సూచించబడినవి
Motor Blog
12 సెప్టెంబర్ 2024
176 Viewed
Contents
జనాభా మరియు ప్రజల ఆదాయంలో పెరుగుదలతో రోడ్డుపై వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోడ్డు భద్రత స్థాయిలు మాత్రం తీవ్రంగా లోపించాయి. దీంతో ప్రతిరోజూ జరిగే ప్రమాదాల సంఖ్య మరింత పెరిగింది. ప్రమాదాల తీవ్రత గతంలో కంటే ఎక్కువగా ఉంది మరియు రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన మరణాల రేటు కూడా పెరిగింది. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నాయి, అదేసమయంలో కారు ఇన్సూరెన్స్ సంబందిత కొన్ని ప్రధాన అంశాలను లేవనెత్తుతాయి. కాబట్టి, కారు ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసేటప్పుడు మరియు దానిని క్లెయిమ్ చేసేటప్పుడు అనేక అంశాలను గుర్తుంచుకోవాలి, అయితే, ఇక్కడ మేము తరచుగా అడిగే ఒక ప్రశ్నను పరిష్కరిస్తున్నాము అది, కారు ఇన్సూరెన్స్‌లో ఎన్నిసార్లు క్లెయిమ్ చేయవచ్చు అనే దానిపై ఏదైనా పరిమితి ఉందా?
Insurance Regulatory and Development Authority of India (IRDAI), మీరు ఎన్నిసార్లు ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేయవచ్చు అనే దానిపై ఎలాంటి పరిమితిని విధించదు. కాబట్టి, మీ ఇన్సూరర్ వద్ద ఎన్ని క్లెయిమ్‌లు అయినా చేయవచ్చు, అలాగే, అవి చెల్లుబాటు అయ్యే పక్షంలో మాత్రమే పరిగణలోకి తీసుకోబడతాయి. అయితే, ముఖ్యంగా చిన్న చిన్న మరమ్మత్తుల కోసం తరచుగా ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు చేయడం మంచిది కాదు. అలా చేయడం వలన నో-క్లెయిమ్ బోనస్ ప్రభావితం అవుతుంది, ఇది ప్రీమియం భారాన్ని తగ్గించేందుకు సహాయపడే అదనపు ప్రయోజనం. ఉదాహరణకు, మీ విరిగి పోయిన బంపర్ లేదా అద్దాలకు చేసిన స్వల్ప మరమ్మత్తులను క్లెయిమ్ చేయడం అనేది ఒక తెలివైన ఎంపిక కాదు. పెద్ద మొత్తంలో నష్టపరిహారాల కోసం మాత్రమే క్లెయిమ్‌లు చేయడం విలువైనది.
మొదటిది, మీరు మీ కారు ఇన్సూరెన్స్ కింద ఏదైనా క్లెయిమ్ చేసినప్పుడు 'నో క్లెయిమ్ బోనస్' ప్రభావితం అవుతుంది. అనగా, మీరు మునుపటి సంవత్సరంలో పాలసీ కింద ఏ క్లెయిమ్ చేయకపోతే, తదుపరి సంవత్సరంలో చెల్లించే ప్రీమియంపై డిస్కౌంట్‌ను పొందుతారు, దీనినే నో క్లెయిమ్ బోనస్ అంటారు. మీరు ఎంత కాలం పాటు క్లెయిమ్ చేయలేదు అనే దానిని బట్టి ఇది 20% నుండి 50% వరకు ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా క్లెయిమ్ చేసినట్లయితే, సంవత్సరాల తరబడి జమచేసిన మీ నో క్లెయిమ్ బోనస్ మొత్తం ఒక్కసారిగా పోతుంది. కథ మళ్లీ మొదటికి వస్తుంది, చిన్న విషయాల కోసం తరచుగా క్లెయిమ్‌లు చేయడం వలన కస్టమర్ విశ్వసనీయత దెబ్బతింటుంది మరియు తదుపరి సంవత్సరాల్లో చెల్లించాల్సిన ప్రీమియం ప్రభావితం అవుతుంది. తరచూ క్లెయిమ్‌లు చేయడంతో పాలసీ రెన్యూవల్ కూడా మరింత ఖరీదైనదిగా మారుతుంది. అయితే, రిపేర్ ఖర్చు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం క్లెయిమ్ చేయడం మంచిది అని గుర్తుంచుకోవాలి.
పైన చర్చించినట్లు, ఎన్ని క్లెయిమ్‌లను ఎలా చేయవచ్చు అనేదానిపై ఎలాంటి పరిమితి లేదు, కానీ మీరు ఎన్నవసారి ఫైల్ చేస్తున్నారో గుర్తుంచుకోవాలి. తరచుగా క్లెయిమ్‌లు చేయడం అనేది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీనికి గల కొన్ని కారణాలు ఇలా ఉన్నాయి:
నో-క్లెయిమ్ బోనస్ లేదా ఎన్‌సిబి అనేది ఒక క్లెయిమ్ చేయని సందర్భంలో ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించే ప్రయోజనం. రెన్యూవల్ ప్రీమియంలలో మార్క్‌డౌన్ రూపంలో బోనస్ అందుబాటులో ఉంటుంది. అటువంటి మార్క్‌డౌన్ శాతం ఓన్-డ్యామేజ్ ప్రీమియంలో 20% వద్ద ప్రారంభమవుతుంది మరియు ప్రతి వరుసగా క్లెయిమ్-ఫ్రీ పాలసీ వ్యవధితో 5వ సంవత్సరం చివరిలో 50% వరకు ఉంటుంది. కాబట్టి, మీరు ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినప్పుడు, ఈ మొత్తం రెన్యూవల్ ప్రయోజనం జీరో అవుతుంది. మరిన్ని వివరాల కోసం దయచేసి IRDAI యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
తరచుగా ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు చేయడంలో మరొక భారం ఏమిటంటే, మీ సమగ్ర కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం దాని అసలు మొత్తానికి రీస్టోర్ చేయబడుతుంది. ఎన్‌సిబి రద్దు చేయబడినప్పుడు మీ ప్రీమియం దాని అసలు మొత్తంతో రిస్టోర్ చేయబడుతుంది, లేకపోతే మీరు చెల్లించే దానికంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
మీరు మీ స్టాండర్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో జీరో-డిప్రిసియేషన్ యాడ్-ఆన్‌ను కలిగి ఉన్నట్లయితే, పాలసీ దాని రీప్లేస్‌మెంట్ సమయంలో విడిభాగాలపై ఏదైనా డిప్రిసియేషన్ కోసం కవరేజీని కూడా అందిస్తుంది. ఈ యాడ్-ఆన్‌లు స్టాండర్డ్ పాలసీ కవర్‌కు అదనంగా ఉంటాయి కాబట్టి, వాటి నిబంధనలు ఇన్సూరెన్స్ కంపెనీచే నిర్వచించబడతాయి. అందువల్ల, ఈ నిబంధనలు ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లో అలాంటి డిప్రిసియేషన్ కవర్ ఎన్నిసార్లు అందించబడవచ్చు అనేదానిపై పరిమితిని పేర్కొనవచ్చు.
మీరు ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినప్పుడు, మినహాయించదగినది అనేది మీరు మీ జేబు నుండి చెల్లించవలసిన మొత్తం. ఈ మినహాయింపు మొత్తం రెండు వర్గాలుగా విభజించబడుతుంది - తప్పనిసరి మరియు స్వచ్ఛంద మినహాయింపు. తప్పనిసరి మినహాయింపు IRDAI ద్వారా నిర్దేశించబడినందున మరియు స్వచ్ఛంద మినహాయింపు మీ పాలసీ నిబంధనలలో పేర్కొనబడినందున, మీరు క్లెయిమ్ చేసే సమయంలో చెల్లించవలసిన అలాంటి మొత్తాన్ని లెక్కించాలి.
పైన చర్చించినట్లుగా, క్లెయిమ్ నంబర్ పై ఎటువంటి పరిమితులు లేవు. అయితే, మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫైల్ చేసే విషయానికి వస్తే గుర్తుంచుకోవడం మంచిది. అనేక కార్ ఇన్సూరెన్స్ క్లెయిములు ఫైల్ చేయబడకూడదని అర్థం చేసుకోవడానికి మాకు వీలు కల్పించే కొన్ని కీలక కారణాలను ఇక్కడ మేము జాబితా చేసాము:
అయితే, కారు ఇన్సూరెన్స్‌లో ఎన్ని సార్లు క్లెయిమ్ చేయవచ్చు అనే దానిపై ఎలాంటి పరిమితి లేదని మనకు తెలుసు; మనం ఎప్పుడు క్లెయిమ్ చేయకూడదో కూడా తెలుసుకోవాలి. కాబట్టి, క్లెయిమ్ చేయకూడదని సలహా ఇవ్వబడిన పరిస్థితులు ఇలా ఉన్నాయి
కాబట్టి, ఒక క్లెయిమ్ చేయడం ద్వారా మీకు ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు, క్లెయిమ్ చేయకపోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఎందుకు కోల్పోవాలి? అలాగే, ఒకవేళ మీరు ఒక క్లెయిమ్ కింద ఒక మొత్తాన్ని క్లెయిమ్ చేస్తున్నట్లయితే, ఆ మొత్తం రెండు ప్రత్యేక సందర్భాలకు సంబంధించినది అయితే, అప్పుడు మినహాయింపు అనేది రెండు సందర్భాలకు విడిగా వర్తిస్తుందని గుర్తుంచుకోండి.
మొత్తానికి, జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి, మినహాయించదగిన మొత్తానికి వర్తించే పరిమితులు తెలుసుకోవాలి, 'నో క్లెయిమ్ బోనస్' పై సంభావ్య ప్రభావాన్ని గుర్తించాలి మరియు ఆ తరువాత క్లెయిమ్ చేయాలి. ఈ అంచనా ఒక నిర్ణయాత్మక అంశం అయినప్పటికీ, అవసరమైనప్పుడు కార్ ఇన్సూరెన్స్‌ను ఎలా క్లెయిమ్ చేయాలి అనే విషయంలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.
మీ పాలసీ కోసం ఎంత ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని నిర్ణయించాలి అనే దానికి అనేక అంశాలు దోహదపడతాయి. అది ఐడివి అనగా ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూలో మార్పులను మొదలుకొని, ప్రీమియం అమౌంటు సాధారణ స్థాయిలు, పాలసీహోల్డర్ లేదా థర్డ్-పార్టీ చేసిన పొరపాటు కారణంగా ఫైల్ చేయబడిన క్లెయిమ్ స్వభావం మరియు కొన్ని ఇతర అంశాలలో మార్పులకు లోబడి ఉంటుంది. కాబట్టి, క్లెయిమ్‌ల సంఖ్య మరియు ఇన్సూరెన్స్ ప్రీమియం మధ్య ఎలాంటి ప్రత్యక్ష సంబంధం ఉండదు.
లేదు, క్లెయిమ్‌ను సమర్పించడానికి ఎలాంటి సమయ పరిమితి లేదు, కానీ సాధ్యమైనంత త్వరగా దానిని పూర్తి చేయడం మంచిది, అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ, ఈ విధమైన జాప్యాల కారణంగా క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశం ఉండదు.
కారు ఇన్సూరెన్స్‌లో ఎన్ని క్లెయిమ్‌లు అనుమతించబడతాయి అనే దానిపై పరిమితి లేదు, అయితే క్లెయిమ్ మొత్తం ఐడివి లోపు ఉండాలి. అప్పుడు, మీరు అదే పాలసీ కింద క్లెయిమ్ చేయవచ్చు.
అనుమతించబడిన క్లెయిముల సంఖ్యపై ఎటువంటి నిర్దిష్ట పరిమితి లేదు, కానీ అధిక క్లెయిములు మీ నో క్లెయిమ్ బోనస్ (NCB) ను ప్రభావితం చేయవచ్చు మరియు పాలసీ రెన్యూవల్ నిబంధనలను ప్రభావితం చేయవచ్చు.
చాలా పాలసీలు యాక్సిడెంట్ క్లెయిమ్‌ల సంఖ్యపై పరిమితిని సెట్ చేయనప్పటికీ, తరచుగా క్లెయిమ్‌లు పాలసీ రెన్యూవల్ సమయంలో అధిక ప్రీమియంలు లేదా కఠినమైన నిబంధనలకు దారితీయవచ్చు.
మీరు మీ పాలసీ నిబంధనల ప్రకారం ఒక సంవత్సరంలో అనేక క్లెయిములను ఫైల్ చేయవచ్చు, కానీ పునరావృత క్లెయిములు నో క్లెయిమ్ బోనస్ (NCB) వంటి మీ ప్రయోజనాలను ప్రభావితం చేయవచ్చు.
3177 Viewed
5 mins read
20 అక్టోబర్ 2024
175 Viewed
5 mins read
16 నవంబర్ 2024
49 Viewed
5 mins read
15 డిసెంబర్ 2025
95 Viewed
5 mins read
07 జనవరి 2022
What makes our insurance unique
With Motor On-The-Spot, Health Direct Click, etc we provide fast claim process , Our sales toll free number:1800-209-0144