రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
India's E-Scooter & Bike RTO Rules
ఫిబ్రవరి 3, 2023

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు బైక్‌కు సంబంధించిన ఆర్‌టిఓ నియమాలు: వీటిని పాటించండి

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవిల)కు, ప్రత్యేకించి ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు బైకులకు ప్రజాదరణ పెరుగుతోంది. ఈ వాహనాలు పర్యావరణ అనుకూలమైనవి మాత్రమే కాకుండా గ్యాసోలిన్ వాహనాలతో పోలిస్తే, తక్కువ ఖర్చుతో వస్తాయి. అయితే, ఇతర వాహనాల మాదిరిగానే ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు బైక్‌లు కూడా నిర్ధిష్ట ఆర్‌టిఓ నియమాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండాలి. అవి, వెహికల్ రిజిస్ట్రేషన్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్సూరెన్స్. భారతదేశంలో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్ కొనుగోలు చేసేటప్పుడు లేదా ఉపయోగించేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని ఆర్‌టిఓ నియమాలు మరియు నిబంధనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు బైకుల కోసం నియమాలు మరియు నిబంధనలు

·       లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్

ఇతర వాహనాల మాదిరిగానే, ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు బైక్‌లను ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్‌టిఓ)లో నమోదు చేసుకోవాలి. మీ ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్‌ను రిజిస్టర్ చేసుకోవడానికి, మీరు మీ ఐడి రుజువు, చిరునామా రుజువు మరియు ఇన్సూరెన్స్ రుజువును అందించాలి. మీ వద్ద ఇప్పటికే గ్యాసోలిన్‌తో నడిచే వాహనం కోసం లైసెన్స్ ఉంటే, ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్‌ను నడపడానికి కూడా మీరు అదే లైసెన్స్‌ ఉపయోగించవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్‌ను రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. మీరు మీ స్థానిక ఆర్‌టిఓ కార్యాలయాన్ని సందర్శించి, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి. డాక్యుమెంట్లు ధృవీకరించబడిన తర్వాత, ఆర్‌టిఓ సంస్థ మీ వాహనానికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సి) మరియు నంబర్ ప్లేట్‌ను జారీ చేస్తుంది.

·       ఇన్సూరెన్స్

భారతదేశంలో ఒక థర్డ్-పార్టీ ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్  ‌ను కలిగి ఉండడం తప్పనిసరి. ప్రమాదం జరిగినప్పుడు థర్డ్-పార్టీ వ్యక్తికి లేదా ఆస్తికి జరిగే ఏదైనా నష్టాన్ని ఈ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. అయితే, మీ స్వంత వాహనానికి జరిగే నష్టాలను కూడా కవర్ చేసే విధంగా ఒక సమగ్ర ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సిఫార్సు చేయడమైనది. మీ ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్‌ కోసం ఇన్సూరెన్స్ కలిగి ఉండడం చాలా అవసరం. ఎందుకంటే, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీకు ఎదురయ్యే ఏదైనా ఆర్థిక బాధ్యతల నుండి అది మిమ్మల్ని రక్షిస్తుంది. భారతదేశంలో అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఇన్సూరెన్స్ పాలసీలు అందిస్తున్నాయి మరియు మీరు మీ అవసరాలు మరియు బడ్జెట్‌‌కు అనుగుణంగా తగినదాన్ని ఎంచుకోవచ్చు.

·       నంబర్ ప్లేట్

మీ ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్‌కి తప్పనిసరిగా ఆర్‌టిఓ ఇచ్చిన నంబర్ ప్లేట్‌ ఉండాలి. ఆ నంబర్ ప్లేట్‌ను వాహనం ముందు మరియు వెనుక బిగించాలి మరియు చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి ఉండాలి. నంబర్ ప్లేట్ అనేది మీ ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్‌లో ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది. ఎందుకంటే, ఇది మీ వాహనం మరియు దాని యజమానిని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. నంబర్ ప్లేట్ స్పష్టంగా కనిపించేలా ఉండాలి మరియు ఏవిధంగానూ పాడు కాకూడదు.

·       ఛార్జింగ్ స్టేషన్లు

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు బైక్‌ల కోసం ఛార్జింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేయడానికి సంబంధించి ఎలాంటి నిర్దిష్ట నియమాలు మరియు నిబంధనలు లేవు. అయితే, వాహనం తయారీదారు ఆమోదించిన ఛార్జింగ్ స్టేషన్‌ను ఉపయోగించాల్సిందిగా సిఫార్సు చేయడమైనది. ప్రామాణిక ఎలక్ట్రికల్ అవుట్‌లెట్లు లేదా ఛార్జింగ్ స్టేషన్ ఉపయోగించి ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు బైక్‌లను ఛార్జ్ చేయవచ్చు. ఛార్జింగ్ స్టేషన్ల కోసం ఎలాంటి నిర్దిష్ట నియమాలు మరియు నిబంధనలు లేనప్పటికీ, మీ వాహనానికి అనుగుణమైన మరియు తయారీదారు ద్వారా ఆమోదించబడిన ఛార్జింగ్ స్టేషన్‌ ఉపయోగించడం ముఖ్యం.

·       పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పియుసి) సర్టిఫికెట్

ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణ అనుకూలమైనవి మరియు ఎలాంటి హానికర కాలుష్య కారకాలను విడుదల చేయవు. అయినప్పటికీ, మీ ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్‌కు పియుసి సర్టిఫికేట్ పొందడం తప్పనిసరి. ఇన్సూరెన్స్ అనేది చట్టపరమైన అవసరం మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ బైక్ కోసం అది కూడా ఒక ముఖ్యమైన అవసరం. పియుసి సర్టిఫికేట్ అనేది ప్రభుత్వం నిర్దేశించిన కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని పేర్కొనే రుజువుగా ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు బైక్‌లతో సహా, భారతదేశంలోని అన్ని వాహనాల కోసం చెల్లుబాటు అయ్యే పియుసి సర్టిఫికేట్ ఉండడం తప్పనిసరి. మీరు మీ ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్‌ను ప్రభుత్వం ఆమోదించిన పియుసి సెంటర్‌లో పరీక్షించడం ద్వారా, పియుసి సర్టిఫికేట్ పొందాలి.

·       బ్యాటరీ సర్టిఫికేషన్

ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు బైక్‌లలో ఉపయోగించే బ్యాటరీ అనేది తప్పనిసరిగా ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) లేదా ఏదైనా ఇతర అధీకృత పరీక్షా ఏజెన్సీ ద్వారా ధృవీకరించబడినదై ఉండాలి. బ్యాటరీ సర్టిఫికేషన్ అనేది ప్రభుత్వం నిర్దేశించిన భద్రత మరియు పనితీరు ప్రమాణాలకు అనుగుణంగా ఆ బ్యాటరీ ఉందని నిర్ధారిస్తుంది. మీ ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్ కోసం ధృవీకరించబడిన బ్యాటరీ ఉపయోగించడం ముఖ్యం. ఎందుకంటే, ఇది రైడర్ మరియు వాహనం భద్రతను నిర్ధారిస్తుంది. ధృవీకరించబడిన బ్యాటరీ అనేది మరింత విశ్వసనీయమైనది మరియు సమర్థవంతమైనదిగా ఉండడంతో పాటు మీ వాహనం మెరుగైన పనితీరు మరియు సుదీర్ఘ జీవితాన్ని అది నిర్ధారిస్తుంది. అంతేకాకుండా, మీ వద్ద అన్ని సరైన ధృవపత్రాలు ఉంటే, ఎలక్ట్రిక్ వాహనం ఇన్సూరెన్స్‌ను మీరు సులభంగా కొనుగోలు చేయవచ్చు.

·       వాహనంలో మార్పులు

ఆర్‌టిఓ నుండి అవసరమైన అప్రూవల్స్ పొందకుండానే మీ ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్‌లో మార్పులు చేయడమనేది చట్టవిరుద్ధం. వాహన సంబంధిత అసలు స్పెసిఫికేషన్లు మార్చే ఏదైనా సవరణ అనేది చట్టపరమైన జరిమానాలు మరియు జరిమానాలకు దారితీయవచ్చు. మీరు మీ ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్‌కి మార్పులు చేయాలనుకుంటే, మీరు ఆర్‌టిఓ నుండి అవసరమైన ఆమోదాలు పొందాలి. మీరు చేసే మార్పు అనేది వాహనం భద్రత, పనితీరు మరియు ఉద్గార ప్రమాణాలను ప్రభావితం చేయకుండా మీరు నిర్ధారించుకోవాలి.

·       ఉద్గారాల ప్రమాణాలు

ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు బైక్‌లు ఎటువంటి హానికర కాలుష్య కారకాలను విడుదల చేయనప్పటికీ, ప్రభుత్వం నిర్దేశించిన ఉద్గార ప్రమాణాలను అవి కూడా పాటించాలి. ఉద్గార ప్రమాణాలనేవి ఆ వాహనం పర్యావరణ అనుకూలమైనదని మరియు పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించదని నిర్ధారిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు బైక్‌లు అత్యంత పర్యావరణ అనుకూల వాహనాలుగా పరిగణించబడతాయి. ఎందుకంటే, అవి ఎటువంటి కాలుష్య కారకాలను విడుదల చేయవు. అయినప్పటికీ, ప్రభుత్వం నిర్దేశించిన ఉద్గార ప్రమాణాలకు మీ వాహనం అనుగుణంగా ఉండేలా చూసుకోవడం ఇంకా ముఖ్యం. ముఖ్యంగా, ఈ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న తరువాత కొనుగోలు చేయాలి ఒక ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్.

ముగింపు

ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు బైక్‌లనేవి వాటి పర్యావరణ అనుకూలత మరియు తక్కువ ఖర్చుతో కూడిన నిర్వహణ కారణంగా భారతదేశంలో ప్రజాదరణ పొందుతున్నాయి. అంతేకాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు సొంతం చేసుకోవాలనుకునే వారికోసం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మీద సబ్సిడీ కూడా ఉంది. అయితే, రైడర్ మరియు సాధారణ ప్రజల భద్రతను నిర్ధారించడం కోసం ఆ వాహనాలు కూడా ఆర్‌టిఓ నియమాలు మరియు నిబంధనలను తప్పక పాటించాలి. నియమాలు మరియు నిబంధనలు అనుసరించడం ద్వారా, మీరు ఎలాంటి చట్టపరమైన జరిమానాలు లేదా ఫైన్‌లు లేకుండా ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్‌ను సొంతం చేసుకోవడం ద్వారా అందివచ్చే ప్రయోజనాలు పొందవచ్చు. ఆర్‌టిఓలో మీ వాహనం నమోదు చేసుకోవడం, ఇన్సూరెన్స్ మరియు పియుసి సర్టిఫికేట్‌లు పొందడం, రైడింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించడం మరియు ధృవీకరించబడిన బ్యాటరీ మరియు ఛార్జింగ్ స్టేషన్‌ ఉపయోగించడం లాంటి విషయాలు గుర్తుంచుకోండి. నియమాలు మరియు నిబంధనలను అనుసరించడం ద్వారా, పరిశుభ్రమైన మరియు పచ్చటి వాతావరణానికి మీరు సహకరించవచ్చు మరియు మీ ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్‌ మీద సురక్షితమైన మరియు అవాంతరాలు లేని ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.   * ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.    

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి