• search-icon
  • hamburger-icon

New Income Tax Slabs for FY 2023-24 - Check Your Slab Now

  • Health Blog

  • 17 ఫిబ్రవరి 2023

  • 329 Viewed

Contents

  • ఆదాయపు పన్ను స్లాబ్
  • పాత వ్యవస్థ మరియు కొత్త వ్యవస్థ మధ్య తేడాలు
  • హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు
  • ముగింపు

కేంద్ర బడ్జెట్‌ను ఇటీవలే పార్లమెంట్‌లో సమర్పించిన నేపథ్యంలో, చాలామంది పన్ను చెల్లింపుదారులు, ప్రత్యేకించి మధ్యతరగతిలోని సంపాదించే ప్రజలు ఈ బడ్జెట్ నుండి చాలా ప్రయోజనాలను ఆశించారు. పొదుపులను ప్రోత్సహించే మెరుగైన పన్ను ప్రోత్సాహకాలు, మరిన్ని సడలింపులు మరియు పన్ను స్లాబ్‌లు లాంటి వాటిని వాళ్లు ఈ బడ్జెట్‌ నుండి ఆశించారు. ఈ బడ్జెట్ అనేది పన్ను చెల్లింపుదారుల కోసం కొత్త ఆదాయపు పన్ను స్లాబ్‌లను తీసుకొచ్చింది. సంపాదించే వ్యక్తిగా మరియు పన్ను చెల్లింపుదారుగా, ఈ బడ్జెట్ మీకు ఏవిధంగా ప్రయోజనకరమైనది? ప్రవేశపెట్టబడిన కొత్త పన్ను స్లాబ్ గురించి మరియు ఆ స్లాబ్‌ల ద్వారా లభించే మొత్తంమీది ప్రయోజనం గురించి చూద్దాం.

ఆదాయపు పన్ను స్లాబ్

బడ్జెట్ ప్రకారం, కొత్త పన్ను స్లాబ్‌లు క్రింది విధంగా ఉన్నాయి:

Tax SlabRates
Up to Rs. 3,00,000NIL
Rs. 3,00,000-Rs. 6,00,0005% on income which exceeds Rs 3,00,000
Rs. 6,00,000-Rs. 900,000Rs 15,000 + 10% on income more than Rs 6,00,000
Rs. 9,00,000-Rs. 12,00,000Rs 45,000 + 15% on income more than Rs 9,00,000
Rs. 12,00,000-Rs. 15,00,000Rs 90,000 + 20% on income more than Rs 12,00,000
Above Rs. 15,00,000Rs 150,000 + 30% on income more than Rs 15,00,000

60 నుండి 80 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారికి క్రింది పన్ను స్లాబులు వర్తిస్తాయి:

Tax SlabsRates
Rs. 3 lakhsNIL
Rs. 3 lakhs - Rs. 5 lakhs5.00%
Rs. 5 lakhs - Rs. 10 lakhs20.00%
Rs. 10 lakhs and more30.00%

80 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు వారి కోసం ఆదాయపు పన్ను స్లాబులు:

Tax SlabsRates
Rs. 0 - Rs. 5 lakhsNIL
Rs. 5 lakhs - Rs. 10 lakhs20.00%
Above Rs. 10 lakhs30.00%

హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యుఎఫ్) మరియు వ్యక్తుల కోసం పన్ను స్లాబులు ఇవి:

SlabNew Tax Regime (Before Budget 2023 - until 31 March 2023)New Tax Regime (After Budget 2023 - From 01 April 2023)
Rs. 0 to Rs. 2,50,000NILNIL
Rs. 2,50,000 to Rs. 3,00,0005%NIL
Rs. 3,00,000 to Rs. 5,00,0005%5%
Rs. 5,00,000 to Rs. 6,00,00010%5%
Rs. 6,00,000 to Rs. 7,50,00010%10%
Rs. 7,50,000 to Rs. 9,00,00015%10%
Rs. 9,00,000 to Rs. 10,00,00015%15%
Rs. 10,00,000 to Rs. 12,00,00020%15%
Rs. 12,00,000 to Rs. 12,50,00020%20%
Rs. 12,50,000 to Rs. 15,00,00025%20%
More than Rs. 15,00,00030%30%

పాత పన్ను వ్యవస్థ ప్రకారం, ఆదాయపు పన్ను స్లాబ్ ఇలా ఉంటుంది:

Income Tax SlabTax Rates
Up - Rs 2,50,000*Nil
Rs 2,50,001 - Rs5,00,0005%
Rs 5,00,001 - Rs 10,00,00020%
Above Rs 10,00,00030%

పాత వ్యవస్థ మరియు కొత్త వ్యవస్థ మధ్య తేడాలు

రెండు పన్ను వ్యవస్థల మధ్య ప్రధాన వ్యత్యాసాలు ఉన్నాయి. అవి:

  1. పాత పన్ను వ్యవస్థతో పోలిస్తే కొత్త పన్ను వ్యవస్థలో తక్కువ పన్ను రేట్లతో మరిన్ని పన్ను స్లాబులు ఉన్నాయి.
  2. ఎఫ్‌వై 2022-23 కోసం ఆదాయపు పన్ను స్లాబ్‌లు మీరు ఎంచుకున్నారా అనేదాని ఆధారంగా హెచ్చుతగ్గులకు లోనవుతాయి పాత వ్యవస్థ లేదా కొత్తది.
  3. పాత పన్ను వ్యవస్థ క్రింద, చాప్టర్ VI ఏ ప్రకారం, అనుమతించబడిన మినహాయింపులనేవి కొత్తగా ప్రవేశపెట్టిన పన్ను వ్యవస్థలో పూర్తిగా అదృశ్యమయ్యాయి.
  4. అంటే, మీ పన్ను బాధ్యతను తగ్గించే అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోయాయని అర్థం.
  5. కొత్త వ్యవస్థతో పోలిస్తే, పన్ను చెల్లింపుదారు కోసం అత్యంత పొదుపు అందించడంలో సహాయపడిన 70 వరకు పన్ను తగ్గింపులు మరియు మినహాయింపులు ఉన్నాయి.
  6. మెరుగైన స్లాబ్ రేట్లు ఉన్నప్పటికీ, పన్ను తగ్గింపులు మరియు మినహాయింపులు లేకపోవడం అనేది ఒక ప్రతికూలత.

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80డి క్రింద, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం చేసిన చెల్లింపు మీద పన్ను మినహాయింపులకు మీరు అర్హులు. అవి:

  1. మీరు, మీ భాగస్వామి మరియు మీ పిల్లలు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన వారైతే, మీరు ప్రీమియం మీద రూ. 25,000 వరకు మినహాయింపు పొందవచ్చు. అది ఈ రెండింటిలో ఏదైనా కావచ్చు - ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ*.
  2. మీ తల్లిదండ్రుల వయసు 60 సంవత్సరాల కంటే తక్కువ ఉండడంతో పాటు, అదే పాలసీలో కవర్ అవుతుంటే, రూ. 25,000 వరకు మీరు అదనపు మినహాయింపు పొందవచ్చు. అంటే, 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి గరిష్ట మినహాయింపు అనేది రూ. 50,000గా ఉంటుంది*
  3. మీ తల్లిదండ్రుల వయసు 60 కంటే ఎక్కువ అయితే, వారి కోసం మీరు గరిష్టంగా రూ. 50,000 వరకు పొందడంతో పాటు, అదనంగా మీకు మరియు మీ భాగస్వామి కోసం రూ.25,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ పరిస్థితిలో, గరిష్ట మినహాయింపు అనేది రూ. 75,000 వరకు ఉంటుంది*.
  4. పాలసీ లబ్దిదారులుగా ఉండే మీరు, మీ భాగస్వామి లేదా మీ పిల్లలు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు వారైతే, మీరు పొందగలిగిన గరిష్ట మినహాయింపు రూ. 50,000 వరకు ఉంటుంది*.
  5. మీ తల్లిదండ్రులు కూడా 60 కంటే ఎక్కువ వయసు వారైతే, రూ. 50,000 వరకు అదనపు మినహాయింపు పొందవచ్చు. కాబట్టి, గరిష్ట మినహాయింపు అనేది రూ.1 లక్ష వరకు ఉంటుంది*.

అయితే, ఈ ప్రయోజనాలనేవి పాత వ్యవస్థ క్రింద అందుబాటులో ఉన్నప్పటికీ, కొత్త వ్యవస్థ కింద ఈ మినహాయింపులు అందుబాటులో లేవు.

ముగింపు

While the new tax regime and the slabs introduced might benefit you greatly in terms of tax savings, you might feel the pinch when it comes to paying premiums for your health insurance. However, it is important to keep yourself and your loved ones insured with the best health insurance policy for them. *Standard T&C apply Insurance is the subject matter of solicitation. For more details on benefits, exclusions, limitations, terms, and conditions, please read the sales brochure/policy wording carefully before concluding a sale.

Go Digital

Download Caringly Yours App!

godigi-bg-img