సూచించబడినవి
Health Blog
21 డిసెంబర్ 2022
73 Viewed
త్వరగా ప్రారంభించండి! ఇది మీ పాలసీ యొక్క సరైన ప్రయోజనాలను పొందడానికి ఇది మీ హెల్త్ ఇన్సూరెన్స్ మంత్ర అవ్వాలి. అనేక మంది యువకులు, కాలేజీ నుండి బయటకు వచ్చి కొత్త ఉద్యోగంలో చేరిన హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ గురించి అసలు ఆలోచించరు. వారిలో చాలా మంది ఇన్సూరెన్స్ అనేది ముసలి వాళ్ళకి అనే భావనలో ఉంటారు. యుక్తవయస్సులో ఆరోగ్యంగా ధృడంగా మరియు ఉత్సాహంతో ఉన్నప్పుడు మీకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం ప్రజలకు తెలియనిది ఏమిటంటే, మీ వయస్సు పెరిగే కొద్దీ చిన్న వయస్సులోనే తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా అందించబడే ప్రయోజనాలను మీరు కోల్పోతారు. ఈ ఆర్టికల్‌లో, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ముందుగానే తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తాము. కారణం 1: వెయిటింగ్ పీరియడ్ నివారించబడుతుంది అనేకమంది వ్యక్తులు గుర్తించని సంగతి ఏమిటంటే, ఒక కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పొందినప్పుడు, వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంటుంది అని. చేరిన కొద్ది కాలంలోనే ఒక పెద్ద క్లెయిమ్ చేసి వారి సభ్యత్వాన్ని రద్దు చేయకుండా ఇది ఫండ్ యొక్క ఇతర సభ్యులకు రక్షణ కలిపిస్తుంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్‌లలో వెయిటింగ్ పీరియడ్ అంటే, ఒక వ్యక్తి వయస్సు పెరిగే కొద్దీ వారికి కవర్ అవసరం కావచ్చు కాబట్టి, అతను/ఆమె వెయిటింగ్ పీరియడ్ ముగిసి కవర్ ప్రారంభం అయ్యే వరకు వేచి ఉండాలి. మీరు ముందుగానే ప్రారంభించినట్లయితే, మీకు నిజంగా కవర్ అవసరమైనప్పుడు, మీ వెయిటింగ్ పీరియడ్ ముగిసిపోతుందని మీరు నిర్ధారించుకుంటారు. కారణం 2: అధిక ప్రీమియంలను నివారించండి మీరు పాలసీని ముందుగానే తీసుకున్నట్లయితే, మీరు అధిక ప్రీమియంపై గణనీయంగా ఆదా చేసుకోవచ్చు. మీ వయస్సు పెరిగే కొద్దీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియంలు పెరుగుతాయి. కాబట్టి దానిని ముందుగానే తీసుకోవడం ద్వారా, మీరు మీ ఆరోగ్య సమస్యలను మాత్రమే కవర్ చేయడమే కాకుండా, కొంత డబ్బును కూడా ఆదా చేస్తారు. అంతేకాకుండా, క్యుములేటివ్ బోనస్ ప్రయోజనం దీర్ఘకాలంలో ప్రతి క్లెయిమ్ రహిత సంవత్సరం కోసం పెరుగుతూ ఉంటుంది మరియు పాలసీని మెరుగుపరుస్తుంది. కారణం 3: ఆరోగ్య తనిఖీలను నివారించండి మీ వయస్సు పెరిగిన తరువాత ఒక హెల్త్ కవర్ తీసుకోవడం మరియు తరువాత అధిక ఎస్.ఐ తో హెల్త్ కవర్ పొందాలనుకుంటున్నప్పుడు ఆరోగ్య స్థితి ఆధారంగా హెల్త్ చెక్ అప్/టెస్టులు అవసరం కావచ్చు. మీ వయస్సు పెరిగే కొద్దీ రక్తపోటు, డయాబెటిస్, మొదలైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అటువంటి సందర్భాల్లో, మీరు అదే కవర్ కోసం అధిక ప్రీమియంను చెల్లించవలసి రావచ్చు. మీకు కొన్ని ముందు నుండి ఉన్న పరిస్థితులు ఉంటే, హెల్త్ చెకప్ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాటిని కవర్ చేయడాన్ని కూడా తిరస్కరించవచ్చు. అయితే, మీరు ముందుగానే ప్రారంభించి ఈ ఆరోగ్య పరిస్థితులు తరువాత తలెత్తితే, మీరు ఆటోమేటిక్‌గా పాలసీ ద్వారా కవర్ చేయబడతారు. కారణం 4: వైద్య ఖర్చులలో భారీ పెరుగుదలను నివారించండి పెరుగుతున్న వైద్య ఖర్చులు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి, మరియు మీకు ఆసుపత్రిలో మంచి గది కావాలనుకుంటే, మీరు అధిక మొత్తం చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి. ఒక మెడికల్ ఇన్సూరెన్స్ ఆటోమేటిక్‌గా మీ అన్ని రిస్కులను కవర్ చేస్తుందని నిర్ధారిస్తుంది మరియు మీరు కోరుకున్నప్పుడు సరైన వైద్య సహాయం పొందగలరు. కారణం 5: మీరు పొదుపు చేసిన మొత్తాన్ని ఆదా చేసుకోండి మీరు విహారయాత్రకు వెళ్లాలనుకుంటున్నా, అద్భుతమైన కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటున్నా, లేదా ముందస్తు రిటైర్‌మెంట్ కోసం చాలా డబ్బును ఆదా చేయాలనుకుంటున్నా, మీకు కావలసిన వాటి కోసం మీ సేవింగ్స్‌ను ఉపయోగించండి. మీకు అత్యవసర వైద్య పరిస్థితి ఏర్పడినప్పుడు, మీరు పొదుపు చేసిన డబ్బు ఖర్చు అవ్వకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ నిర్ధారిస్తుంది. మరోవైపు, ఒక పాలసీ లేకపోతే మీరు పొదుపు చేసిన మొత్తం ఖర్చు అవ్వడమే కాకుండా, మీరు రుణగ్రస్తులు అయ్యే అవకాశం కూడా ఉంది.
50 Viewed
5 mins read
08 నవంబర్ 2024
113 Viewed
5 mins read
07 నవంబర్ 2024
341 Viewed
5 mins read
17 ఏప్రిల్ 2025
33 Viewed
5 mins read
17 ఏప్రిల్ 2025
What makes our insurance unique
With Motor On-The-Spot, Health Direct Click, etc we provide fast claim process , Our sales toll free number:1800-209-0144