రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
24 x 7 Motor Insurance Spot Assistance
అక్టోబర్ 26, 2022

24x7 స్పాట్ అసిస్టెన్స్: మీ రోడ్డు ప్రయాణాలు సాఫీగా సాగడానికి ఇది ఒక 'బ్యాకప్' లాంటిది

అది ఎలాగో చూద్దాం, నలుగురు స్నేహితులు వర్షాకాలం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారు ప్రతి వీకెండ్ కోసం ప్లాన్లు సిద్ధం చేసుకున్నారు. వారు కొన్ని ఆట వస్తువులు, స్నాక్స్ మరియు ఎలక్ట్రానిక్ గేర్‌ లను బ్యాక్‌ప్యాక్‌లో సర్దుకొని వాహనంలో ట్రిప్‌కు బయలుదేరారు. ఈ ట్రిప్ సమీపంలోని హిల్ స్టేషన్‌లో 2 రోజులపాటు ప్లాన్ చేయబడింది, దీని ముఖ్యోద్దేశం వీలైనన్ని దృశ్యాలను చూడటం మరియు అందమైన చిత్రాలను కెమెరాలో బంధించడం. ఈ ప్రయాణం సూపర్ హిట్ వాన పాటలతో ప్రారంభమైంది మరియు కొద్ది సమయంలోనే నలుగురూ కలిసి పాడటం మొదలుపెట్టారు. దానికి తోడుగా చల్లని గాలి మరియు తేలికపాటి వర్షం వారికి మానసిక ఉల్లాసాన్ని అందించాయి, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. వారు ఘాట్ రోడ్డును చేరుకున్నప్పుడు, తెరచి ఉన్న కారు కిటికీలను మంచు మేఘాలు చుట్టుముట్టాయి. అప్పుడు అక్షరాలా వారు ఆకాశవీధిలోని ఆనందాన్ని అనుభూతి చెందారు! అయితే, ఆకస్మాత్తుగా వారి ప్రయాణం ఆగిపోయింది - టైర్‌ పంచర్ అవ్వడమే దీనికి కారణం. వారి వద్ద ఒక స్పేర్ టైర్ కూడా లేదు మరియు నగరానికి చాలా దూరంగా ఉన్నారు, సమీపంలో ఎలాంటి మద్దతు అందుబాటులో లేని ఒక అపరిచిత ప్రదేశంలో వారు చిక్కుకుపోయారని గ్రహించిన తరువాత వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వారి సంతోషకరమైన ట్రిప్ ఆందోళనకరంగా మారింది. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? వారు సరైన ప్లాన్‌తో ట్రిప్‌కు బయలుదేరారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో పరిగణలోకి తీసుకోవాల్సిన కొన్ని అంశాలను చూడండి:
 • వర్షాకాలంలో ఫ్లాట్‌ టైర్లు సర్వసాధారణం. ఎందుకనగా రోడ్లపై చెల్లాచెదురుగా ఉన్న చెత్త ఇరుక్కుపోయి టైర్‌ తొందరగా పంక్చర్ అవుతుంది. అయితే, ఒక స్పేర్ టైర్‌ను ఉంచుకోవడం వల్ల ఈ పరిస్థితిని సులభంగా అధిగమించవచ్చు.
 • ఒకవేళ భారీ వర్షాల కారణంగా ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌లోకి నీరు ప్రవేశించి, ఇంజిన్ పాడైపోయి కారు పూర్తిగా దెబ్బతింటే, పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది.
మరి ఇలాంటి వాటి కోసం వారు పూర్తిగా సంసిద్ధం అవడానికి వేరే ఏదైనా మార్గం ఉందా? సమాధానం, అవును అనే చెప్పవచ్చు. 24 x 7 స్పాట్ అసిస్టెన్స్‌తో కూడిన ఒక ఇన్సూరెన్స్ పాలసీ, ఈ పరిస్థితులను సులభంగా పరిష్కరించడంలో వారికి తోడుగా ఉంటుంది. అవును, మీరు సరిగ్గానే చదివారు. మా మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ 24x7 స్పాట్ అసిస్టెన్స్ అనే కవర్‌తో వస్తుంది. మరియు దాని గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు:
 • మీ ఇన్సూరెన్స్ చేయబడిన కారు ఆగిపోతే, అప్పుడు మా వాల్యూ యాడెడ్ సర్వీసులు (విఎఎస్) – 24 x 7 స్పాట్ అసిస్టెన్స్ కవర్ మీకు ఈ కింది ప్రయోజనాలను అందిస్తుంది:
  • యాక్సిడెంట్: యాక్సిడెంట్ సందర్భంలో మేము మీకు స్పాట్ సర్వే సదుపాయాన్ని అందిస్తాము, క్లెయిమ్ ఫారం డాక్యుమెంటేషన్‌ కొరకు మీకు సహాయం చేస్తాము.
  • టోయింగ్ సౌకర్యం: మీరు మా కస్టమర్ కేర్ నంబర్‌పై మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము టోయింగ్ సౌకర్యాన్ని కల్పిస్తాము. తద్వారా మీరు బజాజ్ అలియంజ్ యొక్క సమీప నెట్‌వర్క్ గ్యారేజీకి మీ వాహనాన్ని తరలించవచ్చు.
  • వసతి ప్రయోజనం: ఒకవేళ మీ కారు పూర్తిగా పనిచేయని స్థితిలో ఉండి, సంఘటనను నివేదించిన సమయం నుండి 12 గంటల్లోపు దాని రిపేర్ పూర్తి కాకపోతే, మీరు మీ కోసం ప్రత్యేకించిన 24x7 స్పాట్ అసిస్టెన్స్ యాడ్-ఆన్ కవర్‌తో వసతి ప్రయోజనాన్ని పొందవచ్చు కారు ఇన్సూరెన్స్ పాలసీ . ఒకవేళ యాక్సిడెంట్ అనేది కవర్ చేయబడిన నగరం నుండి 100 కి.మీల దూరంలో జరిగితే మరియు మరొక కవర్ చేయబడిన నగరంలోని 100 కి.మీల పరిధి లోపల జరిగితే, అప్పుడు మేము రోజుకు రూ. 2000 చొప్పున ఒక పాలసీ సంవత్సరానికి రూ.16,000 వరకు ఓవర్‌నైట్ స్టే ఖర్చులను అందజేస్తాము.
  • టాక్సీ ప్రయోజనం: సంఘటన తర్వాత కూడా మీరు మీ ప్రయాణాన్ని కొనసాగించాల్సి వస్తే, మేము ఆ ప్రదేశం నుండి 50 కి.మీల వరకు ఎక్కడికైనా మీకు టాక్సీ ప్రయోజనాన్ని అందిస్తాము
  • రోడ్‌సైడ్ అసిస్టెన్స్: మీరు కారు డ్యామేజీ కారణంగా ఎక్కడైనా చిక్కుకుపోతే మేము బ్యాటరీ జంప్ స్టార్ట్, స్పేర్ కీ పికప్ మరియు డ్రాప్ సౌకర్యం, ఫ్లాట్ టైర్ సేవలు మరియు మెకానికల్/ ఎలక్ట్రికల్ భాగాల సంబంధిత చిన్న రిపేర్స్ లాంటి సేవలను అందజేస్తాము.
  • అత్యవసర సందేశాలను పంపించడం: కేవలం ఒక ఎస్ఎంఎస్ లేదా కాల్ ద్వారా మీ బంధువులకు మీ ట్రిప్ గురించిన ప్రస్తుత పరిస్థితిని తెలియజేస్తాము. పాలసీని కొనుగోలు సమయంలో మీరు అందించిన ప్రత్యామ్నాయ నంబర్‌ను మేము సంప్రదిస్తాము.
  • ఇంధన సహాయం: ఒకవేళ మీ వద్ద ఇంధనం లేకపోతే మరియు మీ వాహనం కదలకుండా ఆగిపోతే, అప్పుడు మేము చార్జీల ప్రాతిపదికన మీరు ఉన్న ప్రదేశంలో 3 లీటర్ల వరకు ఇంధనాన్ని అందించగలము.
  • మెడికల్ కో-ఆర్డినేషన్: మీ కారు బ్రేక్‌డౌన్ అయినప్పుడు మీరు గాయపడవచ్చు, అలాంటి సందర్భంలో సమీపంలోని వైద్య కేంద్రాన్ని గుర్తించడంలో మేము మీకు సహాయపడగలము.
  • చట్టపరమైన సలహా: అవసరమైతే ఫోన్‌లో 30 నిమిషాల వరకు చట్టపరమైన మద్దతును కూడా అందిస్తాము.
 • ఒకవేళ మీ ఇన్సూర్ చేయబడిన టూ వీలర్ కదలకుండా ఆగిపోతే, అప్పుడు మీరు కేవలం స్వల్ప మార్పులు ఉన్న పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలతో కూడిన మా టూ వీలర్ లాంగ్ టర్మ్ పాలసీతో పాటు 24 x 7 స్పాట్ అసిస్టెన్స్ కవర్ పొందవచ్చు:
  • ఇంధన సహాయం: ఈ సర్వీసు సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది మరియు సరఫరా చేయబడే ఇంధన పరిమాణం ప్రతి సంఘటనకు 1 లీటర్ చొప్పున తగ్గుతుంది.
  • టాక్సీ ప్రయోజనం: మేము సంఘటన స్థలం నుండి 40 కిలోమీటర్ల వరకు మీకు టాక్సీ సేవలను అందిస్తాము. 40 కిలోమీటర్లకు మించిన ప్రయాణ ఖర్చులను మీరే భరించాలి.
  • వసతి ప్రయోజనం: ఒకవేళ మీ టూ వీలర్ పని చేయని పరిస్థితిలో పడి ఉంటే మరియు సంఘటనను నివేదించిన సమయం నుండి 12 గంటల్లో రిపేర్ చేయబడకపోతే, మీరు యాడ్-ఆన్‌గా అందించబడే వసతి ప్రయోజనాన్ని పొందవచ్చు 2 వీలర్ ఇన్సూరెన్స్ . మీరు సంవత్సరానికి ఒకసారి ఈ సేవను పొందవచ్చు అలాగే, రాత్రిపూట బస కోసం రోజుకు రూ. 3000 వరకు ఉపయోగించవచ్చు.
మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి వర్షాలను ఆస్వాదించడానికి వర్షాకాలం సరైన సమయం. కానీ, వర్షాకాలంలో ఊహించని పరిస్థితుల కారణంగా మీ విలువైన సమయం వృధా కావచ్చు. మోటారు ఇన్సూరెన్స్ పాలసీతో మా 24 x 7 స్పాట్ అసిస్టెన్స్ కవర్ పొందండి మరియు మీకు అవసరమైనప్పుడల్లా, ఎక్కడైనా సహాయం పొందండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 4 / 5. ఓట్ల లెక్కింపు: 1

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

 • ఆ కారణంగా మీరు మార్గమధ్యంలో నిలిచిపోయారు. మీరు ఒక కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ ఎంచుకున్నట్లయితే మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు

 • లిండా - జూలై 5, 2018 9:45 am కి

  నిజానికి నేను నాకు కనిపించే ప్రతి పోస్ట్‌లపై ఎలాంటి కామెంట్స్ చేయను. కానీ, ఇది కొంచెం ఆసక్తికరంగా అనిపించింది. ఇక్కడ షేర్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇది ఒక మంచి బ్లాగ్! Yahoo న్యూస్‌లో సర్ఫింగ్ చేస్తున్నప్పుడు నాకు ఇది కనిపించింది. Yahoo న్యూస్‌లో ఎలా లిస్ట్ అవ్వాలి అనే దాని పై ఏవైనా సూచనలు ఇవ్వగలరా? నేను గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాను. కానీ, నాకు సాధ్యం అవ్వడం లేదు! మీకు అభినందనలు! మీ బ్లాగ్‌ మరెందరో పాఠకులను చేరేలా తగు చర్యలు తీసుకోండి.

 • రమేష్ - జూన్ 29, 2018 సాయంత్రం 8:46 గంటలు

  హలో టీమ్,
  నా పేరు రమేష్...నేను ఈరోజు సాయంత్రం ఒక యాక్సిడెంట్‌కు గురయ్యాను...మిమ్మల్ని సంప్రదించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను కానీ, మిమ్మల్ని చేరలేకపోతున్నాను..దయచేసి మీరు 8317637648 పై నాకు కాల్ చేయగలరు. నాకు అత్యవసర సహాయం అవసరం..

  ధన్యవాదాలు
  రమేష్
  8317637648

  • బజాజ్ అలియంజ్ - జూన్ 30, 2018 మధ్యాహ్నం 2:56 గం.లు

   హాయ్ రమేష్, మీకు జరిగిన ప్రమాదానికి మేము చింతిస్తున్నాము, మమ్మల్ని సంప్రదించడంలో మీకు ఎదురైన సమస్యలకు క్షమాపణలు తెలియజేస్తున్నాము. మేము వీలైనంత త్వరగా మీ అభ్యర్థనను స్వీకరిస్తాము. అయితే, మీరు మీ పాలసీ నంబర్‌ను కూడా మాతో పంచుకోగలిగితే మేము ప్రాసెస్‌ను మరింత వేగవంతం చేయగలము.

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి