రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
What is PA Cover In Bike Insurance
ఏప్రిల్ 1, 2021

బైక్ ఇన్సూరెన్స్‌లో పర్సనల్ యాక్సిడెంట్ (పిఎ) కవర్ అంటే ఏమిటి?

రోడ్లు ముఖ్యమైనవి మాత్రమే కాక ప్రమాదకరమైన ప్రదేశాలు కూడా. ఒక దుర్ఘటన ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. అందువల్ల, ఇన్సూరెన్స్ పాలసీ వంటి కంటింజెన్సీ ప్లాన్లను కలిగి ఉండటం తప్పనిసరి అవుతుంది. ఒక ఇన్సూరెన్స్ పాలసీ మీకు జరిగిన నష్టాలను మాత్రమే కవర్ చేయడమే కాకుండా మీ వాహనానికి జరిగిన నష్టాలను కూడా కవర్ చేస్తుంది. ఒక బైక్ ఇన్సూరెన్స్‌ విషయానికి వస్తే మీరు ఒకదాన్ని పొందడం చాలా అవసరం. ఒక కారులో భౌతిక నష్టం జరగడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. ఒక కారులో ఉన్నప్పుడు ప్రమాదం జరిగితే అయ్యే గాయాల కంటే ఒక బైక్ పై ఉన్నప్పుడు ప్రమాదం జరిగితే గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ పాలసీని లేదా సమగ్రమైన పాలసీని కొనుగోలు చేస్తున్నా, మీ బైక్ ఇన్సూరెన్స్‌లో పిఎ కవర్‌ను తప్పకుండా చేర్చండి. బైక్ ఇన్సూరెన్స్‌లో పిఏ కవర్ అంటే ఏమిటి అని తెలుసుకోవడం గురించి మీలో కొందరికి ఆసక్తి ఉండవచ్చు. దాని గురించి అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి!!  

బైక్ ఇన్సూరెన్స్‌లో పిఎ కవర్ అంటే ఏమిటి?

మీకు రోడ్డుపై ప్రమాదం జరిగితే, అది మీకు, మీ బైక్ మరియు థర్డ్ పార్టీలకు నష్టం కలిగిస్తుంది. మీ కారణంగా థర్డ్ పార్టీ ఎదుర్కొంటున్న నష్టం, అది ఒక వ్యక్తికి గాయాలు లేదా వాహనానికి నష్టం అయినా, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద కవర్ చేయబడుతుంది. ఇది మీకు జరిగిన నష్టాన్ని కవర్ చేయదు. మరోవైపు, ఒక సమగ్ర పాలసీ మీరు లేదా థర్డ్ పార్టీ ఎదుర్కొనే అన్ని నష్టాలను కవర్ చేస్తుంది. ఇక్కడ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ఉపయోగపడుతుంది. ఒకవేళ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ఇన్సూరెన్స్ పాలసీలో భాగం అయితే, డ్రైవర్ లేదా బైక్ యజమాని ఇటువంటి సందర్భాల్లో కవరేజ్ పొందుతారు:  
  • ప్రమాదంలో మరణించడం
  • ప్రమాదంలో శాశ్వత పాక్షిక వైకల్యం
  • ప్రమాదంలో శాశ్వత పూర్తి వైకల్యం
  The net cover amount fixed by the Insurance Regulatory and Development Authority of India 15 లక్షలు. దీని కోసం ఒక వ్యక్తి చెల్లించాల్సిన ప్రీమియం దాదాపుగా 750 రూపాయలు. గమనిక: యజమాని-డ్రైవర్ కోసం మాత్రమే ఒక పిఎ కవర్ వర్తిస్తుంది.   మీరు పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌లో పొందే మొత్తాన్ని ఇక్కడ చూడండి:  
సందర్భం కవర్ మొత్తం (% లో)
మరణం 100%
శాశ్వత పూర్తి వైకల్యం 100%
2 అవయవాలు లేదా రెండు కళ్ళు కోల్పోతే, ఒక అవయవం మరియు ఒక కన్ను 100%
ఒక అవయవం లేదా ఒక కంటిని కోల్పోవడం 50%
 

ప్రీమియం మొత్తం స్థిరంగా ఉంటుందా?

ప్రీమియం మొత్తం (750 రూపాయలు) స్థిరమైనది కాదు. మీరు ఒక బండిల్ చేయబడిన దాని కంటే ఒక స్వతంత్ర పిఎ కవర్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే ఇది పెరుగుతుంది. మీ బైక్ కోసం ఒక అన్‌బండిల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ను తీసుకుంటే, మీకు అధికంగా ఖర్చు అవ్వచ్చు.  

పిలియన్ రైడర్ గాయపడితే ఏం చెయ్యాలి?

మీరు ఒక పిలియన్‌తో రైడ్ చేస్తున్నట్లయితే మరియు అతను లేదా ఆమె ప్రమాదంలో గాయపడితే, అవి మీ పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌లో కవర్ చేయబడవు. అయితే, పిలియన్ రైడర్‌ను కవర్ చేయడానికి మీరు మీ పాలసీలో యాడ్-ఆన్ ఎంచుకుంటే, మీ వెనుక ఉన్న మీ స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడు కూడా పాలసీలో కవర్ చేయబడతారు. మీరు కొంత ఎక్కువ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం చేయాలి. మీ పిఎ కవర్‌లో ఈ యాడ్-ఆన్‌ను చేర్చడం ద్వారా మీరు పొందే గరిష్ట పరిహారం దాదాపుగా 1 లక్షలు.  

మీరు పిఎ కవర్ కోసం ఎప్పుడు అర్హులు కారు?

బైక్ ఇన్సూరెన్స్‌లో పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అంటే ఏమిటి అనే భావన దీనికి మాత్రమే పరిమితం కాదు; ఇందులో మీరు వాగ్దానం చేయబడిన పరిహారం పొందని సందర్భాలు కూడా ఉంటాయి. నష్టం కవర్ చేయబడని కొన్ని పరిస్థితులు ఇక్కడ ఇవ్వబడ్డాయి:  
  • ఉద్దేశపూర్వకంగా స్వయంగా చేసుకున్న గాయాలు మరియు ఆత్మహత్య.
  • మద్యం ప్రభావంలో డ్రైవ్ చేసేటప్పుడు కలిగిన గాయాలు.
  • డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు కలిగిన గాయాలు.
  • స్టంట్స్ వంటి చట్టవిరుద్ధమైన చర్యలను నిర్వహించేటప్పుడు కలిగిన గాయాలు.
 

పెయిడ్ రైడర్ల కోసం బైక్ ఇన్సూరెన్స్‌లో పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అంటే ఏమిటి?

ఆహారం డెలివరీ, బైక్ సర్వీస్ మొదలైనటువంటి వాణిజ్య ప్రయోజనాల కోసం అనేక వ్యాపారాలకు రైడర్లు అవసరం. కార్మికుల పరిహారం చట్టం, 1923 ప్రకారం, వారి వ్యాపారం కోసం రైడర్లను నియమించే సంస్థలు అన్నీ వారి రైడర్లకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అందించవలసి ఉంటుంది. వారు నడిపే బైక్ కోసం ఒక పిఎ కవర్‌ను కొనుగోలు చేయాలి. రైడర్ మరణించినా లేదా శాశ్వత లేదా తాత్కాలిక వైకల్యాన్ని ఎదుర్కొంటే ఇది కవరేజ్ అందిస్తుంది.  

మీరు పిఎ కవర్ కొనుగోలు చేయడం అవసరమా?

మోటార్ వాహన చట్టం, 1988 ప్రకారం బైక్ యజమానులు బైక్ కోసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మరియు వారి వాహనాల కోసం ఒక పిఎ కవర్ ‌‌పొందడం తప్పనిసరి. అయితే, ఇటీవల కొన్ని సవరణలు చేయబడ్డాయి, అవి:  
  1. మీ వాహనం కోసం 15 లక్షల మొత్తాన్ని నిర్ధారించే ఒక యాక్సిడెంట్ కవర్ మీ వద్ద ఇప్పటికే ఉంటే, మీరు కొత్త పిఎ కవర్ పై మినహాయింపు పొందవచ్చు.
  2. మీ బైక్ కోసం ఒక పిఎ కవర్ ఉంటే, మీ కొత్త బైక్ కోసం ఒక కొత్తది కొనుగోలు చేయవలసిన అవసరం ఉండదు.
  గమనిక: మీకు రెండు వాహనాలు ఉన్నప్పటికీ మీకు ఒక పిఎ కవర్ మాత్రమే అవసరం.  

పిఎ కవర్‌ను ఎందుకు కొనుగోలు చేయాలి?

మీ కోసం ఒక పిఎ కవర్‌ను మీరు కొనుగోలు చేయడానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి, అవి:  
  1. మరణం సంభవించినప్పుడు మీ కుటుంబం ఆర్థిక సహాయం పొందుతుంది.
  2. శాశ్వత వైకల్యం ఏర్పడిన సందర్భంలో వైద్య ఖర్చుల కోసం మరియు ఆదాయ నష్టం కోసం ఆర్థిక సహకారం.
 

ఎలా క్లెయిమ్ చేయాలి?

కవర్ యొక్క క్లెయిమ్ యజమాని, డ్రైవర్ లేదా నామినీకి అందించబడుతుంది. దాని కోసం, ఒకరు ఒక క్లెయిమ్‌ను ఫైల్ చేయాలి. ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరణిస్తే నామినీ క్లెయిమ్ ఫైల్ చేయాలి. అనుసరించవలసిన దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:  
  1. సంఘటన గురించి ఇన్సూరర్‌కు తెలియజేయండి.
  2. ఒక ఎఫ్ఐఆర్ మరియు సంభవించిన సంఘటనను నిర్ధారించడానికి కొందరు సాక్షులను ఏర్పాటు చేయండి (క్లెయిమ్ ప్రాసెసింగ్ కోసం ఈ రెండు విషయాలు అవసరం).
  3. అవసరమైన అన్ని డాక్యుమెంట్లు మరియు ఫోటోలను జోడించడంతో పాటు క్లెయిమ్ ఫారం నింపండి.
  4. అన్ని అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి మరియు ఆమోదం కోసం వేచి ఉండండి.
  గమనిక: క్లెయిమ్ పొందడానికి వేగవంతమైన మార్గం ఆన్‌లైన్‌లో ఫైల్ చేయడం.   బైక్ ఇన్సూరెన్స్‌లో పిఎ కవర్ అంటే ఏమిటి అనేదాని గురించి ఇది పూర్తి సమాచారం!  

తరచుగా అడిగే ప్రశ్నలు

  1. ప్రమాదం కారణంగా మరణం సంభవించడం కి ఉదాహరణలు ఏమిటి?
బైక్ ఇన్సూరెన్స్ సంస్థల ప్రకారం, చోకింగ్, నీటిలో మునిగిపోవడం, మెషినరీ, కార్ క్రాష్, కార్ స్లిప్స్ లేదా నియంత్రించడం సాధ్యం కానీ ఏదైనా ఇతర సందర్భం వలన మరణం సంభవించినప్పుడు, అది ప్రమాదం కారణంగా జరిగిన మరణంగా పరిగణించబడుతుంది.  
  1. ఒక పర్సనల్ యాక్సిడెంట్ గుండె పోటు పరిస్థితిని కవర్ చేస్తుందా?
అవును, ఒక వ్యక్తి ప్రమాదానికి గురి అయినప్పుడు అతనికి లేదా ఆమెకి గుండెపోటు వస్తే, పర్సనల్ యాక్సిడెంట్ క్లెయిమ్‌కు అర్హత కలిగి ఉంటారు.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి