మీ కస్టమర్‌ను తెలుసుకోండి (కెవైసి) అనేది కస్టమర్‌ల గుర్తింపును ధృవీకరించడంలో సహాయపడే ఒక ప్రక్రియ. మోసాన్ని నివారించడానికి మరియు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా నిర్ధారించడంలో సహాయపడుతుంది కాబట్టి, ఇన్సూరెన్స్ పరిశ్రమలో కెవైసి అత్యంత ముఖ్యమైనది. ఇటీవల, కారు ఇన్సూరెన్సులో కెవైసికి సంబంధించి Insurance Regulatory and Development Authority of India (IRDAI) కొత్త నియమాలు అమలు చేసింది. IRDAI మార్గదర్శకాల ప్రకారం, ఇన్సూరెన్స్ కంపెనీలు కస్టమర్లకు
కారు ఇన్సూరెన్స్ పాలసీలతో సహా ఏదైనా జనరల్ ఇన్సూరెన్స్ పాలసీని జారీ చేయడానికి ముందు తప్పనిసరిగా కెవైసి విధానాలు అనుసరించాలి.
కారు ఇన్సూరెన్స్‌లో కెవైసి అవసరాలు అర్థం చేసుకోవడం
ఆధార్-ఆధారిత ప్రమాణీకరణ, వీడియో కెవైసి లేదా ఇతర ఎలక్ట్రానిక్ పద్ధతులతో పాటు ఆఫ్‌లైన్ మార్గాల ద్వారా కెవైసి ప్రక్రియ పూర్తి చేయవచ్చని IRDAI నిర్దేశించింది. # కెవైసి నిబంధనలనేవి వ్యక్తులు మరియు లేదా చట్ట సంబంధిత వ్యక్తులు/సంస్థలకు భిన్నంగా ఉండవచ్చు. ఈ రెండింటి కోసం కెవైసి నిబంధనలు చూద్దాం:
-
వ్యక్తుల కోసం కెవైసి నిబంధనలు
వ్యక్తుల కోసం కెవైసి నిబంధనలనేవి మోసాన్ని నివారించడం కోసం
కారు ఇన్సూరెన్స్ పాలసీ సరైన వ్యక్తికి జారీ చేయబడిందని నిర్దారించడానికి ఉద్దేశించబడ్డాయి. కార్ ఇన్సూరెన్స్‌లో వ్యక్తుల కోసం కెవైసి నిబంధనలు క్రింది విధంగా ఉన్నాయి:
- వ్యక్తి పేరు: వ్యక్తి తన గుర్తింపు రుజువు డాక్యుమెంట్ ప్రకారం, తన పూర్తి పేరు అందించాల్సి ఉంటుంది.
- చిరునామా రుజువు: యుటిలిటీ బిల్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా ఆధార్ కార్డ్ లాంటి చెల్లుబాటు అయ్యే చిరునామా రుజువును వ్యక్తి అందించాలి.
- గుర్తింపు రుజువు: ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ లేదా ఓటర్ ఐడి లాంటి చెల్లుబాటు అయ్యే గుర్తింపు రుజువును వ్యక్తి అందించాలి.
- సంప్రదింపు వివరాలు: ఫోన్ నంబర్ మరియు ఇమెయిల్ చిరునామా లాంటి తమ సంప్రదింపు వివరాలను వ్యక్తి అందించాలి.
- ఫోటోగ్రాఫ్: కెవైసి ప్రక్రియ కోసం వ్యక్తి తప్పనిసరిగా పాస్‌పోర్ట్ సైజు ఫోటో అందించాలి.
- ఇతర డాక్యుమెంట్లు: కెవైసి ప్రయోజనాల కోసం ఆదాయం రుజువు లేదా వృత్తి రుజువు లాంటి ఇతర డాక్యుమెంట్లు ఇన్సూరర్‌కు అవసరం కావచ్చు.
-
చట్టపరమైన సంస్థ/వ్యక్తుల కోసం కెవైసి నిబంధనలు
కారు ఇన్సూరెన్స్‌లో చట్టపరమైన సంస్థలు/వ్యక్తుల కోసం కెవైసి నిబంధనలు క్రింద ఇవ్వబడ్డాయి:
- చట్టపరమైన సంస్థ/వ్యక్తి పేరు: డాక్యుమెంట్ల ప్రకారం సంస్థ/వ్యక్తి పేరు తప్పనిసరిగా అందించాలి.
- చట్టపరమైన సర్టిఫికెట్: చట్టపరమైన స్థితిని ధృవీకరించే చట్టపరమైన సర్టిఫికెట్‌ను కెవైసి ఫారంతో పాటు అందించాలి.
- చిరునామా రుజువు: వ్యక్తి / సంస్థ చిరునామాను ధృవీకరించే చెల్లుబాటు అయ్యే చిరునామా రుజువు అందించాలి.
- ఇతర డాక్యుమెంట్లు: కెవైసి ప్రయోజనాల కోసం ఆదాయం రుజువు లేదా వృత్తి రుజువు లాంటి ఇతర డాక్యుమెంట్లు ఇన్సూరర్‌కు అవసరం కావచ్చు.
అన్ని రకాల జనరల్ ఇన్సూరెన్స్ పాలసీల కోసం కెవైసి నిబంధనలు అనుసరించాలని దయచేసి గమనించండి. కాబట్టి, మీరు ఒక
థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ లేదా సమగ్ర పాలసీలలో దేనిని కొనుగోలు చేసినా, కెవైసి నిబంధనలు అనుసరించాలి. #
IRDAI అంగీకరించిన కెవైసి విధానాలు
కస్టమర్లకు సులభంగా మరియు సౌకర్యవంతంగా ఉండేలా నిర్ధారించడం కోసం, డిజిటల్ కెవైసి ప్రక్రియల ఉపయోగాన్ని Insurance Regulatory and Development Authority of India (IRDAI) తప్పనిసరి చేసింది. దీనిలో IRDAI అంగీకరించిన కెవైసి పద్ధతులు క్రింద ఇవ్వబడ్డాయి-
వెహికల్ ఇన్సూరెన్స్ :
- ఆధార్ ఆధారిత ఇ-కెవైసి: ఈ పద్ధతిలో, కెవైసి ప్రయోజనాల కోసం ఆధార్ కార్డు ఉపయోగిస్తారు. కెవైసి ప్రక్రియ పూర్తి చేయడం కోసం, కస్టమర్ వారి ఆధార్ నంబర్ మరియు బయోమెట్రిక్ ప్రమాణీకరణను అందించవచ్చు.
- పాన్-ఆధారిత కెవైసి: ఈ పద్ధతిలో, కెవైసి ప్రయోజనాల కోసం కస్టమర్‌కు చెందిన పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్) ఉపయోగిస్తారు. కస్టమర్ తన పాన్ కార్డ్ స్వీయ-ధృవీకరణ కాపీతో పాటు గుర్తింపు రుజువుగా తన పాన్ వివరాలు అందించాలి. అదనంగా, చిరునామా రుజువు కోసం పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి, యుటిలిటీ బిల్లులు లాంటి డాక్యుమెంట్లు కూడా అందించాలి. ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ పాలసీలు రెండింటి కోసం ఈ పద్ధతిని ఐఆర్‌డిఎఐ అంగీకరిస్తుంది
- వీడియో కెవైసి: ఈ పద్ధతిలో, ఇన్సూరర్‌కి వీడియో కాల్ చేయడం ద్వారా, కస్టమర్ తన కెవైసి వివరాలు అందిస్తారు. వీడియో కెవైసి ప్రక్రియ పూర్తి చేయడం కోసం కెమెరా మరియు ఇంటర్నెట్ కనెక్షన్ కలిగిన డివైజ్‌ను కస్టమర్ కలిగి ఉండాలి.
- ఆఫ్‌లైన్ కెవైసి: ఈ పద్ధతిలో, కెవైసి ప్రయోజనాల కోసం భౌతిక డాక్యుమెంట్లు సమర్పించడం జరుగుతుంది. కెవైసి ఫారంతో పాటు కస్టమర్ తన గుర్తింపు రుజువు మరియు చిరునామా రుజువు కాపీలు అందించాలి.
- ఒటిపి-ఆధారిత ఇ-కెవైసి: ఈ పద్ధతిలో, కెవైసి ప్రయోజనాల కోసం కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడిన వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఒటిపి)ని ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రాసెస్‌ను పూర్తి చేయడం కోసం కస్టమర్ తనకు వచ్చిన ఒటిపిని కెవైసి ఫారమ్‌లో నమోదు చేయాలి.
IRDAI పేర్కొన్న నిబంధనల ప్రకారం, అంగీకరించబడిన కెవైసి పద్ధతుల గురించి కస్టమర్లు వారి ఇన్సూరర్ వద్ద తనిఖీ చేయడంతో పాటు ఆ ప్రక్రియను పూర్తి చేయడం ముఖ్యం. ఇది థర్డ్ పార్టీ లేదా సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీ ప్రామాణికతను మరియు క్లెయిముల సులభమైన ప్రాసెసింగ్‌ను నిర్ధారించడానికి సహాయపడుతుంది.
వ్యక్తుల కెవైసి కోసం అవసరమైన డాక్యుమెంట్లు
కారు ఇన్సూరెన్స్ కోసం కెవైసి ప్రక్రియ పూర్తి చేయడానికి, వ్యక్తులు కొన్ని డాక్యుమెంట్లు అందించాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్లలో ఇవి భాగంగా ఉండవచ్చు:
- గుర్తింపు రుజువు: ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి
- చిరునామా రుజువు: యుటిలిటీ బిల్లులు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, అద్దె ఒప్పందాలు
- ఫొటోగ్రాఫ్
- ఇన్సూరర్‌కు అవసరమయ్యే ఇతర డాక్యుమెంట్లు
ముగింపు
కారు ఇన్సూరెన్స్‌లో కెవైసికి సంబంధించిన కొత్త IRDAI నియమాలనేవి ఇన్సూరెన్స్ పరిశ్రమలో పారదర్శకత మరియు సమగ్రతను మెరుగుపరచడాన్ని లక్ష్యంగా కలిగి ఉంటాయి. కెవైసి ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా, కస్టమర్లు వారి పాలసీ నిజమైనదని నిర్ధారించుకోవచ్చు, మరియు వారి క్లెయిమ్‌లు సజావుగా ప్రాసెస్ చేయబడతాయి. కెవైసి అవసరాలు పూర్తి చేయడం ద్వారా, కస్టమర్లు తమ
కారు ఇన్సూరెన్స్ పాలసీ చెల్లుబాటులో ఉంటుంది మరియు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగిన సందర్భంలో వారిని రక్షించగలదు.
*ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.
రిప్లై ఇవ్వండి