రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Car Fitness Certificate Guide
జూన్ 29, 2021

కేవలం 5 దశల్లోనే ఆన్‌లైన్‌లో వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యూవల్

మోటార్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ముందుగా-నిర్వచించిన చెల్లుబాటు అవధిని కలిగి ఉంటాయి. అయితే, పాలసీలు సాధారణంగా ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతాయి. కానీ, ప్రస్తుత నిబంధనల ఆధారంగా అవి మారవచ్చు. ఈ నియమాలను నియంత్రణ సంస్థ, Insurance Regulatory and Development Body of India (IRDAI) ఎప్పటికప్పుడు నిర్వచిస్తుంది. ప్రతి వెహికల్ కొనుగోలు తర్వాత దానికి రిజిస్ట్రేషన్ మరియు పియుసితో పాటు కారు లేదా బైక్ ఇన్సూరెన్స్ పాలసీతో అనుబంధం అవసరమని అందరికీ తెలుసు. కానీ, ఒకసారి పాలసీ కొనుగోలు చేసిన తర్వాత, ప్రజలు ఆ విషయాన్ని మర్చిపోతారు; దాని రెన్యూవల్ గురించి మర్చిపోతారు. ఈ ఆర్టికల్ వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్రాముఖ్యతతో పాటు అది అందించే ప్రయోజనాలను మరియు దానిని రెన్యూ చేయడానికి అనుసరించాల్సిన దశలను హైలైట్ చేస్తుంది. వివరంగా చూద్దాం –

మోటారు ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ అనేది కేవలం ఐదు దశల్లో పూర్తయ్యే ప్రాసెస్

దీనిని ఎలా అనుసరించాలి అనేది ఇక్కడ ఇవ్వబడింది - దశ 1:వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ కోసం ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకోండి మరియు దాని రెన్యూవల్/ కొనుగోలు విభాగానికి వెళ్లండి. దశ 2: మునుపటి మోటారు ఇన్సూరెన్స్ పాలసీ వివరాలతో పాటు పేరు, కాంటాక్ట్ నెంబర్ లాంటి ప్రాథమిక వివరాలను ఎంటర్ చేయండి. దశ 3: ఈ దశలో పాలసీహోల్డర్ వాహనానికి సంబంధించిన వివరాలను మరియు గతంలో సంపాదించిన ఎన్‌సిబి శాతాన్ని ఎంటర్ చేయాలి. దశ 4: పాలసీ కవరేజీని ఫైనలైజ్ చేయండి మరియు తగిన యాడ్-ఆన్ కవర్లను ఎంచుకోండి. దశ 5: మీకు వీలైన చెల్లింపు మాధ్యమం ద్వారా చెల్లించండి మరియు తక్షణమే మీ మెయిల్‌ బాక్స్‌లో పాలసీ డాక్యుమెంట్‌ను పొందండి.

ఆన్‌లైన్‌లో వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్రయోజనాలు

బైక్ మరియు కారు ఇన్సూరెన్స్ పాలసీలను ఇన్సూరెన్స్ కంపెనీల నుండి నేరుగా ఆన్‌లైన్‌లో లేదా ఇన్సూరెన్స్ ఏజెంట్ల నుండి సాంప్రదాయ మార్గంలో కొనుగోలు చేయవచ్చు. దానితో సంబంధం లేకుండా, ఆన్‌లైన్‌లో వెహికల్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయడం అనేది ప్రత్యేక ప్రయోజనాలతో వస్తుంది.
  • ఆన్‌లైన్‌లో మోటారు ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయడం వలన కలిగే మొదటి ప్రయోజనం, ప్రీమియం ఖర్చుల పరంగా కొంతమేరకు పొదుపు చేయవచ్చు. ట్రాన్సాక్షన్ నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీతో జరుగుతుంది, కావున, మధ్యవర్తి కమిషన్ ఏదీ ఉండదు. అలాగే, ప్రీమియం ఖర్చు కూడా తగ్గుతుంది.
  • తదుపరి ప్రయోజనం సకాలంలో పొదుపు చేయడం. మోటార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ అనేది కష్టతరమైన పని కాదు, ఇది ఆన్‌లైన్‌లో కేవలం నిమిషాల్లో పూర్తి చేయగల ఒక సులభమైన ప్రాసెస్.
  • అదనంగా, మోటారు ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ లాంటి టూల్స్‌, సరైన పాలసీని ఎంచుకోవడానికి మరియు బడ్జెట్‌లో ప్రీమియంను సర్దుబాటు చేసుకోవడానికి వీలు కల్పిస్తాయి.
  • చివరగా, ఆన్‌లైన్‌లో వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యూవల్‌ను ఎంచుకున్నప్పుడు, ఇది అనేక ఫారంలను పూరించడం వెనుక మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు ఆన్‌లైన్‌లో సులభంగా పూర్తి చేస్తుంది. యూజర్ నుండి చాలా తక్కువ వివరాలను సేకరించి సిస్టమ్‌లు, సెంట్రల్ డేటాబేస్ నుండి పాలసీ హోల్డర్‌కు సంబంధించిన సమాచారాన్ని అందజేస్తాయి.

మోటార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ యొక్క ప్రాముఖ్యత

సకాలంలో వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యూవల్‌ను నిర్ధారించుకోవడం ఎందుకు ఆవశ్యకమో ఈ కింది అంశాలు స్పష్టం చేస్తాయి:  
  1. చట్టపరమైన సమ్మతి: మోటారు ఇన్సూరెన్స్‌‌ రెన్యూవల్‌ను నిర్ధారించడానికి గల ముఖ్యమైన కారణం, అది ఒక చట్టపరమైన బాధ్యతను సూచిస్తుంది. గడువు ముగిసిన మోటార్ ఇన్సూరెన్స్ పాలసీతో వాహనాన్ని నడపడం అనేది పాలసీ లేకుండా చేసే డ్రైవింగ్‌తో సమానం. అలాగే, వెహికల్ డాక్యుమెంట్లను చెక్ చేసేటప్పుడు ట్రాఫిక్ అధికారులు పాలసీ యొక్క ప్రస్తుత స్థితిని పరిశీలిస్తారు మరియు అది చెల్లుబాటు అవకపోతే, భారీ జరిమానాను విధిస్తారు. ఈ జరిమానాలను నివారించడానికి, మోటార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్‌తో కొనసాగడం ఒక తెలివైన నిర్ణయం.
  1. ఆర్థిక బాధ్యతల నుండి రక్షిస్తుంది: యాక్సిడెంట్ సందర్భంలో ఇది థర్డ్-పార్టీ బాధ్యతల నుండి రక్షించే ఒక మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ. ప్రమాదాలు ఊహించనివి మరియు వాటి ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేయలేము. అందువల్ల, ఊహించని పరిణామాల కోసం సిద్ధంగా ఉండటం అనేది దీర్ఘకాలంలో ఉపయోగకరంగా ఉంటుంది.
  1. గ్రేస్ పీరియడ్‌లో ఎలాంటి కవరేజ్ లభించదు: ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ కవర్ గడువు ముగిసిన తర్వాత రెన్యూవల్ కోసం కొన్ని రోజుల కాలవ్యవధిని ఆఫర్ చేస్తాయి. ఈ కాలాన్ని గ్రేస్ పీరియడ్ అంటారు. వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యూవల్‌లో ఆలస్యం జరిగినప్పుడు, ఈ గ్రేస్ వ్యవధిలో ఎలాంటి కవరేజ్ అందించబడదు, దీని కారణంగా పాలసీహోల్డర్‌కు ఎలాంటి బ్యాకప్ ఆప్షన్ ఉండదు, ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది.
  1. ఎన్‌సిబి రీసెట్: సకాలంలో వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యూవల్‌ను నిర్ధారించడానికి గల మరొక ముఖ్యమైన కారణం, నో-క్లెయిమ్ బోనస్ (ఎన్‌సిబి)ను కోల్పోకుండా చూసుకోవడం. మునుపటి పాలసీ అవధిలో ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే ఈ నో-క్లెయిమ్ ప్రయోజనాలు తదుపరి కాలంలో ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి, సకాలంలో వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ అనేది ఈ ఎన్‌సిబి ప్రయోజనాలను ఏ నష్టం లేకుండా తదుపరిగా కొనసాగించేందుకు సహాయపడుతుంది.
ఈ సులభమైన మరియు సరళమైన దశలను అనుసరిస్తూ ఒక వ్యక్తి, భారతదేశంలో మోటారు ఇన్సూరెన్స్ రెన్యూవల్‌తో కొనసాగవచ్చు. పైన పేర్కొన్న విధంగా పాలసీ రెన్యూవల్ వలన కలిగే ఉపయోగం మరియు ప్రయోజనాల కోసం, ఎప్పటికప్పుడు పాలసీని రెన్యూ చేసుకోండి మరియు అనవసరమైన అవాంతరాలను నివారించండి. ఇన్సూరెన్స్ అనేది అభ్యర్థనకు సంబంధించిన విషయం. ఒక కొనుగోలుని పూర్తి చేయడానికి ముందు దాని ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించిన మరిన్ని వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/పాలసీ షరతులు మరియు నిబంధలను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి