రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
How Do Other Countries Celebrate Their Independence Day?
మే 10, 2021

విభిన్న దేశాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

స్వాతంత్య్ర దినోత్సవం భారతీయులందరికీ ఒక వేడుక లాంటిది. ఈ దినం ముఖ్యంగా స్వేచ్ఛ కోసం మన సుదీర్ఘమైన పోరాటాన్ని సూచిస్తుంది, స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఇలాంటి గతం ఉంటుంది, అక్కడి ప్రజలు కూడా స్వాతంత్య్ర దినోత్సవానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తారు మరియు ఆ వేడుకను ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజును ఎంతో ఉత్సాహంగా మరియు ఉల్లాసంగా జరుపుకునే ప్రపంచవ్యాప్తపు దేశాల్లో కొన్నింటిని గురించి తెలుసుకుందాం. యుఎస్‌ఎ 100 సంవత్సరాలకు పైగా బ్రిటన్ చేత "పదమూడు కాలనీలు" గా పిలువబడిన తరువాత, అమెరికన్లు రెండవ కాంటినెంటల్ కాంగ్రెస్ జూలై 2,nd 1776 న తీర్మానాన్ని ఆమోదించేంత వరకు వలస పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు మరియు రెండు రోజుల తర్వాత జులై 4న స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. అమెరికాలో స్వాతంత్య్ర దినోత్సవం అంటే ఒక సమాఖ్య సెలవుదినం. ఇది జాతీయ వారసత్వం, చట్టం, చరిత్ర మరియు దేశ పౌరులను ప్రశంసించే ఒక గొప్ప రోజు. ఈ సెలవు దినాన్ని పురస్కరించుకొని ప్రజలు వారి కుటుంబం మరియు స్నేహితులతో గడపడానికి దేశంలో విస్తృతంగా ప్రయాణిస్తారు. ప్రజలు బార్బెక్యూ విందును ఏర్పాటు చేసుకుంటారు లేదా పిక్నిక్‌లకు వెళ్తారు, వారు సాధారణంగా అమెరికన్ జెండాను సూచించే రంగుల కాగితాలు మరియు బెలూన్లతో వారి ఇంటిని అలంకరిస్తారు. టౌన్ స్క్వేర్స్, ఫెయిర్‌గ్రౌండ్స్ లేదా పార్కుల్లో సాయంత్రం పూట బాణసంచా కాల్చడం సర్వసాధారణం. పలువురు రాజకీయ నాయకులు బహిరంగ ప్రదేశాల్లో కవాతుల్లో పాల్గొంటారు. "సెల్యూట్ టు ది యూనియన్" అని పిలువబడే ఒక ఆచారం ఉంది, దీనిలో ప్రతి రాష్ట్రం కోసం మధ్యాహ్న వేళ ఏదైనా సన్నద్ధమైన సైనిక స్థావరంలో ఒక తుపాకీతో వందనం చేస్తారు. యునైటెడ్ స్టేట్స్‌లో జూలై మొదటి వారం ప్రయాణాల కోసం అత్యంత రద్దీగా ఉండే వారం, ఇది సాధారణంగా వారాంతం లేదా సుదీర్ఘ కాలం పాటు కొనసాగే సెలవుదినం. కెనడా యూఎస్ఎ తన స్వాతంత్య్ర వేడుకలను జూలై 4న జరుపుకోగా, దానిని ఉత్తరాన ఉన్న పొరుగు దేశం కెనడా, దానికి 3 రోజుల ముందు నుండే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలతో బిజీగా ఉంటుంది. కెనడా దినోత్సవం లేదా అనధికారికంగా కెనడా అవతరణ దినోత్సవం అని పిలువబడే ఈ వేడుకను ప్రతి సంవత్సరం జూలై 1వst తేదీన జరుపుకుంటారు. ఈ దినం దేశంలో సమాఖ్య ప్రభుత్వం ఏర్పాటును గుర్తు చేస్తుంది. కెనడియన్లు కూడా వారి స్వాతంత్య్ర దినోత్సవాన్ని అమెరికా మాదిరిగానే జరుపుకుంటారు. బహిరంగ ప్రదేశాల్లో కవాతులు నిర్వహిస్తారు, కార్నివాల్స్, పండుగలు, బార్బెక్యూలు, ఉచిత కచేరీలు, బాణసంచా మరియు పౌరసత్వ వేడుకలతో ఈ రోజును అట్టహాసంగా జరుపుకుంటారు. రాజకీయ స్థాయిలో కెనడా దినోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది, అధికారులు పార్లమెంట్ హిల్ వద్ద సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ వేడుకలు సాధారణంగా గవర్నర్ జనరల్ లేదా ప్రధానమంత్రి ద్వారా ప్రారంభించబడతాయి లేదా రాజ కుటుంబానికి చెందిన ఎవరైనా ఈ ఈవెంట్‌ను ప్రారంభించవచ్చు. మీరు స్వాతంత్య్ర వేడుకలను చూసేందుకు కెనడా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ట్రావెల్ ఇన్సూరెన్స్ కెనడా పాలసీని కొనుగోలు చేయండి. ఆస్ట్రేలియా 26 జనవరి అనేది ఆస్ట్రేలియా దాని స్వాతంత్య్ర దినోత్సవం లేదా ఆస్ట్రేలియా దినోత్సవాన్ని జరుపుకునే రోజు. తొలుత ఈ రోజును వ్యవస్థాపక దినోత్సవం అని పిలిచేవారు, ఎందుకంటే ఈ రోజున కెప్టెన్ ఫిలిప్ ఆధ్వర్యంలో స్థానికుల మొదటి నౌకాదళం ఆస్ట్రేలియా తీరాలకు ప్రయాణించింది, తరువాత అతను మొదటి ఆస్ట్రేలియన్ గవర్నర్ అయ్యాడు. స్థానికులు కాలనీల పై సార్వభౌమాధికారాన్ని పొందిన ఈ రోజు, స్వతంత్య్ర ఆస్ట్రేలియా పౌరులుగా మారిన తేదీని సూచిస్తుంది, దేశవ్యాప్తంగా ఈ రోజున పౌరసత్వం కోసం వేడుకలు జరుగుతాయి. ప్రజలు సమూహాలుగా విందులో పాల్గొనడం, బహిరంగ కచేరీలు చేయడం, క్రీడా పోటీలు నిర్వహించడం మరియు సంగీత కచేరీలకు హాజరవడం లాంటి అనేక ఆహ్లాదకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సిడ్నీలో పడవ పోటీలు నిర్వహించబడతాయి మరియు అడిలైడ్ ఓవల్‌లో సాంప్రదాయక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడతారు. అలాగే, ఈ రోజున దేశవ్యాప్తంగా జరిగే అనేక కవాతుల్లో దేశంలోని విభిన్న సాంస్కృతికత మరియు ఆస్ట్రేలియన్ల గొప్ప వైవిధ్యం ప్రదర్శించబడుతుంది. మీరు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను స్వయంగా వీక్షించడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే, బజాజ్ అలియంజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆస్ట్రేలియా పాలసీని కొనుగోలు చేయండి. ఫ్రాన్స్ ఫ్రాన్స్‌లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని సాధారణంగా బాస్టిల్ డే అని పిలుస్తారు, ఇంగ్లీష్ మాట్లాడే దేశాల నుండి స్వాతంత్య్రం పొందినప్పటికీ దీనిని అధికారికంగా "లా ఫీట్ నేషనాల్" పేరుతో ప్రతి సంవత్సరం జూలై 14న జరుపుకుంటారు. అన్యాయమైన రాచరికపు పాలనతో విసిగిపోయిన సామాన్యులు ఈ రోజున ఒక కోట మరియు కారాగారం అయిన బాస్టిల్‌ను ఆక్రమించారు. ఫ్రెంచ్ విప్లవం సమయంలో ఈ ఆక్రమణ కీలక మలుపునకు కారణం అయింది మరియు ఫ్రెంచ్ యొక్క నవీన రిపబ్లికన్ యుగపు ఆరంభానికి నాంది పలికింది. ప్యారిస్‌లో నిర్వహించే బాస్టిల్ డే వేడుకలలో ప్రెసిడెంట్ మరియు ఇతర ఫ్రెంచ్ అధికారుల మరియు ఇతర ఉన్నతాధికారుల ఎదుట మిలటరీ పరేడ్ నిర్వహించబడుతుంది. పరేడ్ కాకుండా ప్రతిచోటా వేడుకలు మరియు బాణాసంచా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ రోజును గౌరవిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న అగ్నిమాపక సిబ్బంది డ్యాన్స్ పార్టీలు నిర్వహిస్తారు. మెక్సికో మెక్సికోలో స్వాతంత్య్ర దినోత్సవం "క్రై ఆఫ్ డోలోరెస్"గా ప్రసిద్ధి చెందింది. అధికారికంగా సెప్టెంబర్ 16వ తేదీన ఈ వేడుకను జరుపుకోవాల్సి ఉన్నప్పటికీ, సెప్టెంబరు 15వ తేదీ of September at 11 pm after the President rings the historic church bell followed by the National Anthem of the country. The freedom fight against Spain began on the night of 15 న ప్రారంభం అవుతాయి, ఆ రోజు తొలి గంటల నుండి ప్రీస్ట్ కాస్టిల్లా ప్రజలను ఆయుధాలను చేతబట్టి స్పానిష్ రాచరికపు పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయమని ప్రజలను ఉద్దేశించి అరుస్తూ చర్చి గంటలు మోగించింది. దేశం నలుమూలలా ప్రతి వీధి, ప్రతి భవనం జాతీయ రంగులు ఎరుపు, ఆకుపచ్చ మరియు తెలుపు రంగుతో అలంకరించబడుతుంది మరియు పండుగ వాతావరణం తలపిస్తుంది! ఈ వేడుకను సాంప్రదాయ మెక్సికన్ వంటకాలు, నృత్యాలు, ఎద్దుల పోరాటాలు మరియు కవాతులతో జరుపుకుంటారు. అయితే, ముగింపు వేడుకలు మెక్సికో నగరంలోని ప్రసిద్ధ ప్రదేశం అయిన జోకాలోలో జరుగుతాయి. వివిధ దేశాలను గురించి మరియు వారు జరుపుకునే వేడుకలను గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంది కదూ? మరి మీరు, మీ తదుపరి పర్యటనను ఏదైనా ఒక దేశపు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం ఎందుకు ప్లాన్ చేయకూడదు? అయితే, మీరు మీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందు లగేజీ రాకలో ఆలస్యం/నష్టం, అత్యవసర నగదు, పాస్‌పోర్ట్ కోల్పోవడం, ట్రిప్ ఆలస్యం మరియు రద్దు లాంటి అనేక ఇతర ప్రయోజనాలు అందించే మా విస్తృత కవరేజీతో మీ ట్రిప్‌ను ఇన్సూర్ చేయడానికి మమ్మల్ని అనుమతించండి. ఇప్పుడే మా వెబ్‌సైట్‌కి లాగిన్ చేయండి మరియు మీరు మీ ఫ్లైట్ టికెట్లను బుక్ చేసుకోవడం పూర్తయిన వెంటనే ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ని కొనుగోలు చేయండి. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు!

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి