మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం, భారతదేశంలో కారు డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే కారు ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. ఏది ఏమైనా, యాక్సిడెంట్స్ వంటి ఊహించని పరిస్థితుల నుండి మిమ్మల్ని, మీ ప్రియమైన వారిని సురక్షితం చేయడం ముఖ్యం.
మనం కొనసాగడానికి ముందు, దీనిని కొనుగోలు చేయడం వలన ఒనగూరే కొన్ని ప్రయోజనాలను చూద్దాం: సమగ్ర కారు ఇన్సూరెన్స్ పాలసీ:
- ప్రమాదం జరిగినప్పుడు ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది.
- ప్రమాదంలో జరిగిన నష్టం కారణంగా కారు రిపేరింగ్ ఖర్చులను కవర్ చేస్తుంది.
- అగ్నిప్రమాదం, భూకంపాలు మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా సంభవించే నష్టానికి మీ కారు ఇన్సూరెన్స్ కవరేజీని అందిస్తుంది.
- థర్డ్-పార్టీ నష్టాలు మరియు చట్టపరమైన బాధ్యతల నుండి కారు డ్రైవర్లను రక్షిస్తుంది.
- మీ కారు దొంగిలించబడినట్లయితే ఆర్థిక పరిహారం అందిస్తుంది.
అంతేకాకుండా, కారు ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా మీ వంతు పరిశోధన చేయండి.
కారు ఇన్సూరెన్స్ వివరాలను ఎల్లవేళలా అందుబాటులో ఉంచుకోవడం చాలా అవసరం. ఇది అవసరమైన సందర్భాల్లో సకాలంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ఫైల్ చేయడానికి సహాయపడుతుంది. Insurance Information Bureau (IIB) భారతదేశంలోని కారు ఇన్సూరెన్స్ హోల్డర్ల యొక్క డిజిటలైజ్డ్ రికార్డులను కలిగి ఉండే ఒక వెబ్‌సైట్‌ను నిర్వహిస్తుంది. మీరు వారి వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ కారు ఇన్సూరెన్స్ పాలసీ స్టేటస్‌ను చెక్ చేయడానికి మీ వివరాలను అందించవచ్చు.
జాగ్రత్త వహించాల్సిన విషయాలు
- మీరు మీ కారు రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎలాంటి ప్రత్యేక క్యారెక్టర్లు లేకుండా నమోదు చేయాలని నిర్ధారించుకోండి.
- మీరు ఇటీవల మీ వాహనానికి ఇన్సూరెన్స్ చేసినట్లయితే, అప్పుడు మీ కారు ఇన్సూరెన్స్ పాలసీ వివరాలు అందుబాటులో ఉండవు.
- కొత్త కారు విషయంలో, రిజిస్ట్రేషన్ నంబర్‌కు బదులుగా ఛాసిస్ నంబర్ మరియు ఇంజిన్ నంబర్‌ను నమోదు చేసి ప్రయత్నించండి.
- ఇన్సూరెన్స్ సంస్థలు మార్చి 2010 తర్వాత సమర్పించిన డేటా మాత్రమే అందుబాటులో ఉంటుంది.
- మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడి ద్వారా గరిష్టంగా 3 సార్లు మాత్రమే ఈ సెర్చ్ ఆప్షన్‌ను ఉపయోగించవచ్చు.
- మీ డేటా అందుబాటులో లేకపోతే లేదా కనిపించకపోతే, మీ కారు ఇన్సూరెన్స్ వివరాల కోసం ప్రస్తుత ఆర్‌టిఎ ని సంప్రదించాలని నిర్ధారించుకోండి.
కారు ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్రక్రియ
- మొదట మీరు, మీ పాలసీ నంబర్ మరియు మీ పాలసీ జారీ చేసిన తేదీ, దాని గడువు తేదీ లాంటి అవసరమైన వివరాలను నమోదు చేయాలి.
- మీరు వివరాలను అందించిన తర్వాత, మీ పాలసీ వివరాలు స్క్రీన్ పై ప్రదర్శించబడతాయి.
- కారు ఇన్సూరెన్స్ రెన్యూవల్ వివరాలతో పాటు, గత సంవత్సరం కారు ఇన్సూరెన్స్ ధరలో ఏవైనా మార్పులు ఉంటే అవి కనిపిస్తాయి.
- ఇన్సూరెన్స్ సంస్థలు మార్చి 2010 తర్వాత సమర్పించిన డేటా మాత్రమే అందుబాటులో ఉంటుంది.
- మీ పాలసీని రెన్యూ చేయడానికి ముందు, పూర్తి వివరాలను, నిబంధనలు మరియు షరతులను సమీక్షించండి.
ఈ ఉపయోగకరమైన కారు ఇన్సూరెన్స్ వివరాలు అన్ని వేళల్లో అందుబాటులో ఉంటాయి. కావున, మీరు భవిష్యత్తు రిఫరెన్స్ కోసం ఈ లింక్‌ను సేవ్ చేసుకోవాలని సూచించడమైనది. మీరు మీ ప్రీమియంలను తగ్గించుకోవడానికి పాలసీలను సరిపోల్చడం మరియు కొన్ని సులభమైన చిట్కాలను అనుసరించడం ద్వారా అతి తక్కువ కార్ ఇన్సూరెన్స్ రేట్లతో మీ రెన్యూవల్‌ను పూర్తి చేయవచ్చు.
రిప్లై ఇవ్వండి