రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
CKYC Insurance & Car Insurance in India
ఫిబ్రవరి 25, 2023

బైక్ ఇన్సూరెన్స్ కోసం కెవైసి నిబంధనలు: పూర్తి సమాచారం

బైక్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే, అప్లికేషన్ మరియు రెన్యూవల్ ప్రాసెస్‌లో మీ కస్టమర్‌ను తెలుసుకోండి (కెవైసి) నిబంధనలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. జనవరి 2023 నుండి, మోసం నివారించడం మరియు లావాదేవీల్లో పారదర్శకతను నిర్ధారించడం కోసం అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీదారుల గుర్తింపును ధృవీకరించడాన్ని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డిఏఐ) తప్పనిసరి చేసింది. ఒక పాలసీ కొనుగోలుదారుగా, మీరు బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా కెవైసి నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఇది ఇటీవలి సవరణ కాబట్టి, మీరు అనుసరించాల్సిన కెవైసి నిబంధనలకు సంబంధించి మీకు కొన్ని ప్రశ్నలు మరియు సందేహాలు ఉండవచ్చు. మీకు మరియు ఇతర సంభావ్య పాలసీదారులకు సహాయపడడం కోసం, బైక్ ఇన్సూరెన్స్‌లో కెవైసి నిబంధనల గురించి మేము ఒక లోతైన పరిశీలన చేశాము మరియు వాటికి కట్టుబడి ఉండటంలోని ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాము.

బైక్ ఇన్సూరెన్స్ కోసం కెవైసి ఎందుకు అవసరం?

ముందుగా, కెవైసి అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. ఇది పాలసీదారులు తమ గుర్తింపును ధృవీకరించడం కోసం తమ వ్యక్తిగత సమాచారం మరియు చెల్లుబాటు అయ్యే గుర్తింపు డాక్యుమెంట్లను అందించడానికి అవసరమైన ఒక ప్రక్రియ.‌ బైక్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయడానికి కెవైసి అవసరాలు సులభంగా మరియు సరళంగా ఉంటాయి. పాలసీదారులు క్రింది డాక్యుమెంట్లను అందించాలి:
  1. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గుర్తింపు రుజువు.
  2. యుటిలిటీ బిల్లులు, పాస్‌పోర్ట్, బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లాంటి చిరునామా రుజువు.
  3. పాస్‌పోర్ట్ సైజు ఫొటోగ్రాఫ్
కార్పొరేట్ లేదా బిజినెస్ పాలసీదారుల విషయంలో, పైన పేర్కొన్న డాక్యుమెంట్లకు అదనంగా కార్పొరేట్ సంస్థకు సంబంధించిన చట్టపరమైన రుజువు, సంస్థ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మరియు ఇతర అధికారిక డాక్యుమెంట్లు కూడా అవసరం కావచ్చు. అనైతిక కార్యకలాపాలను ఎదుర్కోవడానికి మరియు మోసాన్ని నిరోధించడానికి అప్లికేషన్ మరియు రెన్యూవల్ ప్రక్రియ సమయంలో ఖచ్చితమైన కెవైసి డాక్యుమెంట్లను అందించడం ద్వారా పాలసీదారులు టూ-వీలర్ ఇన్సూరెన్స్ ‌లో ఈ కెవైసి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. పాలసీదారు విశ్వసనీయతను వ్యవస్థాపించడంతో పాటు పాలసీదారు మరియు ఇన్సూరెన్స్ కంపెనీ మధ్య విశ్వాసం పెంచడానికి కూడా ఇది సహాయపడుతుంది. కెవైసి ప్రక్రియలో భాగంగా అందించబడే డాక్యుమెంట్లు చెల్లుబాటు అయ్యేవిగా, అప్-టు-డేట్‌గా మరియు సరైనవిగా ఉండాలని గుర్తుంచుకోవడం ముఖ్యం. వీటిలో ఏవైనా వ్యత్యాసాలు లేదా లోపాలనేవి అప్లికేషన్ లేదా రెన్యూవల్ ప్రాసెస్‌లో ఆలస్యానికి దారితీయవచ్చు.

బైక్ ఇన్సూరెన్స్ కోసం కెవైసి నిబంధనలను ఎలా పాటించాలి?

బైక్ ఇన్సూరెన్స్ కోసం కెవైసి నిబంధనలకు కట్టుబడి ఉండటం చాలా సులభం మరియు సరళం. మీరు చేయవలసిందల్లా:
  1. అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి:

    మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు అవసరమైన కెవైసి డాక్యుమెంట్లు అందించండి. ఆ డాక్యుమెంట్లు ఖచ్చితమైనవి, అప్-టు-డేట్‌గా మరియు చెల్లుబాటు అయ్యేవిగా ఉన్నాయని నిర్ధారించుకోండి.
  2. డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచుకోండి:

    యాక్సిడెంట్ లేదా దుర్ఘటన జరిగిన సందర్భంలో అవసరం కావచ్చు కాబట్టి, కెవైసి డాక్యుమెంట్ల కాపీని అన్ని సమయాల్లో మీతో ఉంచుకోండి.
  3. డాక్యుమెంట్లను అప్‌డేట్ చేయండి:

    కెవైసి డాక్యుమెంట్లలో, చిరునామా లేదా ఫోన్ నంబర్‌లో మార్పు లాంటి ఏవైనా మార్పులు ఉంటే, ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు వెంటనే తెలియజేయండి మరియు అప్‌డేట్ చేసిన డాక్యుమెంట్లు అందించండి.
  4. సకాలంలో రెన్యూవల్ చేసుకోండి:

    మీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ సకాలంలో జరిగిందని నిర్ధారించుకోండి మరియు అవసరమైతే, అప్‌డేట్ చేయబడిన కెవైసి డాక్యుమెంట్లను అందించండి.

వ్యక్తుల కోసం కెవైసి నిబంధనలు అనుసరించే వివిధ మార్గాలు

‌‌ వెహికల్ ఇన్సూరెన్స్ వ్యక్తిగత పాలసీదారుల గుర్తింపును ధృవీకరించడానికి కెవైసి యొక్క వివిధ పద్ధతులు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
  1. ఆధార్-ఆధారిత కెవైసి:

    ఆధార్-ఆధారిత కెవైసి అనేది బైక్ ఇన్సూరెన్స్ పాలసీతో ఆధార్ నంబర్‌ను లింక్ చేయడం ద్వారా పూర్తి చేయబడే ఒక సరళమైన మరియు అవాంతరాలు-లేని ప్రక్రియ. ఈ ప్రక్రియలో పాలసీదారు వారి ఆధార్ నంబర్‌ అందించవచ్చు మరియు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఒటిపి ద్వారా దానిని ప్రామాణీకరించవచ్చు.
  1. వీడియో-ఆధారిత కెవైసి:

    వీడియో-ఆధారిత కెవైసిలో పాలసీదారు వారి ఆధార్ కార్డ్ లాంటి గుర్తింపు రుజువుతో పాటు వారి లైవ్ వీడియోను ఇన్సూరెన్స్ కంపెనీకి అందిస్తారు. ఈ వీడియో ద్వారా పాలసీదారు గుర్తింపును ఇన్సూరెన్స్ కంపెనీ ధృవీకరిస్తుంది మరియు అందించిన గుర్తింపు రుజువుతో సరిపోలుస్తుంది.
  1. భౌతిక కెవైసి:

    ఇది కెవైసికి సంబంధించిన సాంప్రదాయక పద్ధతి. దీనిప్రకారం, పాలసీదారు వారి గుర్తింపు రుజువు మరియు ఇతర డాక్యుమెంట్లు అందించడం కోసం ఇన్సూరెన్స్ కంపెనీ బ్రాంచ్ కార్యాలయానికి లేదా నిర్దేశిత లొకేషన్‌‌కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్లను ఇన్సూరెన్స్ కంపెనీ ధృవీకరిస్తుంది మరియు KYC ప్రాసెస్‌ పూర్తి చేస్తుంది.
  1. ఒటిపి-ఆధారిత కెవైసి:

    ఒటిపి-ఆధారిత కెవైసి అనేది పాలసీదారు తమ మొబైల్ నంబర్‌ అందించి, తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఒటిపిని అందించడం ద్వారా, ధృవీకరణను పూర్తి చేసే ఒక సాధారణ మరియు సౌకర్యవంతమైన పద్ధతి. ఈ మొబైల్ నంబర్‌ను ఇన్సూరెన్స్ కంపెనీ ధృవీకరిస్తుంది మరియు కెవైసి ప్రాసెస్‌‌ను పూర్తి చేస్తుంది.

కెవైసి నిబంధనలకు కట్టుబడి ఉండడంలో మీరు విఫలమైతే ఏం జరుగుతుంది?

కెవైసి నిబంధనలకు కట్టుబడి ఉండడంలో పాలసీదారు విఫలమైతే, వారి అప్లికేషన్‌ను ఇన్సూరెన్స్ కంపెనీ తిరస్కరించవచ్చు లేదా రెన్యూవల్ ప్రాసెస్‌ ఆలస్యం కావచ్చు. కెవైసి నిబంధనలకు పాలసీదారు కట్టుబడకపోతే, క్లెయిమ్ సమయంలో ఇన్సూరర్ దానిని తిరస్కరించవచ్చు. కెవైసి నిబంధనలను ఐఆర్‌డిఏఐ తప్పనిసరి చేసింది మరియు బాధ్యతాయుతమైన బైక్ యజమానిగా మరియు పాలసీదారుగా, దానికి అనుగుణంగా వ్యవహరించడం మీ కర్తవ్యం.

ముగింపు

మోసపూరిత క్లెయిమ్‌లు నివారించడానికి మరియు నిజమైన వ్యక్తులకే పాలసీ జారీ చేయబడిందని నిర్ధారించడం కోసం వెహికల్ ఇన్సూరెన్స్‌లో క్రింది కెవైసి నిబంధనలు అవసరం. కెవైసి అవసరాలకు అనుగుణంగా, పాలసీదారులు వారి విశ్వసనీయతను వ్యవస్థాపించడంతో పాటు వారికి మరియు ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కి మధ్య విశ్వాసం పెంచుకోవచ్చు. సులభమైన అప్లికేషన్ మరియు రెన్యూవల్ ప్రాసెస్‌ను నిర్ధారించడం కోసం, కెవైసి డాక్యుమెంట్లను ఖచ్చితంగా, అప్-టు-డేట్‌గా మరియు చెల్లుబాటు అయ్యేవిగా ఉంచడం చాలా ముఖ్యం. ఈ సులభమైన దశలను అనుసరించడం ద్వారా, తాము కెవైసి నిబంధనలకు అనుగుణంగా ఉన్నామని మరియు అవాంతరాలు-లేని దీని ప్రక్రియను ఆస్వాదించవచ్చని పాలసీదారులు నిర్ధారించుకోవచ్చు:‌ బైక్ ఇన్సూరెన్స్ కవరేజ్. * ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి