సూచించబడినవి
Home Blog
20 జూలై 2020
122 Viewed
భారతదేశంలో మీ అత్యంత విలువైన ఆస్తిని ఇన్సూర్ చేయడానికి ఒకటి కంటే ఎక్కువ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలను కలిగి ఉండవచ్చు. అయితే, ఒక ఇల్లు మరియు ఇంట్లోని వస్తువులకు కలిగే సంభావ్య నష్టాలు/ డ్యామేజీల గురించి తెలిసినప్పటికీ, భారతదేశంలోని ప్రజలు ఒక్క హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా కొనుగోలు చేయడానికి ఇష్టపడరు.
హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలో రకాలు ఇలా ఉన్నాయి:
ఎంచుకోవడానికి అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, మీ అవసరాల కోసం ఏ రకమైన పాలసీ ఉత్తమంగా సరిపోతుందో అనేది నిర్ణయించుకోవడం మీ ఇష్టం. ఒక హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏదైనా దురదృష్టకర సంఘటన కారణంగా మీ ఇంటికి మరియు/ లేదా ఇంట్లోని వస్తువులకు జరిగిన నష్టం/ డ్యామేజీని కవర్ చేస్తుంది.
ఇవాళ, మీరు ఒక ఇంటిని కొనుగోలు చేయాలన్నా, దానిని అందంగా అలంకరించుకోవాలన్నా ఎక్కువమొత్తంలో ఖర్చవుతుంది. అలాగే నష్టం తర్వాత మీ ఇంటిని పునరుద్ధరించడానికి లేదా రీమోడల్ చేయడానికి అయ్యే ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి. అందువల్ల, ఒక హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం చాలా ముఖ్యం. మీ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ కింది సందర్భాల్లో మీ ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకుంటుంది:
అనేక హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలను కలిగి ఉండటం వల్ల, ఒక పాలసీ కింద మినహాయింపులు మరొక పాలసీలో కవర్ చేయబడతాయనే గ్యారెంటీ ఏదీ లేదు. భారతదేశంలోని దాదాపుగా అన్ని హోమ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఒకే విధమైన చేర్పులు మరియు మినహాయింపులను అందిస్తాయి. కాబట్టి, మీ ఇంటికి మరియు/ లేదా వస్తువులకు జరిగే నష్టం/ డ్యామేజ్ కారణంగా ఏదైనా ఆర్థిక సంక్షోభం ఎదురైనప్పుడు మీకు పూర్తి ప్రయోజనం అందించే ఒక ఉత్తమ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం మంచిది, మీరు హోమ్ ఇన్సూరెన్స్ కోట్‌లను ఆన్‌లైన్‌లో కూడా పొందవచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్‌లాగా కాకుండా, నగదురహిత క్లెయిమ్ సెటిల్‌మెంట్ అనేది ఒక ఎంపిక, ఒక హోమ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను రీయింబర్స్‌మెంట్ ప్రాసెస్ ద్వారా చేయవలసి ఉంటుంది. కాబట్టి, ఒకటి కంటే ఎక్కువ హోమ్ ఇన్సూరెన్స్ కంపెనీలలో క్లెయిమ్‌ను ఫైల్ చేసేటప్పుడు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఏ వస్తువుకు సంబంధించిన క్లెయిమ్ సెటిల్ చేస్తుందో తెలుసుకోవాలి.
మీరు అనేక ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ఒకే క్లెయిమ్‌ను కూడా ఫైల్ చేసే అవకాశం ఉంది, అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలో ఒకరు మీపై మోసం ఆరోపణలు చేయవచ్చు మరియు మీరు అరెస్ట్ కావచ్చు.
మీ ప్రస్తుత హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కవరేజీని మెరుగుపరచడానికి, మీరు పోయిన మీ వాలెట్ కవర్, డాగ్ ఇన్సూరెన్స్ కవర్, తాత్కాలిక రీసెటిల్‌మెంట్ కవర్, అద్దె నష్టం కవర్ మరియు మరెన్నో లాంటి తగిన యాడ్-ఆన్ కవర్లను ఎంచుకోవచ్చు.
మీకు అనేక హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలు కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, మీరు కనీసం ఒక పాలసీని కలిగి ఉండాలని, ఏవైనా దురదృష్టకర సంఘటనల సందర్భంలో మీ ఆర్థిక స్థితిని కాపాడుకోవాలని సిఫార్సు చేస్తున్నాము.
బజాజ్ అలియంజ్ వద్ద మేము హోమ్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్ను ప్రవేశపెడుతున్నాము, దీని వలన ప్రజలు పాలసీ ప్రీమియంను సులభంగా లెక్కించవచ్చు. మీరు మా వెబ్‌సైట్ ద్వారా ఈ పాలసీ అందించే ఫీచర్లు, ప్రయోజనాలు మరియు కవరేజీని చెక్ చేయవచ్చు.
What makes our insurance unique
With Motor On-The-Spot, Health Direct Click, etc we provide fast claim process , Our sales toll free number:1800-209-0144