రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
First Party Car Insurance: Benefits, Inclusions & Exclusions
30 మార్చి, 2023

ఫస్ట్ పార్టీ కార్ ఇన్సూరెన్స్: ప్రయోజనాలు, చేర్పులు మరియు మినహాయింపులు

కార్ ఇన్సూరెన్స్ అనేది ఊహించని సంఘటనల నుండి తమ వాహనాన్ని రక్షించుకోవడానికి ప్రతి కారు యజమాని తప్పనిసరిగా వెచ్చించాల్సిన ఒక పెట్టుబడి లాంటిది. భారతదేశపు రోడ్ల మీద కార్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, మీకు మరియు మీ కారుకి ఎదురుకాగల అన్ని సంభావ్య ప్రమాదాలను కవర్ చేసే సరైన ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం ముఖ్యం. సమగ్ర కార్ ఇన్సూరెన్స్ అని కూడా పిలువబడే ఫస్ట్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ అనేది భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సమగ్ర కార్ ఇన్సూరెన్స్ రూపాల్లో ఒకటి. కారు మరియు దాని యజమానికి ఇది విస్తృత శ్రేణి రక్షణ అందిస్తుంది. ఈ ఆర్టికల్‌లో, ఫస్ట్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు, చేర్పులు మరియు మినహాయింపులతో సహా దాని వివరాలన్నింటిని మేము తెలియజేస్తాము.

ఫస్ట్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు

ఫస్ట్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ మీకు అందించే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
  • సమగ్ర రక్షణ

ఫస్ట్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ అనేది దొంగతనం, అగ్నిప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు మరియు ప్రమాదవశాత్తు నష్టాలతో సహా విస్తృత శ్రేణి ప్రమాదాల నుండి కారు మరియు దాని యజమానికి పూర్తి రక్షణ అందిస్తుంది.
  • థర్డ్-పార్టీ లయబిలిటీలను కవర్ చేస్తుంది

ఈ కార్ ఇన్సూరెన్స్ అనేది మీ కారుకి జరిగిన నష్టాలను కవర్ చేయడమే కాకుండా, ఇతర రోడ్డు వినియోగదారులకు సంభవించే మరణం లేదా గాయం లేదా వారి ఆస్తికి జరిగిన నష్టంతో సహా థర్డ్-పార్టీ బాధ్యతలన్నింటినీ కవర్ చేస్తుంది.
  • నగదురహిత క్లెయిమ్ సెటిల్‌మెంట్

చాలా కారు ఇన్సూరెన్స్ కంపెనీలు నగదురహిత క్లెయిమ్ సెటిల్‌మెంట్లు అందిస్తాయి. అంటే, పాలసీదారు వారి స్వంత జేబులో నుండి మరమ్మత్తు కోసం చెల్లించే అవసరం లేకుండా ఏదైనా నెట్‌వర్క్ గ్యారేజీల్లో వారి కారును మరమ్మత్తు చేయించుకోవచ్చు.
  • 24/7 రోడ్ అసిస్టెన్స్

ఫస్ట్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ అనేది మీకు అదనంగా 24/7 రోడ్ అసిస్టెన్స్ ప్రయోజనం అందిస్తుంది. రోడ్డు మీద ఉన్నప్పుడు బ్రేక్‌డౌన్లు, టైర్లు పంక్చర్ కావడం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఇది మీకు సహాయపడే ఒక ఉపయోగకరమైన ప్రయోజనంగా ఉంటుంది. అయితే, ఈ ప్రయోజనాన్ని మీరు ఒక యాడ్-ఆన్‌గా అందుకోవాల్సి రావచ్చు. ఇలాంటి ప్రయోజనాలు థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్‌ను మాత్రమే కలిగిన వ్యక్తులకు అందుబాటులో ఉండవు.
  • నో-క్లెయిమ్ బోనస్

పాలసీదారు ఒక పాలసీ సంవత్సరంలో క్లెయిమ్ చేయకపోతే, కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ సమయంలో వారు తమ ప్రీమియంను తగ్గించే ఒక ఎన్‌సిబి ప్రయోజనం సంపాదిస్తారు.
  • కస్టమైజ్ చేయదగిన కవరేజ్

కార్ ఇన్సూరెన్స్ అనేది పాలసీదారు తన అవసరాలు మరియు బడ్జెట్‌కు సరిపోయే యాడ్-ఆన్‌లు ఎంచుకోవడం ద్వారా, తన కవరేజీని కస్టమైజ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది.

సమగ్ర కార్ ఇన్సూరెన్స్‌లో చేర్పులు

కార్ ఇన్సూరెన్స్ కవరేజీలో కొన్ని చేర్పులు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
  • ఓన్ డ్యామేజ్ కవర్

ఒక థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్  లయబిలిటీ కవరేజీ మాత్రమే కలిగి ఉంటుంది, సమగ్ర కార్ ఇన్సూరెన్సులో ఓన్ డ్యామేజ్ కవర్ ఉంటుంది. అంటే ఏదైనా ప్రమాదం, దొంగతనం లేదా ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టాలు ఎదురైన సందర్భంలో మీ కారు మరమ్మత్తు లేదా విడి భాగాల భర్తీని ఈ పాలసీ కవర్ చేస్తుంది. మీ స్వంత-నష్టం కవరేజీ పరిధి గురించి మీరు మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ వద్ద తప్పనిసరిగా తనిఖీ చేయాలి.
  • థర్డ్-పార్టీ లయబిలిటీ కవర్

సమగ్ర కార్ ఇన్సూరెన్స్‌లో థర్డ్-పార్టీ లయబిలిటీ కవర్ ఉంటుంది. మీ కారుకు సంబంధించిన ప్రమాదం కారణంగా తలెత్తే చట్టపరమైన మరియు ఆర్థిక బాధ్యతలను ఇది కవర్ చేస్తుంది. ఈ కవర్ థర్డ్-పార్టీ వైద్య ఖర్చులను చెల్లిస్తుంది. అలాగే, వారి ఆస్తికి జరిగే ఏవైనా నష్టాల కోసం పరిహారం అందిస్తుంది. మీరు థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినప్పుడు ఈ కవరేజీని అందుకుంటారు. అయితే, ఫస్ట్-పార్టీ కార్ ఇన్సూరెన్స్‌తో మీరు థర్డ్-పార్టీ లయబిలిటీ మరియు ఓన్-డ్యామేజ్ కవరేజీని పొందుతారు.
  • పర్సనల్ యాక్సిడెంట్ కవర్

ఒక సమగ్ర కారు ఇన్సూరెన్స్, పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ను కలుపుకొని ఉంటుంది. ప్రమాదం జరిగిన సందర్భంలో ఇది పాలసీదారు మరియు ప్రయాణీకులను కవర్ చేస్తుంది. అలాగే, ప్రమాదం కారణంగా మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు ఈ కవర్ పాలసీదారు మరియు ప్రయాణీకులకు పరిహారం చెల్లిస్తుంది.

సమగ్ర కార్ ఇన్సూరెన్స్ మినహాయింపులు

ఫస్ట్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ కవర్ చేయని కొన్ని అంశాలు మరియు సందర్భాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి:
  • అరుగుదల మరియు తరుగుదల

సాధారణ అరుగుదల మరియు తరుగుదల కారణంగా కారుకి జరిగే నష్టాలను కార్ ఇన్సూరెన్స్ కవర్ చేయదు. వయసు మీరడం, సరైన నిర్వహణ లేకపోవడం లేదా కారు అధిక వినియోగం కారణంగా జరిగే నష్టాలు ఇందులో ఉంటాయి.
  • వీటి ప్రభావంతో డ్రైవింగ్ చేయడం

మీరు మద్యం లేదా ఏదైనా ఇతర పదార్థాల ప్రభావంలో ఉన్నప్పుడు జరగగల ప్రమాదాలను కార్ ఇన్సూరెన్స్ కవర్ చేయదు. ఇలాంటి వాటి ప్రభావంతో డ్రైవింగ్ చేయడమనేది భారతదేశంలో ఒక నేరపూరిత అపరాధం అని మీరు తెలుసుకోవాలి. ఇలాంటి సందర్భంలో మీరు క్లెయిమ్ తిరస్కరణ ఎదుర్కోవడం మాత్రమే కాకుండా, భారీ జరిమానాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
  • చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం

యాక్సిడెంట్ సమయంలో కారు డ్రైవర్‌కు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరించబడుతుంది. యాక్సిడెంట్ సమయంలో కారు డ్రైవర్‌కు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉందని పాలసీదారు తప్పక నిర్ధారించుకోవాలి.
  • ఉద్దేశపూర్వక నష్టాలు

ఉద్దేశ్యపూర్వక లేదా స్వీయ ప్రేరేపిత నష్టాలను ఫస్ట్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ కవర్ చేయదు. ఉదాహరణకు, పాలసీదారు తన స్వంత కారుకు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగిస్తే, కారును మరమ్మత్తు చేయడం లేదా మార్పులు చేయడం కోసం అయ్యే ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేయదు.
  • భౌగోళిక ప్రాంతం వెలుపల డ్రైవింగ్

ఇన్సూరెన్స్ పాలసీలో పేర్కొన్న భౌగోళిక కవరేజీ పరిధి వెలుపల ప్రమాదం జరిగినప్పుడు ఎదురయ్యే నష్టాలను ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేయకపోవచ్చు. ఉదాహరణకు, భారతదేశంలోని ఇన్సూరెన్స్ కంపెనీలు మీకు భారతదేశంలో ఎక్కడైనా కవరేజీని అందిస్తాయి. అయితే, పొరుగు దేశంలో రోడ్డు ట్రిప్ సమయంలో ప్రమాదం జరిగితే, మీరు కవరేజ్ అందుకోలేరు.

ముగింపు

చివరగా, ఫస్ట్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ అనేది కారు మరియు దాని యజమానికి విస్తృత శ్రేణి రిస్కుల నుండి సమగ్ర రక్షణ అందిస్తుంది. మీ కోసం సరైన పాలసీని ఎంచుకోవడం కోసం కార్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు, చేర్పులు మరియు మినహాయింపుల గురించి అర్థం చేసుకోవడం ముఖ్యం. వివిధ ఇన్సూరెన్స్ పాలసీలను సరిపోల్చడం మరియు సరసమైన ప్రీమియంతో ఉత్తమ కవరేజీ అందించే ఒకదాన్ని ఎంచుకోవడం మంచిది. కవరేజీ మరియు ప్రీమియం మధ్య మంచి సమతుల్యత నిర్ధారించడం కోసం మీరు దీనిని ఉపయోగించాలి ఆన్‌లైన్ కార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్. కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి ముందు ఎల్లప్పుడూ పాలసీ డాక్యుమెంట్‌ను జాగ్రత్తగా చదవండి మరియు అన్ని చేర్పులు, మినహాయింపులు మరియు నిబంధనలు మరియు షరతుల గురించి మీరు తెలుసుకున్నారని నిర్ధారించుకోండి. సమగ్ర కార్ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడి పెట్టడమనేది ఊహించని సంఘటనల నుండి ఒక కారు మరియు దాని యజమానికి పూర్తి రక్షణ అందిస్తుంది. మరి, ఆలస్యం దేనికి? ఈ రోజే మీ కారును ఇన్సూర్ చేసుకోండి మరియు మీరు డ్రైవ్ చేసేటప్పుడు మనశ్శాంతిని ఆస్వాదించండి!   ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి