రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Bike Insurance Fine
ఫిబ్రవరి 2, 2021

చెల్లుబాటు అయ్యే పాలసీ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు బైక్ ఇన్సూరెన్స్ జరిమానా

భారతదేశంలో, చెల్లుబాటు అయ్యే వెహికల్ ఇన్సూరెన్స్ అనేది మోటార్‌బైక్ రైడర్‌ కలిగి ఉండవలసిన తప్పనిసరి డాక్యుమెంట్లలో ఒకటి. మోటారు వాహన చట్టం, 2019 ప్రకారం వాహన ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం చట్టవిరుద్ధం అని ప్రభుత్వ పాలసీలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. అయినప్పటికీ, భారతదేశంలోని రోడ్ల పై తిరిగే వాహనాలలో దాదాపుగా 57% కి ఇన్సూరెన్స్ లేదు. 2017-18 లో నిర్వహించిన సర్వేల ప్రకారం, ఈ సంఖ్య 21.11 కోట్లకు చేరింది. ఇన్సూరెన్స్ చేయబడని వాహనాలలో 60% వాహనాలు టూ-వీలర్లు, ఇవి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాలు. బైక్ ఇన్సూరెన్స్ అనేది భారతదేశంలో వివాదాస్పద అంశం, ఇన్సూరెన్స్ లేని వాహనాలలో అత్యధికంగా బైకులు ఉంటాయి. ఇన్సూరెన్స్ లేని రైడర్ల పై భారీ బైక్ ఇన్సూరెన్స్ జరిమానాను విధించే నియమాలు ఉన్నాయి. ఈ ఆర్టికల్‌లో మీ టూ వీలర్‌కి ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత మరియు అది లేకపోవడం వలన ఎదురయ్యే పర్యవసానాలను మేము వివరిస్తాము.

2019 మోటార్ వాహన చట్టం

చెల్లుబాటు అయ్యే వాహన ఇన్సూరెన్స్ లేకుండా ఒక వ్యక్తి టూ-వీలర్‌ను నడపడం చట్టవిరుద్ధం. ఇన్సూరెన్స్ లేకుండా ఎవరైనా పట్టుబడితే, వారికి జైలు శిక్ష మరియు జరిమానాలు విధించబడతాయి. పెరుగుతున్న మోటార్ వాహన సంబంధిత మరణాలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకోబడింది. 2019 లో, భారతదేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా 1,49,000 కంటే ఎక్కువ మరణాలు సంభవించాయి. సాధారణ పౌరుల కోసం ఇది చాలా తీవ్రమైన సమస్య అని రుజువవుతోంది మరియు దీనికి పరిష్కారంగా కఠినమైన పాలసీలు అవసరం. అందువల్ల, చట్టాలను ఉల్లంఘించినందుకు జరిమానాలతో పాటు, ప్రభుత్వం థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ ఆదేశాన్ని కూడా జారీ చేసింది. ఈ ఆదేశం ప్రకారం, ప్రమాదం జరిగిన సందర్భంలో థర్డ్ పార్టీకి జరిగిన నష్టాల కోసం డ్రైవర్లు ఇన్సూర్ చేయబడతారు.

అపరాధ రుసుము మరియు జరిమానాలు

బైక్ ఇన్సూరెన్స్ పాలసీలకు కట్టుబడి ఉండకపోతే మీ పై అనేక రకాల జరిమానాలు విధించబడతాయి.
  • బైక్ ఇన్సూరెన్స్ జరిమానా

గతంలో రూ. 1000 జరిమానా విధించబడేది, కానీ ప్రస్తుతం ఈ జరిమానా రూ. 2000 కి పెంచబడింది. కొన్ని కేసులలో 3 నెలల జైలు శిక్ష కూడా ఉంటుంది.
  • నో క్లెయిమ్ బోనస్

బైక్ ఇన్సూరెన్స్‌లో ఎన్‌సిబి లేదా నో క్లెయిమ్ బోనస్ అనేది పాలసీ యాక్టివ్‌గా ఉన్నప్పుడు మీరు ఎటువంటి క్లెయిమ్ చేయకపోతే మీరు అందుకునే ఒక ప్రయోజనం. మీరు 90 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజుల పాటు చెల్లుబాటు అయ్యే బైక్ ఇన్సూరెన్స్ లేకుండా పట్టుబడితే, ఎన్‌సిబి ల్యాప్స్ అవుతుంది.
  • చట్టపరమైన బాధ్యత

ఒక దురదృష్టకరమైన పరిస్థితిలో ఒక ఇన్సూరెన్స్ లేని వాహనం నడుపుతున్నప్పుడు మీకు ప్రమాదం జరిగితే, మీ పై క్రిమినల్ నేరం (నిర్లక్ష్యం) మోపబడటమే కాకుండా థర్డ్ పార్టీకి జరిగిన నష్టాలకు బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇది రెండు విధాలుగా నష్టాన్ని కలిగిస్తుంది.

మీరు బైక్ ఇన్సూరెన్స్ లేకుండా పట్టుబడితే ఏం జరుగుతుంది?

వాహన ఇన్సూరెన్స్ లేకుండా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘనకి పాల్పడుతూ మీరు ఒక ట్రాఫిక్ పోలీసుకి చిక్కిన పరిస్థితులలో, ఇవి జరగవచ్చు. మీ వాహనానికి సంబంధించిన అన్ని చట్టపరమైన డాక్యుమెంట్లను సమర్పించమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఇది మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సి), కాలుష్య సర్టిఫికెట్ మరియు ఇన్సూరెన్స్ పాలసీ కూడా. మీరు పరిశోధనా అధికారికి అన్ని డాక్యుమెంట్లను చూపించాలి. ఒకవేళ మీ వద్ద డాక్యుమెంట్లు అందుబాటులో లేకపోతే, మీరు బైక్ ఇన్సూరెన్స్ జరిమానాను చెల్లించవలసి ఉంటుంది. ఎటువంటి డాక్యుమెంట్లు లేకపోతే, వాటి ప్రకారం మీకు జరిమానా విధించబడుతుంది. వివిధ డాక్యుమెంట్ల కోసం వివిధ జరిమానాలు ఉంటాయి. చలాన్ పేపర్ రూపంలో మీకు జరిమానా జారీ చేయబడుతుంది, దీనిని జరిమానా చెల్లించడానికి ఉపయోగించవచ్చు. ఆన్‌లైన్ చెల్లింపు ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా సందర్భాల్లో, చలాన్‌ను రాష్ట్ర విభాగం యొక్క ఇ-చలాన్ వెబ్‌సైట్ ద్వారా చెల్లించవచ్చు. ఆఫ్‌లైన్ చెల్లింపు కోసం, సమీప ట్రాఫిక్ విభాగ కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా చెల్లించవచ్చు. టూ వీలర్ ఇన్సూరెన్స్ జరిమానాను నివారించడానికి చిట్కాలు
  • మీ దగ్గర అన్ని టూ-వీలర్ వాహనాల కోసం బైక్ ఇన్సూరెన్స్ ఉందని నిర్ధారించుకోండి.
  • ఇన్సూరెన్స్ యొక్క డిజిటల్ మరియు సాఫ్ట్ కాపీలను సృష్టించుకోండి. వాహనంలో సాఫ్ట్ కాపీలు మరియు మీ మొబైల్ ఫోన్ పై డిజిటల్ కాపీలను ఉంచుకోండి.
  • మీ ఇన్సూరెన్స్ పాలసీల యొక్క టూ వీలర్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ అవధిని గమనిస్తూ ఉండండి మరియు వాటిని సకాలంలో రెన్యూ చేయండి.
  • ఇప్పుడు చట్టప్రకారం తప్పనిసరి చేయబడిన థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్‌ని పొందండి.

ముగింపు

భారతదేశంలో ఉన్న ట్రాఫిక్ పరిస్థితి మరియు వ్యక్తిగత రహదారి భద్రత మార్గదర్శకాల వలన బైక్ యజమానులు అందరూ చెల్లుబాటు అయ్యే బైక్ ఇన్సూరెన్స్ పాలసీలను వెంట ఉంచుకోవాలి. భారతదేశంలో ఇది ఒక నైతిక బాధ్యత మరియు సురక్షితమైన రహదారుల కోసం అనుసరించవలసిన చట్టపరమైన విధి. ప్రతికూల పర్యవసానాలను నివారించడానికి సరికొత్త పాలసీలకు అనుగుణంగా ఉండండి. సంబంధిత టూ-వీలర్ ఇన్సూరెన్స్‌ను కూడా తప్పనిసరిగా పొందండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి