రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Importance of World Heritage Day
జూన్ 18, 2021

ప్రపంచ వారసత్వ దినోత్సవం: అంటే ఏమిటి మరియు దీని ప్రాముఖ్యత ఏమిటి

ప్రపంచంలోని స్మారక కట్టడాలను మరియు వాటి సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించే ప్రాముఖ్యతను ప్రజలకు బోధించడానికి ప్రతి సంవత్సరం ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతి దేశానికి దాని స్వంత స్మారక కట్టడాలు ఉన్నాయి, అవి దేశ చరిత్రను మరియు సంస్కృతిని రూపొందించడంలో దోహదపడ్డాయి. ఈ సందర్భంగా, మీరు మీ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా చూడాల్సిన, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐదు చారిత్రక ప్రదేశాలను గురించి వివరిస్తాము. గ్రాండ్ ప్లేస్, బ్రస్సెల్స్, బెల్జియం డచ్‌లో "గ్రోట్ మార్క్ట్ " మరియు ఫ్రెంచ్‌లో "గ్రాండ్ ప్లేస్" అని పిలువబడే గ్రాండ్ ప్లేస్ బరోక్ శైలిలో నిర్మానించబడిన ఒక అద్భుతమైన కట్టడం. ఇది బ్రస్సెల్స్ నగరానికి కేంద్ర బిందువుగా ఉంది, దీని చుట్టూ టౌన్ హాల్ మరియు కింగ్స్ హౌస్ ఉన్నాయి. ఇది నగరంలోని ఒక ప్రధాన పర్యాటక గమ్యస్థానం మరియు నగరానికి ఒక గుర్తింపు చిహ్నం. ఈ గ్రాండ్ ప్లేస్ ఒకప్పుడు ఫ్రెంచ్ ప్రజల ఆగ్రహానికి గురైంది మరియు నిర్మాణం పరంగా దెబ్బతిన్నది, కానీ, తరువాత అది పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఈ స్మారకం చరిత్రలోని వివిధ దశలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. 1971 నుండి, ప్రతి రెండు సంవత్సరాలకు ఆగస్టు నెలలో ఒక భారీ ఫ్లవర్ కార్పెట్‌ ఏర్పాటు చేయబడుతుంది, ఇది ప్రజలను అమితంగా ఆకర్షిస్తుంది. ఒలింపియా, గ్రీస్ ఒలింపియా అనేది పురాతన ఒలింపిక్ క్రీడలకు నిలయమైన ప్రదేశం. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన క్రీడలకు నిలయంగా ఉన్న ఈ ప్రదేశం నేటికీ అలాగే కొనసాగుతోంది. ఇది నాగరికత యొక్క అవశేషాల ద్వారా పూర్వ వైభవం గురించి మీకు అవగాహన ఇస్తుంది. పురాతన ఒలింపిక్ స్టేడియానికి వెళ్లడానికి ముందు మ్యూజియంను సందర్శించడం వల్ల మీకు ఈ ప్రాంతం గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. పురాతన మరియు ఆధునిక ఆటల మధ్య కొనసాగింపుకు చిహ్నంగా ఉండే ఈ ఒలింపిక్ జ్యోతి ఆటలు ముగిసే వరకు మండుతూనే ఉంటుంది. మీరు ఒలింపిక్ క్రీడలను తప్పకుండా అనుసరించే లేదా నిజంగా గ్రీక్ పురాణాలను ఇష్టపడే ఒక వ్యక్తి అయితే, ఈ ప్రదేశాన్ని తప్పక సందర్శించాలి. ఇక్కడ జీసెస్ మరియు హెరా దేవాలయాల అవశేషాలు కూడా ఉన్నాయి. కొలోస్సియం, రోమ్ రోమన్లు నిర్మించిన అతిపెద్ద యాంఫిథియేటర్లలో కొలోస్సియం ఒకటి. ఇందులో ఒకేసారి 55,000 మంది వ్యక్తులు కూర్చోవచ్చు, ప్రధానంగా రోమన్ రాజుల గొప్పదనాన్ని మరియు వారి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించేందుకు రూపొందించబడింది. ఖైదీలు మరియు యుద్ధ నేరస్థులను రక్తపాత యుద్ధాలలో పాల్గొన్న గ్లాడియేటర్లుకు కొలోస్సియం సాక్షిగా నిలిచింది. యుద్ధాలు కేవలం మనుషులకు మాత్రమే పరిమితం కాలేదు, పాంథర్లు, ఎలుగుబంట్లు, పులులు, మొసళ్లు మొదలైనటువంటి క్రూర జంతువులు కూడా ప్రజలను అలరించడానికి గ్లాడియేటర్లకు వ్యతిరేకంగా ఉపయోగించబడ్డాయి. రోమన్లు ​​విదేశాలను ఎలా స్వాధీనం చేసుకున్నారో మరియు ఆ యుద్ధాలను అదే రకమైన హింసతో ప్రదర్శన కోసం కూడా దీనిని ఉపయోగించారని చెప్పబడుతుంది. క్రైస్తవ మతం ఆధీనంలోకి తీసుకుని ఈ చర్యలను నిషేధించే వరకు ఈ కొలోస్సియం మైదానంలో హింస రాజ్యమేలింది. హోర్యుజి, జపాన్ హోర్యుజీ జపాన్‌లోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి మరియు ప్రపంచంలోని పురాతన కలప నిర్మాణాల్లో ఒకటి. ఈ ప్రాంతంలో బౌద్ధమతాన్ని ప్రచారం చేయడంలో పేరుగాంచిన ప్రిన్స్ షోటోకు అనే వ్యక్తి దీనిని నిర్మించారు. జపాన్‌లోని అతి పురాతనమైన ఐదు అంతస్తుల పగోడా అనేది తప్పక చూడవలసిన ప్రదేశం. ఇది శతాబ్దాలుగా పెద్ద భూకంపాలు మరియు అగ్నిప్రమాదాలను ఎదుర్కోవడానికి ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం యొక్క సౌందర్యం కేవలం బాహ్య రూపానికే పరిమితం కాదు, ఆలయం లోపలి భాగం ఫ్రెస్కో కళతో మరియు వివిధ విగ్రహాలతో అలంకరించబడి ఉంది - దాని కంటూ ప్రత్యేకతలతో ఒక మ్యూజియం ఏర్పాటు చేయబడింది. కొలోన్ కేథడ్రల్, కొలోన్, జర్మనీ కొలోన్ కేథడ్రల్ నిర్మాణం 1248 లో ప్రారంభమై 1880 వరకు కొనసాగింది, ఈ నిర్మాణం కాలపరిమితి ఈ గోతిక్ మార్వెల్ నిర్మాణంలో వివరాలు ఎలా ఒక కీలక పాత్రను పోషించాయి అనేదానిని సూచిస్తుంది. ఇది ఒక క్రైస్తవ తీర్థయాత్రగా మరియు ఉత్తర ఐరోపాలోని అతిపెద్ద చర్చిలలో ఒకటిగా కూడా పరిగణించబడుతుంది. కేథడ్రల్ యొక్క ప్రసిద్ధ వాస్తుశిల్పంతో పాటు ప్రజలు ఈ ప్రదేశాన్ని "ష్రైన్ ఆఫ్ త్రీ కింగ్స్" కోసం కూడా సందర్శిస్తారు, ఇది కాంస్యం, వెండి మరియు రత్నాలతో అలంకరించబడినది మరియు బాల యేసుతో కూడిన బ్లెస్డ్ వర్జిన్ మేరీ యొక్క చెక్క శిల్పం. కేథడ్రల్ యొక్క ప్రతి మూలన దాని స్వంత కథ ఉంటుంది, తడిసిన అద్దాల నుండి ఎత్తైన బలిపీఠం వరకు ప్రతి మూలలో ఒక దృశ్యం ఉంటుంది. ఈ ప్రదేశాలలో సెయింట్ పీటర్స్ బెల్ కూడా ఉంటుంది, దీని బరువు 24,000 టన్నులు. మీరు మధ్య యుగ చరిత్ర మరియు కళలను ఇష్టపడే వారైతే, ఈ ప్రదేశాన్ని తప్పక సందర్శించాలి. వివిధ దేశాలకు ప్రయాణించడం మరియు విభిన్న సంస్కృతులను చూడటం మన పరిధిని విస్తరిస్తుంది మరియు మనకు చాలా నేర్పుతుంది. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను సందర్శించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది గతాన్ని మరియు సంస్కృతి పరిణామాన్ని వివరిస్తుంది. ఈ విధంగా ప్రయాణిస్తున్నప్పుడు మమ్మల్ని మనం ఇన్సూర్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం, ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఒక ముందుజాగ్రత్త చర్య కాబట్టి, ఇది చిన్న లోపం లేదా పెద్ద సమస్య వచ్చినప్పుడు మనకు అండగా ఉంటుంది.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

  • Minar is one of the UNESCO World Heritage site located in the capital city of India – Delhi. It was built by Qutab-ud-din Aibak, the first

  • Sanjay g mandal - January 13, 2019 at 8:38 pm

    Nice

  • dhanraj kl - January 13, 2019 at 5:57 pm

    much required info.. people losing importance today

  • Alex macwan - January 13, 2019 at 1:02 pm

    beautiful places

  • Khozema - January 12, 2019 at 3:58 pm

    Travelling here will be so awesome

  • Debayan Das - January 12, 2019 at 3:08 pm

    beautiful places indeed! Amazing collection

  • Ranveer Parihar - January 10, 2019 at 7:22 pm

    Nice post thanks for sharing with us .
    Keep working well

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి