లో బజాజ్ అలియంజ్ అందించే ఒక ప్రత్యేక ఫీచర్, ఇది రూ. 20,000 వరకు తక్షణ మరియు సౌకర్యవంతమైన క్లెయిమ్ సెటిల్‌‌మెంట్ కోసం మిమ్మల్ని అనుమతిస్తుంది.

డే కేర్ విధానాల మినహాయింపులు

డెంటల్ క్లీన్-అప్ లాంటి ఓపిడి (అవుట్-పేషెంట్ డిపార్ట్‌మెంట్) చికిత్సలు డే కేర్ విధానాల కింద కవర్ చేయబడవు మరియు మీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ దాని కోసం మీకు రీయింబర్స్ కూడా ఇవ్వదు. అనేక ప్లాన్లు డే కేర్ విధానాలను కవర్ చేస్తాయి కానీ, ఓపిడిని కవర్ చేయవు. కాబట్టి, మీరు కవర్ చేయబడని చికిత్సల కోసం క్లెయిమ్‌లను ఫైల్ చేయరని నిర్ధారించుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలలో మినహాయింపులు జాబితాను గురించి వివరంగా తెలుసుకోండి.

మీరు పాలసీ నిబంధనలను జాగ్రత్తగా చదవాలని మరియు మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏ డే కేర్ విధానాలు కవర్ చేయబడతాయో వివరంగా తెలుసుకోవాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. దయచేసి, మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీతో డే కేర్ విధానాల కోసం క్లెయిమ్‌ ఫైల్ చేసేటప్పుడు, మీకు ఏ ఇబ్బంది కలగకుండా ఉండటానికి, పాలసీకి సంబంధించిన చేర్పులు, మినహాయింపుల గురించి ఇన్సూరెన్స్ కంపెనీతో చర్చించండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 1.1 / 5. ఓట్ల లెక్కింపు: 53

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

 • Dai software - మార్చి 25, 2021 10:33 pm కి

  దీని గురించి ధైర్యంగా మాట్లాడినందుకు ధన్యవాదాలు, నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను, ఇది నాకు చాలా ఉఫయోగపడే పోస్ట్. ధన్యవాదాలు.

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి