రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Teflon vs ceramic for cars and bikes
29 మార్చి, 2023

టెఫ్లాన్ మరియు సిరామిక్: ఏ కోటింగ్ కార్లు మరియు బైక్‌లకు ఉత్తమంగా సరిపోతుంది?

కారు లేదా బైక్ మెరుస్తూ ఉంటే, అది చాలా విషయాలు చెబుతుంది. మనుషులుగా, మనం ఆకర్షణీయమైన అంశాల వైపు ఆకర్షించబడుతాము. వాహనానికి కూడా ఇది వర్తిస్తుంది. వాహనం మెరుపు అనేది దానిని కొనుగోలు చేయడానికి ముందు వ్యక్తులు పరిగణనలోకి తీసుకునే నిర్ణయాత్మక అంశాల్లో ఒకటిగా ఉంటోంది. అయితే, వాహనం మెరుపు అనేది దాని కోటింగ్ కోసం ఉపయోగించే మెటీరియల్ మీద ఆధారపడి ఉంటుంది. వాహనాల మీద కోటింగ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది: టెఫ్లాన్ మరియు సిరామిక్. ఈ రెండు రకాల మధ్య తేడా ఏమిటి? మీ వాహనం కోసం ఏ రకం కోటింగ్ ఉత్తమమైనది కాగలదు? దీని గురించి మరింతగా అర్థం చేసుకుందాం.

టెఫ్లాన్ కోటింగ్ అంటే ఏమిటి?

టెఫ్లాన్ కోటింగ్‌నే పాలీ-టెట్రా-ఫ్లోరో-ఎథిలీన్ (పిటిఎఫ్ఇ) అని కూడా పిలుస్తారు. ఇది ఒక సింథటిక్ ఫ్లోరోపాలిమర్. కార్లు మరియు బైక్‌ల కోసం ఉపయోగించే టెఫ్లాన్ కోటింగ్ అనేది నాన్-స్టిక్ కుక్‌వేర్ కోసం ఉపయోగించే దానిలాగే ఉంటుంది. మీ కారు మీద టెఫ్లాన్ కోటింగ్ చేసినప్పుడు, ఆ తర్వాత వెంటనే మరొక కోట్ చేయాల్సిన అవసరం లేకుండానే దీర్ఘకాలం పాటు అది మెరుస్తూ మరియు గ్లాసీ లుక్‌తో ఉంటుంది.

టెఫ్లాన్ కోట్ ఎలా వేస్తారు?

కారు మీద టెఫ్లాన్ కోటింగ్ వేయడానికి కొన్ని దశలు ఉన్నాయి:
  1. ఈ కోట్ వేయడానికి ముందు, మీ కారు ఉపరితలం మీద ఉండే ఏదైనా మురికి లేదా దుమ్ము తొలగించడం కోసం మీ కారుని శుభ్రంగా కడగాలి.
  2. కడగడం పూర్తయిన తర్వాత, కారుని పూర్తిగా తుడిచి, తడి లేకుండా ఆరనివ్వాలి.
  3. ఈ కెమికల్‌ను సిద్ధం చేసుకుని, ఒక లూబ్రికెంట్ లాగా ఈ కోటింగ్ వేయాలి.
  4. ఈ కోట్ పూర్తిగా తడి ఆరడానికి అర గంట పడుతుంది.
  5. కోట్ వేసిన తర్వాత, ఉపరితలాన్ని పాలిష్ చేయడం కోసం మరియు ఏవైనా గీతలు లేదా అదనపు లేయర్లు తొలగించడం కోసం బఫింగ్ మెషిన్ ఉపయోగిస్తారు.

టెఫ్లాన్ కోటింగ్ ద్వారా అనుకూలతలు మరియు ప్రతికూలతలు

మీ వాహనానికి టెఫ్లాన్ కోటింగ్ వేయడం ద్వారా క్రింది అనుకూలతలు ఉంటాయి:
  1. టెఫ్లాన్ కోటింగ్ అందించే షైన్ మరియు గ్లాస్ అనేది దీర్ఘకాలం పాటు ఉంటుంది. దానిమీద ఎలాంటి ప్రభావం ఉండదు.
  2. ఉపరితలానికి టెఫ్లాన్ కోటింగ్ వేసినప్పుడు, దాని మీద ఏవైనా గీతలు పడితే వాటిని సులభంగా తొలగించవచ్చు.
  3. టెఫ్లాన్ కోటింగ్ మరింత మన్నికైనది కాబట్టి, దానికి తరచుగా రీకోటింగ్ అవసరం లేదు.
మీ వాహనానికి టెఫ్లాన్ కోటింగ్ వేయడం వల్ల క్రింది ప్రతికూలతలు ఉంటాయి:
  1. మీ కారు దెబ్బతింటే, ఆ కోటింగ్ కూడా ప్రభావితమవుతుంది. మీ కారు ఇన్సూరెన్స్ సంస్థ వద్ద క్లెయిమ్ ఫైల్ చేయగలిగినప్పటికీ, డ్యామేజి ఒకసారి మరమ్మతు చేయబడిన తరువాత మీరు మళ్ళీ ఆ కోటింగ్‌ని అప్లై చేయవలసి ఉంటుంది. *
  2. ఇది మన్నికైనది అయినప్పటికీ, సంవత్సరంలో ప్రతి 4-5 నెలలకు ఒకసారి మళ్లీ వేయాల్సిన అవసరం ఉంటుంది.
  3. టెఫ్లాన్ కోటింగ్ వేయడమనేది బాగా ఖరీదైన వ్యవహారంగా ఉండగలదు.
  4. నిజమైన మెటీరియల్‌కు బదులుగా, కల్తీ టెఫ్లాన్ కోటింగ్ లేదా బాగా చవకైన కోటింగ్‌తో మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది.

సిరామిక్ కోటింగ్ అంటే ఏమిటి?

సిరామిక్ కోటింగ్ అనేది టెఫ్లాన్ కోటింగ్ కంటే ఒక పై స్థాయి కోటింగ్‌గా పరిగణించబడుతుంది. ఉపయోగించిన మెటీరియల్ నాణ్యత, మరియు దాని ప్రయోజనాల కారణంగా, సిరామిక్ కోటింగ్‌ అనేది టెఫ్లాన్ కోటింగ్‌కి అప్‌గ్రేడేషన్‌గా ఉంటుంది.

టెఫ్లాన్ కంటే సిరామిక్ ఏవిధంగా మెరుగైనది?

సిరామిక్ కోటింగ్‌లో ఉపయోగించే టెక్నాలజీ అనేది మెటీరియల్‌ని కేవలం ఉపరితలం స్థాయిలో కాకుండా మాలిక్యులర్ స్థాయిలో వర్తింపజేస్తుంది. ఇది ఒక కఠిన పొరను ఏర్పాటు చేయడం వల్ల, దుమ్ము తక్కవగా పేరుకుంటుంది. ఇందుకోసం ఉపయోగించే మెటీరియల్ అనేది ఒక పాలిమర్ కాబట్టి, మెరుగైన మన్నికను అందిస్తుంది.

సిరామిక్ కోటింగ్‌ను ఎలా వేస్తారు?

క్రింది దశల ద్వారా మీ బైక్‌కు సిరామిక్ కోటింగ్ వేస్తారు:
  1. బైక్ మీద పేరుకున్న దుమ్ము మరియు ఏవైనా ఇతర అశుభ్రతలు తొలగించడ మీ బైక్‌కి పూర్తి స్థాయిలో శుభ్రం చేస్తారు.
  2. ఆ తర్వాత, మీ వాహనాన్ని మరోసారి సబ్బు లేదా ఏదైనా క్లెన్సింగ్ ఉత్పత్తితో వాష్ చేస్తారు.
  3. అలా శుభ్రం చేసిన తర్వాత, రసాయనాన్ని మీ బైక్‌ మీద ఒక పొరలా పెయింట్ చేస్తారు.
  4. ద్రావణాన్ని కడిగేస్తారు మరియు మిగిలిన ద్రావణం తొలగించడం కోసం బఫింగ్ ప్రాసెస్ చేస్తారు.
  5. పాలిష్‌ను ఒక పొరగా వేస్తారు. సాధారణంగా, ఇది నాన్-వ్యాక్స్ మెటీరియల్‌గా ఉంటుంది.
  6. పాలిషింగ్ మెషీన్ ఉపయోగించి, ఈ లేయర్‌ని సమానంగా విస్తరింపజేస్తారు.

సిరామిక్ కోటింగ్‌తో అనుకూలతలు మరియు ప్రతికూలతలు

సిరామిక్ కోటింగ్ వేయడం వల్ల క్రింది ప్రయోజనాలు ఉంటాయి:
  1. బైక్ ఉపరితలం మీద మురికి చేరే అవకాశం తక్కువ శాతంగా ఉంటుంది.
  2. మీ బైక్‌ మీది ఒరిజినల్ పెయింట్ పొరను ఇది ప్రభావితం చేయదు.
  3. ఈ మెటీరియల్‌లో ఉండే మాలిక్యులర్ స్వభావం కారణంగా, ఈ లేయర్ అనేది మరింత మన్నికను అందిస్తుంది.
  4. సిరామిక్ కోటింగ్ వేసిన బైక్‌ను శుభ్రం చేసే పని సులభంగా ఉంటుంది.
సిరామిక్ కోటింగ్‌ వేయడం వల్ల క్రింది ప్రతికూలతలు ఉంటాయి:
  1. టెఫ్లాన్ కోటింగ్‌తో పోలిస్తే సిరామిక్ కోటింగ్ ఖరీదైనది.
  2. టెఫ్లాన్ కోటింగ్‌తో పోలిస్తే, మీ బైక్‌ మీద సిరామిక్ కోటింగ్‌ వేయడానికి పట్టే సమయం ఎక్కువగా ఉంటుంది.
  3. కోటింగ్ వేసేవారికి నైపుణ్యం లేకపోతే, మీ బైక్ దెబ్బతినవచ్చు. మీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ నిబంధనల ప్రకారం అలాంటి డ్యామేజీల కోసం పరిహారం అందించబడవచ్చు. అయితే, శిక్షణ పొందిన ప్రొఫెషనల్ ద్వారా కోటింగ్ వేయించుకోవడం ఉత్తమం. *

టెఫ్లాన్ మరియు సిరామిక్ కోటింగ్ మధ్య తేడాలు

ఈ రెండు రకాల కోటింగ్ మధ్య వ్యత్యాసాలు క్రింద ఇవ్వబడ్డాయి:
టెఫ్లాన్ కోటింగ్ సెరామిక్ కోటింగ్
పెయింట్ ప్రొటెక్షన్ రకం సింథటిక్ వ్యాక్స్ క్లియర్ కోట్
మూలం స్థానం యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
ప్రధాన భాగం పాలీటెట్రాఫ్లోరోఇథలిన్ (పిటిఎఫ్‌ఇ) సిలికాన్ కార్బైడ్ (ఎస్ఐసి)
ఈ కోటింగ్ మందం 0.02 మైక్రాన్స్ 2 మైక్రాన్స్
మన్నిక కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు
రక్షణ రకం తుప్పు మరియు గీతలు తుప్పు పట్టడం, గీతలు పడడం, అల్ట్రావైలెట్ (యూవీ) కిరణాలు మరియు ఆక్సిడేషన్.
ఖర్చు ఒక సెషన్ కోసం సాపేక్షంగా తక్కువ. ఒక సెషన్ కోసం సాపేక్షంగా ఎక్కువ.
  ఈ కారకాల ఆధారంగా, మీరు ఒక ఆర్థికపరమైన ఎంపిక కోసం చూస్తుంటే, మీరు టెఫ్లాన్ కోటింగ్ ఎంచుకోవచ్చు. మీరు ఎక్కువ ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటే, మీరు సిరామిక్ కోటింగ్ కోసం వెళ్లవచ్చు. దీని సహాయంతో వాహనాల కోసం పూర్తి రక్షణ పొందవచ్చని గుర్తుంచుకోండి మోటార్ ఇన్సూరెన్స్. *

ముగింపు

ఈ రకం కోటింగ్ అనేది మీరు కోరుకున్న విధంగా మీ వాహనానికి మెరుపు జోడించడంలో సహాయపడుతుంది. అయితే, మీకు కావలసిన కోటింగ్ రకం ఎంచుకనే ముందు కారు/బైక్ ప్రొఫెషనల్‌తో దాని గురించి చర్చించడం మంచిది. కోటింగ్ అనేది మీ వాహనం ఉపరితలానికి రక్షణ అందిస్తే, సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది నష్టాలు మరియు ఇతర ప్రమాదాల నుండి మీ వాహనానికి పూర్తి రక్షణ అందిస్తుంది. * ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి