రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Coinsurane Meaning & Definition | Bajaj Allianz
జూలై 21, 2020

కోఇన్సూరెన్స్ అర్థం మరియు దాని పూర్తి నిర్వచనం

ఒక మహిళ వైద్య బిల్లులను చెల్లించి ఆసుపత్రి నుండి తన సోదరుడిని డిశ్చార్జ్ చేయించుకోవాలని తన వంతు కోసం వేచి చూస్తుంది. కానీ, ఆమె బిల్లు మొత్తాన్ని చూడగానే స్పృహ తప్పి పడిపోయింది. ఎందుకనగా, ఖర్చు అనేది ఆమె ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంది.

ఆ మహిళ చాలా వరకు వైద్య ఖర్చులు తన సోదరుడి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ద్వారా కవర్ చేయబడతాయని మరియు అతి తక్కువ మొత్తాన్ని (ప్రధానంగా మినహాయింపులు) మాత్రమే తన స్వంతంగా చెల్లించాల్సి వస్తుందని నమ్మింది. ఆమె పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, ఇతర వైద్య విధానాలను పరిగణలోకి తీసుకోలేదు. కాగా, ఆ భారం మొత్తం కూడా చివరి బిల్లుపై పడింది.

ఇక వేరే మార్గం కనిపించకపోవడంతో ఆమె బిల్లులన్నీ చెల్లించి, వాటిలో కొంత భాగాన్ని రీయింబర్స్‌మెంట్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ఫైల్ చేసింది.

సదరు మహిళ మరియు ఆమె సోదరుడు ఇద్దరూ కూడా వారి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అందించే ఇన్సూరెన్స్ మొత్తం (ఎస్‌ఐ) తగినంతగా సరిపోకపోవచ్చని గ్రహించలేదు మరియు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నప్పటికీ అనేక వైద్య బిల్లులను చెల్లించాల్సి వస్తుందని ఊహించలేదు. ఒక వేళ వారు ఒకటి కంటే ఎక్కువ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను కొనుగోలు చేసి ఉంటే, ఈ పరిస్థితిని అధిగమించేవారు, అలాగే మొదటి పాలసీ యొక్క ఎస్ఐ అయిపోయిన తర్వాత, మరో పాలసీ మిగతా ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ విధంగా ఇది వారి అదనపు జేబు ఖర్చులను తగ్గిస్తుంది.

కోఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

రెండు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య మీ ఆసుపత్రి ఖర్చులను పంచుకునే భావనను కోఇన్సూరెన్స్ అని పిలుస్తారు. మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు/ రెన్యూ చేసినప్పుడు ఈ కోఇన్సూరెన్స్‌ను ఎంచుకుంటారు.

ఉదాహరణకు, మీరు బజాజ్ అలియంజ్ వారి వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉన్నా కూడా, ఇతర కంపెనీ బి నుండి మరొక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయవచ్చు, ఇది మీ వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇన్సూరెన్స్ మొత్తం అయిపోయిన తర్వాత మీ ఆర్థిక భారాన్ని తొలగిస్తుంది.

కోఇన్సూరెన్స్ నాకు ఎలా సహాయపడుతుంది?

అనేక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను కొనుగోలు చేయడం ద్వారా, మీరు తక్కువ ప్రీమియం మొత్తాలను చెల్లించవచ్చు మరియు పరిమిత కవరేజీ కోసం ఒకే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి బదులుగా, మీ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని విస్తరించుకోవచ్చు.

మీ పాలసీ డాక్యుమెంట్లో పేర్కొన్న నిబంధనలు మరియు షరతులపై ఆధారపడి, మీ కంపెనీలలో ఒకరు మీ క్లెయిమ్‌ను తిరస్కరించినా మరియు మరొక కంపెనీ దానిని ఆమోదించడం జరుగుతుంది, కాబట్టి, కోఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం అంటే బహుళ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలలో పెట్టుబడి పెట్టడం మీకు ప్రయోజనాన్ని కల్పిస్తుంది. కావున, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మీ క్లెయిమ్‌ను తిరస్కరించడం వలన మీపై ఆర్థికంగా భారం పడదు, అలాగే వైద్య ఖర్చులు మరొక పాలసీ ద్వారా కవర్ చేయబడతాయి.

కోఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది?

మీరు అనేక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను కలిగి ఉంటే, అప్పుడు అవన్నీ కూడా మీరు ఎంచుకున్న కోఇన్సూరెన్స్ ఆధారంగా మీకు చికిత్స మొత్తాన్ని తిరిగి చెల్లించగలవు. చాలా సార్లు మీకు పూర్తి క్లెయిమ్ అమౌంట్ రీయంబర్స్ చేయబడదు, కానీ క్లెయిమ్ మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు/ పాలసీల మధ్య విభజించబడుతుంది మరియు తదనుగుణంగా మీరు రీయింబర్స్‌మెంట్ పొందుతారు. అలాగే, నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం సహాయంతో దీనిని పొందవచ్చు.

ఒక ఉదాహరణ సహాయంతో కోఇన్సూరెన్స్ భావనను తెలుసుకుందాం.

మీరు ఎంచుకున్న ఇన్సూరెన్స్ రెండు ఇన్సూరెన్స్ కంపెనీలు/ పాలసీలు ఎ మరియు బి మధ్య 70% మరియు 30% అయితే, అప్పుడు అదే నిష్పత్తిలో కంపెనీలు/ పాలసీల ద్వారా రూ. 1 లక్ష హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పంచుకోబడుతుంది (అంటే కంపెనీ/పాలసీ ఎ రూ.70,000 చెల్లిస్తుంది మరియు కంపెనీ/పాలసీ బి రూ. 30,000 చెల్లిస్తుంది).

మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, మీ ఇన్సూరెన్స్ కంపెనీలు/పాలసీలు రెండూ మీకు పూర్తి క్లెయిమ్ మొత్తాన్ని చెల్లించవు. ఇది ఎల్లప్పుడూ కోఇన్సూరెన్స్ ఆధారంగా నిర్ణయించబడుతుంది. అలాగే, రెండు పాలసీల మినహాయింపులను మీరు చెల్లించవలసి ఉంటుంది మరియు మిగిలిన క్లెయిమ్ మొత్తం మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల ద్వారా పంచుకోబడుతుంది. మీ పాలసీ నుండి ఎక్కువ ప్రయోజనం పొందడానికి కోఇన్సూరెన్స్, సెక్షన్ 80D క్రింద పన్ను మినహాయింపులు వంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రయోజనాలను అర్థం చేసుకోవడం ముఖ్యం.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి