రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Features of Travel Insurance
జనవరి 2, 2022

ట్రావెల్ ఇన్సూరెన్స్‌‌లో మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 5 ప్రధాన ఫీచర్లు

ఈరోజుల్లో ప్రయాణం మన జీవితాల్లో ఒక భాగంగా మారింది. ఆనందం కోసమో, వ్యాపారం కోసమో, ఉన్నత విద్య కోసమో ప్రజలు మునుపెన్నడూ లేని విధంగా ప్రయాణాలు చేస్తున్నారు! దీంతో ప్రయాణికుల సంఖ్య పెరగడమే కాకుండా, ప్రయాణ సంబంధిత సమస్యల సంఖ్యలో కూడా పెరుగుదల కనపడుతుంది, అనగా , విమానయాన సంస్థల ద్వారా సామాను పోవడం లేదా అనారోగ్యాల బారిన పడటం మొదలైనవి. అందుకే, మీరు విదేశంలో ఊహించని పరిస్థితిలో చిక్కుకున్నట్లయితే, మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ట్రావెల్ ఇన్సూరెన్స్‌లోని ఈ 5 ముఖ్యమైన ఫీచర్లను గురించి తెలుసుకోండి, అత్యవసర సమయంలో గందరగోళానికి గురి కాకండి. మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ వీటిని అందించాలి:

1.అన్ని వైద్య అత్యవసర పరిస్థితుల కోసం కవరేజ్

దురదృష్టకర సంఘటనలు ఎప్పుడైనా జరగవచ్చు, ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఇది ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితిలో మీరు, మీ కుటుంబంతో కలిసి విదేశాల్లో చిక్కుకుపోయే ఒక సందర్భాన్ని ఊహించండి. అందుకే, మీ ఇన్-పేషెంట్ మరియు అవుట్-పేషెంట్ వైద్య ఖర్చులను కవర్ చేసే విస్తృతమైన కవరేజీని ఖచ్చితంగా కలిగి ఉండండి.

2.చెక్ చేయబడిన లగేజీ నష్టం మరియు పాస్‌పోర్ట్ నష్టం కోసం కవరేజ్ అందించాలి

ఒక కొత్త ప్రదేశానికి వెళ్లిన వ్యక్తి తన సామాను పోగొట్టుకున్న దుస్థితిని ఊహించండి లేదా పర్యటన సమయంలో పాస్‌పోర్ట్ పోగొట్టుకున్న ఒక వ్యక్తి పరిస్థితిని గురించి ఆలోచించండి. ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి మీకు రాకూడదని కోరుకుంటారు కదా! ఈ కింది వాటికి కవరేజీని అందించే ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉండండి

3.పర్సనల్ యాక్సిడెంట్ నుండి మిమ్మల్ని కవర్ చేయాలి

 యాక్సిడెంట్ల కారణంగా శారీరక గాయం కలిగినా లేదా మరణం సంభవించినా, మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని కవర్ చేసే విధంగా జాగ్రత్త పడండి.

4.ట్రిప్ రద్దు మరియు తగ్గింపు కోసం మీకు కవరేజ్ అందించాలి

మీ కుటుంబ సభ్యులలో ఒకరు అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యారని ఊహించుకోండి. అప్పుడు మీ ప్రయాణ ఏర్పాట్లు పూర్తయినప్పటికీ, మీరు ప్రయాణాన్ని విరమించుకుంటారు. మీరు ఎంచుకునే ట్రావెల్ ఇన్సూరెన్స్ అటువంటి చివరి నిమిషంలో ట్రిప్ తగ్గింపు లేదా రద్దు కోసం మిమ్మల్ని కవర్ చేస్తుంది

5.మీరు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు దోపిడీ నుండి మిమ్మల్ని కవర్ చేయాలి

ఇంట్లో ఎవరూ లేని సందర్భంలోనే దోపిడీలు ఎక్కువగా జరుగుతుంటాయి. మీరు పర్యటనలో ఉన్నప్పుడు మీ ఇంట్లో దొంగతనం కోసం మిమ్మల్ని కవర్ చేసే ఒక ప్లాన్‌ను ఎంచుకోవడం ఒక తెలివైన నిర్ణయం.

త్వరలో ప్రయాణం చేయాలనుకుంటున్న వారందరికీ, మీరు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాము. ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను సరిపోల్చడం చేయండి మరియు అందుబాటులో ఉన్న ఉత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ఎంచుకోండి!

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 2.3 / 5. ఓట్ల లెక్కింపు: 3

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

 • మాన్యువల్ ఆరోన్ - జూలై 25, 2018 రాత్రి 7:30 గం.లు

  నా భార్య వయస్సు 82 మరియు నా వయస్సు 83. మేము 5 రోజులపాటు పెనాంగ్ మరియు సింగపూర్‌కు వెళ్లాలని అనుకుంటున్నాము. మాకు అవసరమైన మెడికల్ ఇన్సూరెన్స్ లభిస్తుందా?

  • బజాజ్ అలియంజ్ - జూలై 26, 2018 రాత్రి 1:38 గం.లు

   హలో మాన్యువల్,

   సీనియర్ సిటిజన్స్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి సమాచారం కోసం దయచేసి మా టోల్ ఫ్రీ నంబర్ – 1800-209-0144 పై మమ్మల్ని సంప్రదించండి లేదా మీకు సమీపంలోని బజాజ్ అలియంజ్ బ్రాంచ్ ఆఫీసును సందర్శించండి.

   మీ ప్రయాణం సురక్షితంగా జరగాలని, ఆహ్లాదకరమైన ట్రిప్‌ను మీరు ఆస్వాదించాలని కోరుకుంటున్నాము!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి