సూచించబడినవి
Motor Blog
29 మార్చి 2023
402 Viewed
Contents
కారు ఇన్సూరెన్స్ పాలసీ అనేది మీ వాహన రక్షణ కోసం ఒక ఒప్పందం లాంటిది, ఇది ఒక నిర్దిష్ట వ్యవధి కోసం చెల్లుతుంది. అంటే పాలసీ వ్యవధి పూర్తయిన తర్వాత మీరు మీ పాలసీని రెన్యూ చేసుకోవాలి. ఈ కారు ఇన్సూరెన్స్ రెన్యూవల్, సమయంలో మీకు రెండు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి, అవి - మీరు మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌తో కొనసాగించవచ్చు లేదా మీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చుకోవచ్చు. మీరు మీ ప్రొవైడర్ అందించే కవరేజ్ మరియు సర్వీస్‌తో సంతృప్తి చెందినట్లయితే ప్రీమియం చెల్లించవచ్చు మరియు అదే ఇన్సూరెన్స్ కవరేజ్‌తో కొనసాగవచ్చు. లేకపోతే, మీరు కారు ఇన్సూరెన్స్ రసీదులు. ఇన్సూరెన్స్ కంపెనీని మార్చుకునే ఈ సౌకర్యం Insurance Regulatory and Development Authority of India (IRDAI) ద్వారా కల్పించబడిన ఒక పెద్ద ప్రయోజనం. మరిన్ని వివరాల కోసం మీరు IRDAI అధికారిక వెబ్‌సైట్‌ను కూడా సందర్శించవచ్చు.
దురదృష్టకర సంఘటన జరిగిన సందర్భంలో కారు ఇన్సూరెన్స్ కీలక పాత్రను పోషిస్తుంది, అయితే, ఇన్సూరెన్స్ ప్రొవైడర్లను మార్చడం వలన కొన్ని ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు ఉన్నాయి. ఒక కస్టమర్-సెంట్రిక్ ఇన్సూరెన్స్ కంపెనీ సాధారణంగా ఈ కింది ప్రయోజనాలను అందించాలి:
ప్రొవైడర్లను మార్చడం వల్ల కలిగే ప్రతికూలతలలో ఇవి ఉంటాయి, ఒకటి కొత్త విధానాలను నేర్చుకోవడంలో గందరగోళం నెలకొంటుంది మరియు సరైన పరిశోధన లేకుండా అవాంతరాలు-లేని ఇన్సూరెన్స్ అనుభవాన్ని పొందలేకపోవడం.
మీరు కారు ఇన్సూరెన్స్‌ను మార్చడాన్ని ఎప్పుడు పరిగణలోకి తీసుకోవాలో తెలియజేసే కొన్ని సందర్భాలు:
చాలా మంది కొనుగోలుదారులు తక్కువ కవరేజ్ కోసం ఎక్కువ ప్రీమియంలు వసూలు చేస్తున్నట్లు భావించినప్పుడు, వారి ఇన్సూరెన్స్ ప్లాన్లను మార్చుకుంటారు. ఒక వేళ మీ పాలసీ అధిక ధరను కలిగి ఉందని మీరు భావిస్తే, వెంటనే దానిని ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే కవరేజీతో సరిపోల్చాలి. ఈ విధంగా, మీరు ఇన్సూరెన్స్ ప్రొవైడర్లను మార్చడం ద్వారా ప్రీమియంలను ఆదా చేసుకోవచ్చు.
మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ సంస్థ అందించే సరిపోని సేవల కారణంగా మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను మార్చాలనుకుంటున్నారా? ఈ సందర్భంలో, మీరు వేరొక ఇన్సూరెన్స్ కంపెనీ అందించే సేవలు మరియు మద్దతును ధృవీకరించారని నిర్ధారించుకోవాలి.
మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ కంపెనీ ఒక సాధారణ మరియు అవాంతరాలు-లేని క్లెయిమ్స్ ప్రాసెస్‌ను సెట్ చేసిందో లేదో తెలుసుకోవాలి. ఒక వేళ వారు అలా చేయకపోతే, కారు ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను మార్చడం అనేది పరిగణించవలసిన ఒక ఎంపిక. అయితే, మీరు మారడానికి ముందు కొత్త ఇన్సూరెన్స్ సంస్థ క్లెయిమ్ ప్రాసెస్‌ను చెక్ చేయాలి.
యాడ్-ఆన్‌లు అనేవి ఆప్షనల్ పాలసీ ఫీచర్లు. అవి మీ ఇన్సూరెన్స్ ప్లాన్ కవరేజీని గణనీయంగా పెంచవచ్చు. మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ కంపెనీ అలాంటి యాడ్-ఆన్‌లను అందించకపోతే, మీరు మీ ఇన్సూరర్‌ను మార్చుకోవచ్చు. ఇవి కూడా చదవండి: పూర్తి-కవరేజ్ కార్ ఇన్సూరెన్స్: ఒక సమగ్ర గైడ్
ఒక ప్రమాదం తర్వాత కారు ఇన్సూరెన్స్‌ను మార్చుకోవడం అనేది మంచి ఆలోచన కాదా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. సాంకేతికంగా, మీరు ఏ సమయంలోనైనా కారు ఇన్సూరెన్స్‌ను మార్చుకోవచ్చు. అయితే, మీ ప్రస్తుత పాలసీ గడువు ముగిసేలోపు కొత్త ఇన్సూరర్‌తో పాలసీని రెన్యూ చేసుకోవడం మరింత సౌకర్యవంతమైనది. ఒక ప్రమాదం తర్వాత కారు ఇన్సూరెన్స్‌ను మార్చడం వలన మీకు స్వల్పకాలంలో ఎక్కువ ఖర్చవుతుంది, ఎందుకంటే ఇది వెంటనే మీ కొత్త పాలసీ ప్రీమియంను పెంచవచ్చు. చివరగా, కారు ఇన్సూరెన్స్ ప్రొవైడర్లను మార్చడం వల్ల మీకు సరసమైన ధరలు, మెరుగైన కవరేజ్, ఉత్తమ సేవలు, అనుభవజ్ఞులైన కస్టమర్ సపోర్ట్ మరియు ఉపయోగకరమైన వాల్యూ-యాడెడ్ సేవల వంటి ప్రయోజనాలు లభించవచ్చు. మీ పాలసీ మార్పిడిని సాధ్యమైనంత అవాంతరాలు లేకుండా పూర్తి చేయడానికి, మీ ప్రస్తుత పాలసీని రద్దు చేయండి, నో క్లెయిమ్ బోనస్ ఏదైనా ఉంటే బదిలీ దానిని చేసుకోండి, మీ అవసరాలను పరిశోధించి, మీ కొత్త ఇన్సూరెన్స్ సంస్థ మీ అవసరాలను తీరుస్తుందని నిర్ధారించుకోండి.
మీరు మీ ఇన్సూరెన్స్ కంపెనీని ఎప్పుడు మార్చుకోవాలి అనే దానిపై ఒక స్పష్టత వచ్చిన తర్వాత, కారు ఇన్సూరెన్స్ బదిలీ ప్రాసెస్‌ను సులభతరం చేసేందుకు ఇక్కడ పూర్తి మార్గదర్శకాలు ఇవ్వబడ్డాయి:
సాధారణంగా, మీరు కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేసే ముందు మీ కవరేజ్ అవసరాలను విశ్లేషించండి. అదేవిధంగా, కారు ఇన్సూరెన్స్ పాలసీ విషయానికి వస్తే మీ విభిన్న అవసరాలను గురించి అంచనా వేయండి. ఏవైనా ఇన్సూరెన్స్ ప్లాన్‌ను షార్ట్‌లిస్ట్ చేయడానికి ముందు ఈ ప్రాథమిక దశను మీరు అనుసరించినట్లయితే, మీకు ఏం కావాలి అనే దానిని ముందుగానే తెలుసుకోవచ్చు.
తదుపరి దశ, అందుబాటులో ఉన్న వివిధ ఇన్సూరెన్స్ ప్లాన్లను పరిశోధించడం. మీ అవసరాల జాబితా సహాయంతో మీ శోధన తప్పనిసరిగా కుదించబడుతుంది. ఒకసారి అది పూర్తయిన తర్వాత, అందుబాటులో ఉన్న వివిధ ప్లాన్లను సరిపోల్చడాన్ని మర్చిపోవద్దు. ఇది మీకు సరసమైన ఇన్సూరెన్స్ కవరేజీని పొందడంలో సహాయపడుతుంది, అంటే తక్కువ ధరతో మరియు ఎక్కువ ఫీచర్లను అందిస్తుంది.
మీరు వేర్వేరు పాలసీలను షార్ట్‌లిస్ట్ చేసుకున్న తర్వాత, వాటి కింద అందించబడే కవరేజీని ధృవీకరించండి. మీరు ఇన్సూరెన్స్ కంపెనీని మార్చుకోవడానికి గల కారణం నెరవేరిందో లేదో మీరు నిర్ధారించుకోవాలి (లేదంటే మీ పూర్తి శ్రమ వ్యర్థం అవుతుంది).
ఒకవేళ మీరు ఒక సమగ్ర ప్లాన్‌ను కొనుగోలు చేస్తున్నా లేదా అప్‌గ్రేడ్ అవుతున్నా, అవి అందించే యాడ్-ఆన్‌లను పరిగణనలోకి తీసుకోవడం మర్చిపోవద్దు. ఇది నామమాత్రపు ఖర్చుతో పాలసీ పరిధిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువ అనేది ఒక కవర్‌ను కస్టమైజ్ చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన ఒక అంశం.
చివరగా, పాలసీ నిబంధనలను స్పష్టంగా అర్థం చేసుకోవడం మర్చిపోకండి. ఒకసారి మీరు ఆ నిబంధనలను అర్థం చేసుకున్న తర్వాత, ఒక ఉత్తమ ఇన్సూరెన్స్ కవర్‌ను ఎంచుకోవచ్చు. పైన పేర్కొన్న దశలను అనుసరిస్తూ, మీరు ఆన్‌లైన్‌లో కారు ఇన్సూరెన్స్ రెన్యూవల్ సమయంలో పాలసీని అవాంతరాలు లేకుండా మార్చుకోవచ్చు మరియు తగిన ఇన్సూరెన్స్ కవరేజీని పొందవచ్చు. ఇవి కూడా చదవండి: కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు పరిగణించవలసిన విషయాలు
కారు ఇన్సూరెన్స్ ప్రొవైడర్లను మార్చేటప్పుడు, ఈ కీలక అంశాలను గుర్తుంచుకోండి:
ఇవి కూడా చదవండి: కార్ ఇన్సూరెన్స్‌లో యాడ్-ఆన్ కవరేజీలు: పూర్తి సమాచారం ఇవి కూడా చదవండి: భారతదేశంలో 5 రకాల కార్ ఇన్సూరెన్స్ పాలసీలు
ఒక చెడు అనుభవం తర్వాత మీరు మీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చినట్లయితే, మీ ప్రస్తుత పాలసీని రద్దు చేసుకొని కొత్త దానిని కొనుగోలు చేయాలి. పాలసీ వ్యవధి ముగిసేలోపు రద్దు చేస్తే ఎలాంటి జరిమానాలు వర్తిస్తాయో తెలుసుకోండి.
మీ ప్రస్తుత పాలసీ చాలా ఖరీదైనది అయితే, ఇకపై మీ అవసరాలను తీర్చలేకపోతే లేదా మీ ప్రొవైడర్‌తో మీకు చెడు అనుభవం ఎదురైతే కారు ఇన్సూరెన్స్‌ను మార్చుకోవడానికి ఇదే మీకు అనుకూలమైన సమయం.
అవును, మీరు క్లెయిమ్ ఫైల్ చేసిన తర్వాత మీ కారు ఇన్సూరెన్స్ పాలసీని రద్దు చేయవచ్చు, కానీ మినహాయించదగిన మరియు ఏవైనా ఇతర క్లెయిమ్ ఖర్చులను మీరు భరించాల్సి ఉంటుంది. మీరు రద్దు చేయాలని నిర్ణయించుకుంటే, వీలైనంత త్వరగా మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు విషయాన్ని తెలియజేయండి. ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.
3177 Viewed
5 mins read
20 అక్టోబర్ 2024
175 Viewed
5 mins read
16 నవంబర్ 2024
49 Viewed
5 mins read
15 డిసెంబర్ 2025
95 Viewed
5 mins read
07 జనవరి 2022
What makes our insurance unique
With Motor On-The-Spot, Health Direct Click, etc we provide fast claim process , Our sales toll free number:1800-209-0144