సూచించబడినవి
Health Blog
06 నవంబర్ 2024
115 Viewed
Contents
దాంపత్య జీవితంలో తల్లిదండ్రులు అవ్వడం అనేది చాలా ముఖ్యమైన దశ. ఇది భార్యాభర్త అనే అనుబంధం నుండి తల్లిదండ్రులు అనే ఒక కొత్త గుర్తింపుతో మరో ప్రపంచానికి తెరతీస్తుంది. ఇది సవాలుతో కూడుకున్నది కూడా. అంతేకాకుండా, గర్భధారణ దశలో తల్లులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
మనం సాధారణంగా గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలను గురించి వింటుంటాము, అయితే, అవి మహిళలు అందరిలో ఒకేలా ఉండవు. కొందరు మహిళలు ఇతరులతో పోలిస్తే భిన్నమైన సవాళ్లను ఎదుర్కొంటారు, మరికొందరు తీవ్రమైన సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి సమయంలోనే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పూర్తి రక్షణను అందిస్తుంది. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులను ఎదుర్కోవడానికి ఈ పాలసీలు ప్రత్యేకంగా, గర్భధారణ మరియు ప్రసవం సమయంలో కవరేజీని అందిస్తాయి.
ప్రసూతి కవర్‌తో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలలో నార్మల్ మరియు సిజేరియన్, ఈ రెండు రకాల ప్రసవ విధానాలు ఉంటాయి. మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో చేర్చబడిన ప్రసూతి కవర్ కల్పించే ప్రాథమిక ప్రయోజనం ప్రసవం సంబంధింత ఖర్చుల కవరేజ్ విషయానికి వస్తే అదనపు జేబు ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. ఈ ప్లాన్లు ముఖ్యంగా ప్రసవం మరియు ప్రసవానంతర సంరక్షణ సమయంలో తలెత్తే సమస్యల కోసం ఉపయోగపడతాయి. *ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
కాబోయే తల్లులకు నిరంతర సంరక్షణ అనగా ప్రసవం అయ్యే వరకు పూర్తి రక్షణ అవసరం. తల్లి మరియు బిడ్డ, ఇద్దరి ఆరోగ్యం మెరుగ్గా ఉందని నిర్థారించడానికి, కాలానుగుణ చెక్-అప్‌లు అవసరం. ఇలాంటి దశలో సిఫార్సు చేయబడే ఏవైనా ఔషదాలు, శిశు జననంతో ఆగిపోవు. అందువల్ల, ఒక ప్రసూతి ఆరోగ్య బీమా ప్రీ-మరియు పోస్ట్-నేటల్ కవరేజ్‌తో డెలివరీకి ముందు అలాగే తర్వాత ఈ అన్ని వైద్య ఖర్చులను జాగ్రత్తగా చూసుకోండి. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు డెలివరీకి 30 రోజుల ముందు అటువంటి ఖర్చులను కవర్ చేస్తాయి, అయితే ఇన్సూరెన్స్ కవర్ రకం ఆధారంగా 60 రోజుల వరకు.*
ప్రసవ సమయంలో చివరి నిమిషంలో సమస్యలు తలెత్తడం సర్వసాధారణం, కాబట్టి, మీరు నైపుణ్యం గల వైద్యులు, వైద్య సదుపాయానికి మాత్రమే ఎంచుకోవాలి. ఇలాంటి ఆకస్మిక పరిస్థితులను పరిష్కరించేందుకు ఆసుపత్రులు భారీ బిల్లులు వసూలు చేస్తాయి మరియు కుటుంబము కోసం హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్స్ లోని మెటర్నిటీ కవర్ అటువంటి ఖర్చులను కవర్ చేస్తుంది.*
ఒక మెటర్నిటీ ఇన్సూరెన్స్ కవర్ కింద నవజాత శిశువుకు సంబంధించి ఏవైనా పుట్టుకతో వచ్చే వ్యాధులు మరియు ఇతర సమస్యలు జననం నుండి 90 రోజుల వరకు కవర్ చేయబడతాయి.*
ఎంచుకున్న పాలసీ రకాన్ని బట్టి నవజాత శిశువుకు టీకా కోసం కూడా కవర్ అందుబాటులో ఉంటుంది. దీనిలో పోలియో, ధనుర్వాతం, డిఫ్తీరియా, కోరింత దగ్గు, తట్టు, హెపటైటిస్ మొదలైన వాటికి రోగనిరోధక టీకాలతో సహా, మొదటి సంవత్సరంలో శిశువుకు తప్పనిసరి అవసరమయ్యే అన్ని టీకాలు కవర్ చేయబడతాయి* *ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
మార్కెట్లో విస్తృతమైన మెటర్నిటీ ప్లాన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, సరైన పాలసీని ఎంచుకోవడానికి ముందు మీరు ఈ కింది అంశాలను పరిగణలోకి తీసుకోవాలి:
ప్రసూతి ఖర్చులు అనేవి గర్భం దాల్చిన మొదటి రోజు నుండి ప్రారంభమై, ప్రసవం తర్వాత కూడా కొనసాగుతాయి. కాబట్టి, పాలసీలో ఏయే అంశాలు కవర్ చేయబడతాయో తెలుసుకోవడం ఉత్తమం. ఒక ఇన్సూరెన్స్ కవర్ లేకుండా, ఈ ఖర్చులన్నింటినీ భరించడం అనేది భారంగా మారుతుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలలో వేర్వేరు ఉప-పరిమితులు ఉన్నాయి మరియు అవి కవర్ చేయబడే ఖర్చు మొత్తాన్ని గణనీయంగా పరిమితం చేస్తాయి. అందువల్ల, అనేక రకాల ప్రసూతి-సంబంధిత ఖర్చులను కవర్ చేసే ఇన్సూరెన్స్ పాలసీని పొందడానికి, కనీస ఉప-పరిమితులు కలిగిన పాలసీని ఎంచుకోవడం ముఖ్యం.
ఒక మెటర్నిటీ ప్లాన్‌లోని ముఖ్యమైన షరతు వెయిటింగ్ పీరియడ్. అలాంటి వెయిటింగ్ పీరియడ్ 2 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల వరకు ఉండవచ్చు, కావున, మెటర్నిటీ కవర్‌ను కొనుగోలు చేసేటప్పుడు దానిని పరిగణలోకి తీసుకోవడం ముఖ్యం. అలాగే, గర్భధారణ సమయంలో కొనుగోలు చేయడానికి ఎలాంటి ప్రత్యేక ప్రసూతి కవర్లు అందుబాటులో ఉండవు, ఎందుకనగా, గర్భం అనేది ముందుగా ఉన్న పరిస్థితిగా పరిగణించబడుతుంది.
ప్రీమియం ప్రాముఖ్యతను కూడా విస్మరించకూడదు. ఒక ప్రసూతి పాలసీ అన్నింటినీ కవర్ చేయాలని మీరు కోరుకున్నప్పుడు, ప్రీమియం కూడా బడ్జెట్ అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. అందువల్ల, పాలసీ ప్రీమియంలు మరియు ఫీచర్లు రెండూ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ అనేది ఒక ప్రయోజనకరమైన లెక్కింపు సాధనం. ఇది మీరు ఎంచుకున్న ఫీచర్ల ఆధారంగా ప్రీమియంను నిర్ణయిస్తుంది. ఇన్సూరెన్స్ అనేది అభ్యర్థనకు సంబంధించిన విషయం. ఒక కొనుగోలుని పూర్తి చేయడానికి ముందు దాని ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించిన మరిన్ని వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/పాలసీ షరతులు మరియు నిబంధలను జాగ్రత్తగా చదవండి.
50 Viewed
5 mins read
08 నవంబర్ 2024
113 Viewed
5 mins read
07 నవంబర్ 2024
341 Viewed
5 mins read
17 ఏప్రిల్ 2025
33 Viewed
5 mins read
17 ఏప్రిల్ 2025
What makes our insurance unique
With Motor On-The-Spot, Health Direct Click, etc we provide fast claim process , Our sales toll free number:1800-209-0144