వస్తుసేవల పన్ను జిఎస్‌టి అనేది ప్రోడక్టులు మరియు సేవలపై బహుళ పన్ను విధానాల వలన పడే పర్యవసాన ప్రభావాలను తొలగించింది. ఇన్సూరెన్స్ రంగం కూడా జిఎస్‌టి ద్వారా ప్రభావితం అయింది. ఈ రంగంలో 3% పెరుగుదల జరిగింది. పర్సనల్ ఫైనాన్సుల పై దాని ప్రభావం పడింది, కానీ అది స్వల్పంగా ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ పై జిఎస్‌టి ప్రభావం ఎలా ఉంటుంది, జిఎస్‌టి రెట్లు ప్రీమియంల పై ఎలా ప్రభావం చూపుతాయి మరియు జిఎస్‌టి వలన మెడికల్ ఇన్సూరెన్స్ రెన్యువల్ పై ప్రభావం గురించి తెలుసుకుందాం.
జిఎస్‌టి మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎలా ప్రభావితం చేస్తుంది?
ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతూ, జిఎస్‌టి గతంలో విధించిన సేవా పన్ను రేట్ల కారణంగా ఇన్సూరెన్స్ స్కీమ్‌లను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలు మరియు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు రెండింటి పై 18% జిఎస్‌టి విధించబడుతుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ పై జిఎస్‌టి లో ప్రీమియం రేట్లను ప్రభావితం చేసే సేవా పన్నును కలిగి ఉంటుంది (కథనంలో తరువాత చర్చించబడింది).
జిఎస్‌టి తో ప్రీమియంలు
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తం పూర్తిగా జిఎస్‌టి పరిధిలోకి వస్తుంది. అయితే, లైఫ్ ఇన్సూరెన్స్ విషయంలో ప్రీమియం యొక్క రిస్క్ కవరేజ్ విభాగానికి మాత్రమే జిఎస్‌టి వర్తిస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల విషయంలో, మెచ్యూరిటీ ప్రయోజనాలకు దారితీసే పెట్టుబడి విభాగం జిఎస్‌టి పరిధిలోకి రాదు. ఉదాహరణకు, రూ. 10,000 ప్రీమియంతో రూ. 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కవరేజ్ ఈ కింది విధంగా ప్రభావితం అవుతుంది: జిఎస్‌టి అమలుకి మునుపు ప్రీమియంపై 15% పన్ను విధించబడేది. ఆ విధంగా, రూ. 5 లక్షల కోసం వర్తించే పూర్తి ప్రీమియం రూ. 10,000లో 15% గా ఉంటుంది మరియు ఇది రూ.1,500 కు సమానం, పూర్తి మొత్తం రూ. 11,500 అవుతుంది. జిఎస్‌టి అమలులోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం వర్తించే పన్ను 18%. కావున, రూ. 10,000 ప్రీమియం పై 18% గా లెక్కించబడుతుంది, పూర్తి మొత్తం రూ. 11,800 అవుతుంది. మునుపటి పన్ను వ్యవస్థతో పోలిస్తే, సాంకేతికంగా జిఎస్‌టి వలన ప్రీమియంలు ఎక్కువగా ఉంటాయి. అయితే, జిఎస్‌టి అమలుకు మునుపు దీర్ఘకాలిక పాలసీలను కొనుగోలు చేసినవారికి ఒక మినహాయింపు ఉంది. జిఎస్‌టి ప్రభావం వారి పై ఉండదు. అయితే, రెన్యూవల్ సమయంలో ప్రీమియం పై 18% జిఎస్‌టి వసూలు చేయబడుతుంది.
హెల్త్ ఇన్సూరెన్స్‌పై జిఎస్‌టి లాభాలు మరియు నష్టాలు
మెడికల్ ఇన్సూరెన్స్ పై జిఎస్‌టి యొక్క సానుకూల ప్రభావం అనేది సరసమైన ప్రీమియంలతో కూడిన ఇన్సూరెన్స్ పాలసీలకు దారితీసింది. ఆరోగ్య సంరక్షణ ఖర్చులు క్రమంగా పెరుగుతున్నందున దీనిని ఒక వరం అని చెప్పుకోవచ్చు, ఎందుకనగా, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలతో ప్రజలపై ఉన్న ఆర్థిక భారాన్ని కొంత మేరకు తగ్గించవచ్చు. ఈ రోజుల్లో, సరసమైన ప్రీమియంలు మార్కెట్లో చాలా సందర్భోచితంగా ఉన్నాయి, ప్రజలు ఇంతకు ముందు కన్నా నేడు హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే, హెల్త్ ఇన్సూరెన్స్ పై జిఎస్‌టి యొక్క ప్రతికూల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే, వర్తించే పన్ను రేట్లపై అదనపు ఛార్జీలు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ అందుబాటులో లేకపోవడానికి దారితీసాయి. గ్రూప్ పాలసీలను కలిగి ఉన్న పాలసీహోల్డర్లకు కూడా ఇదే పరిస్థితి. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఇండివిడ్యువల్స్ కోసం లేదా గ్రూప్ పాలసీహోల్డర్ల కోసం అందుబాటులో లేదు.
పన్ను మినహాయింపులపై జిఎస్టి ప్రభావం
జిఎస్‌టి వ్యవస్థ కింద ఇన్సూరెన్స్ ఒక సేవగా పరిగణించబడుతుంది. గ్రూప్ పాలసీహోల్డర్లకు పన్ను ప్రయోజనాలు ఇకపై అందుబాటులో ఉండవు. గతంలో 15% గా ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఇప్పుడు 18% కి పెంచబడ్డాయి. యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు మరియు ఎండోమెంట్ ప్లాన్‌లలో పెట్టుబడి మొత్తం గతంలో తక్కువ రేటు సర్వీస్ టాక్స్‌కు లోబడి ఉండేది. ఉదాహరణకు, ప్రారంభ ప్రీమియం పై గతంలో 3.75% ఉన్న రాయితీ రేటు ఇప్పుడు 4.50% కి పెంచబడింది. రెన్యూవల్స్ విషయంలో మునుపటి రేటు 1.875% వసూలు చేయబడింది, ఇప్పుడు 2.25% కి పెరిగింది. గతంలో 15% గా ఉన్న యుఎల్ఐపి ఛార్జీలు ఇప్పుడు 18% కి పెంచబడ్డాయి. 1.5% సర్వీస్ టాక్స్ ఇప్పుడు 1.8% కి పెరిగింది. ఒక ఎండోమెంట్ ప్లాన్ అయినా లేదా ఒక యుఎల్ఐపి అయినా ప్రస్తుతం ఎటువంటి రాయితీ రేట్లు లేవు.
సెక్షన్ 80C మరియు 80D క్రింద పన్ను ఆదా
పాలసీహోల్డర్లు ఆదాయపు పన్ను చట్టం యొక్క సెక్షన్ 80C మరియు
సెక్షన్ 80D కింద మినహాయింపులు మరియు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C. దీని యొక్క సెక్షన్ 80C మరియు 80D ప్రకారం
ఆదాయపు పన్ను చట్టం, నిర్దిష్ట పన్ను చెల్లింపుదారులు నిర్దిష్ట ఇన్సూరెన్స్ పథకాల కోసం కంపెనీకి చెల్లించిన మొత్తం ప్రీమియం కోసం మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. మెడికల్ ఇన్సూరెన్స్ పై జిఎస్టి అనేది సేవ యొక్క వాస్తవ విలువతో పరోక్ష పన్నుగా విధించబడుతుంది. జిఎస్‌టి చట్టాల క్రింద వసూలు చేయబడే ఆ పూర్తి మొత్తాన్ని ప్రస్తుత నిబంధనల ప్రకారం మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు. ఉదాహరణకు, పాలసీ యొక్క ఇన్సూర్ చేయబడిన మొత్తం రూ. 10 లక్షలు. 30 సంవత్సరాల వయస్సులోని పాలసీహోల్డర్లు రూ. 7,000 పై 18% జిఎస్టితో రూ.7,000 ప్రాథమిక ప్రీమియం చెల్లిస్తారు, ఇది రూ.1260 కు సమానం. మొత్తం ప్రీమియం రూ. 8260 గా ఉంటుంది. అదే విధంగా, 50 ఏళ్ల వయస్సు గల ఒక వ్యక్తి రూ. 17,000 ప్రాథమిక ప్రీమియంతో అదే పాలసీని కొనుగోలు చేస్తాడు మరియు రూ.17000 పై 18% జిఎస్టి కలిపితే రూ. 20,060 అవుతుంది. ఈ రెండు సందర్భాల్లోనూ ప్రాథమిక ప్రీమియంల పై వర్తించే జిఎస్‌టి యొక్క అదనపు మొత్తాన్ని, సెక్షన్ 80D కింద పన్ను మినహాయింపు ప్రయోజనం కోసం క్లెయిమ్ చేయవచ్చు. కావున, రూ. 8,260 మరియు 20,060 ల ప్రీమియం మొత్తాన్ని సెక్షన్ 80D కింద మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు. అయితే, పెట్టుబడి పరిమితి యొక్క ఉనికి నిర్దిష్ట సెక్షన్ కింద పన్ను-పొదుపు మినహాయింపు మొత్తాన్ని నిర్ణయిస్తుంది.
సారాంశం
చెల్లింపు విధానంతో సంబంధం లేకుండా అడ్వాన్స్ ప్రీమియంలు మరియు ఆన్-డేట్ ప్రీమియంలు ఈ రెండింటి పై జిఎస్‌టి వసూలు చేయబడుతుంది. జిఎస్‌టి అమలు వివిధ పాలసీల అభివృద్ధికి దారితీసింది, ఇది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రతి వర్గానికి చెందిన ప్రజలకు అందుబాటులో ఉండేలా చేసింది. జిఎస్‌టి రిఫండ్ సంబంధిత ఫిర్యాదుల కోసం, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల పై జిఎస్‌టి చెల్లించే వ్యక్తులు జిఎస్‌టి పై రిఫండ్‌ను క్లెయిమ్ చేయలేరు. ప్రొవైడర్ అందించే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం షీట్‌లో జిఎస్‌టి వివరాలను చూడవచ్చు. మార్చబడిన పన్ను విధానంలోని రిస్కులు మరియు ప్రయోజనాలు అదనపు నిబంధనలతో వస్తాయి. దీర్ఘ కాలం కోసం ఒక మంచి పాలసీని ఎంచుకోవడానికి పాలసీహోల్డర్లు అవధి, క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి, మరియు ప్రక్రియతో పాటు ప్రీమియంలను కూడా చెక్ చేయాలి.
రిప్లై ఇవ్వండి